బిసి సంఘాల బంద్ ను విజయవంతం చేద్దాం
బిఆర్ఎస్వి నర్సంపేట పట్టణ అధ్యక్షులు దేవోజు హేమంత్..
నర్సంపేట,నేటిధాత్రి:
బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు బంద్
విజయవంతం చేద్దామని బిఆర్ఎస్వి నర్సంపేట పట్టణ అధ్యక్షులు దేవోజు హేమంత్ కోరారు.గత 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో బీసీలను విద్య, రాజకీయపరంగా అణిచివేస్తూ రాజకీయంగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ కాలం గడుపుకుంటూ వచ్చిందని ఎద్దేవా చేశారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ వచ్చేవరకు బీసీ విద్యార్థులు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు..నాడు మాజీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో తెలంగాణ ఉద్యమం మాదిరిగానే.. బీసీ రిజర్వేషన్ బిల్లును ఢిల్లీ దాకా తీసుకెళ్లి రిజర్వేషన్ బిల్లును సాధించుకోవాలని పిలుపునిచ్చారు.బిసి విద్యార్థులతో ఆటలాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాటకాలు ఇక బీసీల ముందు చెల్లవని..బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం బంద్ కు మద్దతుగా పాల్గొంటున్న నేపథ్యంలో నర్సంపేట పట్టణలోని ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాలలు, విద్యాసంస్థలు బీసీ బందుకు సంపూర్ణ మద్దతు తెలపాలని హేమంత్ కోరారు.
