రాష్ట్రవ్యాప్త బిసి బంద్ లో పాల్గొన్న తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు
దుగ్గొండి,నేటిధాత్రి:*
ఎన్నికల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోలేని అధికారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టగా ఆ రిజర్వేషన్ పట్ల సుప్రీంకోర్టు స్టే విధించిందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు,నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి ముదిరాజ్ ఆరోపించారు. బీసీ బందు కార్యక్రమంలో భాగంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామం ప్రధాన రహదారిపై ముదిరాజ్ మహాసభ దుగ్గొండి మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మొగిలి మాట్లాడుతూ విద్య ఉద్యోగాలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్ బిల్లు మంచిదే కానీ.. అది అమలు కాకపోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉన్నదని ఆరోపించారు. రిజర్వేషన్ల అమలు కోసం వివిధ బిసి కుల సంఘాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. 42 శాతం బిసి రిజర్వేషన్ అమలు పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా నేటికీ బీసీ వర్గాలకు ఇలాంటి రిజర్వేషన్ల ప్రకారం ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నుండి కేంద్రంలో ఉన్న మంత్రులు, పార్లమెంటు సభ్యులు బిసి రిజర్వేషన్ల పట్ల ఆలోచించాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్,దుగ్గొండి మండలం అధ్యక్షులు పల్లె రమేష్ ముదిరాజ్, సార రాములు ముదిరాజ్, బీసీ జాక్ కన్వీనర్ బండారి ప్రకాష్ ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ నేదురి రాజేందర్ ముదిరాజ్, వరంగంటి తిరుపతి, నీరటి మురళి, ఒరంగంటి కుమారస్వామి, గొర్రె శీను, దండు రాజు, మేక అనిల్, జెట్టబోయిన రాజు, తెప్ప శంకర్, పొన్నం వంశీ తదితరులు పాల్గొన్నారు.
మేమెంతో… మాకంత.. రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు అది అందరి హక్కు
*తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా నేడు తెలంగాణ బంద్..
*బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం…
*తెలంగాణ బీసీ జేఏసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేశాము..
*బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీ బిడ్డ ను రాష్ట్ర అధ్యక్షుని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది…
*రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది..
*రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎనలేని కృషి చేస్తున్నారు…
*బీసీ బంద్ తో బిజెపి కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాడం కోసమే బీసీ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించాం..
*బీసీ బిల్లులు ఆమోదింపజేసి, బీజేపీ నేతలు తమ చిత్తశుద్ది చాటుకోవాలి…
_వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్దన్నపేట( నేటిధాత్రి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అసెంబ్లీలో బిల్ ఆమోదించి గవర్నర్‌కి పంపినా,అది ఇంకా ఆమోదించకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్న సందర్భంగా నేడు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు నేడు వర్ధన్నపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నందు నిర్వహించిన “బీసీ బంద్” కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తోలుత స్వామి వివేకానంద విగ్రహం నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి బీసీలకు మద్దతుగా షాపులను బంద్ చేయించి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం బీసీ నాయకులతో మరియు కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులతో మానవహారం చేపట్టి రోడ్డు పై బైఠాయించి మేమెంతో మాకు అంతా అంటూ నినాదాలు బీసీలకు మద్దతు గా నిలిచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం. రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎనలేని కృషి చేస్తున్నారు. బీసీ బంద్ తో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన జరగాలనే అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టింది. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించేందుకు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఇది బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నిజమైన చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎనలేని కృషి చేస్తున్నారు.బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీ బిడ్డ ను రాష్ట్ర అధ్యక్షుని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అన్నారు. తెలంగాణ బీసీ జేఏసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించాము అన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు యూత్, మహిళ కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల, బీసీ సంఘం,వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు…..
బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్ కోసం నేటి బీసీ బంద్ విజయవంతం: బీసీ జేఏసీ
బీసీ బిల్లును అడ్డుకున్న పాపం బిజెపిదే :మండల కాంగ్రెస్ కమిటీ
శాయంపేట నేటిధాత్రి:
బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు కల్పించకుండా రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని నిర సిస్తూ శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రజాసంఘా లను కలుపుకొని శాయంపేట మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటు వంటి అన్ని పార్టీలు బిసి బంద్ ను స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వడంతోనే 100% బీసీలకు బంద్ విజయవంతం చేయడం జరిగింది. దానికి తోడు అన్ని సంఘాలు ఏకమవడం బిసి ఉద్యమానికి మరియు బందు కు మరింత బలాన్ని చేకూ ర్చింది, కామారెడ్డి డిక్లరేషన్ లోని అన్ని అంశాలను అమలు చేయాల్సిందిగా ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% శాతం కల్పించాల్సిన అవసరం ఉంది బంద్ ఫర్ జస్టిస్ అనే ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది స్వచ్ఛందంగా దుకాణాలు,
విద్యాసంస్థలు బందు పాటిం చి మద్దతు ఇవ్వడాన్ని హర్షి స్తూ మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ఈ ఉద్యమం జరిగిందని భవి ష్యత్తులో బీసీల హక్కులను సాధించేందుకు తోడ్పడుతుం దని అన్ని రాజకీయ పార్టీలు సంఘాలు కలిసికట్టుగా బిసి హక్కుల కోసం పోరాడాలని స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో 42% వాటా అమలు ఆయ్యేదాకా పోరాటం ఆగదని మనమెంతో మనం మనకంత వాటాన్ని సాధిం చేవరకు ఉద్యమం ఆపద్దని పిలుపునివ్వడం జరిగింది అనంతరం వివిధ పార్టీల నాయకులతో పెద్ద ఎత్తున మాందారిపేట ప్రధాన రహ దారిపై రాస్తా రోకో నిర్వహిం చడం జరిగింది
ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల మెంబర్ బాసాని చంద్రప్రకాష్, మాది మార్కెట్ చైర్మన్ పోలపల్లి శ్రీనివాస్ రెడ్డి, పరకాల మార్కె ట్ వైస్ చైర్మన్ మారేపల్లి రవీం దర్, మాజీ జెడ్పిటిసి చల్ల చక్రపాణి, అబ్బు ప్రకాశ్ రెడ్డి, మాజీ ఎంపిటిసి కొమ్ముల భాస్కర్ దుబాసి కృష్ణమూర్తి, మారేపల్లి రాజు, మారపల్లి రాజేందర్, చిందం రవి, నిమ్మ ల రమేష్, బండారి పైడి, జిన్నా రాజేందర్, రేణికుంట్ల సదానం దం, రవి పాల్ వివిధ గ్రామాల నుం చి వచ్చిన కాంగ్రెస్ నాయ కులు మరియు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో నిరసన
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో, 42% బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్న బీసీల మరియు తెలంగాణ ద్రోహి అయిన మాధవరెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి పందాలు మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలకు పైబడిన కూడా ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తూ వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని జ్యోతి పండాల్ అన్నారు. బీసీల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి నామమాత్రంగా జీవో ని రిలీజ్ చేసి మళ్లీ వాళ్ల వర్గానికి సంబంధించిన వ్యక్తి హైకోర్టులో కేసు వేసి బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి గాని రేవంత్ రెడ్డి కి గాని ఎంత చతుర శుద్ధి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుందని జ్యోతి పండగ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆదిల్, మెహిన్ పటేల్, మహమ్మద్ ఆసీస్, షోహెద్, మహమ్మద్ ఒకే, ఇక్రమ్, మహమ్మద్ మోసిన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ముజ్జు, మహమ్మద్ కుతుబుద్ధిన్, మహమ్మద్ రిజ్వాన్, విజయ లక్ష్మీ, బిస్మిల్లా, అంజమ్మ, స్వీటీ, అంజన్న, కళావతి, రజిత. తదితరులు పాల్గొన్నారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందే ఎమ్మెల్యే జీఎస్సార్.
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్ నిర్వహించింది.ఈ బంద్‌కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కొరకు సర్వే నిర్వహించి శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపియడం జరిగింది. బీసీలకు 42 శాతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇస్తే ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటారని దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గవర్నర్ ను మధ్యలో అడ్డు పెట్టుకొని నాటకం చేస్తుందని విమర్శించారు.అందుకే గవర్నర్ గారు అట్టి ఆర్డినెన్సును ఎటు తేల్చకుండా పెండింగులో పెట్టారు అన్నారు.అని దీనికంతటికీ ముఖ్య కారణం కేంద్రలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని విమర్శించారు. మాకు కోర్టుల మీద గౌరవం,నమ్మకం ఉంది.కావునా బీసీ లందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ సుంకరి రామచంద్రయ్యా అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసీ సభ్యులు చల్లూరి మధు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై సీపీ సాయిచైతన్య స్పందించారు. హత్య జరిగిన సమయంలో, అతడిని ఆస్పత్రికి తరలించే విషయంలో ఎస్సై సాయం కోరినా ఎవరూ స్పందించలేదని ఆయన అన్నారు.
నగరంలో నడిరోడ్డుపై కానిస్టేబుల్ ప్రమోద్ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుడు రియాజ్‌ను శుక్రవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొస్తున్న సమయంలో కానిస్టేబుల్‌ను కత్తితో పొడిచి పారిపోయాడు.
ఈ ఘటనపై సీపీ సాయిచైతన్య శనివారం స్పందించారు. సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య దురదృష్టకరమన్నారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. కానిస్టేబుల్ గాయాలపాలైన వెంటనే అతడిని ఎస్సై ఆధ్వర్యంలో ఆస్పత్రికి తరలించామన్నారు.
సాయం చేసేందుకు ఎవరూ రాలేదు దాడి జరిగిన సమయంలో పోలీసులు సాయం కోసం అడిగితే ఎవరూ కూడా ముందుకు రాలేదని సీపీ పేర్కొన్నారు. ఆటోలని ఆపి ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరితే ఎవరూ స్పందించలేదన్నారు. జనమంతా పక్కనే ఉండి ఫొటోలు.. వీడియోలు తీస్తూ ఉన్నారే తప్ప ఒక్కరు కూడా సాయం చేసేందుకు ముందుకు రాలేదని ఆయన పేర్కొన్నారు.
పోలీసనే కాకుండా ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయి ఉంటే సాయం చేసే గుణం ఉండాలని సీపీ సూచించారు. ఆపద సమయంలో ఒకరికి ఒకరు సాయం చేసుకుంటేనే ప్రాణాలు నిలబడతాయన్నారు. మాకెందుకునే అనే పరిస్థితి ఉండకూడదని వివరించారు.
అహోరాత్రులు ప్రజల సేవకే పనిచేస్తున్నాం.. కమిషనరేట్ పరిధిలో పోలీస్‌శాఖ అహోరాత్రులు కృషి చేస్తోందన్నారు. ఎన్నో నేరాలు జరగకుండా పోలీస్‌శాఖ కట్టడి చేస్తోందన్నారు. అలాగే అనేక నేరాలను ఛేదిస్తున్నామని స్పష్టం చేశారు. ఇలా ఒక క్రైంను ఛేదించే విషయంలోనే ఈ కానిస్టేబుల్ తన ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితుడు రియాజ్ సైతం అక్కడి నుంచి పారిపోగా.. ఎవరూ స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ప్రతిఒక్కరూ సాయంచేసే బాధ్యత అలవర్చుకోవాలని సూచించారు. అలా పరోపకారం చేస్తే తిరిగి ఎప్పుడో అది మనకు పనిచేస్తుందని చెప్పారు.
ఇంట్లోని ఈ ప్రదేశాల్లో దీపం వెలిగిస్తే.. ప్రతికూల శక్తులు పరార్.!
ఈ దీపావళికి మీ ఇంట్లో దీపాలు ఎక్కడ వెలిగించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? దీపావళి నాడు లక్ష్మీ పూజతో పాటు దీపాలు వెలిగించడం వల్ల ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సానుకూలత ఆకర్షిస్తుంది. కాబట్టి, ఇంట్లో ఏ ప్రదేశాల్లో దీపం వెలిగిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ దీపావళికి ఇంట్లో దీపాలు ఎక్కడ వెలిగించడం మంచిదో మీకు తెలుసా? ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20న జరుపుకుంటారు. దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజించడంతో పాటు, దీపాలు వెలిగించడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున దీపాలు వెలిగించడం వల్ల ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. కాబట్టి, దీపావళి రోజున ఇంట్లో ఏ ప్రదేశాలలో దీపాలు వెలిగించడం శుభప్రదమో తెలుసుకుందాం..
సి.పి.ఎం ఆధ్వర్యంలో బీసీలకు మద్దతుగా బస్ డిపో ముందు ధర్నా
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
తెలంగాణ రాష్ట్ర బిసి రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా తెలంగాణ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపులో భాగంగా సిరిసిల్లలో బంద్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ డిపో ముందు బస్సులు బయటకు రాకుండా ధర్నా చేపట్టడం జరిగినది. అనంతరం సిరిసిల్ల పట్టణంలో ప్రదర్శన నిర్వహించడం జరిగినది.ఈరోజు బంద్ ను విజయవంతం చేసినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు మరియు వాణిజ్య వ్యాపార విద్య సంస్థలకు ధన్యవాదాలు తెలుపడం జరిగినది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ మాట్లాడుతూ బిజెపి రాష్ట్రంలో మద్దతు ఏసి కేంద్రంలో అడ్డుకుంటూ ద్వంద వైఖరి అవలంబిస్తుంది.బిజెపి పార్టీ రాష్ట్రపతి వద్ద గవర్నర్ వద్ద బీసీ బిల్లులు ఆమోదింప చేయకుంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలు బిజెపికి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కోడం రమణ , జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ , అన్నదాస్ గణేష్. సిపిఎం పార్టీ నాయకులు మిట్టపల్లి రాజమల్లు , రాపల్లి రమేష్ , నక్క దేవదాస్ , ఉడుత రవి. సిరిమల్ల సత్యం , ఎలివేటి శ్రీనివాస్ , జిందం కమలాకర్ , తన్నీరు లక్ష్మీరాజం , బెజ్జిగం సురేష్.బింగి సంపత్,స్వర్గం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ అమలు పట్ల బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమం నేపథ్యంలో నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు చక్రాలు కదల్లేదు. ఉద్యోగులు, కార్మికులతో బంద్ లో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో ఉదయం 3 గంటల నుండి ఆర్టీసీ కార్మికులు బంద్ లో పాల్గొని విజయవంతం క్టారు. దీంతో ఆర్టీసీ బస్సుల చక్రాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.నర్సంపేట డిపో బీసీ సంఘం అద్యక్షులు కందికొండ మోహన్ మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం నర్సంపేట నర్సంపేట ఆర్టీసీ డిపో ఉద్యోగులు, కార్మికులందరు మద్దతిచ్చామన్నారు. జిల్ల వర్కింగ్ ప్రజిడేంట్ వేములు రవి ,నాయకులు బి. రమేష్ ఎన్.ప్రవీణ్, మాదవ్ రేడ్య, కిరణ్ కుమార్ గౌడ్ ,సాంబయ్య మహేందర్, యాదయ్య, అనిల్, రాజు,శ్రీను,రవి, బాస్కర్, కిషన్, గోవర్దన్, కె యస్ రావు, ప్రబాకర్, డిపి లీల, శ్రీలత, రమణ, సరిత, శ్రీలత తదితర కార్మికులు స్వచ్చందంగా పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం బీసీ జర్నలిస్టులు మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన బందు పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో బీసీ జర్నలిస్టులు బీసీ జేఏసీ కి మద్దతు తెలుపుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు సామల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని, బీసీలను అయోమయానికి గురిచేస్తున్నాయని అన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లలో తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీలందరూ ఏకం కావాలని చెప్పారు. వివిధ పార్టీలు, వివిధ సంఘాలలో ఉన్న బీసీ లందరూ బయటకు వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు బీసీ జర్నలిస్టుల మద్దతు కూడా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జర్నలిస్టులు ఎడ్ల సంతోష్, తడుక సుధాకర్, శేఖర్ నాని, పాలకుర్తి మధు, తోట శ్రీనివాస్, అడ్డగట్ల శ్రీనివాస్, జగన్, క్యాతం వెంకటేశ్వర్లు తో పాటు తోటి జర్నలిస్టులు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సిరిసిల్లలో బీసీ రిజర్వేషన్ల బంద్ పై అఖిలపక్షం బైక్ ర్యాలీ
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బీసీ సంఘాల, మరియు అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలుకు మద్దతుగా ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహం నుండి గాంధీ చౌక్ వరకు అఖిలపక్ష పార్టీల మద్దతుతో బైక్ ర్యాలీ చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పట్టణ బీసీ సంఘాలు మరియు వ్యాపార సంఘాలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగనది. అంతేకాకుండా నిత్యం సిరిసిల్ల రద్దీ జనం తో ఉన్న కూడళ్లు నిర్మానుషంగా మారడం తో అటు బస్ డిపో వద్ద బిసి సంఘాల ముఖ్య నేతలు బస్ లను ఆపివేయడం, ప్రయాణి కులకు ఇబ్బంది అయ్యే విధంగా ఏర్పడంతో, దీపావళి పండగ ముందు సమయన సిరిసిల్ల ప్రాంత ప్రజలకు ఇబ్బంది చెప్పడం జరుగుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలని అన్ని పార్టీలు కూడా మరియు ప్రజలు కూడా ప్రశాంతంగా మద్దతు ప్రకటించాలని బీసీ సంఘాలు కోరడం జరిగినది.
కోహిర్ మండల పరిధిలోని కవేలి గ్రామ శివారులో గల నూతన డెక్కన్ హోటల్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర మాజీ ఐడిసి కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ తన్విర్ హాజరై రిబ్బన్ కతరించి హోటల్ ను ప్రారంభించారు. మాజీ చైర్మన్ మాట్లాడుతూ తక్కువ ధరకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించుకోవాలని కోరారు హోటల్ యాజమాన్యం మాజీ చైర్మన్ గారికి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కే ప్రసాద్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, మహమ్మద్ వాసిమ్, మీర్ ముజఫర్ అలీ, మహమ్మద్ హామీద్ తదితరులు పాల్గొన్నారు
ఏనుమాముల మణికంఠ కాలనీలో భూవివాదం తీవ్రరూపం దాల్చింది. తమ స్థలానికి గోడ కట్టగా, దానిని కొంతమంది అన్యాయంగా కూల్చివేశారని భూ యజమాని చంద్రకళ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై ఏనుమాముల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, అధికారులు పట్టించుకోకుండా, దౌర్జన్యం చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారని ఆమె ఆరోపించారు. తోట చంద్రకళ తెలిపిన వివరాల ప్రకారం, సర్వే నంబర్ 189/బి మణికంఠ కాలనీ రోడ్డు 4లో తాము 2008 వ సంవత్సరంలో శ్రీనివాస్ వద్ద కొనుగోలు చేశామని, ఇట్టి జాగపై వేరే వ్యక్తులతో తగాదా ఏర్పడటం వలన 2011వ సంవత్సరంలో కోర్టులో కేసు వేసినట్లు తెలిపారు.. కోర్టు తీర్పు 2018 లో తమకు అనుకూలంగా వచ్చిందని, వెంటనే చుట్టూ ప్రహరీ గోడ కట్టుకున్నామని తెలిపారు. ఈ మధ్య కాలంలో వేరే వాళ్ళు జాగా మీధకు రాగా, అప్పుడు ఉన్న సిఐ రాఘవేంద్రరావు ఇరువురి సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించి ఆ భూమి తమదేనని నిర్ధారించినట్లు చెప్పారు. అయినప్పటికీ ప్రస్తుతం కొందరు భూ ఆక్రమణదారులు, ఓడిపోయిన వారి వద్ద నుండి అగ్రిమెంట్ పెట్టుకొని పది రోజుల క్రితం మా గోడను పాక్షికంగా ధ్వంసం చేశారు అని అన్నారు. ఈ నెల 7వ తేదీన గోడను కూల్చిన వారిపై కేసు నమోదు చేయాలని ఏనుమాముల పోలీసు స్టేషన్ లో పిటిషన్ ఇచ్చిన కూడా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో, ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాదితులు ఈ వివాదంపై దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జహీరాబాద్ కార్యకర్తల నిర్ణయం మేరకే డిసిసి అధ్యక్ష ఎన్నిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ లోని ఫంక్షన్ హాల్ లో శుక్రవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో AICC అబ్జర్వర్ జరిత మాట్లాడుతూ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపికపై కాంగ్రెస్ కార్యకర్తల నిర్ణయమే అంతిమమని తెలిపారు. అధ్యక్ష పదవి కోసం కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ సమావేశంలో సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.
ఝరాసంగం : బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో.9 పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇప్పటికే ప్రారం భమైన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే రిజ ర్వేషన్ల అంశంపై అంశంపై సందిగ్ధత కొనసాతుండ గానే జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ఈదులపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు తనను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ.10 లక్ష లు అందజేస్తానని ప్రకటించడం స్థానికంగా ఆసక్తిని రేపింది. గ్రామ బిఆర్ఎస్ పార్టీ మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ప్రకటించాడు. గ్రామంలో 1500 ఓటర్లు ఉండగా ఇటీవల ప్రకటించిన హైకోర్టు స్టే ఇచ్చిన క్రమంలో మళ్లీ తమకు అనుకూలంగా రిజర్వేషన్ వచ్చి తనను ఏక గ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ.10 లక్షలు ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించినా ఈదులపల్లి బీసీ (మహిళ)కు రిజర్వ్ అయి ఉండటంతో మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ ఈ ప్రతి పాదనను ముందుకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.
సగర సంగం రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి “కానిగంటి శ్రీనివాస్”.
“నేటిధాత్రి”, హుజూరాబాద్.
ఈరోజు రాష్ట్రవ్యాప్త “బీసీ బంద్” లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండల్ సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో హుజరాబాద్ లో “బీసీ బంద్” లో తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కాని గంటి శ్రీనివాస్.
హుజురాబాద్ అధ్యక్షులు యంజాల వాసు. చింత చంద్రయ్య. రాచమల్ల రఘు. దొరికిన చంద్రమౌళి. కొల్లూరి మధు. భాస్కర్. అనిశెట్టి శివ. సతీష్. కొల్లూరి అనిల్. అనిశెట్టి పరమేశ్వర్ సదరు బంధువులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ హుజురాబాద్ లో ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.
సగర సంగం రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి “కానిగంటి శ్రీనివాస్”.
“నేటిధాత్రి”, హుజూరాబాద్.
ఈరోజు రాష్ట్రవ్యాప్త “బీసీ బంద్” లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండల్ సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో హుజరాబాద్ లో “బీసీ బంద్” లో తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కాని గంటి శ్రీనివాస్.
హుజురాబాద్ అధ్యక్షులు యంజాల వాసు. చింత చంద్రయ్య. రాచమల్ల రఘు. దొరికిన చంద్రమౌళి. కొల్లూరి మధు. భాస్కర్. అనిశెట్టి శివ. సతీష్. కొల్లూరి అనిల్. అనిశెట్టి పరమేశ్వర్ సదరు బంధువులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ హుజురాబాద్ లో ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.
`క్వాలిటీ కంట్రోల్ బోర్డు వద్దన్నా వినిపించుకోలేదు!
`క్వాలిటీ కంట్రోల్ బోర్డు కాదన్నా వాడేశారు!
`కాంట్రాక్టర్ల ధన దాహానికి అధికారులు తోడయ్యారు!
`చూసేవారెవరని విచ్చలవిడిగా ఎర్రకంకర వాడేశారు!
`మహా ప్రాజెక్టును సర్వనాశనం చేశారు!
`అది కంకరే కాదు! ప్రాజెక్టులకు సరఫరా చేశారు!!
`మన్ను మశానం తప్ప కంకర అసలే కాదు!
`అవునవును అని తల ఊపే అధికారులు!
`వరంగల్ గుట్టల్లో బలమైన బండలే లేవు!
`కంకర తయారు చేయడం సాధ్యమే కాదు!
`గులకరాళ్లను కంకర అని సరఫరా చేస్తున్నారు!
`ఎర్రగుట్టలు తొలిచి కంకర అని నమ్మిస్తున్నారు.
`కాంట్రాక్టర్లు..అధికారులు పంచుకుతింటున్నారు!
`ఇదే కంకర ఓ పెద్ద ప్రాజెక్టులో కూడా వాడారు?
`ఇప్పుడు నేషనల్ హైవేల నిర్మాణానికి వాడుతున్నారు!
`ఇంటికి ఏ మాత్రం పనికి రాదు!
`ప్రాజెక్టుల నిండా నింపేశారు!
`ప్రాజెక్టుల నిర్మాణం అబాసుపాలు చేశారు!
`ప్రజాధనం నీళ్ల పాలు చేశారు!
`సగం వాటలు అధికారుల చేతుల్లో పెట్టి చేతులు దులుపుకున్నాయి!
హైదరాబాద్, నేటిధాత్రి: తెలంగాణలో కాంట్రాక్టర్ల బరితెగింపు, అధికారుల కాసుల కక్కుర్తి మూలంగా ప్రజా దనం పెద్దఎత్తున దుబారా అవుతోంది. దుర్వినియోగమౌతోంది. ప్రభుత్వానికి నాణ్యమైన కంకర సరఫరా చేస్తామనిచెప్పి, టెండర్లు దక్కించుకొని పనికి రాని కంకర సరఫరా చేస్తున్నారు. సుద్దకూడా అంతో నయమనేంత నాసిరకమైన కంకర సరఫరా చేశారు. అసలు దానిని కంకర అని ఎలా నిర్ధారించారో..ఎలా కంకర అని కాంట్రాక్టర్లు నిర్ణయించుకున్నారో అర్ధం కాదు. కంకర పేరుతో సరఫరా చేస్తున్న దానిని అది కంకరే అని అదికారులు ఎలా నిర్దారిస్తున్నారో..ఎలా అందుకు అనుమతులు జారీ చేస్తున్నారో తెలియకుండాపోతోంది. గత పదేళ్ల కాలంగా ఈ దుబారా వ్యవహరం విపరీతంగా సాగుతోంది. సహజంగా ఏ నిర్మాణానికైనా సరే నాణ్యమైన కంకర కావాలని కోరుకుంటాం. మంచి కంకరలో చిన్న డస్టు కూడా వుండకుండా జాగ్రత్తపడతాం. ఆ కంకర తెచ్చుకున్న తర్వాత ఏ మాత్రం అనుమానం వచ్చినా తిరిగి వాపస్ చేయిస్తాం. మరి అలాంటిది తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అనేక కార్యక్రమాలకు అధికారులు దగ్గరుండి పనికి రాని, ఎందుకూ పని చేయని కంకరను ప్రోత్సహిస్తున్నారు. కంకర అంటే ఏళ్ల తరబడి మన్నేలా వుండాలి. చెక్కు చెదరకుండా వుండాలి. గాలి, నీటి కోతను తట్టుకోగలగాలి. దశాబ్ధాల తరబడి బలంగా,దృఘంగా వుండాలి. నిజమైన రాయితో తయారైన కంకర వందల సంవత్సరాలైనా సరే గట్టిగా వుంటుంది. నిర్మాణాలను పటిష్టంగా వుంచుతుంది. ఇంటి నిర్మాణాలకే ఇన్ని రకాలుగా ఆలోచిస్తాం. అలాంటిది ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టే నిర్మాణాలకు మరింత బలమైన కంకర అవసరం. ఎండకు, వానకు, వరదలకు తట్టుకొని నిలబడేలా వుండాలి. అది రోడ్డైనా, ప్రాజెక్టులైనా, చెరువులైనా, చెక్ డ్యామ్‌లైనా, రిజర్వాయర్లైనా సరే కంకర ఎంత బలంగా వుంటే ఆ నిర్మాణాలు అంత ఎక్కువ కాలం నిర్మాణాలు చెక్కు చెదరకుండా వుంటాయి. కాని తెలంగాణలోని కొంత మంది అవినీతి అదికారుల దుర్భుద్ది మూలంగా, దుర్మార్గులైన కొంత మంది కాంట్రాక్టర్లు కలిసి ప్రజా ధనం దోచుకుతినేందుకు ఎందుకూ పనికి రాని కంకర విచ్చలవిడిగా వాడుతున్నారు. అందుకే మన కళ్లముందే అనేక నిర్మాణాలు చెదిరిపోతున్నాయి. కూలిపోతున్నాయి. కొట్టుకుపోతున్నాయి. అవి నాసిరకం కంకర నిర్మాణాలని తేలిపోతున్నాయి. వాటి గురించి పట్టించునే నాధుడే కరువయ్యారు. ఎంత సేపు రాజకీయాలు తప్ప, వ్యవస్ధలో నిటారుగా నిలడాల్సిన అధికారులు ఎందుకు వంగిపోతున్నారు. ఎందుకు ఇంత లాలూచీగా వ్యవహరిస్తున్నారు. భయం లేకుండా పోతున్నారు. అనేది కూడా ఇక్కడ ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు, రోడ్ల నిర్మాణాలకు ఎందుకూ పనికి రాని ఎక్రకంకరణను సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. వరంగల్ జిల్లాలో కట్టడాలకు అవసరమైనటు వంటి కంకరను అందించే గట్టలే లేవు. ఆ గుట్టలన్నీ కేవలం ఎర్రమట్టితో నిండి వున్న తూర్పు కనుమలకు చెందినవి. ఆ గుట్టలు పూర్తిగా మట్టితో మాత్రం ఎక్కువ శాతం వుంటాయి. ఆ మట్టిలో ఎర్ర రాయి గుండ్లు మాత్రమే వుంటాయి. అవి చాలా నాసిరకంగా వుంటాయి. అవి నిర్మాణాలకు ఎట్టి పరిస్దితుల్లో ఉపయోగార్హం కాదు. కంకర తయారు చేసే గుట్టల్లో పెద్ద పెద్ద బరువైన బండలుండాలి. కొన్ని ఎకరాల్లో విస్తరించి వుండే బండ నుంచి మాత్రమే కంరర తయారు చేయాలి. కాని గుండ్లతో కూడిన గుట్టలను కాంట్రాక్టర్లు ఎంచుకోవడం? వాటికి అధికారులు పర్మిషన్లు ఇవ్వడం జరుగుతోంది. అలా కొండలు తవ్వేస్తున్నారు. అటు మట్టి, ఇటు ఎర్ర గుండ్లతో తయారు చేసిన కంకరను సరఫరా చేస్తున్నారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. నేటిధాత్రి పై చిత్రంలో చూపిస్తున్న ఎర్ర రంగు రాయిని కూడా కంకర అని ఎవరైనా అంటారో మీరే చెప్పండి? అది నిర్మాణాలకు వాడుకునే వాళ్లు ఎవరైనా వుంటారా? ఇక్కడ విచిత్రమేమిటంటే మాకు పెద్ద కొండ వుంది. అందులో లక్షల టన్నుల కంకర తయారయ్యే గుట్టలున్నాయని ఎవరూ అధికారులకు అర్జీలు పెట్టుకోలేదు. మేము కంకర వ్యాపారం చేయాలనుకుంటున్నాం. మీరు ఏవైనా గుట్టలను మాకు అప్పగిస్తే కంకర తయారు చేసి, ప్రభుత్వానికి సరఫరా చేస్తామని దరఖాస్తులు పెట్టుకున్నారు. అలా దరఖాస్తులు పెట్టుకున్నవారికి అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు కనిపించిన ప్రతి గుట్టను అధికారులు కాంట్రాక్టర్లకు రాసిచ్చారు. కంకర తెమ్మని రాతపూర్వక ఆదేశాలిచ్చారు. ఇది కంకరేనా..ఈ కంకర నిర్మాణాలకు ఎవరైనా వాడుతారా? అంటూ నేటిధాత్రి ప్రశ్నిస్తే మాదేముంది? మేం కాంట్రాక్టు చేద్దామనుకున్నాం! కంకర సరఫరా చేసే క్రషర్లు ఏర్పాటు చేసుకుంటామని చెప్పాం! మాకు అందుబాటులో వున్న కొండలు లీజుకిస్తే, వాటి కంకర తయారు చేసి, ప్రభుత్వానికి సరఫరా చేస్తామని చెప్పాం!! ఇదీ స్దూలంగా అడ్డదారిలో, అడ్డగోలుగా, ప్రజా దనం దుర్వినియోగం చేసిన కొందరు కాంట్రాక్టర్లు చెబుతున్న మాట!!! ఇదిలా వుంటే సదరు కాంట్రాక్టర్లు ఓ మహా నిర్మాణానికి పెద్దఎత్తున కంకర సరఫరా చేసే ముందు రాజేంద్ర నగర్‌లో వున్న క్యాలిటీ కంట్రోల్ బోర్టుకు కంకర రాయిని పంపించారు. అక్కడున్న నిపుణులు ఇది కంరరే కాదని నిర్ధారించారు. అది కంకరగా పనికి రాదని తేల్చేశారు. ఇది సుద్దకన్నా అద్వాహ్నమైందని చెప్పారు. ఈ ఎర్రరాయికి కరిగిపోయే గుణం వుంటుందని చెప్పారు. ఎట్టి పరిస్దితుల్లోనూ నిర్మాణాలకు ఈ కంకర అసలే వాడొద్దని హెచ్చరించారు. తెలంగాణలో చేపట్టిన ఓ మహా నిర్మాణానికి ఈ రాతి కంకర వాడడం ఎంతో ప్రమాదకరమని కూడా తేల్చిచెప్పారు. ఎట్టిపరిస్ధితుల్లోనూ తాము అంగీకరించే పరిస్దితి లేదని చెప్పారు. అయినా అదికారులు అదే కంకరను ఈ మహా నిర్మాణానికి సుమారు 20వేల కోట్ల రూపాయల విలువైన కంకరను సరఫరా చేయించుకున్నారు. సహజంగా కంకరకు మంచి బలమైన నల్లరాతి గ్రానైట్ కావాలి. అంతే కాని గులకరాయిలా కూడా పనిచేయని ఎర్రరాయిని విచ్చలవిడిగా వాడేశారు. ఆ మహా నిర్మాణానికే కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్మాణం సాగిస్తున్న జాతీయ రోడ్లకు కూడా వరంగల్ జల్లాలో ఇదే కంకరను విస్తారంగా వినియోగిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన మహా నిర్మాణం ఇప్పుడు ఆరోపణల పాలు కావడంలో ఎర్ర కంకర పాత్రే ఎక్కువ అని నిపుణులు అంటున్నారు. ఎంత చెప్పినా అదికారులు పట్టించుకోలేదు. కాంట్రాక్టర్లు వినలేదని కూడా అంటున్నారు. ఏదైనా జరిగితే మొత్తం నిర్మాణానికే ప్రమాదం ఎదురౌతుందని తెలసి కూడా అటు అదికారులు, ఇటు కాంట్రాక్టర్లు బరితెగించారంటే సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలు కోవాలి. ఈ దిశగా దర్యాప్తు సాగించాలి. ఎంత మంది కాంట్రాక్టర్లకు ఎన్ని గుట్టలు అదికారులు అప్పగించారు? ఎన్నికొండలు తొలిచేశారు? ఆ కొండల మూలంగా ఎంత కంకర వచ్చింది? రాజేంద్ర నగర్ క్వాలిటీ కంట్రోల్‌బోర్డు వద్దని ఆదేశాలు జారీ చేసినా, ఎవరు పక్కకు పెట్టారు. ఎందుకు తొక్కిపెట్టారు? దీని వెనుక ఎవరున్నారు? వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ నాసిరకం కంకర సరఫరా చేయడం అంటే నేరం కాదా? కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన మొత్తానికి సమానమైన లాభంతో ఎంబిలు తయారు చేసినట్లు సమాచారం. సగం, సగం వాటాలు అన్నట్లు ఇద్దరూ కలిసి వేల కోట్లు దోచేశారు. ప్రజా ధనం నీళ్లలోపోశారు. ఆ కాంట్రాక్టర్లు ఎవరు? అనుమతులిచ్చిన అదికారులెవరు? ఎంత కంకర సరఫరా చేశారు? ఎంత సొమ్ము దుబారా చేశారు? అనే పూర్తి వివరాలతో కూడిన ప్రత్యేక కధనాలు త్వరలోనే మీ నేటిధాత్రిలో…
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలి
వరంగల్ జిల్లా ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు.శుక్రవారం హన్మకొండలోని డిసిసిబి భవన్ ఆడిటోరియంలో జెడ్పి సీఈఓ, ఇంచార్జి డిఆర్డీఓ రామిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ,జిల్లా ఉద్యానవన అధికారి శ్రీనివాసరావు, డిఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా సహకార అధికారి నీరజలతో కలిసి వరంగల్ డివిజన్ లో వరి ధాన్యం కొనుగోలుపై సన్నాహక,శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం 2025 -26 సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని,కొనుగోలు కేంద్రాలను లోతట్టు ప్రాంతాలలో ఏర్పాటు చేయకూడదని, కొనుగోలు ప్రక్రియకు అవసరమైన గన్నీ సంచులు, టార్పాలిన్లు, తేమ శాతాన్ని నిర్ధారించేయంత్రాలు సమకూర్చడం జరుగుతుందని,సన్న రకం, దొడ్డు రకం ధాన్యాన్ని వేరువేరుగా కొనుగోలు చేసి నిల్వ చేయాలని, కొనుగోలు సమయంలో ఎప్పటికప్పుడు ధాన్యం, రైతుల వివరాలను ట్యాబ్ లలో నమోదు చేయాలని, రిజిస్టర్ సక్రమంగా నిర్వహిస్తూ రైతుల వివరాలు నమోదు చేయాలని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, నీడ, వైద్య వసతి తదితర మౌలిక వసతులు కల్పించాలని, తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తమ సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోలుకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే గన్ని సంచులు రైతులకు అందించాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు ధ్రువీకరించిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని ,ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పర్యవేక్షించాలని, కొనుగోలు ప్రక్రియలో భాగంగా తేమశాతం యంత్రాలు, టార్పాలిన్లు, త్రాగునీరు, నీడ తదితర విషయాలకు సంబంధించి పి.సి.ఎస్.ఎ.పి. యాప్, గన్ని సంచుల నిర్వహణ కోసం మేనేజ్మెంట్ యాప్, పట్టాదారు, బ్యాంకు పాస్ పుస్తకాలు, ఆధార్, మొబైల్ నెంబర్ నిర్వహణపై ఓ.పి.ఎం.ఎస్. యాప్ లను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.
Efficient Rice Procurement in Warangal District
ప్రభుత్వం వరి ధాన్యం కనీస మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి క్వింటాలుకు 2 వేల 389 రూపాయలు, సాధారణ రకానికి క్వింటాలుకు రూ .2 వేల 369 లుగా నిర్ణయించడం జరిగిందని, సన్న రకం వడ్ల కు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, జిల్లాలో టాగింగ్ చేయబడిన రైస్ మిల్లులకు మాత్రమే కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు.వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేయబడిన రైతుల పంట సాగు డేటా ప్రకారం మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని, హార్వెస్టర్ వినియోగ సమయంలో ఆర్ పి ఎం 18-20 ఉండేలా పర్యవేక్షించాలని, ఇలా నిర్దేశిత వేగంతో వినియోగించినట్లయితే తాలు పోయి నాణ్యమైన ధాన్యం వస్తుందని ,హార్వెస్టర్ యంత్రాల వినియోగ సమయంలో నిబంధనలను పాటించాలని, కోతకు వచ్చిన తర్వాత మాత్రమే పంట కోయాలని, బ్లోయర్ యాక్టివ్ మోడ్ లో ఉండాలని ,రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 48 గంటలలో సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Efficient Rice Procurement in Warangal District
కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేసిన ప్యాడి క్లీనర్లను వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు,సీఓలు, డిఆర్డీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జేఏసీ పిలుపుమేరకు మేరకు బందునువిజయవంతం చేద్దాం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల. కేంద్రంలో ఈరోజు మార్కండేయ భవన్లో. వివిధ రాజకీయ పార్టీల కుల సంఘాల బీసీ సంఘాల ప్రతినిధులతో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ జేఏసీ పిలుపుమేరకు రేపు జరిగే బందును అన్ని వర్గాల ప్రజలు వివిధ రాజకీయ పార్టీలు కుల సంఘాలు బీసీ సంఘాలు కార్మిక సంఘాలు నేతలు సహకరించాలని బీసీ నేతలను కోరారు దేశంలో రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీలకు 42 శాతం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో తెస్తే మరి ఉన్నత వర్గాల్లో కొందరు బీసీ వ్యతిరేకులు కోర్టులో పిటిషన్ వేసి నిలుపుదల చేశారని వారికి తగిన గుణపాఠం చెబుతామని నేతలంతా. ముక్తకంఠంతో. హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రాజ్యాంగంలో ని. 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి తర్వాత ఎన్నికలకు పోవాలని నాయకులను కోరారు ఈ సందర్భంగా. బీసీ సంఘాల నేతలు ఎగుర్ల కర్ణాకర్. కందుకూరి రామ గౌడ్. బి ఆర్ ఎస్. పార్టీ మండల అధ్యక్షులు రాజన్న. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మచ్చ శ్రీనివాస్. బిజెపి నాయకులు గుగ్గిల ఆంజనేయులు . ఇట్టి కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొని ప్రసంగించారు ఇట్టి బందుకు వారి పార్టీల పక్షాన జేఏసీ. పిలుపుమేరకు బందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇట్టి కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు కట్ట రవి. శాలి అధ్యక్షులు రాపల్లి ఆనందం. ఎగుర్ల ప్రశాంత్. నేరెళ్ల అనిల్. రంగు ప్రసాదు. గుర్రం తిరుపతి. గాద సత్తయ్య. వెంగళ రమేష్ పలువురు. జేఏసీ నాయకులు తదితరులు బందుకు మద్దతు ప్రకటించారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.