కాశీబుగ్గ మధర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ లో అన్నదానం
నేటిధాత్రి, కాశీబుగ్గ.
హైదరాబాద్ హైడ్రా కమిషనర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ జన్మదిన వేడుకలు వరంగల్‌లో ఘనంగా నిర్వహించారు. కాశీబుగ్గకు చెందిన దివ్యాంగుడు సయ్యద్ అసద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు 19వ డివిజన్ లోని మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్‌లో జరిగాయి. ఈ సందర్భంగా మానసిక వికలాంగుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న వారు కమిషనర్ ఏవి రంగనాథ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సయ్యద్ అసద్ మాట్లాడుతూ, రంగనాథ్ సార్ వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడు తనకు న్యాయం చేశారని తెలిపాడు. హైడ్రా సంస్థ కార్యకలాపాలు ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆ సంస్థ వరంగల్ ట్రై సిటీలో కూడా విస్తరించాలని కోరారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూములు, భూకబ్జాలు విస్తృతంగా జరుగుతున్నాయని, వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు, సేవా సంస్థ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
చౌటుప్పల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చౌటుప్పల ఆధ్వర్యంలోఏర్పాటుచేసినటువంటి నక్కలగూడెం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను సంఘ పి ఐ సి చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షాలు వస్తున్నందున రైతులు తమ ధాన్యరాశులపై టార్పాలిన్లు కప్పుకోవాలని సూచించారు. రైతులు తమ పంటలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఆధార్ కార్డులకు తమ పాన్ నెంబర్లకు లింక్ చేయించుకోవాలని తెలిపారు .కొనుగోలు ప్రారంభం అయినందున రైతులు తమ ధాన్యాన్ని ఎండబెట్టుకోవాలని తాలు పట్టుకోవాలని సూచించారు. అధికారులు సూచించిన పరిమితులు లోబడి ఉంటే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, సంఘం డైరెక్టర్ కృష్ణ, ఏఈఓ సౌమ్య, రైతులు జంగయ్య, వై బుచ్చిరెడ్డి, అశోక్ రెడ్డి ,శ్రీశైలం ,కార్యదర్శి వై రమేష్ ,సిబ్బంది పాల్గొన్నారు.
స్వచ్చత పరిశుభ్రత హరిత పాఠశాల కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరానికి గాను నిజాంపేట మండలం నగరం ప్రభుత్వ పాఠశాల మొదటి స్థానాన్ని దక్కించుకుందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. పాఠశాల పరిశుభ్రత విషయం లో 61 అంశాల్లో పాఠశాల పురోగతిని పరిశీలించి రేటింగ్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రేటింగ్స్ లో మండలంలోని నగరం తండా గ్రామంలో గల పాఠశాల ఫైవ్ స్టార్ రేటింగ్ తో మొదటి స్థానం లో నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు వెంకటేష్, కల్పన ఉన్నారు.
జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీజీఐఐసి, నిమ్డ్ భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం జహీరాబాద్ నిజ్జా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 1501 ఎకరాల భూమిని సేకరించి నిమ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. మిగిలిన భూమిని కూడా త్వరలో నిమ్ కు అప్పగించాలని సూచించారు.
రామాయంపేట మండలం తోనిగండ్ల గ్రామానికి చెందిన రైతు పేగుడ దుర్గయ్య (68) మృతి చెందడంతో గ్రామం మొత్తానికి విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమారు 25 రోజుల క్రితం పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కళ్లుచిరుగి పొలం వద్దనే కుప్పకూలిన దుర్గయ్యను చుట్టుపక్కల రైతులు గమనించారు. వెంటనే స్పందించిన వారు 108 అంబులెన్స్‌కి సమాచారం ఇవ్వగా, అతన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆయనకు రక్తపోటు అత్యధికంగా పెరగడంతో కోమాలోకి వెళ్లినట్లు నిర్ధారించారు. అక్కడి నుండి హైదరాబాద్‌కు తరలించిన కుటుంబ సభ్యులు, మేడ్చల్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించారు. అయితే 26 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన దుర్గయ్య చివరకు బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. రైతు దుర్గయ్య భార్య లక్ష్మి కూడా సుమారు ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ముగ్గురు కూతుళ్లను విడిచి వెళ్లిపోయిన దుర్గయ్య మృతితో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల విలాపాలతో తోనిగండ్ల గ్రామం మునిగిపోయింది. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు దుర్గయ్య కుటుంబానికి సానుభూతి తెలిపారు. “ఆయన ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవారు. కుటుంబం కోసం జీవితాంతం శ్రమించారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేం” అని గ్రామస్థులు కన్నీటి కణాలతో గుర్తుచేశారు.
బుధవారం భూపాలపల్లి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పం కిషన్ పుట్టిన రోజు సందర్భంగా కిషన్ ని ఆశీర్వదించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్సార్ మాట్లాడుతూ కిషన్ నిండు నూరేళ్లు ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గం ( సంగారెడ్డి జిల్లా) జహీరాబాద్ ప్రాంతంలో చిన్న హైదరాబాద్ లో అంజయ్య, జయశ్రీ దంపతులకు జన్మించిన పూజ, చిన్నతనం నుండి బాగా చదువుకొని మన ప్రాంతము కె గర్వకారణం అయ్యే విదంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రూప్ 1 పరీక్షల్లో తెలంగాణ లో 25 వ ర్యాంకు సాధించి వికారాబాద్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా పోస్టింగ్ పొందింది.మన ప్రాంతంలో ఎంతో మంది విద్యార్థులకు పూజ ఆదర్శంగా నిలిచారు అని జహీరాబాద్ ప్రాంత వాసులు కొనియాడారు జహీరాబాద్ మహిళా మణులు పూజకు ఘనంగా సర్కారం చేశారు.పూజ ను జన్మనిచ్చినందుకు తండ్రి అంజయ్య దంపతులు గర్వపడ్డారు.ఈ కార్యక్రమంలో అనిత,స్వప్న,సిందూజా, రుక్మిణి, పద్మ, ఆశమ్మ, శారదా,రాజరమేశ్, తదితరులు పాల్గొన్నారు.
అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం అదనపు ఎస్పీ చంద్రయ్య.
పోలీస్ అమరవీరుల సంస్మరణలో (పోలీస్ ఫ్లాగ్ డే)
పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజుపోలీస్ అమరవీరుల సంస్మరణలో (పోలీస్ ఫ్లాగ్ డే)ఈ సందర్భంగా ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని ఉద్ధ్యేశించి అదనపు ఎస్పీ మాట్లాడుతూ…అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటు పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై, పోలీస్ శాఖ పనితీరు, వివిధ అంశాలపై విధ్యార్ధిని, విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఊదేశ్యంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు విద్యతో సమాజంలో జరుగుతున్న పరిణామాల పై అవగహన పెంచుకోవాలన్నారు. విద్యార్ధులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ అంటే ఏమిటి, అది ప్రజలకు శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని పని విధానం ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అందు కోసం స్టాల్స్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వివరించిన విషయాలు. ● ఫ్రెండ్లీ పొలిసింగ్ విధానం ద్వారా ప్రజలకు దగ్గర అవుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం డే/నైట్ బీట్స్, పెట్రోలింగ్ వ్యవస్థలు ఏవిధంగా పనిచేస్తాయి. ● పోలీసు శాఖ నేరస్తులను సులువుగా గుర్తించడం కోసం అభివృద్ధి చేసిన ఫేస్ రికగ్నిషన్ సిస్టం, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి నూతన సాంకేతికతల గురించి వివరించారు. ● నేరాలు జరగకుండా నివారించడంలో మరియు జరిగిన నేరాన్ని త్వరగా చేదించడం లో సి.సి కెమెరాలు ఏవిధంగా ఉపయోగపడతాయి. ● మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ఏర్పాటైన షీ టీమ్ లు, భరోసా సెంటర్ ఏవిధంగా పని చేస్తాయి. ● పోలీస్ శాఖ ఉపయోగించే ఆయుధాలు,వాటి పనితీరు, ఏ సందర్భాలలో ఉపయోగపడతాయి అని వివరించడం జరిగింది.
● బాంబ్ స్క్వాడ్స్ ఏవిదంగా బాంబులను నివృత్తి చేస్తుంది,పోలీస్ జగిలాల పని తీరు పై అవగాహన కల్పించడం జరిగింది. ● విద్యార్థులకు ట్రాఫిక్ నియమలపై ఆవాహన కల్పించడం జరిగింది.హెల్మెట్ ధరించాలని, మైనర్ డ్రైవింగ్,ర్యాష్ చేయవద్దని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని అవగాహన కల్పించడం జరిగింది. ● సైబర్ నేరాలగురించి ఏవిధంగా అప్రమత్తంగా వుండాలి, ఆన్లైన్ లో అపరిచితులతో పరిచేయాలకు దూరంగా ఉండాలని, ఏదైనా సైబర్ క్రైమ్ కు గురి అయినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేసి మీ యొక్క ఫిర్యాదు నమోదు చేయాలని వివరించడం జరిగింది. పైవిషయాలకు సంబంధించి అర్మోరర్లు, బాంబ్ స్క్వాడ్ టీం, IT Core, భరోసా సిబ్బంది,షిటీమ్,ఫింగర్ ప్రింట్స్, కమ్యూనికేషన్ సిబ్బంది విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరును వివరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ,ఆర్.ఐ యాదగిరి,ఆర్.ఎస్.ఐ లు శ్రవణ్ యాదవ్, దిలీప్, పోలీస్ సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు
డిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడిగా డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని నామినేట్ చేయాలని అథర్ గౌరి విజ్ఞప్తి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు మునిసిపాలిటీ మాజీ ప్రతినిధి కౌన్సిలర్ ముహమ్మద్ అథర్ గౌరి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మల్లికా అర్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా డిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నామినేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ ఉజ్వల్ రెడ్డి విద్యావంతులైన పేద ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న నాయకుడు, సంగారెడ్డి జిల్లా ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకుడు అని, డాక్టర్ ఉజ్వల్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేశారని, ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నాయకుడని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా డిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని నామినేట్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన పాకాల ప్రశాంత్ రెండు రోజుల క్రితం చనిపోయిన విషయం తెలుసుకున్న చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచులు తడగొండ సత్యరాజ్ వర్మ, బక్కశెట్టి నర్సయ్య, నాయకులు నర్సింబాబు, బక్కశెట్టి శ్రీనివాస్, అజయ్, రాజు, ఖాసీం షరీఫ్, త్రినాథ్ వర్మ, పాదం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో దుబాయ్ లో మరణించిన ఎలగందుల ప్రకాష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన చొప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్. గత కొద్దిరోజుల క్రితం మరణించిన ప్రకాష్ మృతదేహాన్ని అక్కడి ఎన్నారై సభ్యుల సహకారంతో ఇండియాకు రప్పించి వారికి ఇద్దరు పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారని తెలుసుకొని పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి పిల్లల చదువుల ఫీజులు మాఫీ చేయాలని కోరగా, యాజమాన్యం సానుకూలంగా స్పందించారు. ఈసందర్భంగా కుటుంబ సభ్యులు రవిశంకర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పూడూరు మల్లేశం, ఎడవల్లి పాపిరెడ్డి, వేల్పుల హరికృష్ణ, దాసరి అరుణ్ కుమార్, సుద్దాల మల్లేశం, రేణికుంట బసంతం రేణిగుంట అశోక్, దాసరి అనిల్, వేల్పుల రవి, రేణికుంట శ్రావణ్, రేణిగుంట రవి, రేణిగుంట ఆనంద్, దాసరి శంకర్, రేణిగుంట హరీష్, లింగంపల్లి రవి, దాసరి శ్రీనివాస్, దాసరి శేఖర్, దాసరి శ్రీనివాస్, దాసరి రవీందర్, పురాణం రమేష్, తదితరులు పాల్గొన్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల 17 వ వార్డ్ శ్రీనివాస్ నగర్ ఏరియాలో ఇళ్ల మధ్య ఏపుగా పిచ్చి మొక్కలు పెరగడంతో పిచ్చి మొక్కలలో చెత్తాచెదరం చేరుకొని దోమలకు ఆవాసాలుగా మారి కాలనీవాసులు జ్వరాలు బారిన పడుతున్నారంటూ కాలనీవాసులు వాపోతున్నారు. మొక్కలు ఏపుగా పెరగడంతో విష జ్వరాలకు నిలయంగా మారడంతో రాత్రిపూట బయటకు రావాలంటే భయాందోళనకు గురవుతున్నామన్నారు. పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో విష సర్పాలు సంచరించడంతో పాటు క్రిమి కీటకాలు దోమల బెడద కూడా ఎక్కువైందని వారు ఆరోపిస్తున్నారు. చికెన్ గున్యా, డెంగి ,మలేరియా వంటి వైరల్ జ్వరాలు రాకుండా పిచ్చి మొక్కలను
తొలగించాలని మునిసిపాలిటీ అధికారులను వారు కోరుతున్నారు. ఎస్ఆర్కే పాఠశాల పక్కన గల రోడ్డు సరిగా లేదని, పాఠశాల సమీపంలో లక్షలు వెచ్చించి ఓపెన్ జిమ్ ఐతే ఏర్పాటు చేశారు కానీ ఓపెన్ జిమ్ కు వెళ్ళే దారి మొత్తం పిచ్చి మొక్కలతో నిండుకు పోయిందని ,వ్యాయామం కోసం వెళ్లే వారు సైతం పిచ్చి మొక్కల ను చూసి ఓపెన్ జిమ్ కు వెళ్లలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. పాలకవర్గం లేకపోవడంతో స్థానిక నాయకులు సైతం కాలనీలోని సమస్యలను పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా స్థానిక మునిసిపాలిటీ అధికారులు చొరవ తీసుకొని కాలనీ సమస్యలు తీర్చాలని వారు కోరుతున్నారు.
అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా స్పీడ్ డ్రైవింగ్ విషయంలో ఏ మాత్రం తక్కువ కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది. ఆ వీడియోలో ఓ యువతి పల్లెటూరి రోడ్లపై అతి వేగంగా స్కూటీ నడిపి అందుకు తగ్గ మూల్యం చెల్లించింది.
అతి వేగం (Speed) అత్యంత ప్రమాదకరం అని అందరికీ తెలిసిందే. అయినా యువకులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. బిజీగా ఉన్న రోడ్డు మీద వెళ్లినా, సందుల్లో నడుపుతున్నా వేగాన్ని మాత్రం తగ్గించరు. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా ఆ విషయంలో ఏ మాత్రం తక్కువ కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది. ఆ వీడియోలో ఓ యువతి (Girl) పల్లెటూరి రోడ్లపై అతి వేగంగా స్కూటీ (Scooty) నడిపి అందుకు తగ్గ మూల్యం చెల్లించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువతి ఓ గ్రామంలోని రోడ్లపై స్కూటీ మీద ప్రయాణం చేస్తోంది. ఆమె స్కూటీ మీద వెళ్తుండగా వెనుక బైక్ మీద వెళ్తున్న వ్యక్తులు వీడియో తీశారు. ఆ యువతి క్రమంగా తన స్కూటీ స్పీడ్ పెంచింది. గడ్డి పై నుంచి కూడా అంతే స్పీడ్‌గా వెళ్లింది. ఆ సమయంలో ఆమె స్కూటీ బ్యాలెన్స్ తప్పినా నిలదొక్కుకుంది. ఆ తర్వాత టర్నింగ్ వచ్చినపుడు మాత్రం ఆ స్పీడ్‌లో ఆమె నియంత్రించుకోలేకపోయింది. దీంతో బైక్‌తో సహా కింద పడిపోయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. సుంకాలు భారీగా తగ్గనున్నాయా..
గత కొద్ది రోజులుగా భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై అమెరికా టారిఫ్ వార్ ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రతీకార సుంకాల పేరుతో 25 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే.గత కొద్ది రోజులుగా భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై అమెరికా టారిఫ్ వార్ ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రతీకార సుంకాల పేరుతో 25 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఇక, రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తోందనే కారణంతో ట్రంప్ మరో 25 శాతం సుంకాలు విధించారు
ప్రస్తుతం భారత్ ఎగుమతులపై అమెరికాలో 50 శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి. అయితే భారత్-అమెరికా మధ్య ఎన్నో రోజులుగా జరుగుతున్న వాణిజ్య చర్యలు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ ట్రేడ్ డీల్‌తో భారత్‌పై అమెరికా సుంకాలు భారీగా తగ్గబోతున్నాయట. ప్రస్తుతం ఉన్న 50 శాతం నుంచి 15-16 శాతానికి తగ్గే వీలుందట. నవంబర్ 30 తర్వాత ఈ కొత్త టారిఫ్‌లు అమల్లోకి రావచ్చొని కొందరు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు (US imports India tariffs).
ఈ ట్రేడ్ డీల్ కోసం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించుకునే ప్రయత్నంలో భారత్ ఉన్నట్టు తెలుస్తోంది (bilateral trade India US 2025). ప్రస్తుతం భారత్ ముడిచమురు దిగుమతుల్లో రష్యా వాటా 34 శాతంగా ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతులను క్రమంగా తగ్గించుకునేందుకు భారత్ అంగీకరించనుందని సమాచారం.
అమెరికాలో భారీగా పండే మొక్కజొన్న దిగుమతులను చైనా ఇటీవల భారీగా తగ్గించుకుంది. దీంతో ప్రత్యామ్నాయ మార్కెట్ కోసం భారత్ వైపు అమెరికా చూస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి మొక్కజొన్న, సోయామీల్‌ను భారత్‌లోకి అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చిత్తూరులో భారీ వర్షాలు.. ప్రజలకు అధికారులహెచ్చరికలు
వెదురుకుప్పం మండలం దేవళంపేట వద్ద రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడి గ్రామస్తులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Chittoor Rains) కురుస్తున్నాయి. అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎన్టీఆర్, కృష్ణాపురం జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు రెండు ప్రాజెక్టుల్లోనూ రెండు గేట్లు ఎత్తి నీటిని బయటకు విడుదల చేశారు. వెదురుకుప్పం మండలం దేవళంపేట వద్ద రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడి గ్రామస్తులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు నగరంలోని నీవా నది లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కార్పొరేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, కళాశాలలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తోంది జిల్లా యంత్రాంగం. పది రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూరగాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
కాగా.. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఈరోజు మధ్యాహ్ననికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈరోజు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ క్రమంలో చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండరాదని.. లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. పొంగిపోర్లే వాగులు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు.
ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాను, రష్యా అధ్యక్షుడు పుతిన్ హంగేరి రాజధాని బుడాపేస్ట్‌లో సమావేశం అవుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ సమావేశం వాయిదా ప్రస్తుతానికి వాయిదా పడింది. మళ్లీ భవిష్యత్తులో ఈ సమావేశం జరుగుతుందనే అంశంపై స్పష్టత లేదని వైట్ హౌస్ వెల్లడించింది.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో హంగేరి రాజధాని బుడాపేస్ట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఉక్రెయిన్‌పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేందుకు రష్యా సుముఖత వ్యక్తం చేయ లేదు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లు ద్వారా చర్చించుకున్నారు. అనంతరం ఈ ప్రకటన జారీ అయింది. ట్రంప్, పుతిన్‌ల మధ్య బుడాపెస్ట్‌లో సమావేశం జరగనుందంటూ గత వారం ఒక ప్రకటన వెలువడిన విషయం విదితమే.
అయితే ఈ సమావేశం నిలిచిపోయేందుకు స్పష్టమైన కారణాలు అయితే లేవని అమెరికా స్పష్టం చేసింది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఉపయోగం లేని ఈ భేటీ ద్వారా సమయం వృధా చేసుకోవాలంటూ తనదైన శైలిలో ఆయన తెలిపారు. ఈ చర్చల వల్ల ఎలాంటి ఆశాజనక పరిణామాలు ఉండవని ట్రంప్ వెల్లడించారు. అయితే రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొన్ని నెలలుగా సాగుతోంది.దాంతో ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణపై చర్చలకు ట్రంప్, పుతిన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వీరు మరికొద్ది రోజుల్లో బుడాపేస్ట్‌లో సమావేశం కావాల్సి ఉంది. ఇక వీరి భేటీపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సైతం స్పందించింది. భవిష్యత్తులో వీరి భేటీ సందేహమేనంటూ అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ కాల్పుల విరమణకు ముందు ఉక్రెయిన్ మరిన్ని భూభాగాలను వదులుకోవడానికి అంగీకరించాలంటూ మాస్కో చాలా కాలంగా డిమాండ్ చేస్తోన్న విషయం విదితమే.
వారి సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు: మాధవ్
ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకురావడం, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని మాధవ్ తెలిపారు.
ఏపీకి కేంద్రం నుంచి లక్షన్నర కోట్ల సాయం అందిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ (AP BJP Chief Madhav) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. లక్షా 80వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. రూ.11,444 కోట్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి నిధులు కేటాయించారని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా 15 బిలియన్ డాలర్ల్ ఒక లక్షా 25వేల కోట్లతో విశాఖకు రావడం డబుల్ ఇంజన్ గ్రోత్‌కు ఒక చిహ్నమని పేర్కొన్నారు. విశాఖను గ్లోబల్ గ్రోత్ సెంటర్‌గా మార్చేలా అనేక కంపెనీలు, ఐటీ సంస్థలు వస్తున్నాయని వెల్లడించారు మాధవ్.
ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకురావడం, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. కర్ణాటక వంటి పక్క రాష్ట్రాలకు కంటగింపుగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు దగా కోరు రాజకీయాలు చేస్తూ.. వారి వైఫల్యాలను వారే బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు. కర్ణాటకలో ఫెయిల్ గవర్నమెంట్ ఉంది కాబట్టే.. ఆ పార్టీ తరపున వారు ఆక్రోశం వెలిబుచ్చుతున్నారని వ్యాఖ్యలు చేశారు. మోడీ, చంద్రబాబులు అసాధ్యమైన అంశాన్ని సాధించి.. ప్రపంచ వ్యాప్తంగా ఏపీ గురించి చర్చించుకునేలా చేశారని ఏపీ బీజేపీ చీఫ్ తెలిపారు.
కృత్రిమ మేధస్సుతో అనేక ప్రయోగాలకు విశాఖ వేదిక కాబోతుందన్నారు. ఎనర్జీ సోర్స్ కింద సోలార్, విండ్, హై ఎనర్జీలను వాడేందుకు గ్రీన్ ఎనర్జీ తయారవుతుందన్నారు. టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాన్ ఫ్యాక్చరింగ్‌లో యువత ప్రతిభకు చైనా తర్వాత ఏపీకే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అమెరికాలో ఆంక్షలు ఉండటంతో భారత దేశంలోనే వీరంతా ఉండబోతున్నారని అన్నారు. ఐదేళ్లల్లో ఐదు లక్షల ఉద్యోగాలు యువతకు వస్తాయని ప్రకటించారు. నరేంద్ర మోడీ, రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. వైజాగ్ – చెన్నై కారిడార్, బెంగుళూరు – చెన్నై కారిడార్, రాయలసీమ వైపు మరో కారిడార్‌లు రాబోతున్నాయని మాధవ్ అన్నారు. డిపెన్స్ క్రస్టల్స్, అతిపెద్ద రిఫైనరీ, జాతీయ రహదారుల కనెక్టివిటీ అన్ని ప్రాంతాలకు పెరగడం ద్వారా అభివృద్ధి మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఎలక్ట్రానికి వెహికల్ తయారు చేసే కంపెనీలు, జిందాల్ సంస్థలు, పవర్ హౌస్‌లు ఏపీకి రాబోతున్నాయని.. డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో రాయలసీమ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. మన రాజధాని అమరావతిలో గత ప్రభుత్వంలో అభివృద్ధి ఆగిపోయిందని… అమరావతితో వారంతా ఆటలాడుకుని నాశనం చేశారని మండిపడ్డారు. మోడీ సారథ్యంలో ఇప్పుడు అమరావతి నిర్మాణానికి 15వేల కోట్లు కేటాయించారన్నారు. అమరావతి నుంచి అనంతపురం వరకు జాతీయ రహదారుల అనుసంధానం కాబోతున్నాయని తెలిపారు. ఏపీ జీవనాడి పోలవరం నిర్మాణం కోసం కేంద్రం ఐదు వేల కోట్లు కేటాయించిందని అన్నారు. కుడి, ఎడమ కాలువ పనులు పూర్తి చేసి త్వరలోనే ప్రాజెక్టు పూర్తి చేస్తారని వెల్లడించారు. ఏపీని అన్ని విభాగాల్లో అబివృద్ధి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అడుగులు వేస్తున్నాయన్నారు. ఓకల్ ఫర్ లోకల్ నినాదంతో.. ప్రతిఒక్కరూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. భారత దేశ ఆర్థికాభివృద్ధికి దేశ ప్రజలంతా సహకారం అందించాలని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కోరారు.
జూబ్లీహిల్స్ బైపోల్స్ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనటంపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవటమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై (Jubilee Hills Bypoll) బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) దృష్టిసారించారు. గులాబీ పార్టీ ముఖ్యనేతలు, జూబ్లీహిల్స్ బైపోల్స్ ఇంచార్జ్‌లకు కేసీఆర్ పిలుపునిచ్చారు. రేపు (గురువారం) ఫాంహౌస్‌లో పార్టీ నేతలతో గులాబీ బాస్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉపఎన్నిక ప్రచారంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే 40 మందితో స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది బీఆర్‌ఎస్. అయితే జూబ్లీహిల్స్ బైపోల్స్ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనటంపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవటమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా.. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైన కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది బీఆర్‌ఎస్ పార్టీ. అందుకు తగ్గ ప్రణాళిలను కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకే టికెట్ ఇచ్చింది బీఆర్‌ఎస్. మాగంటి సునీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎక్కడిక్కడ ర్యాలీలో, సభలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొని బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరుతున్నారు.మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఉపఎన్నికల్లో గెలుపు తమదే అంటూ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుండగా.. బైపోల్‌లో విజయం తమనే వరిస్తుందని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఈ మూడు పార్టీల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టంకట్టనున్నారో చూడాలి మరి.
‘‘పిఏ పిఆర్‌ఓ’’ లు ‘‘మూటల కోసమే’’ పనిచేస్తున్నారు!
`మంత్రులు, ఎమ్మెల్యేలను బద్నామ్ చేస్తున్రు!
`ప్రజల నుంచి పిఏ, పిఆర్వోల మీద సామాన్యుల నిరసనలు.
`పార్టీ నాయకులకు కూడా విలువివ్వరు.
`కార్యకర్తలను పురుగుల్లా చూస్తారు!
`మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పుకోలేక నాయకులు మధనపడుతున్నారు.
`ఎమ్మెల్యేలను నాయకులను కూడా కలువనివ్వరు!
`మంత్రుల దరి చేరనివ్వరు!
`ఎమ్మెల్యే బిజీ, బిజీ అని చెప్పి తిప్పించుకుంటున్నారు.
`ఎలాంటి సమాచారం తెలియనీయకుండా జాగ్రత్త పడుతుంటారు.
`సామాన్యులకు అప్పాయింట్ ఇవ్వరు!
`జనాలకు మంత్రులు, ఎమ్మెల్యేలను దూరం చేస్తున్నారు.
??జర్నలిస్టుల ఫోన్లుకు కూడా స్పందించరు.??
`మంత్రులు, ఎమ్మెల్యేల అధికారిక పర్యటనలపై వివరాలివ్వరు.
`కనీసం వార్త రాసి మీడియాకు పంపడం కూడా చేతకాదు!
`మంత్రుల సక్సెస్ స్టోరీలకు సమాచారం ఇవ్వరు.
`వార్తలను చూసి పారిశ్రామిక వేత్తలకు ఫోన్లు?
`రియల్ వ్యాపారులకు బెదిరింపులు?
`ఎమ్మెల్యేల పేరు చెప్పి దందాలు, పైరవీలు!
`అధికారులను సైతం హడలెత్తించి పనులు చేసుకుంటున్నారు!
హైదరాబాద్,నేటిధాత్రి:
దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదన్న సామెతను నిజం చేస్తున్నారు కొంత మంది ప్రజా ప్రతినిదుల పిఏలు, పిఆర్వోలు అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొంత మంది పిర్వోలు, పిఏలు అత్యుత్సాహానికి పోయి, మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలకు దూరం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పలకుబడిని పలుచన చేస్తున్నారు. వారి పేర్లు చెడగొడుతున్నారు. వారికి వున్న ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారు. ప్రజల్లో వారికి వున్న ఆదరణను దూరం చేస్తున్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకే తలవంపులు తెస్తున్నారు. రాజకీయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శల పాలయ్యేలా చేస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీలకు అస్త్రాలంచేలా వ్యవహరిస్తున్నారు. పిఏలు, పిఆర్వోలు చేసే మకిలి పనులకు ప్రజా ప్రతనిధులు సమాధానం చెప్పుకునే పరిసి ్దతి తీసుకొస్తున్నారు. మేమే ఎమ్మెల్యేలకు బాస్‌లమన్నంత దర్పం ప్రదర్శిస్తున్నవాళ్లున్నారు. మూడు ముడుపులు, ఆరు పైరవీలు అన్నట్లు అడ్డగోలు సంపాదనకు ఎగబడుతున్నారు. ప్రజా ప్రతినిధుల పరువు గంగపాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రజలే పాలకులు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిదులైన నాయకులు ప్రజా సేవకులు. ప్రజల కోసం ఆరాటపడే మనస్తత్వం వున్న వారు మాత్రమే సహజంగా నాయకులౌతారు. ప్రజలకు దూరంగా వుండాలనుకునే వారు నాయకులు కాలేరు. నాయకులు కావాలని చాలా మందికి వుంటుంది. కాని ప్రజా సేవ చేయగలిగే వారు మాత్రమే నాయకులుగా మారుతారు. ప్రజా జీవితంలో వుంటారు. ప్రజలు తమను ఎన్నుకంటే మరింత మేలైనా, మెరుగైన సేవ చేయడానికి ప్రజా ప్రతినిధులౌతారు. ప్రజల కోసం జీవితాలు త్యాగం చేసిన వారు మన దేశంలో చాలా మంది వున్నారు. ప్రజల ప్రాణంగా బతికిన వారు అనేక మంది వున్నారు. ప్రజల కోసం జీవితాంతం తపన పడిన వారు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. ఏ నాయకుడైనా సరే ప్రజల గుండెల్లో చిరస్దాయిగా నిలిచిపోవాలనే కోరుకుంటారు. తన తర్వాత తరాలు తనను గుర్తు చేసుకోవాలని తపన పడుతుంటారు. అలాంటి సేవలు చేస్తుంటారు. ఒక్కసారి నాయకుడైన తర్వాత ఎవరూ ప్రజలకు దూరంగా బతకాలని కోరుకోరు. గెలిచినా, ఓడినా ప్రజల్లోనే వుంటారు. ఒకప్పుడు నాయకులు ఎదరులేకుండా, తిరుగులేకుండా వరుస విజయాలు చూస్తుండేవారు. ఇప్పుడు ఒక్కసారి గెలిచిన నాయకుడు మళ్లీ గెలుస్తామా? లేదా? అన్న మీమాంసలోనే రాజకీయం చేస్తున్నారు. ప్రజలు మార్పు కోరుకున్నా, ప్రభుత్వాలను మార్చినా, కొంత మంది నాయకులు ఎప్పుడూ గెలుస్తూనే వుంటారు. అది వాళ్ల నాయకత్వ పటిమకు, ప్రజా సేవకు నిదర్శనం. కాని కొన్ని సార్లు నాయకులు ఎందుకు ఓడిపోయారో కూడా అర్దం కాని పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఐదేళ్లపాటు నిరంతరం ప్రజల్లోనే వుంటారు. ప్రజా సేవలో వుంటారు. అభివృద్ది పనులు అనేకం చేస్తూనే వుంటారు. తమ నియోజకవర్గ అభివృద్ది కోసం పాటు పడుతూనే వుంటారు. కాని మరుసటి ఎన్నికల్లో ఓటమి పాలౌతుంటారు? కారణం ఆ నాయకులు కాదు. నాయకులు నమ్మిన మనుషులు. నాయకుల వద్ద పనిచేసే అనుచరులు. ముఖ్యంగా పిఏలు, పిర్వోలు. ఈ విషయం పదవులు పోయిన తర్వాత గాని సదరు నాయకులకు తెలియకుండాపోతోంది. పిఏలు, పిర్వొల మూలంగా ఇటీవల కాలంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎందుకంటే వాళ్లు నమ్మిన వాళ్లు బాగా పనిచేస్తున్నారని అనుకుంటారు. అలా వాళ్లు చెప్పిన మాటలు వింటూ నాయకులు వినడమే రాజకీయానికి ఇబ్బందికరమైన పరిస్దితులు వస్తున్నాయి. గతంలో గొప్పగా పనిచేసిన నాయకులు కూడా పిఏలు, పిర్వోల మూలంగా రాజకీయ మనుగడలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవాళ్లున్నారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో కూడా వాళ్లే కనిపిస్తున్నారు. నాయకులు మారినా, ప్రభుత్వాలు మారినా పిఆర్వోలు, పిఏలు మాత్రం మళ్లీ, మళ్లీ ప్రత్యక్షమౌతుంటారు. అదే పనిని వాళ్లు చేస్తుంటారు. దశాబ్ధాల తరబడి అదే పిఏలు, అదే పిర్వోలుగా పనిచేస్తున్న వాళ్లు అనేకమంది వున్నారు. అలా పాతుకుపోయి ప్రభుత్వాలను భ్రష్టుపట్టించిన వాళ్లే , మళ్లీ మళ్లీ ప్రత్యక్షమౌతుంటారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలు, ఇప్పటి వరుకు కొనసాగుతున్న వాళ్లు అనేక మంది వున్నారు. కాని పాపం వీళ్లను నమ్ముకున్న నాయకులు మాత్రం ఓటమి పాలై రాజకీయాలకు దూరమైన వారు కూడా వున్నారు. అలా వుంటుంది. పిఏల పనితీరు. ఎమ్మెల్యే, మంత్రులు అంటే ప్రజల మనుషులు. ప్రజా ప్రతినిధులు. ప్రజల కోసం వున్న సేవకులు. ఒక్కసారి ప్రజా ప్రతినిధి అయిన తర్వాత వారిని ప్రజలకు కలవకుండా చేస్తున్నదే ఈ పీఆర్వో, పిఏలు. వారికి లేనిపోనివి చెప్పి, నాయకులకు, ప్రజలకు దూరం చేస్తుంటారు. ఎన్నికల సమయంలో అందరూ కలిసిపనిచేస్తారు. కొందరు నాయకులు ఎక్కువ పనిచేయొచ్చు. కొంత మంది నాయకులు తక్కువ పనిచేయొచ్చు. కాని వారందరూ అదే పార్టీకి చేందిన నాయకులు. కాని ఒక నాయకుడు ప్రజా ప్రతినిధి అయిన తర్వాత వారికి దగ్గర కావడానికి అనేక మంది రకరకాల వార్తలు మోసుకొని వస్తారు. నిజానికి అందరూ కలిసి పని చేస్తేనే నాయకులు గెలుస్తుంటారు. కార్యకర్తల్లో కూడా కొన్ని విభేదాలుంటాయి. ఆదిపత్యాలుంటాయి. నాయకులుగా ఎదగాలన్న తపన వుంటుంది. ఎమ్మెల్యే, మంత్రి ఆశీస్సులతో మరింత ఉన్నత స్దానానికి చేరుకోవాలని వుంటుంది. ఈ ద్వితీయ శ్రేణి నాయకుల ఆశలే పిఏలకు, పిఆర్వోలకు వరంగా మారుతుంది. ద్వితీయ శ్రేణి నాయకులు చెప్పే ప్రతి విషయాన్ని ఎమ్మెల్యే చెవిలో వేసి, తనకు అత్యంత సమ్మకస్తుడు అని పేరు పొందేందుకు పిఏలు, పిర్వోలు ప్రయత్నిస్తుంటారు. అలా నాయకుడు గుడ్డిగా నమ్మే స్ధితికి వచ్చిన తర్వాత ఇక పిర్వోలు, పిఏలు తమ ప్రతాపం చూపిస్తుంటారు. ప్రజలకు ప్రజా ప్రతినిధులను దూరం చేస్తుంటారు. ఎమ్మెల్యేల ఫోన్లుకూడా తన చేతుల్లో పెట్టుకొని, ఎవరి ఫోన్ ఎత్తాలో, ఎవరి ఫోన్ ఎత్తకూడదో కూడా పిఏలు, పిర్వోలే నిర్ణయించే స్ధాయికి చేరుకుంటారు. కేవలం తమకు పనికి వచ్చే వారి ఫోన్లు మాత్రమే లిప్ట్ చేస్తుంటారు. లేకుంటే ఎమ్మెల్యే బిజీగా వున్నారంటూ దాట వేస్తుంటారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, అదే సమాదానం చెబుతుంటారు. నాయకులు ఫోన్ చేసిన విషయం, ఎమ్మెల్యేలు, మంత్రులకు చేరవేయరు. ఎందుకంటే ఆ స్దాయిలో వుండే ప్రజా ప్రతినిధులకు ఊరిపి సలపనంత పని వుంటుంది. పని ఒత్తిడి కూడా గతం కాన్న ఎక్కువౌతుంది. దీనిని ఆసరా చేసుకొని పిఏలు, పిర్వోలు చెలరేగిపోతుంటారు. ఎమ్మెల్యేల దర్శనం చేసుకోవాలంటే, పిఏలు, పిర్వోలను ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్తితి వస్తుంది. ఇక పార్టీ నాయకులు, కార్యకర్తల పరిస్దితే ఇలా వుంటే సామాన్య ప్రజల పరిస్దితి ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. ఒకప్పుడు నాయకుడి వద్దకు ప్రజలు నేరుగా వెళ్లిపోయే పరిస్దితి వుండేది. నాయకులు కూడా ప్రజల వద్దకు చేరుకొని ప్రజాసమస్యలు తెలుసుకునే వెసులుబాటు వుండేది. ఇప్పుడు ఆ పరిస్దితి లేదు. ఎమ్మెల్యేల చుట్టూ అధికారులు, వ్యక్తిగత సిబ్బంది, పిఏలు, పిర్వోలు అంటూ చక్రబందనాలుంటాయి. వీళ్లందరినీ దాటుకొని వేళ్తేగాని ప్రజలకు నాయకులు అందుబాటులోకి రాని పరిస్ధితి నెలకొన్నది. ఈ విషయం సదరు ఎమ్మెల్యేలకు తెలియదు. మంత్రులకు కూడా తెలియదు. ఒకప్పుడు జర్నలిస్టులు నేరుగా ఎమ్మెల్యే, మంత్రులను కలిసే అవకాశాలుండేవి. అప్పుడు అది కూడా లేదు. ఎమ్మెల్యేలు, మంత్రుల అప్పాయింటు మెంటుకోసం పిఏ, పిర్వోలను అడగాల్సిన పరిస్ధితి ఎదురౌతోంది. ఇంతకీ ఈ పిఏలు, పిర్వోలు ఏం చేస్తున్నారంటే దందాలు చేస్తున్నారు. వసూళ్ల పర్వం మొదలు పెట్టారు. పైరవీ కారుల అవతారం ఎత్తుతున్నారు. వసూల్ రాజాలుగా మారుతున్నారు. రోజుకు ఎంత సంపాదిస్తున్నామన్నదానిపై దృష్టిపెడుతున్నారు. ఇదీ బైట వినిపిసున్న మాట. ప్రతి పనికి రేటు నిర్ణయిస్తూ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు అనేకమంది పిఏలు, పిర్వోల మీద వున్నాయి. పిఆర్వోలు మంత్రులకు సంబంధించిన షెడ్యూల్‌ను మీడియాకు ఎప్పటికప్పుడు అందజేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే అభివృద్ది, ప్రగతిని ఎప్పటికప్పుడూ వివరిస్తూ, వార్తలు పంపిస్తూ వుండాలి. సంబంధిత నియోజకవర్గాలలో వార్తా పత్రికల్లో వచ్చిన ప్రజా సమస్యలు ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలి. కాని ఆ పని చాల మంది పిర్వోలు చేయడం లేదు. జర్నలిస్టులకు కనీస సమాచారం అందించేందుకు కూడా ఇష్టపడడంలేదు. ఓ నాలుగుసార్లు ఫోన్ చేస్తే జర్నలిస్టుల నంబర్లు కూడా బ్లాక్ చేస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ప్రజల్లో లేనిపోని అపోహలు ఎదురయ్యేలా చేస్తున్నారు. ఇక పత్రికల్లో వచ్చే వార్తలలో తమకు ఆదాయ వనరులు సమకూరుతాయనుకున్నప్పుడు సదరు వ్యక్తులకు ఫోన్లు చేయడం, ఎమ్మెల్యే పేరు చెప్పి వసూళ్ల పాల్పడడం చేస్తుంటారు. అవతలి వ్యక్తులు నిజంగానే ఎమ్మెల్యే చేయించారేమో అనే భయంతో ముళ్లెలు మట్ట చెప్పడం కూడా జరుగుతుంది. ఇక వ్యవస్దలో అనేక రకాల పనులు వుంటాయి. వాటి కోసం కొంత మంది పైరవీలు చేసుకుంటారు. అలాంటి పనులతో పిఏలు పంట పండిరచుకుంటున్నారు. పైరవీలు, పనులు చక్కదిద్ది నాలుగు రాళ్లు సంపాదించుకోవడంలో పిఏలు, పిర్వోలు బీజీబిజీగా వున్నారంటూ ఆనేక ఆరోపణలున్నాయి. ఇలాంటి పిర్వోలను, పిఏలను గుర్తించి ఎమ్మెల్యేలు, మంత్రులు తేరుకోకపోతే మాత్రం రాజకీయంగా నష్టం చవి చూడాల్సింది వాళ్లే.. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు, మంత్రులు తేరుకొని నాయకులు, ప్రజలను కలిసి, ఎదురులేని, తిరుగులేని రాజకీయాలు చేస్తూ, మళ్లీ మళ్లీ గెలుస్తూ, ప్రజా సేవ చేయాలంటే స్వార్ధపరులైన పిఏలను, పిర్వోలను పక్కన పెట్టకపోతే తీరని నష్టాన్ని కొని తెచ్చుకున్న వాళ్లవుతారు.
“నిహాంత్” పెళ్లి వేడుకకు హజరై వదూవరులను దీవించండి.
“సిఎం రేవంత్ రెడ్డి”ని కలిసి శుభలేఖ అందజేసిన “సుభాష్ రెడ్డి”.
వివాహానికి తప్పకుండా హజరై వదూవరులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి.
తన కుమారుడు “నిహాంత్” పెళ్ళి శుభలేఖ “సిఎం”కు అందజేసిన “సుబాష్ రెడ్డి”.
“నేటిధాత్రి”,హైదరాబాద్. మా అబ్బాయి నిహాంత్ పెళ్లికి రండి. వచ్చి మీ అమూల్యమైన ఆశీర్వనాలు అందించి దీవించండి. ప్రముఖ పారిశ్రామిక, రియల్ వ్యాపారి, మానవతా వాది, సామాజిక వేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం కలిశారు. నవంబర్ 7 న తేదీన సుభాష్ రెడ్డి కుమారుడు నిహంత్ పెళ్లి వేడుక జరగనున్నది.
CM Revanth invited to Nihant’s wedding
తన కుమారుడి పెళ్ళికి హజరై నూతన వదూవరులను ఆశీర్వదించాలని కోరుతూ పెళ్ళి శుభలేఖను సిఎం. రేవంత్ రెడ్డికి అందించి సుబాష్ రెడ్డి ఆహ్వానం పలికారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.