ప్రపంచ చిత్రపరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అకాడెమీలో కోలీవుడ్ అగ్ర నటుడు కమల్ హాసన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ అకాడెమీలో సభ్యులుగా చేరాలంటూ…
ప్రపంచ చిత్రపరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అకాడెమీలో కోలీవుడ్ అగ్ర నటుడు కమల్ హాసన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ అకాడెమీలో సభ్యులుగా చేరాలంటూ కమల్ హాసన్‌తో పాటు పలువురు భారతీయ ప్రముఖ నటీనటులకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు ‘ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ తాజాగా విడుదల చేసిన కొత్త సభ్యుల జాబితాలో కమల్ హాసన్ పేరు ఉంది. ఎంతోమంది హాలీవుడ్ నటీనటులతో పాటు ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియలో కమల్ హాసన్ పాలుపంచుకోనున్నారు. ఆస్కార్‌కు నామినేట్ అయ్యే చిత్రాల్లో ఫైనల్ ఎంపిక ప్రక్రియలో వీరికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తుంది. కాగా, ఈ ఏడాది మొత్తం 534 మంది సభ్యులను ఆహ్వానించినట్టు అకాడెమీ తెలిపింది. ప్రతిభావంతులైన వీరికి అకాడెమీలో చోటు కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది.
ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో రైతులు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అధికారులకు ఇవ్వడం జరిగిందని అవి ఎలా పరిష్కరిస్తున్నారని అవి ఎంతవరకు పరిష్కారం అయ్యాయని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనేంటి మాణిక్ రావు తహ సీల్దార్ తిరుమలరావు ను ప్రశ్నించారు. శుక్రవారం ఝరాసంగం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ధరణి స్థానంలో నూతన ఆర్ ఓ ఆర్ 2025 చట్టం భూభారతి పేరుతో తీసుకువచ్చిందని ఇందులో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులకు 100 ఆప్షన్స్ ఇస్తామని ప్రకటించిందని అవి ఆన్లైన్లో ఉన్నాయా అని ఎమ్మెల్యే అడిగారు. దీనికి తహసిల్దార్ మాట్లాడుతూ ఇంకా ఆన్లైన్లో ఆ అవకాశం లేదని తెలిపారు. రిజిస్ట్రేషన్ల విషయంలోసర్వర్ కనెక్షన్ సమస్యతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నా దృష్టికి వచ్చినట్లు ఎమ్మెల్యే అడగగా పైనుండే సర్వర్ సమస్య నెలకొన్నదని స్లోగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని తహసిల్దార్ సమాధానం ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే సీసీ ఎస్ఏ కార్యాలయానికి ఫోన్ లో మాట్లాడి సమస్యను వివరించారు. ఎమ్మెల్యే వెంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, నాయకులు ప్యాలవరం మాజీ ఉప సర్పంచ్ మాణిక్యం యాదవ్, నర్సింలు, తదితరులు ఉన్నారు.
మున్సిపల్ కమిషనర్ గా సుభాష్ రావు దేశ్ముఖ్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మున్సిపల్ అధికారులు, సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలిపి ఆహ్వానించారు. అదేవి ధంగా వివిధ రాజకీయ, పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, ఆయా కుల సంఘాలకు చెందిన నాయకులు ఆయనను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెల పడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ, జహీరాబాద్ కు మళ్ళి కమిషనర్ గా రావడం ఎంతో శుభసూచకంగా ఉం దని, తమ వద్దకు మున్సిపల్ పట్టణ పరిధిలోని ఉన్నటువంటి ఆయా బస్తీల, వార్డులల్లో ఉన్నటువంటి ఆయా సమస్యలు తమ వద్దకు వచ్చినచో వాటిని పరిష్కారమయ్యేలా చూసే విధంగా అడుగులు వేస్తామని, అంతేకాకుండా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు, ప్రబలకుండా చూస్తామని వారు తెలిపారు.
◆ – తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
◆ – కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంలోని దేవరం పల్లి,చీలపల్లీ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు పట్టాలను అందజేసి ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాల పనులను,మరియు దేవరం పల్లీ గ్రామంలో డా౹౹సిద్దం.
ఉజ్వల్ రెడ్డి గారీ సొంత నిధులతో ఏర్పాటు చేసిన బోర్ ని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.
ఉజ్వల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ ఝరాసంఘం మండల అధ్యక్షుడు హన్మంతరావు పాటిల్ గారితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.
నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని,రాబోయే 3 సంవత్సరాలలో మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తామన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని,గతం కంటే ఎక్కువగా పెట్టుబడి సహాయం రైతు భరోసా కింద రూ.12000 ఎకరా నికి అందిస్తున్నామని తెలిపారు.
N. Giridhar Reddy.
మహిళలకు ఆర్టీసీబస్సులలో ఉచిత ప్రయాణం,ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకు గ్యాస్ సిలిండర్,సన్న రకం బియ్యం సరఫరా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,జహీరాబాద్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి,మాజీ కేతకి దేవాలయం చైర్మన్ మల్లన్న పాటిల్,మాజీ యూత్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్,మాజీ యం.పి.టి.సి హఫీజ్,మాజీ సర్పంచ్ నవాజ్ రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి,శామ్ రావు పాటిల్,అశ్విన్ పాటిల్,సంగమేశ్,శ్రీకాంత్ రెడ్డి,రంగా అరుణ్ కుమార్,అక్బర్,నథానెయల్,మల్లీకార్జున్,నర్సింహా యాదవ్,ఇమామ్ పటేల్,ఝరాసంఘం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ ప్రాంతంలో అక్రమంగా ఎర్రరాయిని తవ్వుకు పోతాం చూడు.. దమ్ముంటే ఆపుకోండి అంటూ మైనింగ్ మాఫియా సవాల్ విసురుతోంది. డివిజన్ లోని ఓ పోలీసు అధికారి గతంలో సీరియస్ గా తీసుకుని ఈ మాఫియాకు అడ్డుకట్ట వేసినా పూర్తిస్థాయిలో నిరోధించ లేకపోయారు. వీరి ఆగడాలపై ప్రభుత్వం జోక్యం లేకుండా పోవడంతో, ఇష్టం వచ్చిన కాడికి విక్రయిస్తూ అందిన కాడికి దోచేస్తున్నారు. మైనింగ్ సెస్ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి వేస్తున్నారు. అక్రమార్కుల దందాకు అంతే లేకుండా పోయిందని స్థానిక ప్రజల వాపోతున్నారు.
జహీరాబాద్ ప్రాంతంలో దశాబ్దాలుగా అక్రమ ఎర్రరాయి తవ్వకాల దందాతో బలపడ్డ స్థానిక మాఫియా అధికారులకే సవాల్ గా మారారు. “తవ్వుకు పోతాం చూడు.. దమ్ముంటే ఆపు” అంటూ అధికార యంత్రాంగానికి సవాల్ విసురుతున్నారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డివిజన్ లోని ఓ పోలీసు అధికారి కొంతమేర అక్ర మ తవ్వకాల నిరోధానికి అడ్డుకట్ట వేసినప్పటికీ పూర్తిస్థాయిలో నిరోధించ లేకపోయారని స్థానికులు బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఈ ప్రాంతం లోని ఎర్రరాయి నిక్షేపాలు అక్రమార్కుల పరమవు తున్నాయి. ఘనుల తవ్వకాలపై అజమాయిషి లేక పోవడంతో అడ్డగోలుగా వీరి అక్రమ దందా మూడు పూల ఆరుకాయలు సాగుతోంది. కనీసం ధర నిర్ణ యంలోను ప్రభుత్వం జోక్యం లేకుండా పోవడంతో ఇష్టం వచ్చిన కాడికి ధర నిర్ణయించి అందిన కాడికి దోచేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మైనింగ్ సెస్ చెల్లించకుండా ఆదాయం గండి వేస్తున్నారు. ఇదిలా ఉండగా దీని ప్రభావం ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కూడా పదుతోంది.
Indiramma’s housing.
ఎర్రరాయిపై ఉదాసీనత..
ప్రజాప్రతినిధుల అండదండలు, అధికారుల ఉదాసీ నత కారణంగా ఈ ప్రాంతంలో ఎర్రరాయి తవ్వకా లు యథేచ్ఛగా సాగుతున్నాయి. అడ్డూ అదుపు లేకుండా పెద్దమొత్తంలో సాగుతున్న జీరో వ్యాసా రంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడు తోంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈ అక్రమ దందా మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది. అక్కడక్కడ పట్టా భూముల్లో ఎర్ర రాయి తవ్వకాలు జరుగుతున్నప్పటికీ అసైన్మెంట్ భూముల్లోనే ఎక్కువ మొత్తంలో ఈ అక్రమ వ్యాపా రం సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు అక్రమ మైనింగ్ దందాపై ఉక్కుపాదం మోపాల్సిన
పెద్ద మొత్తంలో అక్రమ మైనింగ్..
ఈ ప్రాంతంలో భారీగా ఎర్రరాయి తవ్వకాలు సాగు తున్నాయి. అనునిత్యం వేలకొలది ఎర్ర రాయి నెలిక్ తీసి లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. ప్ర జాప్రతినిధుల అండ దండలు, అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. జహీరాబాద్ ప్రాంతంలోని కోహీర్, ఝరాసంగం, న్యాల్ కల్, మొగుడంపల్లి తదితర మండలాల్లో సుమారు 50కి పైగా రాయి ఘనులున్నాయి. అదే మొత్తంలో కోత మిషన్లు నడుస్తు న్నాయి. ఒక్కొక్క మిషన్ రోజుకి సుమారు 2వేలకు పైగా రాయిని వెలికి తీస్తాయి. ఈ విధంగా తీసిన రాయిని సమీపంలోని పట్టణాలకు తరలించి విక్ర యిస్తారు. ఈ విధంగా ఈ ప్రాంతంలో రోజుకి 1లక్షకుపైగా ఎర్రరాయిని విక్రయిస్తున్నారు. ఒక రాయికి రూ.15 నుంచి 25వరకు విక్రయిస్తారు. దీంతో రోజుకి 15లక్షల నుంచి 25 లక్షల వరకు ఎర్ర అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే నెలకు రూ.4.5 నుంచి రూ.5.5కోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. అదేవిధంగా సంప త్సరానికి ఒక ఎర్ర రాయి రూ.54 నుంచి 6.5కోట్ల వరకు ఎర్ర రాయుళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్ అనుమతులు ఉంటే ఈ వ్యాపారం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూలేదని నిపుణులు పేర్కొన్నారు. అనుమతులు లేని కారణం గా ప్రభుత్వానికి రావల్సిన సొమ్ము సైతం అక్రమా ర్కుల జేబులనే నింపుతుంది.
Indiramma’s housing.
పాతాళాన్ని మైమరిపించే గుంతలు
ఈ ప్రాంతంలో ఎర్రరాయి తవ్వకాల ద్వారా ఏర్పడు తున్న భారీ గుంతలు పాతాళాన్ని తలపిస్తున్నాయి. కోతలు పాతాళానికి నిచ్చెనలు వేసినట్లు భ్రాంతిని కలిగిస్తున్నాయి. కోతల అనంతరం ఘనిలో ఏర్పడ్డ భారీ గుంతలు మృత్యు కుహరాలుగా మారుతు న్నాయి. ఈ ఘనిలో పని చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి కూలీలు వలస వస్తున్నారు. ఘని ప్రారంభానికి ముందు జెసిబి సాయంతో నేలను చదును చేసి పైపొర మట్టిని తొలగించిన అనంతరం కోత యంత్రాల సాయంతో కావలసిన సైజులో వాటిని కోస్తారు కోసిన రాళ్లను కూలీల సాయంతో పైకి తీసి వాహనాల్లో మార్కెట్ కు తరలించి విక్రయిస్తారు ఇక్కడి నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులు సమీప పట్టణానికి తీసుకెళ్లి రూ.4,5 అదనపు ధరలకు విక్రయిస్తున్నారు. ఎర్ర రాయి తీసేందుకు ఘనిలో 4, 5 మంది కూలీలు పని చేస్తారు. ఇలా పనిచేసిన వారు కూడా శ్రమదో పిడీకి గురౌతున్నారు.
సైన్మెంట్ భూముల్లో వ్యాపారం..
స్థానిక వ్యాపారులు అసైన్మెంట్ భూములను తమ వ్యాపార కేంద్రాలుగా మలుచుకుని ఎర్రరాయి. తవ్వకాలు విచ్చలవిడిగా చేపట్టారు. సుమారు ఈ ప్రాంతంలోని దాదాపు వంద ఎకరాలకుపైగా అసైన్మెంట్ భూముల్లో ఇలాంటి తవ్వకాలు కొనసా గుతున్నాయి. అధికారులు అడపాదడపా దాడులు: చేసినప్పటికీ ప్రజా ప్రతినిధులు ఒత్తిడితో ఎలాంటి చర్యలు లేకుండా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి.
అంతా జీరోలోనే..
జీరో దందాతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ఈ జీరో దందాకు అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అభిప్రాయప డుతున్నారు. నిర్మాణ రంగంలో ఎర్రరాయి వినియో గం తప్పనిసరైంది. సిమెంట్ కాంక్రీట్ ఇళ్ల నిర్మాణంలో సైతం బేస్ మెంట్ కోసం ఎర్ర రాయిని ఎక్కువ గా వినియోగిస్తున్నారు. కనీసం ప్రతి ఇంటికి కనీసం రెండు వేల వరకు ఎర్ర అవసరమ వుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పూర్తిగా ఎర్ర రాయిని వినియోగించి ఇల్లు నిర్మాణం చేస్తు న్నారు. ఎక్కువ మొత్తంలో రాయి వాడతారు. చూడచక్కని ఎర్ర రాయి వినియోగం ఎక్కువ వాడటంతో వ్యాపా రస్తులు జీరోలో విక్రయించి పెద్ద మొత్తంలో దండు కుంటున్నారు. ఇదిలా ఉండగా దీని ప్రభావం ఇంది. రమ్మ ఇండ్ల నిర్మాణంపై పడుతోంది. ఇండ్ల కోసం ప్రభుత్వం ఐదు లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తుం ది. రాయి ధర పెంచడంతో ఇండ్ల నిర్మాణం లక్ష్యం నీరుగారే ప్రమాదం ఉందంటున్నారు.
`ఇది ప్రభుత్వం క్రెడిట్ కాదా..గొప్ప కార్యక్రమం అనుకోవడం లేదా!
`ఇంత గొప్ప కార్యక్రమం ప్రచారం చేయడానికి ఎవరూ ముందుకు రారు. ………………… `ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసిన సంగతి నాయకులు చెప్పలేరా!
`పదేళ్లుగా ఇవ్వని ఇండ్లు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నా చెప్పుకోరా!
`రైతు భరోసాపై సంబరాలు గొప్పగా చేయరా! …………………
`పనికి రాని పత్రికలకు కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తున్నారు.
`ప్రభుత్వ పథకాలపై ఏ ఒక్క పత్రికైనా, వార్తలు రాస్తున్నాయా? విశ్లేషణలు చేస్తున్నాయా?
`ప్రభుత్వానికి పత్రికలు అండగా నిలుస్తున్నాయా!
`సోషల్ మీడియా లో ప్రభుత్వంపై జరుగుతున్న విష ప్రచారం కనిపించడం లేదా!
`ప్రభుత్వాన్ని డ్యేమేజ్ చేస్తున్న వార్తలు కనిపించడం లేదు. ………………………….. `రేషన్ కార్డులిచ్చినా ఒక్కరైనా స్పందించరా?
`పదవులపై వున్న మక్కువ నాయకులకు ప్రచారంలో ఎందుకు లేదు.
హైదరాబాద్,నేటిధాత్రి: ప్రచారం శూన్యం. పదవుల కోసం మాత్రం ఆరాటం. కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు అభ్యంతరకం. ఒక రకంగా చెప్పాలంటే పార్టీకి ఇబ్బందికరం. పధకాల ప్రచారంలో మాత్రంవెనుక వుంటున్నారు. వివాదాలలో మాత్రం ముందుంటున్నారు. దాంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఏది మాట్లాడాల్సి వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రమే మాట్లాడాల్సి వస్తోంది. ప్రతిపక్షాలను ఎదుర్కొవాలన్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే నోరు తెరవాల్సి వస్తుంది. ఆది నుంచి పార్టీ నాయకులది ఇదే తీరు. ప్రభుత్వ పధకాలు వివరించాలన్నా సిఎం. రేవంత్‌రెడ్డే. పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న సిఎం. రేవంత్‌రెడ్డే. మరి మంత్రులు ఏం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు. ప్రతిపక్షాలను ఏ రకంగా ఎదుర్కొవాలన్నా ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే ఎదుర్కొవాలా? ప్రతిపక్షాలకు దీటైన సమాదానం ఒక్క సిఎం. రేవంత్‌రెడ్డి మాత్రమే ఇవ్వాలా? మంత్రులకు భాద్యత లేదా? సమయం లేదా? ఎమ్మెల్యేలకు ప్రభుత్వ పథకాల మీద అవగాహన లేదా? మాకెందుకు ఆ తలకాయ నొప్పి అనుకుంటున్నారా? మంత్రుల్లో ఒక్క పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే ఆది నుంచి దూకుడుగా వుంటున్నారు. సిఎం. రేవంత్ రెడ్డి తర్వాత ప్రతి విషయంలోనూ ఆయన స్పందిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. భవిష్యత్తుపై ఆశాజనకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల్లో నమ్మకం కల్గిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అంశాన్ని ఆయన సృషిస్తూ పార్టీకి అండగా నిలుస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినట్లు ఇతర మంత్రులు నిత్యం కొంత సమయం కేటాయించుకోలేరా? అవకాశం వచ్చినప్పుడైనా ప్రబుత్వ పనితీరును గొప్పగాచెప్పుకోలేరా? ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ఇతర మంత్రులు నోరు విప్పరా? ప్రతిపక్షాలు, ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ను పొంగులేటి చీల్చి చెండాడినట్లు ఇతర మంత్రులకు ధైర్యం చాలడం లేదా? మంత్రి పదవుల్లో వున్నప్పటికీ ఎందుకు మౌనంగావుంటున్నారు. రాజ్యాంగ పరంగా రాష్ట్రంలో అంతకన్నా పెద్ద పదవి వుంటుందా? క్యాబినేట్ అంటేనే సమిష్టి బాధ్యత. ఆ విషయాన్ని మంత్రులు మర్చిపోతున్నారా? అంతా సిఎం చూసుకుంటారు లే..అనుకుంటున్నారా? చీటికి మాటికి ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తుంటే మంత్రుఉల, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదు. ప్రతిపక్షాల నోరు మూయించే ధైర్యం మంత్రులకు లేకపోతోందా? ప్రతిపక్షాలను ఎదుర్కొలేకపోతే పార్టీలో తప్పుడు సంకేతాలు వెళ్లవా? ప్రజలు ప్రతిపక్షాల అసత్యాలను నిజమని నమ్మరా? నిజం చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్న కాలంలో ఎక్కడా పెద్దగా ప్రజా ఉద్యమం జరగలేదు. ప్రజల్లో నుంచి వ్యతిరేకత రాలేదు. నిరసనలు ఎక్కడా జనం చేపట్టలేదు. ఆఖరుకు రైతులు కూడా ఏనాడు రోడ్డెక్కలేదు. అంటే ప్రభుత్వ పనితీరు మీద రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా సంతృప్తిగా వున్నట్లే లెక్క. ఈ మాత్రం కూడా మంత్రులకు, ఎమ్మెల్యేలకు అవగాహన లేకుండాపోయిందా? ఈ ఏడాదిన్న కాలంలో ఏనాడైన రైతులు కరంటు లేదని రోడ్డెక్కారా? కనీసం మాకు కరంటు సరిపోవడం లేదని చెప్పడం విన్నారా? ఇండ్లకు కూడా కరంటు కోతలు విన్నామా? ఈ సారి వేసవిలో గత పదేళ్లకన్నా ఎక్కువ విద్యుత్ వినియోగం జరిగింది. అయినా కరంటు కోతలు చూశామా? పత్రికల్లో వార్తలు చదివామా? లేదు. రైతులు తమకు విత్తనాలు అందలేదని ధర్నాచేశారా? ఎరువుల చాలడం లేదని నాయకులను ఘెరావ్ చేశారా? ఆఖరకు పండిన పంటలను గిట్టుబాటు ధర రాలేదన్నారా? వడ్లు కొనుగోలు చేయడం లేదన్నమాట విన్నామా? పైగా వడ్లకు బోసన్ కూడా ఇస్తున్నారు. దానిని కూడా ప్రజలకు వివరించడంలో ఎందుకు విఫలమౌతున్నారు. ఎందుకు చొరవ తీసుకోలేకపోతున్నారు. ప్రభుత్వానికి రక్షణగా, పార్టీకి అండగా ప్రతిపక్షాల నోరు మూయించలేరా? ఓ నలుగురు మంత్రులు తప్ప మరెవరికీ సమయం చాలడం లేదు. మాటలు రావడం లేదు. అంతో ఇంతో మాట్లాడితే సిఎం. తర్వాత పొంగులేటి ఎక్కవగా స్పందిస్తుంటారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రి కొండా సురేఖలు స్పందించినంతగానైనా ఇతర మంత్రులు నోరు మెదపలేరా? ఈ మధ్య మంత్రి సీతక్క కూడా ఎక్కడా పెద్దగా బిఆర్‌ఎస్ మీద విరుచుకుపడుతున్నట్లు లేదు. ఎందుకు సైలెంట్‌గా వుంటున్నారు. అసలే వర్షాకాలం వచ్చింది. వైరల్ ఫీవర్లు వస్తున్నాయి. వాటిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే మాట్లాడాలా? వైద్యారోగ్య శాఖ మంత్రి రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రతిపక్షాల మీద ఆయన స్పందించినట్లు ఒక్క వార్తకూడా వస్తున్న దాఖలాలు లేవు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లండి. ప్రజల మధ్యలో వుండండి. ప్రజలకు అందుబాటులో వుండంది. వారి సమస్యలు తీర్చండి. అంటూ ఎన్ని సార్లు సిఎం. రేవంత్‌రెడ్డి చెబుతున్నా పట్టించుకోవడంలేదు. వినిపించుకోవడంలేదు. తెలంగానలోఉచిత బస్సు వల్ల ఎంతోమంది లబ్ధి చేకూరుతోంది. గతంలో కేసిఆర్ పదేళ్ల కాలంలో మూడు సార్లు బస్సు చార్జీలు విపరీతంగా పెంచారు. కొత్తగా బస్సు డిపోలు నిర్మాణం చేసింది లేదు. కొత్త బస్సులు కొన్నది లేదు. పైగా ఆర్టీసి ఆస్ధులు , భూములు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలుఎదుర్కొన్నారు. ఆర్టీసి బస్సులను ప్రజలకు దూరం చేశారు. కాని ప్రజా ప్రభుత్వం ఆర్టీసిని ప్రజలకు మరింత చేరువ చేసింది.ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. అయిన చార్జీలు పెంచలేదు. వేలాది కొత్త బస్సులు కొనుగోలు చేశారు. ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇంత గొప్ప విషయాన్ని ప్రచారం చేసుకోవడానికి కాంగ్రెస్ నాయకులకు ఎందుకు నోరురావడం లేదు. దేశమంతటా మూడు నెలల పాటు ఉచిత రేషన్‌లో భాగంగా దొడ్డు బియ్యం సరఫరాచేస్తున్నారు. కాని ఒక్క తెలంగాణలో మాత్రమే ప్రజలకు మూడు నెలలకు అవసరమైన సన్న బియ్యం అందజేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోఅమలు కాని ఇంతటి గొప్ప కార్యక్రమం కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదా? సన్నబియ్యం పథకం ప్రారంభించినప్పుడు కొంత హడావుడి ఒకటిరెండు రోజులు చేశారు. తర్వాత మర్చిపోయారు. ఇప్పుడు మూడు నెలల సన్నబియ్యం ఇస్తున్నా ఎక్కడా కాంగ్రెస్ నాయకులు కనిపించడం లేదు. మంత్రుల కూడా ఆ పంపిణీలో పాలు పంచుకోవడం లేదు. గతంలో సామాన్యులు సన్న బియ్యం కొనుగోలు చేసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునేవారు. కాని ఇప్పుడు ఉచితంగా మూడు నెలల బియ్యం తీసుకుపోతున్న సంతోషంలోవున్నారు. సంబరపడుతున్నారు. అయినా కాంగ్రెస్ నాయకులు చూడరు. ఇదేనా పార్టీమీద నాయకులకు వున్న మమకారం. పదువుల మీదవున్న శ్రద్ద ప్రభుత్వకార్యక్రమాలు ప్రచారంచేయడంలో లేదు. ఇక ప్రభుత్వం నుంచి పత్రికలకు కోట్లాది రూపాయల ప్రకటనలు జారీ చేస్తున్నారు. కాని ఆ పత్రికలు ఎక్కడైనా ప్రభుత్వ పధకాల వార్తలు రాస్తున్నాయా? ప్రభుత్వ పధకాల గొప్పదనం గూర్తి వ్యాసాలు రాస్తున్నాయా? విశ్లేషనలు చేస్తున్నాయా? ఏ పత్రిక ప్రభుత్వానికి అనుకూలంగా వుందో..ఏపత్రిక లేదో కూడా చూసుకునే తీరిక ఓపిక కాంగ్రెస్ నాయకులకు లేకుండాపోయంది. ప్రభుత్వానికి, పార్టీకి అండగా నిలుస్తున్న పత్రికలను గుర్తించడం లేదు. ఆ పత్రికలకు ప్రోత్సహం లేదు. కాని ప్రజల్లో కనిపించని పత్రికలకు మాత్రం కోట్లు గుమ్మరిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా అలాగే తగలబడిరది. ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నమే చేయడం లేదు. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డ్యామేజ్ చేసే వార్తలు రాస్తున్న పత్రికలను కాంగ్రెస్ పార్టీ నెత్తిన పెట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై జరుగుతున్న అసత్య విష ప్రచారాలను కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా తిప్పి కొట్టడంలేదు. గత బిఆర్‌ఎస్ పాపాలను ఎండగట్టడంలేదు. కనీసం ప్రభుత్వ పథకాలను కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం చేయడంలేదు. పదవులపై వున్న మక్కువ కాంగ్రెస్‌లో మెజార్టీ నాయకులకు ప్రభుత్వ పథకాల ప్రచారంలో లేదు.
ఏసీబీకి పట్టుబడిన అధికారులను, ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి.
ఏసీబీకి సమాచారం ఇచ్చి ప్రజాధనాన్ని కాపాడిన వ్యక్తులకు ఉద్యోగం, ఉపాధి కల్పించాలి. వారిని దేశభక్తులుగా ప్రకటించాలి.
నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏసీబీ కోర్టులను ఏర్పాటు చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
నేటిధాత్రి”,
దిల్ సుఖ్ నగర్ (గ్రేటర్ హైదరాబాద్): అ
వినీతి అక్రమాలతో ఏసీబీకి పట్టుబడిన అధికారులను, ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని, వారి స్థానంలో ఏసీబీకి పట్టించి ప్రజాధనాన్ని కాపాడిన వ్యక్తులను దేశభక్తులుగా ప్రకటించి, వారి అర్హతను బట్టి వారికి ఉద్యోగం, ఉపాధి కల్పించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య అన్నారు.
దేశంలో అవినీతి, అక్రమాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, అక్రమ సంపాదన లక్ష్యంగా పనిచేస్తున్న అవినీతి, అధికారుల అండతోనే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఏసీబీ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు.
ఈ విషయంలో త్వరలో దేశవ్యాప్త ఉద్యమం చేపట్టేందుకు తమ సంస్థ ఆధ్వర్యంలో కార్యచరణను చేబట్టబోతున్నామని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏసీబీ చురుకుగా పనిచేస్తుందని ఆయన ప్రశంసించారు.
ఒకసారి రెడ్ హ్యాండెడ్ గా తప్పు చేసి పట్టుబడ్డవారికి క్లీన్ చిట్ ఇవ్వడం తగదని ఆయన అన్నారు.
అలాంటి వారిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోకుండా కఠినమైన చట్టాలను తీసుకురావాలని న్యాయస్థానాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఖజానాను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి చేతిలో ఉందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు వల్లెం భరత్ రాజ్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకులు రాగం శ్రీశైలం యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ లావణ్య, గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి కోమాండ్ల శ్రీనివాస్, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు బాతరాజు సిద్దు తదితరులు పాల్గొన్నారు.
కామ్రేడ్ గాజర్ల రవి మృతికి సంతాపం తెలిపిన టి యు డబ్ల్యూ జే (ఐజేయు ) జర్నలిస్ట్ యూనియన్ .
చిట్యాల, నేటిధాత్రి :
కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి సమాజానికి తీరని లోటని భూపాలపల్లి ఐజేయు జిల్లా అధ్యక్ష,కార్యదర్శి లు క్యాతం సతీష్ , సామంతుల శ్యామ్ లు అన్నారు.
వెలిశాల గ్రామంలో శుక్రవారం గాజర్ల రవి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈనెల 18న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు, ఏఓబి కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన తెలిసిందే.
కాగా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి గత 35 సంవత్సరాల క్రితం ఉద్యమంలో చేరి..
పీడిత ప్రజల విముక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన అమరుడు గాజర్ల రవి అని అన్నారు.
కార్యక్రమంలో చిట్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఐలయ్య జర్నలిస్టులు పుల్ల రవితేజ కట్కూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మనుషులపై ఆవులు దాడి చేస్తున్నట్లు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నది తిరుపతిలో కాదని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ వ్యక్తిపై ఆవు దాడి చేస్తున్నట్లు శుక్రవారం ఉదయం నుండి సోషల్ మీడియాలో ప్రసారం అవుతోందని తెలిపారు. ఈ వీడియోపై వివరాలు సేకరించగా మహారాష్ట్ర లోని నాసిక్ లో జరిగిందని తెలిసింది. సోషల్ మీడియాలో తిరుపతి నీ ట్యాగ్ చేయడంతో ఇలా.ప్రసారం అవుతోందని తెలిపారు. నగరపాలక సంస్థ వెటర్నరీ డాక్టర్ నాగేంద్ర ఆధ్వర్యంలో అనునిత్యం నగరంలో తిరుగుతూ ఆవులు, కుక్కలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని కమిషనర్ ఆ ప్రకటనలో తెలిపారు..
వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాలని వినతి.
నర్సంపేట నేటిధాత్రి:
గిరిజన వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాలని ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ అధికారి సౌజన్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణం వడ్డెర కాలనీలో ఉన్న గిరిజన సంక్షేమ బారుల వసతి గృహంలో చదువుతున్న గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొన్నది పేర్కొన్నారు.గిరిజన విద్యార్థులకు అనుగుణంగా అధికారులు స్పందించి గిరిజన వసతి గృహాన్ని ఆశ్రమం పాఠశాలగా అప్ గ్రేడ్ చేసి మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాములు,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థల పరిశీలన
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి.
నర్సంపేట,నేటిధాత్రి:
నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం స్థలాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో అధునాతనమైన అంగులతో విశాలవంతమైన వాతావరణంలో 30 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతో మంజూరు చేయగా ఆ నిధులతో నిర్మించబోయే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి స్థల సేకరణను పరిశీలన చేసినట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. రూ.200 కోట్ల నిధులతో ఆధునిక సదుపాయాలతో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.ఈ ప్రాజెక్టు సాధించడంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి కృషి ప్రాధానంగా నిలిచిందని పలువురు ప్రజల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గం విద్యారంగ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయని,నియోజకవర్గ పిల్లలు ఇక మెట్రో స్థాయి వసతులతో కూడిన పాఠశాలలో చదివే అవకాశం పొందనున్నట్లు తెలిపారు.ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి, మన నియోజకవర్గానికి రావడం గర్వంగా ఉందన్నారు. ఈ పాఠశాల ద్వారా గ్రామీణ విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను సులభంగా పొందడం విశేషమని, నియోజకవర్గ భవిష్యత్ తరాల విద్యాభివృద్ధికి బలమైన పునాది కానుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,అధికారులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
జహీరాబాద్లో బుల్లెట్ బైక్ సైలెన్సర్ సౌండ్ పొల్యూషన్తో ప్రజలు భయభ్రాంతుల గురవుతున్నారు. జహీరాబాద్ పట్టణంలో విచ్చలవిడిగా యువత రోడ్లపై రెచ్చిపోతూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. బుల్లెట్టు వాహనాలు నడుపుతూ భీకరమైన సైలెన్సర్ సౌండ్లతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికైన పోలీసులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి సమాజానికి, వెలిశాల గ్రామానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. ఈనెల 18న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు, ఏఓబి కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. కాగా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి గత 35 సంవత్సరాల క్రితం ఉద్యమంలో చేరి..పీడిత ప్రజల విముక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన అమరుడు గాజర్ల రవి అని పోలినేని లింగారావు అన్నారు. శుక్రవారం ఆయన గాజర్ల రవి స్వగ్రామమైన వెలిశాలకు చేరుకొని గాజర్ల రవి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట వెంగల రమేష్, పెరుమాండ్ల మహేందర్, కుమార్ గౌడ్, తిరుపతిరెడ్డి, రామస్వామి తదితరులున్నారు.
డాక్టర్ నర్సన్,మారుపాక కృష్ణకు విశ్వపుత్రిక జాతీయ పురస్కారాలు
సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కవులకు విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్,భారతీయ అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో,ప్రముఖ గజల్ కవయిత్రి డాక్టర్ పి.విజయలక్మి పండిట్ సారాధ్యములో విశ్వపుత్రిక జాతీయ పురస్కారాలు ప్రధానాలు.. అందించడం జరిగినది. జాతీయపురస్కారాలకు, వేములవాడనుండి తెలంగాణ అవార్డు గ్రహీత,డాక్టర్ నర్సన్, గిడుగు రామమూర్తి జాతీయ పురస్కారగ్రహీత, మారుపాక కృష్ణకు విశ్వ పుత్రిక జాతీయ పురస్కారం అందించడం జరిగినది. అందుకుగాను కమిటీ సభ అధ్యక్షులు సామ్రాట్ కళారత్న డాక్టర్ బిక్కికృష్ణ, ఆధ్వర్యంలో పురస్కారలు అందించడం జరిగినది. ఐ.ఆర్. యస్ ప్రిన్సిపాల్ చీఫ్ సెక్రటరీ నరసింహప్ప, ఇన్కమ్ టాక్స్ అధికారి కంఠం నేని రవిశంకర్, సినిమా ప్రొడ్యూసర్ శ్రీమతి కాంతి కృష్ణ,శ్రీమతి యేలవర్తి ధనలక్ష్మి తదితరులు పాల్గొని వారికి అభినందనలు తెలపడం జరిగినది.
విద్యుత్ ఆగాధంతో కాడెద్దు మృతి చెందిన సంఘటన కేసముద్రం మండలం మర్రితండా గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మర్రితండ గ్రామానికి చెందిన బాధిత రైతు భూక్యా లక్ష్మణ్ రోజు మాదిరిగానే కాడెద్దును మేతకు గ్రామ శివారు తీసుకువెళ్లారని గడ్డి మేస్తూ విద్యుత్ స్తంభం పక్కకు వెళ్లడంతో ఎర్త్ వైర్ కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే కాడెద్దు మృతి చెందినట్లుగా బాధిత రైతు కన్నీరు మున్నీరయ్యాడు. విద్యుత్ శాఖ, పశు సంరక్షణ శాఖ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆర్థికంగా ఆదుకోవాలని బాధిత రైతు భూక్యా లక్ష్మణ్ ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన కాడెద్దు సుమారు 65 వేల విలువ ఉంటుందని స్థానిక రైతులు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు డాక్టర్ రవీందర్, లైన్మెన్ వాంకుడోత్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.
టి యు డబ్ల్యూ జే (ఐ జేయు) 3 మడలాల కన్వీనర్ గా పుల్లరవితేజ.
చిట్యాల నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టి యు డబ్ల్యూ జె ఐ జెయు చిట్యాల టేకుమట్ల మొగుళ్ళపల్లి మూడు మండలాల కన్వీనర్గా పుల్ల రవితేజను (ఆర్ బి న్యూస్ )నియమించినట్లు జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి సామంతల శ్యామ్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధి కోసం గత కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న రవితేజను నియమించమని జర్నలిస్టుల సమస్యల కోసం కృషి చేయాలని అన్నారు అనంతరం ఎన్నికైన రవితేజ ను అభినందించారు, ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు ఐజేయు జిల్లా నాయకులు కాట్రేవుల ఐలన్న ప్రెస్ క్లబ్ నాయకులు కట్కూరి శ్రీనివాస్ బుర్ర రమేష్ గుర్రపు రాజమౌళి సరిగోమ్ముల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా సిరోలు మండల కేంద్రంలో ని కొత్తూరు సి గ్రామానికి చెందిన దాత దయ్యాల నాగేశ్వర్ గౌడ్ తన సొంత ఖర్చులతో ఏర్పాటుచేసిన మాత జ్ఞాన సరస్వతి విగ్రహం మరియు సభ వేదికను,ఘనంగా ఆవిష్కరించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ హాజరై,సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరించి విద్యా ప్రాధాన్యతను వివరించారు. “విద్య వల్లే వ్యక్తి వికాసం సాధ్యం అన్నారు, మాత జ్ఞాన సరస్వతి ఆశీస్సులతో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి,” అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో కురవి మండల పార్టీ అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్,సిరోల్ మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి కరుణాకర్ రెడ్డి,డిఇఓ రవీందర్ రెడ్డి,ఎంఈఓ లచ్చిరామ్ నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు మలిశేటి వేణు,పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, ఇటువంటి సత్కార్యాలు గ్రామాభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రజల అభిప్రాయపడ్డారు,దాత నాగేశ్వర్ గౌడ్ అందించిన ఈ సహకారం పాఠశాల విద్యార్థులపై మంచి ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
పౌర హక్కుల పరిరక్షణలో కామ్రేడ్ ఓంకార్ పాత్ర ఎనలేనిది
మోడీ పాలనలో పౌర హక్కులకు ప్రమాదం
“పౌర హక్కుల పరిరక్షణ- ఓంకార్ గారి పాత్ర” అనే రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
వరంగల్ జిల్లా ప్రతినిధి నేటిధాత్రి:
పౌర హక్కులు రాజ్యాంగ పరిరక్షణ కోసం కామ్రేడ్ ఓంకార్ చేసిన ఉద్యమాలు త్యాగాలు ఎనలేనివని ఆయన స్ఫూర్తితో ప్రమాదంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని పౌర హక్కులను రక్షించుకునేందుకు ప్రతి పౌరుడు పూనుకోవాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సిపిఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, న్యూ డెమోక్రసీ గ్రేటర్ కార్యదర్శి రాచర్ల బాలరాజు, లిబరేషన్ జిల్లా కార్యదర్శి అక్కనపెల్లి యాదగిరి, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు నున్న అప్పారావు, రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు సోమ రామమూర్తి, కేడల ప్రసాద్, ఫుడ్ అడ్వైజరీ కమిటీ మాజీ సభ్యులు బానోతు సంగులాల్ లు పిలుపునిచ్చారు. ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ అసెంబ్లీ టైగర్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాల్లో భాగంగా పౌర హక్కుల పరిరక్షణ ఓంకార్ పాత్ర అనే అంశంపై వామపక్ష కమ్యూనిస్టు సామాజిక ప్రజా సంఘాల బాధ్యులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవన్ లో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పౌర హక్కుల పరిరక్షణకై కామ్రేడ్ ఓంకార్ పాత్రను వివరిస్తూ అధ్యక్షత వహించిన పెద్దారపు రమేష్ నోట్ ప్రవేశపెట్టారు. అనంతరం సమావేశానికి హాజరైన వక్తులు ప్రసంగిస్తూ కేంద్రంలో ఏర్పడిన బిజెపి ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఈడి సిబిఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమంగా జైలులో పెట్టుతున్నదని అర్బన్ నక్సలైట్లని టెర్రరిస్టులని రకరకాల పేర్లతో నిర్బంధం ప్రయోగిస్తూ మావోయిస్టుల పేరుతో బూటకపు ఎన్కౌంటర్లతో అడవిలో మూలవాసులైన ఆదివాసీలను కాల్చి చంపుతున్నారని అటవీ సంపద కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుటకు దోచిపెడుటకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో ఆర్టికల్స్ 14 నుంచి 24 లో పొందుపరచబడిన స్వేచ్ఛ సమానత్వ మత విద్య సాంస్కృతిక రాజ్యాంగ ప్రాథమిక హక్కులను కాలరాస్తూ పౌరులుగా స్వేచ్ఛగా జీవించలేని స్థితికి నెట్టివేస్తున్నారని 1975 ఎమర్జెన్సీ కంటే భిన్నంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజాస్వామిక పత్రిక స్వేచ్ఛను సైతం హరించి వేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు కామ్రేడ్ ఓంకార్ పౌర హక్కులు శాంతిభద్ర సమస్యలపై అసెంబ్లీలో సుమారు రెండు గంటలకు పైగా మాట్లాడి ప్రజా పోరాటాల పరిరక్షణకై హక్కులకై గలమెత్తి చట్టసభలకు వన్నె తెచ్చి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా భార్గవ కమిషన్ వేయించి సాక్షులను ప్రవేశపెట్టి పాలకవర్గాల గుట్టు రట్టు చేసిన గొప్ప యోధుడు కామ్రేడ్ ఓంకార్ ను ఆయన పౌర హక్కుల రక్షణ కోసం చేసిన కృషి నేటికీ ఎంతో అనుసరణీయమని ఈ క్రమంలో ప్రమాదంలో ఉన్న పౌర హక్కులను కాపాడుకునేందుకు వామపక్ష కమ్యూనిస్టు సామాజిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆ దిశలో ప్రతి పౌరుడు ఉద్యమాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంసిపిఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబా బాబురావు, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, అసంఘటిత కార్మిక సంఘాల నాయకులు నలిగంటి చంద్రమౌళి, ప్రజాసంఘాల నాయకులు ఓదెల రాజన్న, అనిత,ఎండి ఇస్మాయిల్, ఐతం నాగేష్, మైదం సంజీవ్, ఎండి సలీం, ఎగ్గని మల్లికార్జున్, మాలి ప్రభాకర్, అప్పన్నపూరి నరసయ్య, నలివెల రవి, పరిమళ గోవర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
తాడిచెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుండి పడి గీతా కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన ఓరుగంటి సాయిలు తాడిచెట్లు ఎక్కి కళ్ళు గీసి జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం తాడిచెట్టి ఎక్కి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారీ కిందపడ్డాడు. ఈ సంఘటనలో సాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వైద్య చికిత్సల కోసం 108లో పరకాల సివిల్ ఆస్పత్రికి అక్కడి నుండి హనుమకొండలోని ఎంజీఎం తరలించినట్లు తెలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.