గౌడ హలో గీతన్న చలో చలో హైదరాబాద్ గోడపత్రికల ఆవిష్కరణ

గీత కార్మికులకు సేఫ్టీ మోకులు బైకులు ఇవ్వాలని డిమాండ్

గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బత్తిని శివశంకర్ అధ్యక్షతన సమావేశం జరగగా ఈకార్యక్రమానికి కల్లు గీత కార్మిక సంఘం కార్యదర్శి బూడిద గోపి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కల్లుగీత వృత్తికి ప్రభుత్వ ఆదరణ లేకపోవటం వల్ల రోజు రోజుకు తగ్గిపోతున్నదని కొత్త తరం ఈవృత్తిలోకి రావడం లేదని తరతరాలుగా కొనసాగుతున్న వృత్తి కొద్ది రోజులలో అంతరించిపోయే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లుగీత కార్మికులకు సేఫ్టీ మూకులు మోటర్ బైకులు ఇవ్వాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ప్రమాదాల నివారణకు సేఫ్టీ మూగులు అలాగే తాటి ఈత వనాలకు పోవడానికి మోటారు బైకులు ఇస్తామని ఆశ చూపిస్తున్నారు తప్ప ఆచరణలో ఇవ్వడం లేదా అని తక్షణమే కల్లుగీత సొసైటీలో టీ ఎఫ్ టి లలో సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ మోటార్ బైకులు సేఫ్టీ మూకులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి అన్నారు
ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత వృత్తిని ఆధునికరించి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో నీరా ఉత్పత్తుల తాటి ఉత్పత్తుల కేంద్రాలను నెలకొల్పి కల్లుగీత నిరుగ్యగ యువతను మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా శిక్షణను ఇచ్చి కల్లుగీతను పరిశ్రమగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.అలాగే శాస్త్రజ్ఞుల ద్వారా పరిశోధన చేసి పొట్టి జాతి తాటి ఈత వనాలను పెంచాలని ప్రతి గ్రామానికి చెట్ల పెంపకానికి ఐదు ఎకరాల భూమి కొని ఇవ్వాలని కల్లుగీత కార్మికులకు ఇస్తున్న పెన్షన్ 2000 నుంచి 5 వేలకు పెంచాలని గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గీతకార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22న హైదరాబాదులో జరిగే మహా ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
గ్రామ సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్ ఎంపీటీసీ మూటపోతుల శివశంకర్ గౌడహలో గీతన్న చలో హైదరాబాద్ గోడ పత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు మామిండ్ల వెంకటేశ్వర్లు గౌడ్ సీనియర్ పాత్రికేయులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్ లాదెళ్ల సమ్మయ్య గౌడ్ అరెల్లి శంకర్ గౌడ్ ఆరెల్లి రాజు గౌడ్ మామిళ్ళ రవీందర్ గౌడ్ తాళ్లపల్లి గోవర్ధన్ మార్క చిన్న మొగిలి గౌడ్ జనగాని మహేందర్ గౌడ్ మచ్చిక శంకర్ గౌడ్ పోశాల రాజయ్య గౌడ్ నారగోని రవీందర్ గౌడ్ ఓరుగంటి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కరువు నేలన మహాఘట్టం ఆవిష్కరణ

https://epaper.netidhatri.com/

పాలమూరు కరువు తీర్చనున్న జలరాశులు
తెలంగాణ తల్లికి కడుపారా సాగునీరు!
రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి ‘‘గుంట కండ్ల జగదీష్‌ రెడ్డి’’ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేందర్‌ రావు’’ తో ‘‘రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల ప్రారంభం’’ సందర్భంగా చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే

`పారే నీరు ఒడిసి పట్టిన అపర భగీరధుడు కేసిఆర్‌.

`ఎడారి లాంటి తెలంగాణలో సాగు సంపదలు.

`తెలంగాణ గొంతు తడిపిన జలధాత.

`సాగు నీటి కష్టం తీర్చిన రైతు బాంధవుడు.

`నాడు కన్నీటి చుక్కలు కార్చి…తెలంగాణ తెచ్చి. ప్రాజెక్టులు కట్టి.

`తెలంగాణ సస్యశ్యామలం చేసిన దేవుడు.

`నీటి పరవళ్లతో మురుస్తున్న పాలమూరు పల్లెలు.

`పలుగురాళ్ల పాలమూరులో పండుతున్న పసిడి పంటలు

`పదేళ్ల కింద వలసలు.

`ఇప్పుడు సాగు సిరులు.

`ఎండిన బీడుల స్థానంలో పచ్చని పైర్లు.

`ఎటు చూసినా పచ్చిని పొలాలు.

`కోనసీమలా మారనున్న పాలమూరు

`పాలమూరు.. రంగారెడ్డితో జాడలేకుండా పోయిన కరువు ఛాయలు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

https://epaper.netidhatri.com/

పలుగు రాళ్ల పాలమూరులో నీటి పరవళ్లు, సాగు మడులు, బంగారు పంటలు, రైతు మోములో చిరునవ్వులు చూస్తామని కలలో కూడా అనుకోలేదు. కరువు నేలకు గంగమ్మను తెచ్చి తెలంగాణ తల్లికి జలాభిషేకం చేసిన అపర భగీరధడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఒకనాడు కనీసం గొంతు తడుపుకోవడానికి కూడా మంచినీరు లేక గోస పడిన కాలం. చుక్క నీరు దొరక్క అల్లాడిన తెలంగాణం. పొలాల గొంతు ఎండి ఎడారిగా మారి, కరువు కాటుతో అల్లాడి, ఊళ్లకు ఊళ్లు మాయమైన కాలం. గుక్కెడు మంచినీటి కోసం మైళ్ల దూరం కడువలు నెత్తిన పెట్టుకొని ఆడబిడ్డలు అరిగోస పడ్డ కాలం. చెరువుల్లో నీరు లేక, బావుల్లో చుక్క కానరాని కాలం చూసింది తెలంగాణ. గజాల కొద్ధి గంపెడాశతో బావులు తవ్వినా, వేల అడుగులు బోర్లు వేసిన దుబ్బతప్ప నీటి చుక్క చూడని తెలంగాణ నిన్న. బతకలేక బతుకు జీవుడా? అంటూ పొట్టు చేతపట్టుకొని ఊరొదిలి బొంబాయిలో కూలీలుగా బతికిన పల్లె తెలంగాణ. చెప్పుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు సుడులు తిరుగుతుంటాయి. ఇదంతా పదేళ్ల కింద ముచ్చట. ఇప్పుడు పాలమూరులో పలుగు రాళ్లు పోయాయి. పంటల మాగాణాలు వచ్చాయి. అరవైఏళ్ల పాటు పరాయి పాలనలో గోసపడ్డ తెలంగాణ, సాగు నీటి రంగంలో విప్లవం చూస్తోంది. కేసిఆర్‌ నాయకత్వంలో బంగారు తెలంగాణ రూపకల్పన జరిగింది. ఎక్కడ చూసినా పచ్చదం. పల్లెదనం. పల్లెలన్నీ బంగారు మయం. కోటిన్నర ఎకరాల సాగుమయం. పచ్చని పంటల మాగాణ నా తెలంగాణ అని ప్రతి ఒక్కరూ కీర్తించుకునేలా మారిపోయింది. మిషన్‌ కాకతీయతో చెరువులు బాగు పడ్డాయి. కాళేశ్వరం పూర్తితో చెరువులు నిండుకుండలౌతున్నాయి. మల్లన్న సాగర్‌ వంటి అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేయబడ్డాయి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పూర్తయింది. మొత్తం తెలంగాణ సంబరపడుతోంది. అంటున్న విద్యుత్‌ శాఖ మంత్రి జి. జగదీష్‌రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న విశేషాలు..ఆయన మాటల్లోనే…
గతంలో ఎక్కడ చూసినా ఎండిన బీడులే.
.ఇప్పుడు ఎక్కడ చూసిన పొల మడులే. మడుల నిండా నీళ్లే…ఇరవై నాలుగు గంటలం కరంటే…అటు పచ్చని పైర్లు, ఇటు ఎల్లవోస్తున్న బోర్లు, బావులు…తెలంగాణ మొత్తం జలకళలతో అలరాలుతోంది. గతంలో తెలంగాణ నాయకులు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించేవారు. ఎన్నికలు ఓట్లు, సీట్లు, పదవులు తప్ప, ప్రజల సమస్యలు పట్టలేదు. తెలంగాణ ప్రజలకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు. ఉమ్మడి నల్లగొండలో ప్రజలు ఫ్లోరైడ్‌ బారిన పడి తరాలు నాశనమౌతున్నా కనికరించలేదు. మంచినీటికి దిక్కలేదు. మూసీ నది మురికి నీళ్లే మీకు వరం అన్నట్లుగా అందించారు. అలా కూడా తెలంగాణ ప్రజలను అవమానించారు. అనారోగ్యాల పాలు చేశారు. నోరుండి మాట్లాడలేని, తలుండి ఎత్తుకోలేని, నాలుక వుండి కదిలించలేని, చేతుండి నిలదీయలేని కాంగ్రెస్‌ నాయకుల మూలంగా నల్లగొండ నాశనమైంది. కేసిఆర్‌ పుణ్యమా అని తెలంగాణ వచ్చింది. ఇప్పుడు నల్లగొండ ఒక గొప్ప నేలగా విరాజిల్లుతోంది. మంచినీరందుతోంది. సాగు నీరందుతోంది. పాలమూరు రంగారెడ్డితో నల్లగొండ మొత్తం పచ్చని మాగాణమౌతుంది. తెలంగాణ సాధించిన తర్వాత భవిష్యత్‌ తెలంగాణ ఎలా వుండాలన్నది ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పుడో కలలో రూపంలో పదిలం చేసుకున్నాడు. అలా తయారు చేసుకున్న బ్లూ ప్రింట్‌ తో అందమైన తెలంగాణను ఆవిష్కరిస్తున్నారు. అభివృద్ధిని చేసి చూపిస్తున్నారు. ప్రగతిని పట్టాలెక్కించారు. ఈ రంగం, ఆ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలలో అభివృద్ధి మన కళ్ల ముందు నిలుపుతున్నారు. అటు అభివృద్ది ఇటు, సంక్షేమం ఏ కాలంలో సరిసమానంగా అందిస్తూ ప్రతి ఇంటికి పెద్దకొడుయ్యాడు. తెలంగాణ పాలిట దేవుడయ్యారు. తెలంగాన జాతికి పితగా కీర్తించబడుతున్నారు. ఎందుకంటే జలదృష్యంతో ప్రాస్ధానం మొదలు పెట్టి, ఉద్యమం చేపట్టి, పోరాటం సాగిం చి, తెలంగాణ సాధించి, సుజల దృష్యం ఆవిష్కరించి, నీటి చుక్క కోసం పరితపించిన తెలంగాణను నీటి పరవళ్లతో తరింపజేస్తున్నాడు. కేసిఆర్‌ అనే పదమే ఒక వేదం. మూడక్షరాల నామం…తెలంగాణ పాలిట జపం. తెలంగాణ సాధనకు ఆ పదమే భీజమైంది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకలను ఏకం చేసింది. ఆ పేరే తెలంగాణ తెచ్చింది. గోసపడిన తెలంగాణ తల రాత మార్చింది. తెలంగాణ బతుకులో వెలుగులు నింపింది. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచింది. దటీజ్‌ కేసిఆర్‌ అంటూ దేశమంతా కొనియాడుతోంది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతికి అంకితం చేసే తరుణం వచ్చేసింది.
ఆ మహా ఘట్టం ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేతుల మీదుగా జరగనున్నది. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని బూత్‌పూర్‌ మండలంలోని కరివెన వద్ద ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 2015లో ముఖ్యమంత్రి కేసిఆర్‌ పనులను ప్రారంభించారు. జూరాల ప్రాజెక్టు నుంచి కృష్ణానది నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు అవసరమైన సారు, తాగు నీటి అవసరాలు తీర్చనున్నది. ఈ ప్రాజెక్టు అదనపు అవసరాలు హైదరాబాద్‌కు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కూడా వినియోగిస్తారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లోని ఏల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తోడి, రంగారెడ్డి జిల్లా లక్ష్మిదేవిపల్లికి పంపిస్తారు. అక్కడ నుంచి నీటిని ఎత్తిపోస్తారు. సముద్ర మట్టానికి మూడుందల అడుగుల ఎత్తున వున్న శ్రీశైలం నుంచి ఐదు అంచెలుగా సుమారు 600 అడుగుల ఎత్తున లక్ష్మిదేవి జలాశయానికి తరలిస్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఐదు లిఫ్టులు, ఆరు జలాశయాలు నిర్మాణం జరిగింది. ఇటీవలే డ్రైరన్‌ కూడా విజయవంతంగా కొనసాగింది. గుట్టలను కట్టలుగా మార్చి, చెరువులను నిర్మించిన కాకతీయకాలపు చరిత్రను ఆధారంగా రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. ఆయ గుట్టలకున్న విశిష్టతే కాదు, అక్కడ కొలువై వున్న దేవుళ్ల పేరుతోనే రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. నార్లాపూర్‌ వద్ద అంజనగిరి జలాశయం నిర్మించారు. ఏదుల వద్ద వీరంజనేయ జలాశయం. వట్టెం వద్ద వెంకటాద్రి జలాశయం. కరివెన వద్ద కురుమూర్తి జలాశయాలు నిర్మాణంచేశారు. అంజనగిరి జలాశయం కట్ట పొడవు ఏడు కిలోమీటర్ల పరిధిలో చేపట్టారు. వీరంజనేయ జలాశయం సుమారు 8 కిలోమీటర్లు, వెంకటాద్రి జలాశయం 15కిలోమీటర్లు, కురుమూర్తి జలాశయం 14 కిలోమీటర్లు నిర్మాణం జరిగింది. పాలమూరు రంగారెడ్డి మూలంగా మొత్తం 1226 గ్రామాలకు తాగు నీరు, సాగు నీరు అందనున్నది. పైగా పరిశ్రమలకు అదనం. మూడు జిల్లాలో 12,30,000 వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారాసాగు నీరు అందనున్నది. కొండలనే పెట్టని గోడలుగా నిర్మాణం చేయడం మూలంగా జలాశయాల నిర్మాణానికి ఖర్చు తగ్గింది. కొండలపై పడిన నీరు కూడా నేరుగా జలశయాలలోకి వచ్చి చేరుతుంది. వర్షపు నీరు చుక్క కూడా వృధా పోకుండా కాపాడినట్లౌవుంది. జంట జలాశయాలు ప్రత్యేకం. ఇప్పటికే కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌లో భాగంగా 345 మీటర్ల ఎత్తున నిర్మించిన ఎల్లూరు రిజర్వాయర్‌ ను ఆనుకొనే సమాంతరంగా నార్లాపూర్‌లో అంజనగిరి నిర్మాణం జరిగింది. ఈ రెండిరటినీ అనుసంధానం చేసి, ఒకే స్ధాయిలో వుండేలా నిర్మాణం చేయడం తెలంగాణ ఇంజనీరింగ్‌ ప్రతిభకు నిదర్శనం. అంతే కాదు కల్వకుర్తి లిఫ్టులతో పని లేకుండానే ఎల్లూరు రిజర్వాయర్‌ నింపేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా వెంకటాద్రి, కురుమూర్తి రిజర్వాయర్లను కూడా మరో జంట రిజర్వాయర్లుగా పిలుస్తున్నారు. అంతే కాకుండా ఈ రిజర్వాయర్ల మద్య అనేక ఐలాండ్స్‌ కూడా వున్నాయి. అవి భవిష్యత్తులో పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లుతాయి. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ నెల 16న బాహుబలి మోటార్లను ప్రారంభిస్తారు.

అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:

అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని వారి సమస్యలను పరిష్కరించాలనిసిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. గురువారం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నాలుగవ రోజు చేరుకుంది… . ఈ సందర్భంగా, వారు మాట్లాడుతూ, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, వారి సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,అంగన్వాడి సిబ్బందితో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని ఆరోపించారు. వీరిచే ఇతర పనులు కూడా చేయించుకుంటూ శ్రమను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రికార్డుల నిర్వహణ పేరిట అధికారులు వేధింపులు గురి చేస్తున్నారని, కొత్త యాప్ లు తీసుకొచ్చి మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు కనీస వసతులు కరువయ్యాయని పేర్కొన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, గతంలో మంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని కోరారు. అదనపు పనులను రద్దు చేయాలని, అంగన్వాడీల పై ప్రజాప్రతినిధుల పెత్తనాన్ని నివారించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న టిఎ, డిఎ ఇతర అలవెన్స్ ను వెంటనే విడుదల చేయాలన్నారు. సకాలంలో జీతాలు, అద్దె, కూరగాయలు, గ్యాస్ బిల్లులు ఇవ్వాలన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు అంగన్వాడీ సిబ్బంది చేసే సమ్మెకు పూర్తిగా మద్దతుగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు చాపల శ్రీను, సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ ,సిఐటియు మునుగోడు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు,మునుగోడు ఏఐటియుసి మండల అధ్యక్షులు దుబ్బ వెంకన్న, మునుగోడుఏఐటియుసి మండల కార్యదర్శిశివయ్య, , భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులువీరయ్య, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులుఅన్నపూర్ణ,సత్తమ్మ,కే దారి,రమణమ్మ,డి రమణ, సిహెచ్ లక్ష్మి, పారిజాత, రాధిక, ప్రమీల,రాజేశ్వరి, కలమ్మ, తారకమ్మ,నాగమణి,,రమణ,,,తదితరులు పాల్గొన్నారు.

బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మాహక సమావేశం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ తంగళ్ళపల్లి టౌన్ ఆధ్వర్యంలో రేపు జరగనున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వర్చువల్ గా ప్రారంభోత్సవం కానున్న మెడికల్ కాలేజ్ మరియు మీటింగ్ జరగనున్నందున మండలంలోని బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు మహిళా నాయకులు కార్యకర్తలు యువ. నాయకులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

 

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో స్థానిక సర్పంచ్ బై రీ వేణి శ్రీవాణి రమేష్ చేతుల మీదుగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులకు చౌటపల్లి రాజేష్ కి.27.000. అలాగే కారంపురి అశోక్ కి24.000. పరికపల్లి పద్మకి 22.500. రూపాయల చెక్కులు అందజేయడం జరిగిందనిమన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆపదలో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉందని అలాగే ఇట్టి చెక్కులు రావడానికి కృషి చేసిన మంత్రి కేటీఆర్ కి మా తరఫున గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలుతెలుపుతూ నామని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కారంపూరి మహేష్ ఉపసర్పంచ్ అల్వాల సాయిరాం వార్డు సభ్యులు ముద్దుల రమేష్ ఎంపీటీసీ సిలివేరి ప్రసూన నరసయ్య ఏఎంసీ డైరెక్టర్ బైరీ రమేష్ మండల బీసీ సెల్ ఉపాధ్యక్షులు సాదుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

జిల్లా ప్రజలకు వైద్య సేవలు

జిల్లా ప్రజలకు వైద్య సేవలు

విద్యార్థుల చెంతకే ప్రభుత్వ వైద్య విద్యా ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ
మారుమూల గ్రామం అయిన భూపాలపల్లి దినదినాభివృద్ది చెందుతూ జిల్లాగా ఏర్పడి నేడు భూపాలపల్లి జిల్లా వైద్య సేవలకు నిలయంగా నిలుస్తుంది
భూపాలపల్లి జిల్లా లో 100 పడకల ఏరియా హాస్పిటల్ తో పాటు, మెడికల్ కాలేజ్, ఆయుష్ హాస్పిటల్ వచ్చి భూపాలపల్లి మెడికల్ హబ్ గా అభివృద్ధి చెందడం జరిగింది.
భూపాలపల్లి మెడికల్ కళాశాల వల్ల విద్యార్ధులకు వైద్య విద్య లో సీట్ల సంఖ్య పెరిగి విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడే వైద్య విద్యను అభ్యసించే అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్ గా 9 మెడికల్ కళాశాలను ప్రారంభించనున్నారు.
అదే విధముగా 16 వతేదీన నూతన మండలం గా ఏర్పడిన గోరికొత్తపల్లి మండలం యొక్క తహసీల్దార్ కార్యాలయం ను మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నాం గోరికొత్తపల్లి ప్రజల కు అడ్మినిస్ట్రేషన్ సకాలంలో చేకూరుతుంది.
అదే విధంగా భూపాలపల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా 50 కోట్ల రూపాయల నిధిలను మంజూర చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
అందులో భాగంగా ముందుగా 30 కోట్లు ఒక్కసారి మిగిలిన 20 కోట్లు మంజూరు చేయగా భూపాలపల్లి పట్టణంలో నేను వార్డు విజిటింగ్ చేసినప్పుడు నా దృష్టికి వచ్చిన మా మున్సిపల్ కౌన్సిలర్లు చెప్పిన ముఖ్యమైన పనులను గుర్తించి అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ కొరకు పంపించడం జరిగింది.
త్వరలోనే వాటికి టెండర్లు పిలిచి,పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రమేష్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ జడ్పిటిసి శోభ రఘుపతిరావు భూపాలపల్లి నియోజక వర్గ ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అక్రమ అరెస్టు అప్రజాస్వామ్యకo

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
కె. వి.రంగా కిరణ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: హైదరాబాదులో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చేస్తున్న దీక్ష భగ్నం చేసి అక్రమ అరెస్టు ను నిరసిస్తూ కొత్తగూడెం పట్టణంలో బస్టాండ్ అమరవీరుల స్థూపం వద్ద భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది ఈ నిరసనలో భాగంగా కె.వి.రంగా కిరణ్ మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నిరుద్యోగ భృతి కోసం 24 గంటల ఉపవాస దీక్షను భగ్నం చేసి మహిళలు అని కూడా చూడకుండా వారిని లాకెళ్లడం బాధాకరం అని తెలిపారు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ భృతి కల్పిస్తానని కేసీఆర్ మోసం చేశాడు అంతేకాకుండా రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలే బొంద పెడతారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లీ శ్రీనివాస్ కుమార్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల నాగేశ్వరరావు గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి చింతలచెరువు శ్రీనివాసరావు, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు లక్ష్మణ అగర్వాల్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లపు సాయిరాం, శ్రీనివాస్ గౌడ్, జంటంగి కృష్ణ, పాల్వంచ పట్టణం ప్రధాన కార్యదర్శి రాపాక రమేష్ జిల్లా కోశాధికారి జల్లారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

పెండెం ఆనంద్ కు ఎమ్మెల్యే పెద్ది ఘన నివాళులు

నర్సంపేట,నేటిధాత్రి :

స్వతంత్ర సమరయోధుడు పెండెం కటయ్య కుమారుడు, నర్సంపేట ఎస్ టి వి ఫౌండర్,జర్నలిస్టు పెండెం శివానంద్ తండ్రి పెండెం ఆనంద్ అనారోగ్యంతో గురువారం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో మృతి చెందాడు.కాగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిమ్స్ ఆసుపత్రిలో ఆనంద్ మృతదేహం వద్ద పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు.కుమారుడు జర్నలిస్టు శివానంద్ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెండెం కట్టయ్య కుటుంబం రాజకీయాలలో, ప్రజాసేవలో ప్రజలకు సుదీర్ఘకాలం పాటు సేవలు అందించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.

చేర్యాల్ ఎంపీడీవో భవనాన్ని స్వాధీనపరుచుకున్న సిద్దిపేట జిల్లా కోర్టు అధికారులు””

చేర్యాల నేటిధాత్రి..

చేర్యాల పట్టణానికి ఇటీవల మంజూరైన మున్సిఫ్ కోర్ట్ ఏర్పాటు కోసం ప్రతిపాదించిన స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం రోజున సిద్దిపేట జిల్లా కోర్టు ప్రధాన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం సూర్యనారాయణ మూర్తి గారి ఆధ్వర్యంలో స్వాధీనపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల ఎంపిపి ఉల్లంపల్లి కరుణాకర్, సిద్దిపేట జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవీందర్ , సూపరిడెంట్ శ్రీధర్ చేర్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భూమిగారి మనోహర్, జనరల్ సెక్రెటరీ తాటికొండ ప్రణీత్, సాంస్కృతిక మరియు క్రీడాల సెక్రటరీ అంకని సురెందర్, కోశాధికారి పొన్నం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల నియమావళిని పాటించాలి – చోప్పదండి సిఐ రవీందర్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు పోలీస్ స్టేషన్లో రాబోవు గణేష్ ఉత్సవాలు మరియు అసెంబ్లీ ఎన్నికల గురించి చొప్పదండి సీఐ రవిందర్, రామడుగు ఎస్ఐ తోట తిరుపతిలు పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈసమావేశానికి అన్నీ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు హాజరయ్యారు. ఈసమావేశంను ఉద్దేశించి చొప్పదండి సిఐ రవీందర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రామడుగులో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీసు వారు ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన బందోబస్తు చేయడం జరుగుతుంది. ప్రతి పార్టీ వారు పోలీసు వారికి పూర్తి సహకారాలు అందించాలని, శాంతి భద్రతల దృశ్య ఎటువంటి సంఘటన చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి సహకారం చేయాలని, ఎన్నికలు షెడ్యూల్ వచ్చిన నాటి నుండి, ఎన్నికలు ముందు ప్రచారం, ఎన్నికల రోజు, ఎన్నికల తదుపరి ఏవిధంగా ఎన్నికల కోడ్ ఉంటుందో దాని ప్రకారం నడుచుకోవాలని, ఏదైనా ఎన్నికల నియమావళిని అతిక్రమించిన వారి పైన తదితర చట్టపరమైన చర్యలు తీసుకోబడునని, రానున్న గణేష్ చతుర్థి, మిలాద్ ఉల్ నబి పండుగలు మత సామరస్యం, సహోదర భావంతో పండుగలు జరుపుకోవాలని, గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబి వేడుకలు ఒకే రోజు వచ్చాయని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సవాలను సంతోషంగా జరుపుకోవాలని, గణేష్ మండప నిర్వహకులు మండపాలను రోడ్డుకి అడ్డంగా ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని, మండపాల వద్ద బాధ్యత కలిగిన నిర్వహణ కమిటీ సభ్యులు బాధ్యత తీసుకోవాలని, మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి మండపం వద్ద విధిగా పాయింట్ బుక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, బ్లూ కోల్ట్ సిబ్బంది తరుచు మండపాలు తనిఖీ చేయడం జరుగుతుందని, మండపాల్లో, నిమర్జనం రోజున డీజేలకు అనుమతి లేదని, అనుమతి లేకుండా డీజేలను మండపాల్లో కానీ, నిమర్జనం రోజున ఉపయోగిస్తే డీజే వారితో పాటుగా మండపాల నిర్వాహకులను బైండోవర్ చేయడం జరుగుతుందని, పోలీస్ వారి సలహాలు, సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో రామడుగు ఎస్ఐ తోట తిరుపతి, గణేష్ మండపాల నిర్వహణ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో ఉద్యమించాలి

నర్సంపేట,నేటిధాత్రి :

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జీ నాగయ్య పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ఈ నెల 10 నుండి 17 వరకు నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐఎంఏ హాల్ లో సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన సభ నిర్వహించారు.ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ 1945నుంచి1951 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటo కొనసాగుతున్న క్రమంలో ఆనాటి ప్రధాని నెహ్రు సైన్యం, నైజం ప్రభుత్వ పోలీసులు దౌర్జన్యాలకు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రజలు 4000 మంది మరణించారని అన్నారు. ఈ నేపథ్యంలో ఆ పోరాటం ద్వారా తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూములను సాధించుకొని భూమి లేని పేదలందరికీ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఆ పోరాటంలో మొదటి అమరుడు దొడ్డి కొమరయ్య కాగా చాకలి ఐలమ్మ ఆంధ్ర మహాసభ ద్వారా పోరాటం నిర్వహించగా నేడు అదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ప్రజలు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య సమ్మయ్య,ముంజల సాయిలు, అనంతగిరి రవి, గడ్డమీది బాలకృష్ణ,కందికొండ రాజు, కుదురుపాక రాములు,మద్ది అశోక్,ఎండి ఫారిదా, వజ్జంతి విజయ,జగన్నాధం కార్తీక్,బిట్ర స్వప్న,ఉదయగిరి నాగమణి, తాళ్లపల్లి ప్రవళిక,గణిపాక ఇంద్ర,బి లక్ష్మి, కలకోటి అనిలు, గణిపాక విలియం కేరి, తదితరులు పాల్గొన్నారు.

జాగృతి పోలీస్ కళా బృందం అధ్వర్యంలో వివిధ అంశాల మీద ప్రజలకి అవగాహన కార్యక్రమం

హన్మకొండ, నేటిధాత్రి:

ఈ రోజు జాగృతి పోలీస్ కళా బృందం, వరంగల్ నగర పొలీస్ కమీషనర్ శ్రీ ఏవి రంగనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్, రాయపుర కాలనీలో చదువు,రోడ్డు ప్రమాదాలు, షీటీమ్స్,,డయల్100,, సిసి కెమేరాలు,మరియు గుట్క,గంజాయి డ్రగ్స్ వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, మూఢ నమ్మకాలపై మేజిక్ షో,ముసలి తల్లి తండ్రులను మంచిగ చూసుకోవాలని,తదితర అంశాలపై పాటల ద్వార, మరియు సైబర్ క్రైమ్స్ నాటిక ద్వార ప్రదర్శిస్తు1930 సైబర్ టోల్ నంబర్ గురించి చెప్పడంజరిగంది.ఈ కార్యక్రమానికి హన్మకొండ సీఐ ,ఎస్ఐ ,డివిజన్ కార్పొరేటర్,పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్, కళాబృందం ఇంచార్జి ఉమెన్ ఏఎస్ఐ శ్రీమతి నాగమణి గారు, సభ్యులు, ఎచ్సీఎస్ విలియమ్, వెంకటేశ్వర్లు, పీసీ రత్నయ ఎచ్జీఎస్, శ్రీనివాస్, విక్రంరాజ్ నారాయణ, మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

వ్యవసాయ విప్లవం రావాలి

ఆరోగ్యమే మహా భాగ్యం. ఎంత కష్ట పడినా, సంపాదించినా, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ప్రతి ఒత్తిడితో కూడుకున్న జీవితానికి నాణ్యమైన, మేలైన ప్రకృతి వర ప్రసాదమంటి ఆహారం అందరికీ అవసరం. పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ విప్లవం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో జన్యుపరమైన మార్పులతో నూతన వంగడాల సృష్టి నిరంతరం జరుగుతూనే వుంది. దానికి తోడు పంట అధిక దిగుబడి కోసం వాడుతున్న రసాయన ఎరువులు విచ్చలవిడిగా వాడకం జరుగుతోంది. సస్య రక్షణలో భాగంగా అనేక పురుగు మందులు వాడాల్సిన అవసరం ఏర్పడుతోంది. దాంతో మనం తీసుకునే ఆహారంలో మందుల అవశేషాలతో కూడుకున్న ఆహారాన్ని తీసుకోక తప్పడం లేదు. వాటిని తీసుకోవడం మూలంగా మన శరీరాలలో కూడా మార్పులు సంభవిస్తున్నాయి. మెటబాలిజమ్ దెబ్బ తింటోంది. శరీరంలోని ఆర్గాన్లు దెబ్బతింటున్నాయి. చిన్న వయసులొనే ప్రజలు అనారోగ్యాల పాలౌతున్నారు. అందుకే ప్రజలందరిలోనూ ఇప్పుడిప్పుడే అవగాహన వస్తోంది. కానీ ఇప్పటికే విసృతంగా, అవసరాన్ని మించి రసాయన ఎరువుల వాడకం జరిగిపోయింది. దాంతో భూమిలో సారం దెబ్బతిన్నది. గతంలో రైతులు పూర్తి స్థాయిలో తయారీ కంపోస్టు ఎరువులను వినియోగించే వారు. రాను రాను వాటిని పూర్తిగా తగ్గించేసి, అధిక దిగుబడుల కోసం అవసమయ్యే ఎరువుల వాడకం విపరీతంగా పెరిగింది. దాంతో పండే ప్రతి పంటలోనూ పోషకాలన్నా, రసాయన మూలకాలే ఎక్కువ వుంటున్నాయి. అవి మనుషుల శరీరాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. కూరగాయల సాగు చేసే రైతులు మోతాదుకు మించి కూడా రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించడం‌ పర్యావరణ అసమతుల్యతకు కూడా కారణమౌతున్నాయి. రసాయన ఎరువులు, పురుగు మందుల‌ మూలంగా వాతావరణం కూడా కాలుష్యమౌతోంది. అటు నీరు, ఇటు గాలి, తినే ఆహారం అన్నీ కాలుష్య కారకాలుగా మారిపోడంతో మనుషుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. లేని లేని రోగాలు వచ్చిపడుతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అందువల్ల శ్రేష్ఠ అగ్రీ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అందజేస్తున్నారు. ఇది అటు భూసారం పెంపకానికి ఉపయోగపడుతుంది. ఇటు పంటలలో ఎలాంటి విష రసాయనాలు లేని పంటలను అందజేస్తుంది. పూర్తిగా సహజ సిద్దమైన, ప్రకృతి వనరులతో ఈ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ తయారు చేయడం జరుగుతోందని కంపనీ డైరెక్టర్లు బాబూ రావు, శ్రీనివాసరావు, సూర్య ప్రకాశ్ రావులు వివరించారు. హైదరాబాదు కేంద్రంగానే ఈ ఆర్గానిక్ ఉత్పదన ఎరువుల తయారీ జరుగుతోందని వారు తెలిపారు. ఆర్గానిక్ ఎరువుల తయారీ రంగంలో శ్రేష్ఠ అగ్రిసైన్స్ ప్రైవేటు లిమిటెడ్ వ్యవసాయ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోందని వారు వివరించారు. ఆపరేషన్ అఫ్ సేల్స్ ఇంచార్జి పావనకుమార్ మాట్లాడుతూ నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలలో రైతులకు, అందిస్తున్నామన్నారు. శ్రేష్ఠ అగ్రి సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అన్ని రకాల పంటల ఉత్పదనలకు అందుబాటులో వున్నాయని మార్కెటింగ్ మేనేజర్ చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలోని నిరుద్యోగ యువత కోసం 24 గంటల నిరాహార దీక్షను కిషన్ రెడ్డి ముగించారు

హైదరాబాద్‌: నిరుద్యోగ యువత పట్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి చేపట్టిన 24 గంటల నిరాహార దీక్ష గురువారం ముగిసింది.

నిరాహార దీక్ష ముగింపు సందర్భంగా కిషన్‌రెడ్డికి తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నిమ్మరసం అందించారు.

రెడ్డి బుధవారం ఇక్కడ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు.

అయినప్పటికీ, అనుమతించిన సమయానికి మించి నిరసనను “కొనసాగించినందుకు” బుధవారం సాయంత్రం ఆయనను పోలీసులు ధర్నా చౌక్ నుండి “బలవంతంగా” తరలించారు.

రెడ్డిని రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యాలయానికి తరలించినప్పటికీ బిజెపి కార్యకర్తలు నినాదాలు చేసి పోలీసుల చర్యను వ్యతిరేకించడంతో బుధవారం సాయంత్రం ధర్నా చౌక్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
రెడ్డి మాత్రం పార్టీ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష కొనసాగించారు.

తెలంగాణలో పార్టీ వ్యవహారాల ఇంచార్జి, బిజెపి ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ బుధవారం రాత్రి పోలీసుల చర్యను ఖండించారు మరియు నిరసన ప్రదేశంలో రెడ్డి స్పృహతప్పి పడిపోయారని పేర్కొన్నారు.

"ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరసనకు అనుమతి జారీ చేయబడింది, అయితే వారు సమయాలను పాటించలేదు మరియు నిరసన స్థలం నుండి ఖాళీ చేయలేదు" అని సీనియర్ పోలీసు అధికారి బుధవారం రాత్రి PTI కి చెప్పారు.

రెడ్డి స్పృహ తప్పి పడిపోవడంపై ఆరా తీస్తే డీహైడ్రేషన్ వల్ల అయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.

ఆయన అభ్యర్థన మేరకు కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ కార్యాలయానికి తరలించినట్లు అధికారి తెలిపారు.
పోలీసుల చర్యను ఖండిస్తూ తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి గురువారం నిరసనలకు పిలుపునిచ్చారు.

ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లినట్లు బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.

ప్రజల సమస్యలపై బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగించాలని కిషన్‌రెడ్డితో షా ఫోన్‌లో మాట్లాడినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.



 

ఆర్టీసీ బిల్లుపై ఆమోదముద్రవేసిన గవర్నర్.

హైదరాబాద్,నేటిధాత్రి :

సుదీర్ఘ నెల రోజుల తర్వాత రాష్ట్ర గవర్నర్ ఆర్టీసీపై గురువారం ఆమోద ముద్ర వేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజుల క్రితం ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ తీర్మానం చేసి ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించింది.

కాగా ఆ బిల్లును ఆమోదించాల్సిన గవర్నర్ తమిళసై పెండింగ్లో పెట్టారు.

నెలరోజుల వ్యవధి తర్వాత తెలంగాణ ఆర్టీసీ బిల్లును గవర్నర్ తమిళసై కొద్ది సమయం క్రితం ఆమోదించారు.

మెక్సికో కాంగ్రెస్‌లో మిస్టీరియస్ నాన్-హ్యూమన్ ”ఏలియన్ శవాలు” ప్రదర్శించబడ్డాయి

కాంగ్రెస్ విచారణ సందర్భంగా, పెరూలోని కుస్కో నుండి వెలికితీసిన రెండు ‘గ్రహాంతర శవాలు’ మెక్సికో నగరంలో ఆవిష్కరించబడ్డాయి.

మునుపెన్నడూ వినని సంఘటనలో, మెక్సికో కాంగ్రెస్ మంగళవారం రాజధాని నగరంలో అసాధారణమైన సంఘటనను నిర్వహించింది, ఇది గ్రహాంతర జీవుల ఉనికి గురించి చర్చలకు దారితీసింది. ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన గుర్తించబడని క్రమరహిత దృగ్విషయాలపై కాంగ్రెస్ విచారణ సందర్భంగా, పెరూలోని కుస్కో నుండి వెలికితీసిన రెండు ఆరోపించిన ‘గ్రహాంతర శవాలు’ మెక్సికో నగరంలో ఆవిష్కరించబడ్డాయి, ఇండిపెండెంట్ నివేదించింది.
గ్రహాంతర వ్యక్తుల యొక్క 1,000-సంవత్సరాల పురాతన శిలాజ అవశేషాలుగా పేర్కొంటున్న ”నాన్-మనుషు” గ్రహాంతర శవాలను జర్నలిస్ట్ మరియు యూఫోలజిస్ట్ జైమ్ మౌసాన్ కిటికీల పెట్టెల్లో సమర్పించారు. రియాన్ గ్రేవ్స్, అమెరికన్స్ ఫర్ సేఫ్ ఏరోస్పేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు మాజీ U.S. నేవీ పైలట్ కూడా హాజరయ్యారు.

Mr. మౌసాన్, శాన్ లాజారో లెజిస్లేటివ్ ప్యాలెస్‌లో ప్రమాణ స్వీకారం చేస్తూ, ”ఈ నమూనాలు మన భూగోళ పరిణామంలో భాగం కాదు… ఇవి UFO శిధిలాల తర్వాత కనుగొనబడిన జీవులు కాదు. అవి డయాటమ్ [ఆల్గే] గనులలో కనుగొనబడ్డాయి మరియు తరువాత శిలాజీకరించబడ్డాయి.

“UFOలు మరియు గుర్తించబడని క్రమరహిత దృగ్విషయాలను” ప్రదర్శించే అనేక వీడియోలు కూడా ఈవెంట్ సమయంలో ప్రసారం చేయబడ్డాయి.

మిస్టర్ మౌసాన్ కాంగ్రెస్‌తో మాట్లాడుతూ, రెండు మృతదేహాల నుండి DNA నమూనాలను పరీక్షించారు మరియు ఇతర DNA నమూనాలతో పోల్చారు మరియు DNA నమూనాలో 30 శాతానికి పైగా ‘తెలియదు’ అని కనుగొనబడింది. ఇంకా, శవాల యొక్క ఎక్స్-కిరణాలు కూడా ప్రదర్శించబడ్డాయి, ఇవి అరుదైన లోహ ఇంప్లాంట్‌లతో పాటు శరీరంలో ఒకదానిలో “గుడ్లు” ఉన్నట్లు చూపించాయి.

బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి:

కల్వల గ్రామానికి చెందిన‌ గొల్ల కురుమ యాదవులు,కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మహబూబాబాద్ శాసనసభ్యులు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందనీ ఆ పార్టీ గ్రామ అధ్యక్షుడు లింగాల పిచ్చయ్య తెలిపారు.ఈ సందర్భంగా వారికి ఎమ్మేల్యే బి ఆర్ ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి మోడం రవీందర్,మండల కార్యవర్గ సభ్యుడు ఏదునూరి శ్రీనివాస్,బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి కుదురుపాక ఉపేందర్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.బి ఆర్ ఎస్ లో చేరిన వారిలో మార్గం యాదగిరి తాడబోయిన,కొమురయ్య బిజెపి పార్టీకి చెందిన గొడ్డేటి రాము చిలుకూరి నరసయ్య,యేసు,దాసరి కొమురమ్మ మొత్తం 40 కుటుంబాలు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం కావడం జరిగిందనీ తెలిపారు.

పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్….

 తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీ చేసి పలు సూచనలు చేస్తూ పరిసరాలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ తరహాలో కేసులు నమోదవుతున్నాయని గత మూడు సంవత్సరాల నుండి నమోదవుతున్న కేసుల గురించి కం పారీ టీయూ స్టేట్మెంట్ను పరిశీలించి పెండింగ్ ఉన్న కేసులను సిడి పైళ్లను రికార్డులను పరిశీలించి పైవివిధ కేసులు చేసిన వాహనాలను త్వరగా డిస్పోజలు చేయాలని ఇంప్లిమెంటేషన్ పరిశీలించి ఫైల్స్ సక్రమమైన పద్ధతిలో ఉంచాలని సూచించారు అలాగే రిసెప్షన్ మరియు ఫంక్షన్ హాల్ వర్టికల్స్ గురించి చేయవలసిన విధుల గురించి నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క వివరాలు వారు నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు వర్టికల్ వారిగా అధికారులు సిబ్బంది విధులు నిర్వహించాలని ప్రజల సమస్యలు తీర్చడానికి అధికారులుఎల్లవేళ లా అందుబాటులో ఉండి సేవలు అందించాలని రానున్న పండుగ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని విలేజ్ పోలీసులు తరచూ వారికి కేటాయించిన గ్రామాల్లో తిరుగుతూ కావాల్సిన సమాచారం సేకరిస్తూ రౌడీలు అనుమానిత మరియు సంఘ విద్రోహక శక్తులపై నిరంతరం నిఘ వారి కదలికలను గమనించాలని బ్లూ కోర్స్ పెట్రో కార్స్ 24.7. గస్తి నిర్వహిస్తూ పెట్రోలింగ్ నిర్వహించే సమయంలో సిబ్బంది పాత నేరస్తులను తనిఖీచేయాలని క్రైమ్ రేట్ తగ్గించాలని అధికారులు సిబ్బంది యాక్టివ్గా పోలీసులు విధులు నిర్వహించాలని సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకూరవాలని తదుపరి సమస్య పరిష్కరిస్తానని అన్నారు పోలీస్ స్టేషన్ రికార్డ్స్ మరియు సిడి ఫైల్స్ లో ఇన్వెస్టిగేషన్ ఎస్ఓపి ప్రకారం క్రమ పద్ధతిలో ఉన్నందున ఎస్సై మరియు సిబ్బందిని అభినందించారు ఎస్పీ గారి వెంట డిఎస్పి ఉదయ రెడ్డి సిఐ సదన్ కుమార్ ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో పోలిసుల పాత్ర కీలకం

ఎస్పి పుల్లా కరుణాకర్

భూపాలపల్లి నేటిధాత్రి

బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో రాబోవు రాష్ట్ర శాసనసభ ఎన్నికల నియమావళి, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది తీసుకోవలసిన చర్యలపై ఎస్పి పుల్లా కరుణాకర్ ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిoచారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.రాబోయే శాసనసభ ఎలక్షన్స్ సందర్భంగా పోలీసులు ఎన్నికల సంఘం నియంత్రణలో , పర్యవేక్షణలో క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు.ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఎన్నికలను ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని, ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఒకటికి రెండుసార్లు విషయాలు తెలుసుకొని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. పోలీసు అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామాలలో ఎలాంటి సమస్యలు లేకుండా, సమస్యలు సృష్టించే వారినీ బైండోవర్ చేయాలని తెలిపారు. ఇంతకు ముందు ఎలక్షన్స్ సమయంలో సమస్యలును సృష్టించిన వారి పై పూర్తి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలీస్ అధికారులు ఎలక్షన్ సమయంలో సమస్యలు సృష్టించే వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలను, మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి, దృష్టిసారించాలన్నారు.
ఈ యొక్క శిక్షణ కార్యక్రమo లో భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, కాటారం డిఎస్పీ జి జి. రామ్మోహన్ రెడ్డి, జిల్లా పరిధిలోని సీఐ లు, ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version