తెలంగాణే ఓ వైద్యాలయం.

https://epaper.netidhatri.com/

`తెలంగాణలో ప్రభుత్వ వైద్య విప్లవం.

`దేశంలో ఎక్కడా లేనన్ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు.

`తెలంగాణలోనే వైద్య విద్యార్థులెక్కువ.

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంకల్పం.

`మంత్రి హరీష్‌ రావు ఆచరణం.

`జిల్లాకో వైద్య కళాశాలకు శ్రీకారం.

`అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలు ప్రారంభం.

`పేదలకు ఎంతో చేరువైన ప్రభుత్వ వైద్యం.

`హైదరాబాదు చుట్టూ నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు.

`వరంగల్‌ లో 2500 పడకల పెద్దాసుపత్రి.

`నిమ్స్‌ లో మరో కొత్త ఆసుపత్రి నిర్మాణం.

`మేలైన, మెరుగైన ప్రభుత్వ వైద్యం.

`తల్లి బిడ్డల సంక్షేమ, సంరక్షణలో నూతన అధ్యాయం.

https://epaper.netidhatri.com/

హైదరబాద్‌,నేటిధాత్రి:
ఇదినా తెలంగాణ అని ప్రతి తెలంగాణ వ్యక్తి సగర్వంగా చెప్పుకునేంత స్ధాయికి చేరుకోవడం అన్నది సాధారణమైన విషయం కాదు. ఆదర్శవంతమైన రాజకీయాలు, అంకితభావం కూడుకున్న ఉద్యమాన్ని పద్నాలుగేళ్ల పాటు నడిపి, తెలంగాణ సాధకుడు కేసిఆర్‌ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తుండడం అన్నది చరిత్రకే కొత్త భాష్యం. రేపటి తరానికి ఆదర్శం. ప్రజల కోరికను ఉద్యమ రూపంలో తెలంగాణ సాధించి తీర్చాడు. తెలంగాణ ప్రజలు గతంలో పడిన వేతలు భవిష్యత్తులు ఎప్పుడూ పడకుండా అనేక ఆవిష్కరణలు చేపడుతున్నాడు. వాటి ఫలితాలు కూడా పదేళ్లలో చూపించి, అందరినీ అబ్బురపర్చుతున్నాడు. దేశమంతా తెలంగాణ ప్రగతిని కొనియడేలా చేస్తున్నాడు. తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే అన్నది ఒకప్పటి మాట. కాని తెలంగాణ అన్న సర్వతోముఖాభివృద్ధికి చిరునామా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌కే చెల్లింది. అయితే ఇక్కడ ఆర్ధిక శాఖ, వైద్య శాఖ మంత్రి హరీష్‌రావు పాత్రకు ఎనలేని పేరుంది. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసిఆర్‌తో అడుగులేశాడు. ఉద్యమ సైనికుడయ్యారు. తెలంగాణ వచ్చిన వెంటనే సాగించిన జలయజ్ఞం కోసం మంత్రి హరీష్‌రావును ముందుంచి, ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ సాగునీటి కల సాకారం చేయించాడు. ఇప్పుడు ఆరోగ్య తెలంగాణ ఏర్పాటులో హరీష్‌రావుది కీలకపాత్ర దారిని చేశారు. ఇలా ఒక నాయకుడు ఒక రాష్ట్ర చరిత్రలో రెండు రకాల వైవిద్యాలను కూడుకున్న రంగాలను చక్కదిద్దే పనిని అంది పుచ్చుకోవడం అంటే మాటలు కాదు. అందుకు ఎంతో సమర్థిత అవసరం. అది ఒక్క హరీష్‌రావుకు మాత్రమే చెల్లింది. ఆయనతోనే అటు సాగు విప్లవానికి అవసరమైన అపర భరీరధ ప్రయత్నం, ఇటు ప్రజల జీవితాలను కాపాడే ఆరోగ్య రంగం ఆయన ద్వారా తెలంగాణలో వేనూళ్లుకోవడం గొప్ప అదృష్టం.
ఒకనాడు తెలంగాణలో వైద్యం అంటే అయితే హైదరాబాద్‌ గాంధీ, ఉస్మానియా, లేకుంటే వరంగల్‌ ఎంజీఏం.
ఇవే పెద్ద ప్రభుత్వ దవఖానాలు. ఇక నిమ్స్‌ హైదరాబాద్‌లోనే వున్నా, పేదలకు అందని ద్రాక్షే అన్నట్లు వుండేది. అక్కడ కూడా సరైన వైద్య సదుపాయాలు లేక, పేదలకు అప్పులు చేసి, భూములు అమ్ముకొని ఖరీదైన వైద్యం చేయించుకొని పేదలుగా మారేవారు. ప్రైవేటు వైద్యం ఒక వేళ వికటిస్తే అటు ధనంతోపాటు, ప్రాణాలు పోయి, సర్వం కోల్పోయి కుటుంబాలు వీధినపడేవి. ఒకనాడు తెలంగాణ జిల్లాల్లోనైనా పెద్ద ఆసుపత్రులు ఏర్పాటు చేయమంటే కూడా ఉమ్మడి పాలకులు ఏర్పాటు చేయలేదు. ఇక వైద్య విద్య అంటే అదొక బ్రహ్మ పదార్ధంగా వుండేది. వైద్య విద్య అంటేనే ఖరీదైనది. అలాంటి వైద్య విద్య సామాన్యులకు అందులోనూ తెలంగాణ యువతకు అందకపోయేది. పేరుకే తెలంగాణలో వైద్య విద్య కాని, సీట్లన్నీ ఆంధ్రా విద్యార్ధులే సాధించుకునేవారు. తెలంగాణ లో విద్యలో కూడా అంతంత మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలో, లేక వ్యాపారవేత్తల పిల్లలో ప్రైవేటు ఇంటర్‌ కాలేజీలలో చదవి, మెడికల్‌ కోచింగ్‌లు తీసుకొని సీట్లు సాధించేవారు. అంతటి స్ధోమత తెలంగాణలో చాలా మందికి వుండేది కాదు. అందువల్ల పేదల పిల్లలకు వైద్య అందేది కాదు. దాంతో తెలంగాణలో ఎక్కడ చూసినా ఆంద్రాప్రైవేటు వైద్యులు. ప్రైవేటు ఆసుపత్రులు వెలిసేవి. కాని కాలం మారింది. తెలంగాణ వచ్చింది. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత పది జిల్లాల తెలంగాణ ముప్పై మూడు జిల్లాలైంది. ప్రతి జిల్లాలో ఒక అధ్భుతమైన ప్రభుత్వ పరిపాలన కార్యాలయమైన సమీకృత కలెక్టరేట్ల భవనాలు నిర్మాణం జరిగాయి. ప్రజలందరికీ ఒకే దగ్గర అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో వుండడం వల్ల ఒకే దగ్గర అన్ని పనులు జరిగేందుకు వీలేర్పడిరది. గతంలో ఒక కార్యాయాలం ఈ మూలన, మరొ కార్యాయలం ఆ మూలన అన్నట్లు జిల్లా వ్యాప్తంగా వీలును బట్టి ఏర్పాటు చేయడంతో ప్రజలు ఎంతో శ్రమపడాల్సివచ్చేది. రోజులకు రోజులు కష్టపడాల్సివచ్చేది. కాని ఇప్పుడు అన్నీ కార్యాలయాలు ఒకే చోట నిర్మాణంతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యాయి. అలాగే తెలంగాణలో ప్రజలకు ఖరీదైన వైద్యం కూడా జిల్లాల్లో ఉచితంగా అందుబాటులోకి వస్తోంది. తెలంగాణలో ప్రతి జిల్లాకో మెడికల్‌ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈనెల 15న ఏకకాలంలో తొమ్మిది మెడికల్‌ కాలేజీల తరగతులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందిస్తున్న వైద్య విద్యను ఆయన చేతుల మీదుగానే మొదలు కానున్నాయి. అయితే మెడికల్‌ కాలేజీలతోపాటు, నర్సింగ్‌ కాలేజీలు కూడా ఏర్పాటు కావడంతో, తెలంగాణలో వైద్యానికి అవసరమైన సిబ్బందికి కొరత కూడా వుండదు. పైగా నిపుణులైన డాక్టర్లే కాదు, నిపుణులైన నర్సులు కూడా వైద్య అందించేందుకు సిద్దంగా వుంటారు.
తెలంగాణ ప్రభుత్వ వైద్య విప్లవం చూస్తోంది.

దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని మెడికల్‌ కాలేజీలు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఏర్పాటు చేశారు. తెలంగాణలోని మెడికల్‌ కాలేజీలలో 95శాతం స్ధానిక విద్యార్దులకే అందించనున్నారు. దేశంలోనే తెలంగాణ వైద్య విద్యార్దులను తయారు చేయడంలో మొదటి స్ధానంలో నిలవనున్నది. ఇలాంటివి జరగాలంటే పాలకులకు ఎంతో సంక్పలం వుండాలి. అసలు తెలంగాణలో ఇన్ని వైద్య కళాశాలలు ఏర్పాటౌతాయని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. అటు వైద్య కళాశాలలో వైద్య కల్పనే కాకుండా, అనేక జిల్లాలో కొత్త కొత్త ఆసుపత్రుల నిర్మాణం జరిగింది. అందులో వైద్యం కూడా ఎప్పుడో అందుబాటులోకి వచ్చింది. గత ఉమ్మడి జిల్లాల ఆసుపత్రులలో మరింత వైద్య సదుపాయాలు పెంచడం జరిగింది. దానికి తోడు తెలంగాణలో మాతా శిశు సంక్షేమం కోసం కూడా ప్రత్యేకంగా ఆసుపత్రుల నిర్మాణం చేయడం జరిగింది. గతంలో మహిళలు గర్భిణీలు ప్రైవేటు ఆసుపత్రి వైద్యం అందుకోక తప్పని పరిస్ధితులు. చివరకు డెలివరీ కోసం ఆపరేషన్లు, వేలకు వేల ఫీజులు. ఇప్పుడు ఆ పరిస్దితి లేదు. తెలంగాణలో ప్రభుత్వం మాతా శిశి సంరక్షణ పేరుతో ఉచిత వైద్యం అందిస్తోంది. దాంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసూతి సేవలు నిలిపేసుకోవాల్సిన పరిస్ధితులు ఎదురయ్యాయి. మహిళలు డెలివరి కోసం ఆసుపత్రికి తీసుకెళ్లడం, డెలివరీ అయిన తర్వాత తల్లీ, బిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకున్నది. దానికి తోడు కేసిఆర్‌ కిట్‌ అదనం. ప్రసూతి సేవల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున ఉచిత ఆంబులెన్స్‌లు కూడా ఏర్పాటుచేసింది. ఇక జిల్లాల నుంచి నగరానికి వచ్చే వారు గాంధీ, నిమ్స్‌, వరకు రాకుండా నగర శివారులోనే నాలుగు పెద్ద ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మాణం చేస్తోంది. వాటితో తెలంగాణ నలు మూలల ప్రజలకు ఖరీదైన ఉచిత ప్రభుత్వ వైద్యం అత్యాధునిక సేవలు అందనున్నాయి. ఇక వరంగంల్‌లో అత్యాధునిక సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చకచకా జరుగుతోంది. దసరా వరకు పూర్తి కానున్నది. సుమారు 2500 పడకలతో దేశంలోనే అత్యాధునికమైన, అన్ని రకాల వ్యాధులకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి రానున్నది. ఇక నిమ్స్‌లో కూడా మరో 1500 అదనపు బెడ్‌ సౌకర్యం కోసం మరో ఆసుపత్రి నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. ఇలా తెలంగాణలో కొత్తగా నిర్మాణమౌతున్న ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాల ద్వారా పేద వర్గాలకు పెద్దఎత్తున మేలు జరగనున్నది. వైద్యం విషయంలో పేదలు పడుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వ వైద్యం విసృతంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు వైద్య కళాశాలలు, వాటికి అనుబందంగా వస్తున్న నర్సింగ్‌ కాలేజీల మూలంగా పెద్దఎత్తున ఉపాధి కల్పన కూడా జరనున్నది. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల వైద్యాలకు అవసరమైన వైద్యులతోపాటు, టెక్నీషియన్లు, నర్సింగ్‌ స్టాఫ్‌, ఫార్మసీ స్టాప్‌, సెక్యూరిటి, అడ్మినిస్ట్రేషన్‌ స్టాఫ్‌, సిస్టమ్‌ టెక్నిషియన్లు ఇలా అనేక రంగాల ప్రైవేటు వ్యక్తులకు కూడా ఉపాది లభిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుతో అటు వైద్యమేకాకుండా, కొత్తగా ఒక ఊరు వెలిసే అవకాశం కూడా వుంది. ప్రజలకు మేలైన, మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రికేసిఆర్‌ను ప్రజలు కొనియాడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!