ఆరోగ్యమే మహా భాగ్యం. ఎంత కష్ట పడినా, సంపాదించినా, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ప్రతి ఒత్తిడితో కూడుకున్న జీవితానికి నాణ్యమైన, మేలైన ప్రకృతి వర ప్రసాదమంటి ఆహారం అందరికీ అవసరం. పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ విప్లవం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో జన్యుపరమైన మార్పులతో నూతన వంగడాల సృష్టి నిరంతరం జరుగుతూనే వుంది. దానికి తోడు పంట అధిక దిగుబడి కోసం వాడుతున్న రసాయన ఎరువులు విచ్చలవిడిగా వాడకం జరుగుతోంది. సస్య రక్షణలో భాగంగా అనేక పురుగు మందులు వాడాల్సిన అవసరం ఏర్పడుతోంది. దాంతో మనం తీసుకునే ఆహారంలో మందుల అవశేషాలతో కూడుకున్న ఆహారాన్ని తీసుకోక తప్పడం లేదు. వాటిని తీసుకోవడం మూలంగా మన శరీరాలలో కూడా మార్పులు సంభవిస్తున్నాయి. మెటబాలిజమ్ దెబ్బ తింటోంది. శరీరంలోని ఆర్గాన్లు దెబ్బతింటున్నాయి. చిన్న వయసులొనే ప్రజలు అనారోగ్యాల పాలౌతున్నారు. అందుకే ప్రజలందరిలోనూ ఇప్పుడిప్పుడే అవగాహన వస్తోంది. కానీ ఇప్పటికే విసృతంగా, అవసరాన్ని మించి రసాయన ఎరువుల వాడకం జరిగిపోయింది. దాంతో భూమిలో సారం దెబ్బతిన్నది. గతంలో రైతులు పూర్తి స్థాయిలో తయారీ కంపోస్టు ఎరువులను వినియోగించే వారు. రాను రాను వాటిని పూర్తిగా తగ్గించేసి, అధిక దిగుబడుల కోసం అవసమయ్యే ఎరువుల వాడకం విపరీతంగా పెరిగింది. దాంతో పండే ప్రతి పంటలోనూ పోషకాలన్నా, రసాయన మూలకాలే ఎక్కువ వుంటున్నాయి. అవి మనుషుల శరీరాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. కూరగాయల సాగు చేసే రైతులు మోతాదుకు మించి కూడా రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించడం పర్యావరణ అసమతుల్యతకు కూడా కారణమౌతున్నాయి. రసాయన ఎరువులు, పురుగు మందుల మూలంగా వాతావరణం కూడా కాలుష్యమౌతోంది. అటు నీరు, ఇటు గాలి, తినే ఆహారం అన్నీ కాలుష్య కారకాలుగా మారిపోడంతో మనుషుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. లేని లేని రోగాలు వచ్చిపడుతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అందువల్ల శ్రేష్ఠ అగ్రీ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అందజేస్తున్నారు. ఇది అటు భూసారం పెంపకానికి ఉపయోగపడుతుంది. ఇటు పంటలలో ఎలాంటి విష రసాయనాలు లేని పంటలను అందజేస్తుంది. పూర్తిగా సహజ సిద్దమైన, ప్రకృతి వనరులతో ఈ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ తయారు చేయడం జరుగుతోందని కంపనీ డైరెక్టర్లు బాబూ రావు, శ్రీనివాసరావు, సూర్య ప్రకాశ్ రావులు వివరించారు. హైదరాబాదు కేంద్రంగానే ఈ ఆర్గానిక్ ఉత్పదన ఎరువుల తయారీ జరుగుతోందని వారు తెలిపారు. ఆర్గానిక్ ఎరువుల తయారీ రంగంలో శ్రేష్ఠ అగ్రిసైన్స్ ప్రైవేటు లిమిటెడ్ వ్యవసాయ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోందని వారు వివరించారు. ఆపరేషన్ అఫ్ సేల్స్ ఇంచార్జి పావనకుమార్ మాట్లాడుతూ నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలలో రైతులకు, అందిస్తున్నామన్నారు. శ్రేష్ఠ అగ్రి సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అన్ని రకాల పంటల ఉత్పదనలకు అందుబాటులో వున్నాయని మార్కెటింగ్ మేనేజర్ చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.