ఇదేమి రోడ్డు…. ప్రయాణికులకు నరకం

ప్రయాణం…. ప్రమాదం

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం మాందారి పేట కూడలి నుండి భూపాలపల్లికి పోయే తారు రోడ్డు గుట్టల వద్ద టైర్ యొక్క గుంతలు పడి అతి ప్రమాదకరంగా మారింది. పరకాల రహదారి మార్గంలోని మాందారిపేట-పరకాల రోడ్డు పైకి వస్తే వాహనదారులు భయభ్రాంతులకు గురై ప్రయాణం సాగిస్తున్నారు ఈ రహదారిపై వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది ముఖ్యంగా భారీ వాహనాల వల్ల రోడ్డు టైర్ గుంతలు పడి ప్రయాణం సాగడం నరక యాతన పడుతున్నారు వాహనాలు రోడ్డుపై ప్రయాణించడం ప్రమాదకరంగా మారింది. చిన్న వాహనాలు ప్రమాదాలు జరిగి ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మార్గాన్ని సకాలంలో పూర్తి చేయాలని కోరుతున్నారు

సాయికిరణ్ ను ఆదర్శంగా తీసుకోవాలి – ఉప్పుల శ్రీనివాస్

రామడుగు, నేటిధాత్రి:

విద్యార్థులు సాయికిరణ్ ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని సరస్వతి హైస్కూల్ కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ అన్నారు. యూపీఎస్సీ ఫలితాల్లో గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ జాతీయస్థాయిలో ఇరవై ఏడవ ర్యాంకు సాధించినందుకు పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సాయికిరణ్ అంచెలంచెలుగా ఎదిగి ఆన్ లైన్ కోచింగ్ తో జాతీయస్థాయిలో ర్యాంకు సాధించడం గర్వకారణమన్నారు. తన ప్రతిభకు పేదరికం అడ్డుకాదని, కష్టపడి చదివితే ఎంతటి ఉన్నత స్థాయికైనా ఎదగవచ్చని నిరూపించారన్నారు. ఈకార్యక్రమంలో స్కూల్ కోకరస్పాండెంట్ ఉప్పుల సత్యం, తేజ స్కూల్ కరస్పాండెంట్ దేవేందర్రావు, సామాజిక కార్యకర్త కల్లెపల్లి పర్శరాం, తదితరులు పాల్గొన్నారు.

జైపూర్ మండలంలో రోజురోజుకీ పెరుగుతున్న కాంగ్రెస్ పార్టీ కండువాలు

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో రోజురోజుకీ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతూనే వస్తున్నాయి. తాజాగా గురువారం రోజున జైపూర్ మండలంలోని రామారావు పేట గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీని వీడి మాజీ ఉపసర్పంచ్ తంగళ్ళపల్లి వెంకటేశం, వార్డు మెంబర్ గోలి వెంకటేష్, లోడింగ్ అండ్ అన్ లోడింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు బొద్దున రాజేశం, పద్మశాలి సంఘం నాయకుడు మెరుగు సమ్మయ్య మరియు ఇంకొంతమంది నాయకులు, కార్యకర్తలు చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అందరికీ కండువాలు కప్పి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సాధారంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి మాట్లాడుతూ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన అన్నదమ్ములు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చెన్నూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి అన్నివేళల ముందు ఉంటానని, నాయకుల, కార్యకర్తల అండదండలు, ప్రజల ఆశీస్సులు ఎప్పుడు తోడుండాలని, అందరం కలిసికట్టుగా కృషిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకీ ఘన విజయాన్ని అందించాలని తెలియజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకులు మాట్లాడుతూ రాబోవు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మేజారిటీతో గెలిపించేందుకు తమ సాయశక్తుల కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నామాల సత్యవతి తిరుపతి, మాజీ ఎంపీటీసీ ముదం రమేష్,మాజీ ఉప సర్పంచ్ గుండా శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజ్జుద్దీన్, కాంగ్రెస్ నాయకుడు నామాల నాగరాజు,కార్యకర్తలు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ నుండి బిజెపిలోకి భారీగా చేరికలు

వరంగల్ పార్లమెంట్ లో కాంగ్రెస్ కి ప్రజాబలం లేదు

ప్రజలంతా బిజెపి వైపు మోడీ పాలన వైపు మొగ్గు చూపుతున్నారు

హసన్ పర్తి / నేటి ధాత్రి

గ్రేటర్ వరంగల్ పరిధిలో గల హసన్ పర్తి లోని కె ఎల్ ఎన్ కన్వెన్షన్ హాల్ లో బిఆర్ఎస్ మాజీ ఎంపిటిసి పిట్టల కుమారస్వామి ఎర్రగట్టు గుట్ట మాజీ చైర్మన్ పెద్దమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని విడి బిజెపి లోకి హసన్ పర్తి మండలంలోని పలు గ్రామాల నుండి సుమారు 200 మందికి పైగా చేరారు. వీరికి బిజెపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్. ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ బీజేపీలో చేరేవారు త్యాగం చేస్తున్నట్టు లెక్క
త్యాగధనులకు స్వార్థ పరులకు మధ్య పోటీ ఇది.
కాంగ్రెస్ కి ఓటు వేస్తే దాని విలవ జీరో పేదవాళ్ల బ్రతుకులు మరింత బాగుపడాలంటే సుస్థిర పాలన కొనసాగాలంటే.. అందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి. నిండు మనసుతో నన్ను మోదీ నీ ఆశీర్వదించండి. పార్టీలో చేరిన వారిలో 66 వ డివిజన్ నాయకులు శిలం రాజేందర్, పిట్టల ముక్తిశ్వర్, గోనెల కుమారస్వామి, పెద్దమ్మ కోంరేల్లి, రమేష్ ముని పల్లి గ్రామం నుంచి అలుగు శ్రీధర్, ఉచిత రాజయ్య, ఉచిత రవి, బిక్షపతి, నాగారం గ్రామం నుంచి దేవునూరి హరీష్, వల్లాల వినయ్, కోలిపాక రేవంత్, వంశీ, వంగ పహాడ్ నుంచి గోనెల శ్రీకాంత్, శ్రీనివాస్, రవి, సుమన్ ముచ్చర్ల నుండి శివ కుమార్, ప్రసాద్  సుదాన్ పల్లి నుండి ఆళ్ల రవీందర్, శంకర్ హసన్ పర్తి నుండి శివ కుమార్, రాజ్ కుమార్ తదితరులకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన అరూరి రమేష్. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా బిజెపి అధ్యక్షురాలు రావు పద్మ, బిజెపి SC మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కొండెటి శ్రీధర్, పార్లమెంటరీ ప్రబారి మురళిధర్, కార్పొరేటర్లు అభినవ్ భాస్కర్, గురుమూర్తి, నాయకులు కుమారస్వామి, కేశవరేడ్డి, జెడ్పీటీసీ సునీత, పిఎసిఎస్ చైర్మన్ రమేష్ గౌడ్, తిరుపతి, రాజేశ్వర్ రావు, రాం చంద్ర రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో గంజాయి కల్తీకల్లు నిర్మూలిద్దాం పోస్టర్ ఆవిష్కరణ.

ఎస్సై జి శ్రవణ్ కుమార్.

చిట్యాల, నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండwల ఎస్ఐ జి శ్రావణ్ కుమార్ మరియు తన సిబ్బంది చిట్యాల మండలంలోని అన్ని గ్రామాలకి వెళ్లి గ్రామ సెంటర్లలో బస్టాండ్లో గంజాయి మరియు కల్తీకల్లు నిర్మూలన గురించి వాల్ పోస్టర్లు అతికించి మండల ప్రజలని ఎవరైనా గంజాయి విక్రయించిన కల్తీకల్లు( అల్ప్రోజలం మరియు డైజొఫామ్) కలిపిన కల్లును విక్రయించిన డయల్ 100, ఎస్సై చిట్యాల 8712658124 లేదా తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్ బ్యూరో 8712671111 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని చెబుతూ, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, గంజాయి వాడకం పట్టణాల నుండి పల్లెలకు చాప కింద నీరులా కూడా పాకిందని యువత తల్లిదండ్రులు ఇప్పుడు కూడా వారి పిల్లల్ని గమనిస్తూ ఉండాలని గంజాయి తాగే వారిలో మత్తు అనేది నరాల వ్యవస్థ పై పని చేస్తుందని ఇంత ముందు ఎప్పుడు లేని విధంగా విపరీతమైన ఆకలి విపరీతమైన నవ్వు వస్తుంటాయని ఇటువంటి మార్పులు ఏవైనా చోటు చేసుకుంటే వెంటనే సంప్రదించాలని వారికి అవసరానికి మించి డబ్బులు ఇవ్వకూడదని తెలుపుతూ ప్రస్తుతం గంజాయిని అనేక రకాలుగా చాక్లెట్ల రూపంలో మిల్క్ షేక్ ల రూపంలో అమ్ముతున్నారు కనుక తల్లితండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు, గ్రామాలలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్న సమాచారం ఉన్న సేవిస్తున్న సమాచారం ఉన్న వెంటనే తెలియపరచాలని మన యువతను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు
ఇట్టి కార్యక్రమంలో కానిస్టేబుల్స్ సిద్ధార్థ లాల్ సింగ్ నవీన్ లింగన్న పాల్గొన్నారు

మాకు న్యాయం చేయండి.

కొడుకులపై వాల్ పోస్టర్లు వేసిన వృద్ధ దంపతులు .

చిట్యాల, నేటి ధాత్రి :

కొడుకులు మానసికంగా ఇబ్బందుల గురి చేస్తున్నారని మేము భరించలేక పోతున్నామంటూ పిల్లలు ఉన్నా అనాథలుగా బ్రతుకుతున్నామంటూ ఓ వృద్ధ దంపతుల ఆ గ్రామంలో వాల్ పోస్టర్ లు వేసి మాకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకుంటున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే…భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రా పురం గ్రామానికి చెందిన క్యాతం భూమయ్య వరలక్ష్మి అనే వృద్ధ దంపతులకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. తను సంపాదించిన ఆస్తి వ్యవసాయ భూమిని గత కొన్ని ఏళ్ళ క్రితం పెద్ద కొడుకుకు 20 గుంటలు ఎక్కువగా మిగతా ఇద్దరు కొడుకులకు సమాన వాటా లుగా కూతురుకు ఒక ఎకరం భూమిని పంచి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పెద్ద కొడుకు క్యాతం రమేష్ చిన్న కొడుకు క్యాతం సతీష్ లు ఇద్దరు మమ్మల్ని హింసిస్తూ వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ ఆ వృద్ధ దంపతులు ఆ గ్రామంలో ఫోటోలతో కూడిన వాల్ పోస్టర్ లు వేసి ఎక్కడికి పోయినా కూడా మాకు న్యాయం జరుగుత లేదంటూ మందు డబ్బా పట్టుకుని చావే మాకు దిక్కని ఇప్పటికైనా అధికారులు మాకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.ఈ సందర్భంగా వృద్ధ దంపతులు మాట్లాడుతూ…నా పెద్దకొడుకు క్యాతం రమేష్ చిన్న కొడుకు క్యాతం సతీష్ ఇద్దరు కలిసి మమ్మల్ని వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మేము బరించ లేక పోతున్నామని తెలిపారు. వృద్ధులైన మాకు గత కొన్ని సంవత్సరాలుగా పంటలు పండకపోవడం తో పాటు పాత ఇల్లు కూలి పోయే దశలో ఉండగా కొత్త ఇల్లు నిర్మించుకున్నామని దీంతో కొన్ని అప్పులు కాగా పంటలు పండక పోతాయా అన్న ఆశతో పంట పండిస్తున్న ప్పటికీ పంటలు దిగుబడి రాక పోవడం తో అప్పులు పెరిగి పోయాయి. ఈ క్రమంలో నేను నా కొడుకుల ను పెద్ద మనుషులు దగ్గరికి పలు మార్లు పిలిపించి నేను ఉంచుకున్న భూమి నా పట్టా భూమిలోని 20 గుంటలు అమ్మి అప్పు కడుదామంటే నా పెద్ద కొడుకు రమేష్ చిన్న కొడుకు సతీష్ లు నన్ను నానా భుతులు తిడుతూ భూమిని అమ్మ నీయకుండా అడ్డు పడుతున్నారు. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో నేను ఎక్కడికి వెల్లి నా బాధను చెప్పుకున్నా కూడా నాకు న్యాయం జరుగుతాలేదు. వృద్దులమైన మాకు పోలీస్ స్టేషన్కు వెళ్లి మా భాధ చెప్పుకున్నా కూడా మాకు న్యాయం జరుగక పొగా నా ఇద్దరు కొడుకులు నా మీదనే ఉల్టా కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మందు డబ్బా పట్టుకుని మాకు న్యాయం కావాలంటూ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ స్పందిచాలంటూ తమ గోడును వెళ్ళ బోసుకున్నారు.

అంబీర్ చెరువు అలుగును సంబం ధిత వారితో కలిసి పరిశీ లించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

శేరిలింగంపల్లి,ఏప్రిల్ 18 నేటి ధాత్రి ఇన్చార్జి

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివా స రావు మాట్లాడుతూ…చు ట్టూ ప్రక్కల కాలనీల నుండి వచ్చే మురుగు నీరు అంబీర్ చెరువులో కలవకుండా ప్రత్యేక చర్యలను తీసు కుంటామని ప్రత్యేక పైప్ లైన్ ద్వారా మురుగు నీరు మల్లింపు చర్యలను చేపట్టి చెరువు కలుషితం కాకుండా చేస్తామని,చెరువు ను సుందరవనంగా తీర్చిదిద్దు తామ ని,చెరువులో మురుగు నీరు(డ్రై నే కాకుండాజీ)కలవడం వలన చుట్టూ పక్కల కాలనీవాసులు,ప్రజలు తీవ్ర ఇబ్బందు లకు గురిఅవుతున్నారని,ప్రజలకు ఎటు వంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలను తీసుకుంటామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తెలియచేసారు.అం బీర్ చెరువు అలుగును పరిశీలించి,అలు గు వద్ద చెత్త,చెదారం పెరుకుపోవడం
వలన నీటి ప్రవాహం సాఫీగా సాగక, మురుగు నీటి వ్యవస్థతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు అని,అలుగు వద్ద పెరుకపోయిన చెత్త చెదారంను వెంటనే జేసీబీ సహాయంతో అలుగు వద్ద పేరుకు పోయిన‌ వ్యర్థాలను తొలగించడం జరుగు తుందని,పనులు త్వరిత గతిన పూర్తి చే సి ప్రజలకు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని,నీటి ప్రవాహం సాఫీగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కార్పొ రేటర్ నార్నె శ్రీనివాసరావు అధికారులకు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నవీన్ నాయుడు,బ్రహ్మం,సీ తారామ రాజు,వర్మ,సతీష్,తదితరులు పాల్గొన్నారు.

కోరగుట్ట ఎన్ కౌంటర్ లో అసువులు బాసిన సుధాకర్ దంపతులు..!

ముగిసిన 25 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం.

ఇప్పటివరకు ఉద్యమంలో అసువులు బాసిన ఆరుగురు చల్లగరిగ వాసులే.

మృతదేహాల కోసం బయలుదేరిన బంధువులు.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ మురళి అలియాస్ శంకరన్న చత్తీస్ గడ్ రాష్ట్రంలోని కాంకేర జిల్లాలోని బేనగొండ కోరగుట్ట అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు తెలిసింది ఈ ఎన్కౌంటర్లో సుధాకర్ భార్య రజిత కూడా మృతి చెందినట్లు తెలిసింది, సుధాకర్ 25 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది, 15 ఏళ్ల వయసులోనే అప్పటి పీపుల్స్ వార్ పార్టీ పట్ల ఆకర్షితుడై అజ్ఞాతవైపు అడుగులు వేసిన సుధాకర్ అంచలంచలుగా ఎదిగి మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో నేలకొరిగాడు, ఇదే ఎన్కౌంటర్లు భార్య సుమన అలియాస్ రజిత కూడా మృతి చెందినట్లు సమాచారం,కోరగుట్ట అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది నక్సల్స్ మృతి చెందారని ముగ్గురు భద్రత సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే, ఈ ఎన్కౌంటర్లో సుధాకర్ అలియాస్ శంకరన్న దంపతులు మృతి చెందారని తెలియడంతో చల్లగరిగే గ్రామం కన్నీటి సంద్రంగా మారింది, ఎవరిని కదిలించిన కన్నీళ్లు పర్యంతమవుతున్నారు, సుధాకర్ అలియాస్ శంకర్ ఎన్కౌంటర్లో మృతి చెందాడన్న విషయాన్ని పోలీసులు మాత్రం ధ్రువికరించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తీవ్ర ఆందోళన గురయ్యారు, చివరికి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు తెలుసుకొని మృతదేహాల కోసం బంధువులు వెళ్లినట్లు సమాచారం.

సుధాకర్ ఉద్యమ ప్రస్థానం..

చిట్యాల మండలంలోని చల్లగారి గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ ఆలియాస్ మురళి అలియాస్ శంకర్ ఉద్యమ ప్రస్థానం ముగిసినట్లే అయింది, సుధాకర్ చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు, 1998లోనే ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే పీపుల్స్ వార్ పార్టీ పట్ల ఆకర్షితుడై ఉద్యమ ఓనమాలు నేర్చుకున్నాడు, అప్పటి ఉద్యమ సిద్ధాంతాలకు ఆకర్షితులై సానుభూతిపరుడుగా పని చేశాడు తన చిన్నమ్మ కుమారుడు కలికోట శంకర్ భూపాలపల్లి శివారు బొగ్గుల వాగు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందగా ఆ తరుణంలోనే మరింత చురుగ్గా పాల్గొన్న సుధాకర్ 1999లో 9వ తరగతి చదువుతూనే అజ్ఞాతంలోకి వెళ్ళాడు అప్పటినుండి సుధాకర్ స్వగ్రామానికి తిరిగి రాలేదు. 9వ తరగతిలో 15 ఏళ్ల వయసులో ప్రయాణమైన సుధాకర్ అజ్ఞాత జీవితం నేటికీ సుమారు 25 ఏళ్లు ఉద్యమంలో అనేక పోరాటాలు చేస్తూ ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తూ వివిధ హోదాల్లో పని చేశాడు. సుధాకర్ ముందుగా నిజాంబాద్ జిల్లా బాన్సువాడ ఏరియా జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేశాడు అనంతరం పరిస్థితిలో ప్రభావం కారణంగా చత్తీస్గడ్ రాష్ట్రంలోని ఉత్తర బస్తర్ ఏరియా జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు సమాచారం,

సుధాకర్ కుటుంబ నేపథ్యం..

చిట్యాల మండలంలో ని చల్లగరిగ గ్రామానికి చెందిన సిరిపెల్లి ఓదెలు రాజ పోచమ్మ దంపతులకు ఒక కుమారుడు ఇద్దరు కూతుళ్లు సంతానం కాగా సుధాకర్ తండ్రి ఓదెలు 15 ఏళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు చిన్న కూతురు దేవేంద్ర కుటుంబ సభ్యులతో పదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది, పెద్ద కూతురు విజయ భూపాలపల్లి మండలం గుడాడుపల్లిలో తన కుటుంబంతో నివాస ఉంటుంది. సుధాకర్ తల్లి రాజకపోచమ్మ కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగించేది వృద్ధాప్యం మీద పడడంతో కూలిపానికి వెళ్లలేక ఇంటి వద్ద ఉంటుంది ఈ క్రమంలోనే సుధాకర్ ఎన్కౌంటర్లో మృతి చెందాడని తెలిసి కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు.

సుధాకర్ మృతదేహం గుర్తింపు కోసం బయలుదేరిన బంధువులు….!

ఎన్కౌంటర్లో మృతి చెందిన సిరిపెల్లి సుధాకర్ ఆలియాస్ మురళి అలియాస్ శంకరన్న మృతి చెందాడు అన్న సమాచారంతో బంధువులు గుర్తించడానికి బయలుదేరినట్లు సమాచారం అలాగే సుధాకర్ దంపతుల మృతదేహాలను గుర్తించి చల్లగరిగకు శుక్రవారం రోజున తీసుకొని వస్తున్నట్లు స్థానికుల సమాచారం,

క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాగణపురం మండలం సీతారాంపురం గ్రామ పరిధిలో ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూపాలపల్లి ములుగు జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అనంతరం వారు మాట్లాడుతూ క్రీడా పోటీలలో పాల్గొనడం వల్ల స్నేహభావం పెరుగుతుందని క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ప్రతి ఒక్కరిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని అలాంటప్పుడే క్రీడల్లో రాణించగలుగుతారని ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్నారు క్రీడల్లో రాణించే వారిని ప్రోత్సహిస్తే మంచి క్రీడాకారులు గా ఎదిగి ఈ ప్రాంతానికి పేరు తీసుకొస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో పరకాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ మాజీ ఎంపీపీ రామేశ్వరరావు గణపురం పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమార్ కో ఆప్షన్ సభ్యుడు ఎండి చోటే మియా క్రీడాకారులు పాల్గొన్నారు.

పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించడంలో ఉపాధి హామీ సిబ్బంది విఫలం

ధర్మసమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కోగిల జితేందర్

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు మందకోడిగా సాగిన ఉపాధి పనులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ముగియడంతో చేసే పనులు లేక ఇంట్లో ఉంటే పూట గడిచే పరిస్థితులు లేకపోవడంతో కూలీలు ఉపాధి పనుల బాట పట్టారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ లెక్కచేయకుండా కూలీలు ఉపాధిహామీ పనులను రోజుకు వేల మంది కూలీలు వినియోగించుకుంటున్నారు.మండలంలో ఉపాధి పనికి వచ్చే కూలీల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించడంలో ఉపాధిహామీ సిబ్బంది విఫలమయ్యారని ప్రదేశాల్లో కూలికి రక్షణకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలి ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు కూలీలకు నీడ కోసం పట్టాలు, మంచినీటి సౌకర్యం, మెడికల్ కిట్టులు, అందుబాటులో ఉంచాలి. అయితే ఆ సౌకర్యాలు ఇప్పటివరకు అమలు అంతంత మాత్రమే జరుగుతున్నాయి. వేసవి తాపం నుంచి కూలీలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం త్వరితగతిన కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిచి, ప్రతి రెండు వారాలకు ఒకసారి పని జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించాలనీ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు చేశారు.

ప్రమాదపు అంచులో కరెంట్ లైన్

•గత సంవత్సర కాలంగా పరిష్కారం కానీ సమస్య.

•లైన్మెన్ వీరన్న కు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేదు.

•పలుమార్లు చెప్పిన పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు.

•ఊరికి సమీపంలో ఉండడం వలన భయాందోళనలో గ్రామ ప్రజలు.

•అటుగా చూడకుండా వెళ్లిన మూగజీవాలు, మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది.

•పట్టుకుంటే చేతికి అందే అంత కింద ఉన్న కరెంటు తీగలు

వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటే ప్రమాద ల నుంచి బయటపడవచ్చు అంటున్న గ్రామ రైతులు.

మరిపెడ నేటి దాత్రి.

మహబూబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపుడి గ్రామంలో గ్రామ శివారులో ఉన్న నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం వెనకాల ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుండి వెళ్లినటువంటి లైను లో మొదట రెండు స్తంభాలు వేయవలసిన దూరంలో ఒకటే స్తంభం వేయడం వలన కరెంటు తీగలు కొంత కాలానికి లూస్ అయ్యి కిందికి వేలాడడం జరిగింది అయితే ఈ సమస్యను పరిష్కరించాలి అని గత కొంతకాలంగా అంటే దాదాపుగా సంవత్సరం క్రింద విద్యుత్ శాఖ వారికి అక్కడ ఉన్నటువంటి రైతులు మా సమస్యను పరిష్కరించాలి అని ఒక లెటర్ రాయడం జరిగింది పలుమార్లు గ్రామానికి సంబంధించిన లైన్మెన్ ని ఈ సమస్యపై సంప్రదించడం జరిగింది అయినా కూడా విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ వారు గానీ గ్రామానికి సంబంధించినటువంటి లైన్మెన్ గానీ ఎవరు పట్టించుకోవడం లేదు అని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు వాపోతున్నారు గ్రామానికి దగ్గరగా ఉండడం వలన అటుగా వెళ్లే మనుషులు గాని మూగజీవాలు గాని విద్యుత్ తీగలు తగిలి మరణించే అవకాశం ఉంది అయినా సరే పలుమార్లు అధికారులకు చెప్పిన నిమ్మకు నీరు ఎత్తినట్టే ఉంటున్నారు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లూజ్ పోల్స్ వేయాలి అని పలుమార్లు విజ్ఞప్తి చేసిన సమస్యను దాటవేస్తున్నారు అని అక్కడ జరగకూడనిది ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత విద్యుత్ శాఖ వారే వహించవలసి ఉంటుంది అన్నారు ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేకపోతే త్వరలోనే విద్యుత్ శాఖ ఆఫీస్ ముందు ధర్నాకు దిగుతాం అన్నారు, ఈ కార్యక్రమంలో గుండగాని. లింగరాజు, గణేష్, గుండాగాని. రమేష్, భద్రు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు తెగిపోయిన రోడ్డుకు మరమ్మత్తులు.

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో బస్టాండ్ నుండి పెద్దమ్మ తల్లి దేవాలయం వరకు వెళ్లే రోడ్డు ఇటీవల భారీ వర్షాలకు కొట్టుకుపోవడం జరిగింది అటు ప్రక్కనున్న రైతులు పొలాలు కోయుటకు వడ్లు తరలించడానికి రోడ్డు లేదు అని ఒడేడు గ్రామ రైతులు తెలుపగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెంటనే ఆదేశాల మేరకు డిసిసి ఉపాధ్యక్షులు మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ వెంటనే జెసిబి ని పంపించి రోడ్డుకు మరమ్మత్తులు చేపించడం జరిగింది..ఈ కార్యక్రమంలో ఓడేడు గ్రామ మాజీ సర్పంచి సిరికొండ బక్కారావు, గ్రామ శాఖ అధ్యక్షులు దాసరి చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవునూరి సదానందం,బొల్లపల్లి పోశాలు,తోట సుధాకర్,నరాల మల్లన్న, తదితరులు పాల్గొన్నారు..

6 గ్యారెంటీ ల అమలుతో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై రెట్టింపైన నమ్మకం

పోరిక బలరాం నాయక్ గెలుపుతోనే భద్రాచలం అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్న నియోజకవర్గ ప్రజలు

భద్రాచలం నేటి ధాత్రి

మాజీ గ్రంథాల చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి

మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ మాజీ గ్రంథాల చైర్మన్, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు భోగల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక భద్రాచలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్నికల హామీగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం వల్ల,తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పై ఉంచిన నమ్మకం ఆదరణ ఇప్పుడు మరింతగా పెరిగిందని

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో తెలంగాణ ప్రజల ఆదరణతో విజయం సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ పయనం చేస్తుందని, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు,పోరిక బలరాం నాయక్ ని భద్రాచలం నియోజకవర్గం ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అఖండ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.

ఈ ఎన్నికల ప్రచారంలో పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు రాసమల్ల రాము,అన్నెం రామిరెడ్డి, షాబీర్ భాష, మహిళా కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గద్వాలలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ సరఫరా

వనపర్తి నేటిదాత్రి;
గద్వాల పట్టణంలో ఈ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసి బస్టాండులో ప్రయాణికులకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు ప్రతిరోజు వేసవికాలం అయిపోయేసరికి మజ్జిగ చల్లని మంచినీరు సరఫరా చేస్తున్నార ని ప్రయాణికులు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు . వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా గత సంవత్సరం మాదిరిగానే ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు చలివేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారికి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు వనపర్తి

బిఆర్ఎస్ పార్టీ కి నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి భారీ చేరికలు.

పార్లమెంట్ అభ్యర్థి గెలుపే
లక్ష్యంగా పనిచేయండి.

హసన్ పర్తి /నేటి ధాత్రి

వర్థన్నపేట నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో వర్థన్నపేటనియోజవర్గంలో బిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. హన్మకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హాసన్ పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి ,మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగేళ్లపల్లి తిరుపతి , ఆధ్వర్యంలో నాగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బండారి స్వర్ణలత మరియు మాజీ ఉపసర్పంచ్ బండారి సాంబయ్య, తోట రవి బండారి రాజయ్య బండారి భీమయ్య గడ్డం రాజారాం బండారి శ్రీకాంత్ తో సుమారు 50 మందిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వర్థన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు.ఈ సందర్బంగా వర్థన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు మాట్లాడుతూ
ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం, బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మొన్నటి ఎన్నికల వరకు ప్రజలను మోస పూరిత మాటలతో మభ్యపెడుతూ కాలం వెల్లదీశారని అన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌ నాయకులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాపాలన సాధ్యమని తెలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పాత కొత్త అనే విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పని చేసి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గారిని భారీ మెజారితో గెలిపించి వరంగల్ గడ్డ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి అని వారు కోరారు…
ఈ ఆహ్వాన కార్యక్రమం లో హాసన్ పర్తి మండల బీసీ సెల్ అధ్యక్షులు నక్క రవి ,గ్రామ అధ్యకులు గౌరు రాజీ రెడ్డి, కుమార్, అనిల్ ,బద్రి ,సాంబ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ పార్లమెంట్ డిఎస్పి అభ్యర్థిగా మేకల సుమన్

నడికూడ,నేటిధాత్రి:
వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలంలోని కౌకొండ గ్రామానికి చెందిన మేకల సుమన్ మహారాజ్ ఎంపికై నట్లు రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ఒక ప్రక టనలో తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడికి మేకల సుమన్ ధన్యవాదాలు తెలిపారు.వరంగల్ పార్లమెంటు ప్రజలంతా చెప్పు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.బహుజన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా ధర్మ సమాజ్ పార్టీ పనిచేస్తుందని మేకల సుమన్ వివరించారు.రాబోయే రోజుల్లో రాజ్యాధికారం మనదేనని నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే బహుజనులకు న్యాయం జరిగేలా పోరాడుతానని అన్నారు.

నియోజకవర్గవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసిన శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్పల్లి,ఏప్రిల్ 17 నేటి ధాత్రి ఇన్చార్జి

కూకట్పల్లి నియోజకవర్గంలో పలు అసోసి యేషన్ సభ్యులు,పలు దేవాలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్పల్లి, బాలాజీనగర్, మూసాపేట్,ఫతేనగ ర్,బాలానగర్,ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలు,శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముల వారి ఆశీస్సు లు అందరిపై ఉన్నాయని,ప్రతి పండుగ ను ఆనందగా జరుపుకుంటున్నా మని అన్నారు.బాల రామున్ని జనవరి 22న అయోధ్య మందిరంలో ప్రతిష్ఠించుకున్న విషయాన్ని గుర్తు చేశారు.ఈరోజు అయో ధ్య గుడిలో నేరుగా ఆ బాలరాముడి నుదుట మీదకు సూర్య కిరణాలతో సూర్య తిలకం అద్భుతంగా ఉందని
అన్నరు.అనంతరం అన్నప్రసాద కార్యక్ర మంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరిం చారు.ఆ తర్వాత మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్తో కలిసి పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నా రు.ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

కాన్కూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాన్కూర్ గ్రామంలో బత్తుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. గ్రామంలో గల ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవం వేడుక ఘనంగా నిర్వహించారు. అనంతరం హనుమాన్ దీక్ష స్వీకరించిన స్వాములకు మరియు సుమారు 1200 మంది భక్తులకు గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

తెలంగాణ ఉద్యమకారుడు ముక్కెర సాయిలు మృతి

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం తెలంగాణ రాష్ట్ర సమితిలో సీనియర్ ఉద్యమ నాయకులు తెలంగాణ జెండా పట్టిన నాటినుండి తెలంగాణ సాయిలు గా పేరు సంపాదించిన ముక్కెర సాయిలు గౌడ్ 85 సంవత్సరాలు అనారోగ్యంతో మృతి చెందారు వారి కుటుంబ సభ్యులు బుధవారం గణపురంలో అంత్యక్రియలు జరిపారు.

ధర్మ రావు పేట గ్రామంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మ రావు పేట గ్రామంలోని ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. లోక కళ్యాణార్థం జరిగే భగవత్ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారి తీర్థ, అన్న, ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వర దేవస్థాన కమిటీ భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు.స్వామివారి కల్యాణ మహోత్సవంలో రఘువంశం వరుడు రామయ్య తరపున ఆకుల సుభాష్ కుటుంబం సీతమ్మ తల్లి తరపున కన్న రాజయ్య కుటుంబం కొన్ని సంవత్సరాలుగా ఈ కళ్యాణం అర్చకులు లంక రాజేశ్వర్ శర్మ అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు.

error: Content is protected !!
Exit mobile version