ఈ నామినేషన్ ర్యాలీయే సాక్ష్యం: శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్పల్లి ఏప్రిల్ 18 నేటి ధాత్రి ఇన్చార్జి

గురువారం శామీర్ పేట్ కలెక్టరేట్ లో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్య ర్థి శ్రీ ఈటెల రాజేందర్ నునామినే షన్ సందర్భంగా కూకట్ పల్లి నియో జకవర్గం నుండి ర్యాలీగా బీజేపీ రా ష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.ఈ ర్యాలీ కూకట్ పల్లి నియోజకవర్గం నుండి శామీర్ పేట్ కలెక్టరేట్ వరకు కొనసాగింది.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ… శ్రీ ఈటెల రాజేందర్ అన్న భారీ మెజారిటీతో గెలవబోతు న్నారని దానికి సాక్ష్యం ఈరోజు జరి గిన నామినేషన్ౄ ర్యాలీనే అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివ రించాలని అన్నారు.పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఈటెల రాజేం దర్ అన్నతోనే ఉన్నారని చెప్పారు
కూకట్ పల్లి నియోజకవర్గం నుండి భారీ బైక్ కార్ ర్యాలీగా వెళ్లారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు,అభిమానులు పాల్గొన్నారు.

మావోయిస్ట్స్ లకు ఎవరు సహకరించవద్దు

గుత్తికొయా గుంపును సందర్శించిన జిల్లా ఎస్పి

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపూర్ గుత్తికోయ గుంపును నిన్న ఉదయం జిల్లా ఎస్పి సందర్శించారు గుత్తికొయా ప్రజలతో జిల్లా ఎస్పి మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు ములుగు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరి అందిపుచ్చుకోవాలని అందుకోసం ములుగు జిల్లా పోలీస్ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంట్టుందని తెలియచేసారు గుత్తి కోయ గ్రామ పెద్దలతో యువకులతో ఎస్పి మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులకు, సంఘవిద్రోహులకు ఎవరు ఆశ్రయం కల్పించవద్దని స్వార్ధప్రయోజనాల కోసం ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అమాయక ప్రజలను రెచ్చకొడుతూ ప్రాణాలను బలిగొంటున్నారని వారిని విశ్వాసించారాదని మారుతున్న సమాజాన్ని బట్టి మారాలని ఎస్పి తెలియచేసారు అనంతరం ఎస్పి ఏఎస్పి గుత్తికొయా పిల్లలకు బిస్కెట్స్ అందచేశారు. గుత్తికొయా గుడాలలో గల సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటానని ఎల్లవేళలా పోలీసులకు సహకరించాలని తెలియచేసారు ఈ కార్యక్రమంలో ఎఎస్పి ఏటూరునాగారం డిఎస్పి ములుగు రవీందర్ సి ఐ ఏటూరునాగారం రాజు కన్నాయిగూడెం ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు

బాలిక జన్మోత్సవ వేడుక

నడికూడ,నేటి ధాత్రి :

మండలంలోని వరికోల్ గ్రామంలో భేటి బచావో, బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా గురువారం ఐసిడిఎస్ సూపర్వైజర్స్ రోజారాణి,శ్రీదేవి ఆధ్వర్యంలో బాలిక జన్మోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామంలోని చెక్క అనిల్ – అఖిల దంపతుల కుమార్తెకు ప్రత్యేకంగా అలంకరించిన ఉయ్యాలలో బారసాల కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా తల్లిదండ్రులకు బిడ్డకు కొత్తబట్టలు బహుకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెన్నెల మహిళ సాధికారత అధికారి ఎం. మానస అంగన్వాడి టీచర్లు పోశాల రజిత, పూలరాణి, గండ్ర రజిత, సుమలత సుజాత,సుగుణ,భాగ్యలక్ష్మి, శ్యామలత, రాజేశ్వరి, హేమలత, సూర్య కళ, ఆశ కార్యకర్తలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ గెలుపు ప్రగతికి మలుపు : మాజీ ఎమ్మెల్యే

మల్కాజిగిరి :

నేటి ధాత్రి ప్రతినిధి ,మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గములో కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రగతికి మలుపు అని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఆనంద్ బాగ్ లో పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సి మహేందర్ రెడ్డి హాజరు కావడం జరిగింది అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి సునీతా మహేందర్ రెడ్డి ని గెలిపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో హరివ…

యూత్ కాంగ్రేస్ నియోజకవర్గ స్థాయి సమావేశం

పరకాల నేటిధాత్రి
పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 22వ తేదీన జరగబోయే నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సన్నాహక సమావేశం గురించి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల శాసన సభ్యులు బూత్ కమిటీల నిర్మాణం మరియు మండల కమిటీల నిర్మాణం బలోపేతం చేయడానికి చర్చించడం జరిగింది.22వ తేదీన మహదేవ్ కన్వెన్షన్ హాల్ పరకాలలో జరిగే నియోజకవర్గ స్థాయి యూత్ కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది.అలాగే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డా”కడియం కావ్యని భారీ మెాజరిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మార్క కిరణ్. అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రవణ్.పరకాల మండల యూత్ కాంగ్రేస్ అధ్యక్షులు దొమ్మాటీ కృష్ణకాంత్.పరకాల పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మచ్చ సుమన్.ఆత్మకూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఓరుగంటి మహిపా ల్ రెడ్డి.గీసుగొండ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆకుల రుద్ర ప్రసాద్.నడికూడ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అప్పం కుమార్.దామెర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్ల సుధాకర్.డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దుపాకి సంతోష్.సంపత్.జిల్లా నాయకులు అల్లం శ్రీరామ్ కుమార్.పరకాల యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి రాంప్రసాద్,శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వి జి ట్రస్ట్ నుండి ఇద్దరు విద్యార్థు లకు 40 వేలరూపాయలు స్కూల్ యాజమాన్యానికి పంపిన దొడ్ల

కూకట్పల్లి ఏప్రిల్ 18 నేటి ధాత్రి ఇన్చార్జి
వేల రూపాయలను అందజేసిన 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంక టేష్ గౌడ్ నేత దొడ్ల రామకృష్ణగౌడ్ చేతులమీదుగా ఎల్లమ్మబండ మోం టెసరీ స్కూల్ లో రెండోవ తరగతి 6వ తరగతి చదువు తున్న పీజేఆర్ నగర్ కు చెందిన సీనియర్ నాయకు డు కొత్తపల్లి యాదగిరి ఇద్దరు పిల్లల కు స్కూల్ ఫీజు నిమిత్తం డి వి జి ట్రస్ట్ ద్వారా 40,000/- రూపాయల చెక్కును కాంగ్రెస్ నాయకులతో స్కూల్ యాజమా న్యానికి పంపించ డం జరిగింది.కార్యక్ర మంలో గుడ్ల శ్రీనివాస్,పోశెట్టిగౌడ్,యా దగిరి సంగమేష్,అగ్రవాసు,నగేష్,సు ధాకర్ రెడ్డి,రాజు,తదితరులు పాల్గొన్నారు.

నవాబ్ పేట్ మండల బిఆర్ఎస్ పార్టీకి షాక్..

కాంగ్రెస్ పార్టీలో చేరిన యన్మన్ గండ్ల మాజీ సర్పంచ్ భాస్కర్,

మాజీ పి ఎ సి ఎస్ డైరెక్టర్ మైసయ్య..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి వంశి చంధ్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాజీ సర్పంచ్ భాస్కర్ పిఎసిఎస్ డైరెక్టర్ మైసయ్య అన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు పురస్కరించుకొని గురువారం రోజు నవాబు పేట్ మండలంలోని యన్మన్ గండ్ల గ్రామ బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ భాస్కర్,మాజీ పి ఎ సి ఎస్ డైరెక్టర్ మైసయ్య, మాజీ వార్డు సభ్యులు వెంకటేష్ తోపాటు 30 మంది కార్యకర్తలు నేడు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ కండువా వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జహీర్ అక్టార్, నవాబుపేట మండల అధ్యక్షులు నీరటి రామచంద్రయ్య , నిల్యా నాయక్, మాజీ ఎంపిటిసి చెలిమే శేఖర్, జి సత్యనారాయణ గౌడ్, బ్యాగరి వెంకటయ్య, కొన్నింటి శ్రీనివాసులు,రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు

రాజక్క కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వఉద్యోగం ఇప్పించాలి

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో ఎబిఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశములో పాల్గొన్న ఎబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పత్తిపాక గ్రామానికి చెందిన కావటి రాజక్క హన్మకొండ లో చేపలు అమ్మి వస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై రోజులు గడుస్తున్న ఇప్పటికి ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పందించక పోవడం బాధకారం అన్నారు.బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగి రెండు కాళ్ళు కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజక్కను ప్రభుత్వం వెంటనే ఆడుకోవాలనిఅన్నారు.ప్రభుత్వం వెంటనే రాజక్క కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించి ఆడుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.లేనియెడల ఎబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొంగర రాజశేఖర్,ప్రమోద్,తరుణ్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

వేసవి కరాటే శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి.

కింగ్ షోటోకాన్ 26వ వేసవి శిక్షణ శిబిరాల బ్రోచర్లను ఆవిష్కరించిన..

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

వేసవి కరాటే శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కింగ్ షోటోకాన్ కరాటేడూ ఇండియా ఆధ్వర్యంలో వచ్చేనెల 2 నుంచి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న 26వ వేసవి ఉచిత కరాటే శిక్షణ శిబిరాల బ్రోచర్లను గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల నుంచి కింగ్ షోటోకాన్ జహంగీర్ పాషా ఖాద్రీ ఆధ్వర్యంలో వేసవిలో ఉచిత కరాటే శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నారు. పట్టణంలోని విద్యార్థులు, యువకులు కరాటే శిబిరంలో పాల్గొని శిక్షణ పొందాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సెల్ఫ్ డిఫెన్స్, ఫిట్ నెస్ పై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కింగ్ షోటో కాన్ ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రీ మాట్లాడుతూ ఈ ఏడాది 26వ వేసవి ఉచిత కరాటే శిక్షణా శిబిరాలను జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ రోడ్డు స్కూల్ ఆవరణ, షాసాబ్ గుట్టలోని అల్ నూర్ స్కూల్లో వచ్చేనెల 2 తేదీ నుంచి జూన్ 2 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు శిబిరాలు ఉంటుందని, శిబిరంలో కరాటే, కిక్ బాక్సింగ్, జూడో, బాక్సింగ్, యోగా, సెల్ఫ్ డిఫెన్స్, ఫిజికల్ ఫిట్ నెస్ పై శిక్షణ అంజేస్తామని తెలిపారు. శిక్షణ అనంతరం బెల్టు గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. మిగతా వివరాల కోసం 9849301171 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ సంఘం ప్రతినిధి చెన్న వీరయ్య, నాయకులు సీజే బెనహర్, సాదుల్లా జునేది, శాంతన్న యాదవ్, ప్రవీణ్ కుమార్, సీనియర్ కరాటే విద్యార్థి ఆర్ష్ జమీల్ తదితరులు పాల్గొన్నారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కారుకే జై కొట్టాలి

ఎన్నికల్లో ఏకపక్ష తీర్పు ఇవ్వండి

శాయంపేట నేటి ధాత్రి;

వరంగల్ పార్లమెంట్ బి ఆర్ ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పరకాల మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ మారపెల్లి నందం అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు గోస పడుతున్నారని అన్నారు. నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్న పంటలు చూసి దుఃఖిస్తున్న రైతన్నలు బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిందని గుర్తు చేశారు. ఎంపీగా సుధీర్ కుమార్ గెలిస్తే పార్లమెంటులో కొట్లాడి ఉమ్మడి జిల్లాకు నిధులు తీసుకొస్తారని అన్నారు. రైతులను ఆదుకుంటారని తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు తోడుదొంగలని అన్నారు. వారి స్వలాభం కోసం పార్టీలు మారి ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.

నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన పాలమూరు బీజేపీ ఎంపీ.అభ్యర్థి డీకే అరుణ..

మహబూబ్నగర్ జిల్లా ::నేటి ధాత్రి

భారతీయ జనతా పార్టీ పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ పార్టీ శ్రేణులు అభిమానులతో కలిసి ఊరేగింపుగా వెళ్లి భారీ జన సందోహం తో పాలమూరు జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలతో పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు కలెక్టర్ కు సమర్పించారు. కళాకారులు ఆటపాటలతో అప్పుల మోతల మధ్య బిజెపి నినాదాలతో పాలమూరు మారుమోగింది. డీకే అరుణకు దారి పొడవునా పట్టణ ప్రజలు శుభాభివందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి భారీ ఎత్తున నాయకులు అభిమానులు తరలివచ్చారు

నేటి యువతికి ఆదర్శం సాయికిరణ్ – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ ఇంటికి వెళ్లి శాలువాతో సన్మానించి అభినందించిన చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందాల సాయికిరణ్ జాతీయస్థాయిలో ఇరవై ఏడవ ర్యాంకు సాధించడం హర్షనీయమని, సాయికిరణ్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని యువత కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రతిభకు పేదరికం అడ్డు కాదని, కష్టపడి చదివితే ఎంతటి ఉన్నత స్థాయికైనా ఎదగవచ్చని సాయికిరణ్ నిరూపించాడన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, ఎంపీపీ జవ్వాజి హరీష్, నాయకులు వీర్ల నర్సింగరావు, కోల రమేష్, బండపల్లి యాదగిరి, కాడే శంకర్, సుదీర్, పంజాల శ్రీనివాస్ గౌడ్, కృష్ణ, మారుతి, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ గూటికి చేరిన బీఆర్ఎస్ నాయకులు

జైపూర్, నేటిధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరు గుడ్ బాయ్ చెప్తున్నారు, ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే ప్రస్తుతం తాజాగా పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు,నర్వ గ్రామానికి చెందిన యువ నాయకులు పవన్ కుమార్ తో పాటు దుగుట జితేందర్,జాడి శ్రీనివాస్,దుగుట రాజకుమార్, జాడి రాజశేఖర్,బండారి శేంకర్,గోదారి గణేష్,సల్లూరి వెంకటేష్,గోదారి దుర్గయ్య లు పలువురుతో కలిసి స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరినట్లు పవన్ కుమార్ తెలిపారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎలక్షన్ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం తమ వంతు సహాయంగా కృషి చేస్తామని తెలిపారు, ఆ రోజులలో కాక వెంకటస్వామి చేసిన సేవలను ఎవరు మర్చిపోలేదని ప్రస్తుతం రాజకీయాల్లో వివేక్ వినోద్ ఒక రామ రాజ్యంల పరిపాలిస్తున్నారని వాళ్లు చేసిన సేవలను బట్టి ప్రజలు వంశీని భారీ మెజారిటీతో గెలిపించుకుంటారని అన్నారు.

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పలకలు పంపిణీ

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామమైన గుడ్డెలుగులపల్లిలో వర్క్ సైట్ పాఠశాలలోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పలకలు, విద్యార్థులకు అవసరమైన సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో సెక్టోరీలు అధికారి అశోక్ రెడ్డి, మండల విద్యాధికారి అంబటి వేణుకుమార్, సిఅర్పి అశోక్ రెడ్డి, వర్క్ సైట్ స్కూల్ ఇంచార్జి మరియు ఇటుక బట్టీల యజమాని చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదేమి రోడ్డు…. ప్రయాణికులకు నరకం

ప్రయాణం…. ప్రమాదం

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం మాందారి పేట కూడలి నుండి భూపాలపల్లికి పోయే తారు రోడ్డు గుట్టల వద్ద టైర్ యొక్క గుంతలు పడి అతి ప్రమాదకరంగా మారింది. పరకాల రహదారి మార్గంలోని మాందారిపేట-పరకాల రోడ్డు పైకి వస్తే వాహనదారులు భయభ్రాంతులకు గురై ప్రయాణం సాగిస్తున్నారు ఈ రహదారిపై వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది ముఖ్యంగా భారీ వాహనాల వల్ల రోడ్డు టైర్ గుంతలు పడి ప్రయాణం సాగడం నరక యాతన పడుతున్నారు వాహనాలు రోడ్డుపై ప్రయాణించడం ప్రమాదకరంగా మారింది. చిన్న వాహనాలు ప్రమాదాలు జరిగి ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మార్గాన్ని సకాలంలో పూర్తి చేయాలని కోరుతున్నారు

సాయికిరణ్ ను ఆదర్శంగా తీసుకోవాలి – ఉప్పుల శ్రీనివాస్

రామడుగు, నేటిధాత్రి:

విద్యార్థులు సాయికిరణ్ ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని సరస్వతి హైస్కూల్ కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ అన్నారు. యూపీఎస్సీ ఫలితాల్లో గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ జాతీయస్థాయిలో ఇరవై ఏడవ ర్యాంకు సాధించినందుకు పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సాయికిరణ్ అంచెలంచెలుగా ఎదిగి ఆన్ లైన్ కోచింగ్ తో జాతీయస్థాయిలో ర్యాంకు సాధించడం గర్వకారణమన్నారు. తన ప్రతిభకు పేదరికం అడ్డుకాదని, కష్టపడి చదివితే ఎంతటి ఉన్నత స్థాయికైనా ఎదగవచ్చని నిరూపించారన్నారు. ఈకార్యక్రమంలో స్కూల్ కోకరస్పాండెంట్ ఉప్పుల సత్యం, తేజ స్కూల్ కరస్పాండెంట్ దేవేందర్రావు, సామాజిక కార్యకర్త కల్లెపల్లి పర్శరాం, తదితరులు పాల్గొన్నారు.

జైపూర్ మండలంలో రోజురోజుకీ పెరుగుతున్న కాంగ్రెస్ పార్టీ కండువాలు

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో రోజురోజుకీ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతూనే వస్తున్నాయి. తాజాగా గురువారం రోజున జైపూర్ మండలంలోని రామారావు పేట గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీని వీడి మాజీ ఉపసర్పంచ్ తంగళ్ళపల్లి వెంకటేశం, వార్డు మెంబర్ గోలి వెంకటేష్, లోడింగ్ అండ్ అన్ లోడింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు బొద్దున రాజేశం, పద్మశాలి సంఘం నాయకుడు మెరుగు సమ్మయ్య మరియు ఇంకొంతమంది నాయకులు, కార్యకర్తలు చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అందరికీ కండువాలు కప్పి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సాధారంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి మాట్లాడుతూ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన అన్నదమ్ములు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చెన్నూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి అన్నివేళల ముందు ఉంటానని, నాయకుల, కార్యకర్తల అండదండలు, ప్రజల ఆశీస్సులు ఎప్పుడు తోడుండాలని, అందరం కలిసికట్టుగా కృషిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకీ ఘన విజయాన్ని అందించాలని తెలియజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకులు మాట్లాడుతూ రాబోవు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మేజారిటీతో గెలిపించేందుకు తమ సాయశక్తుల కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నామాల సత్యవతి తిరుపతి, మాజీ ఎంపీటీసీ ముదం రమేష్,మాజీ ఉప సర్పంచ్ గుండా శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజ్జుద్దీన్, కాంగ్రెస్ నాయకుడు నామాల నాగరాజు,కార్యకర్తలు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ నుండి బిజెపిలోకి భారీగా చేరికలు

వరంగల్ పార్లమెంట్ లో కాంగ్రెస్ కి ప్రజాబలం లేదు

ప్రజలంతా బిజెపి వైపు మోడీ పాలన వైపు మొగ్గు చూపుతున్నారు

హసన్ పర్తి / నేటి ధాత్రి

గ్రేటర్ వరంగల్ పరిధిలో గల హసన్ పర్తి లోని కె ఎల్ ఎన్ కన్వెన్షన్ హాల్ లో బిఆర్ఎస్ మాజీ ఎంపిటిసి పిట్టల కుమారస్వామి ఎర్రగట్టు గుట్ట మాజీ చైర్మన్ పెద్దమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని విడి బిజెపి లోకి హసన్ పర్తి మండలంలోని పలు గ్రామాల నుండి సుమారు 200 మందికి పైగా చేరారు. వీరికి బిజెపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్. ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ బీజేపీలో చేరేవారు త్యాగం చేస్తున్నట్టు లెక్క
త్యాగధనులకు స్వార్థ పరులకు మధ్య పోటీ ఇది.
కాంగ్రెస్ కి ఓటు వేస్తే దాని విలవ జీరో పేదవాళ్ల బ్రతుకులు మరింత బాగుపడాలంటే సుస్థిర పాలన కొనసాగాలంటే.. అందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి. నిండు మనసుతో నన్ను మోదీ నీ ఆశీర్వదించండి. పార్టీలో చేరిన వారిలో 66 వ డివిజన్ నాయకులు శిలం రాజేందర్, పిట్టల ముక్తిశ్వర్, గోనెల కుమారస్వామి, పెద్దమ్మ కోంరేల్లి, రమేష్ ముని పల్లి గ్రామం నుంచి అలుగు శ్రీధర్, ఉచిత రాజయ్య, ఉచిత రవి, బిక్షపతి, నాగారం గ్రామం నుంచి దేవునూరి హరీష్, వల్లాల వినయ్, కోలిపాక రేవంత్, వంశీ, వంగ పహాడ్ నుంచి గోనెల శ్రీకాంత్, శ్రీనివాస్, రవి, సుమన్ ముచ్చర్ల నుండి శివ కుమార్, ప్రసాద్  సుదాన్ పల్లి నుండి ఆళ్ల రవీందర్, శంకర్ హసన్ పర్తి నుండి శివ కుమార్, రాజ్ కుమార్ తదితరులకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన అరూరి రమేష్. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా బిజెపి అధ్యక్షురాలు రావు పద్మ, బిజెపి SC మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కొండెటి శ్రీధర్, పార్లమెంటరీ ప్రబారి మురళిధర్, కార్పొరేటర్లు అభినవ్ భాస్కర్, గురుమూర్తి, నాయకులు కుమారస్వామి, కేశవరేడ్డి, జెడ్పీటీసీ సునీత, పిఎసిఎస్ చైర్మన్ రమేష్ గౌడ్, తిరుపతి, రాజేశ్వర్ రావు, రాం చంద్ర రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో గంజాయి కల్తీకల్లు నిర్మూలిద్దాం పోస్టర్ ఆవిష్కరణ.

ఎస్సై జి శ్రవణ్ కుమార్.

చిట్యాల, నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండwల ఎస్ఐ జి శ్రావణ్ కుమార్ మరియు తన సిబ్బంది చిట్యాల మండలంలోని అన్ని గ్రామాలకి వెళ్లి గ్రామ సెంటర్లలో బస్టాండ్లో గంజాయి మరియు కల్తీకల్లు నిర్మూలన గురించి వాల్ పోస్టర్లు అతికించి మండల ప్రజలని ఎవరైనా గంజాయి విక్రయించిన కల్తీకల్లు( అల్ప్రోజలం మరియు డైజొఫామ్) కలిపిన కల్లును విక్రయించిన డయల్ 100, ఎస్సై చిట్యాల 8712658124 లేదా తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్ బ్యూరో 8712671111 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని చెబుతూ, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, గంజాయి వాడకం పట్టణాల నుండి పల్లెలకు చాప కింద నీరులా కూడా పాకిందని యువత తల్లిదండ్రులు ఇప్పుడు కూడా వారి పిల్లల్ని గమనిస్తూ ఉండాలని గంజాయి తాగే వారిలో మత్తు అనేది నరాల వ్యవస్థ పై పని చేస్తుందని ఇంత ముందు ఎప్పుడు లేని విధంగా విపరీతమైన ఆకలి విపరీతమైన నవ్వు వస్తుంటాయని ఇటువంటి మార్పులు ఏవైనా చోటు చేసుకుంటే వెంటనే సంప్రదించాలని వారికి అవసరానికి మించి డబ్బులు ఇవ్వకూడదని తెలుపుతూ ప్రస్తుతం గంజాయిని అనేక రకాలుగా చాక్లెట్ల రూపంలో మిల్క్ షేక్ ల రూపంలో అమ్ముతున్నారు కనుక తల్లితండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు, గ్రామాలలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్న సమాచారం ఉన్న సేవిస్తున్న సమాచారం ఉన్న వెంటనే తెలియపరచాలని మన యువతను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు
ఇట్టి కార్యక్రమంలో కానిస్టేబుల్స్ సిద్ధార్థ లాల్ సింగ్ నవీన్ లింగన్న పాల్గొన్నారు

మాకు న్యాయం చేయండి.

కొడుకులపై వాల్ పోస్టర్లు వేసిన వృద్ధ దంపతులు .

చిట్యాల, నేటి ధాత్రి :

కొడుకులు మానసికంగా ఇబ్బందుల గురి చేస్తున్నారని మేము భరించలేక పోతున్నామంటూ పిల్లలు ఉన్నా అనాథలుగా బ్రతుకుతున్నామంటూ ఓ వృద్ధ దంపతుల ఆ గ్రామంలో వాల్ పోస్టర్ లు వేసి మాకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకుంటున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే…భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రా పురం గ్రామానికి చెందిన క్యాతం భూమయ్య వరలక్ష్మి అనే వృద్ధ దంపతులకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. తను సంపాదించిన ఆస్తి వ్యవసాయ భూమిని గత కొన్ని ఏళ్ళ క్రితం పెద్ద కొడుకుకు 20 గుంటలు ఎక్కువగా మిగతా ఇద్దరు కొడుకులకు సమాన వాటా లుగా కూతురుకు ఒక ఎకరం భూమిని పంచి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పెద్ద కొడుకు క్యాతం రమేష్ చిన్న కొడుకు క్యాతం సతీష్ లు ఇద్దరు మమ్మల్ని హింసిస్తూ వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ ఆ వృద్ధ దంపతులు ఆ గ్రామంలో ఫోటోలతో కూడిన వాల్ పోస్టర్ లు వేసి ఎక్కడికి పోయినా కూడా మాకు న్యాయం జరుగుత లేదంటూ మందు డబ్బా పట్టుకుని చావే మాకు దిక్కని ఇప్పటికైనా అధికారులు మాకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.ఈ సందర్భంగా వృద్ధ దంపతులు మాట్లాడుతూ…నా పెద్దకొడుకు క్యాతం రమేష్ చిన్న కొడుకు క్యాతం సతీష్ ఇద్దరు కలిసి మమ్మల్ని వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మేము బరించ లేక పోతున్నామని తెలిపారు. వృద్ధులైన మాకు గత కొన్ని సంవత్సరాలుగా పంటలు పండకపోవడం తో పాటు పాత ఇల్లు కూలి పోయే దశలో ఉండగా కొత్త ఇల్లు నిర్మించుకున్నామని దీంతో కొన్ని అప్పులు కాగా పంటలు పండక పోతాయా అన్న ఆశతో పంట పండిస్తున్న ప్పటికీ పంటలు దిగుబడి రాక పోవడం తో అప్పులు పెరిగి పోయాయి. ఈ క్రమంలో నేను నా కొడుకుల ను పెద్ద మనుషులు దగ్గరికి పలు మార్లు పిలిపించి నేను ఉంచుకున్న భూమి నా పట్టా భూమిలోని 20 గుంటలు అమ్మి అప్పు కడుదామంటే నా పెద్ద కొడుకు రమేష్ చిన్న కొడుకు సతీష్ లు నన్ను నానా భుతులు తిడుతూ భూమిని అమ్మ నీయకుండా అడ్డు పడుతున్నారు. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో నేను ఎక్కడికి వెల్లి నా బాధను చెప్పుకున్నా కూడా నాకు న్యాయం జరుగుతాలేదు. వృద్దులమైన మాకు పోలీస్ స్టేషన్కు వెళ్లి మా భాధ చెప్పుకున్నా కూడా మాకు న్యాయం జరుగక పొగా నా ఇద్దరు కొడుకులు నా మీదనే ఉల్టా కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మందు డబ్బా పట్టుకుని మాకు న్యాయం కావాలంటూ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ స్పందిచాలంటూ తమ గోడును వెళ్ళ బోసుకున్నారు.

error: Content is protected !!
Exit mobile version