ఆచార్య కూరపాటి వెంకటనారాయణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్*
నడి కూడ,నేటి ధాత్రి:
గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం మీద అధికారం చలాయించిన భారతీయ జనతా పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్
90 శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా అణిచివేయడం జరిగిందని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ ప్రముఖ ఆర్థిక సామాజికవేత్త ఆవేదన వ్యక్తం చేశారు.
ఈరోజు నడికూడ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, సామాజిక న్యాయం సాధించుకుందాం కేంద్రంలో మార్పు కోసం బీజేపి, బీఆర్ఎస్ లను ఓడిద్దాం అనే కరపత్రం ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడుతూ తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు తెలంగాణను ఏలుకొని, దోచుకుని రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులపాలు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి ఓడించారు. కుటుంబ ఆధిపత్య, నియంతృత్వ దోపిడి పాలన కొనసాగించారని, అలాంటి ప్రజా వ్యతిరేక పాలకులను ఓడించాలని పరకాల నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫోన్ టాపింగు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల కబ్జాలు చేసి ప్రభుత్వ ధనాన్ని దోచుకుని అనేక దందాలకు పాల్పడ్డ కుటుంబం నాయకత్వం వహిస్తున్న ఆ పార్టీని మరోసారి ఓడించాలని విజ్ఞప్తి చేశారు.
గత పది సంవత్సరాల నుండి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అమలుపరచిన ఆర్థిక, సామాజిక విధానాలు తిరోగమన దిశలో ఉన్నాయని ప్రొఫెసర్ కూరపాటి ఎద్దేవ చేశారు. ప్రజలకు జిఎస్టి పేరుతో డీజిల్, పెట్రోల్, గ్యాస్ మొదలగు నిత్యావసర వస్తువులపై విపరీతమైన పన్నులు పెంచి పేదల నుండి ప్రతి నెల 2 లక్షల పదివేల కోట్ల రూపాయలు వసూలు చేసి కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టుతుందని, దేశంలో 8 లక్షల పేద రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ వ్యవసాయాన్ని సంక్షోభం నుండి కాపాడలేకపోయారని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం రైతులకు గిట్టుబాటు ధరలను ఇవ్వలేకపోయారని ప్రొఫెసర్ వెంకట్ నారాయణ ఆందోళన చెందారు.
దేశంలో 40శాతం సంపద 10 శాతం కూడా లేని ధనవంతమైన జనాభాకు మాత్రమే చెందిందని దేశ ఆదాయంలో ఒక్క శాతం కూడా లేని ధనవంతులైన కార్పొరేట్లకు దేశ సంవత్సరాదాయంలో 25శాతం చెబుతున్నదని తీవ్రమైన ఆర్థిక అసమానుతులకు దారి తీసిన మోడీ పాలనను వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు.కేంద్రంలో అధికారం కొరకు మాత్రం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు (హిందువులు) కావాలి కానీ మోడీ ప్రభుత్వానికి మాత్రం గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర కార్పొరేట్ సంస్థలే ఆత్మీయులని కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు పేద ప్రజలపై పనుల భారం మోపి వందలాది బిలినియర్లను తయారుచేసిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చినట్టుగానే కేంద్రంలో కూడా ఈసారి ప్రభుత్వాన్ని మార్చడం ద్వారా మాత్రమే పేద ప్రజలకు ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని వెంకట్ నారాయణ హితవు పలికారు.కేంద్రంలో పది సంవత్సరాల కాలం తిరోగమన ఆర్థిక విధానాలను అనుభవించిన ప్రజలు మార్పు దిశలో ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేసుకోవడానికి ఒక పటిష్టమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఎంతైనా ఉందని అదేవిధంగా కేంద్రంలో కూడా మార్పు దిశలో ప్రజలు ఓట్లు వేయాలని అది సాధ్యమైనప్పుడే రాష్ట్రం కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చినట్టుగానే కేంద్రంలో కూడా ఈసారి ప్రభుత్వాన్ని మార్చడం ద్వారా మాత్రమే పేద ప్రజలకు ఆర్థిక సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని వెంకట్ నారాయణ హితవు పలికారు.
కేంద్రంలో పది సంవత్సరాల కాలం తిరోగమన ఆర్థిక విధానాలను అనుభవించిన ప్రజలు మార్పు దిశలో ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేసుకోవడానికి ఒక పటిష్టమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఎంతైనా ఉందని అదేవిధంగా కేంద్రంలో కూడా మార్పు దిశలో ప్రజలు ఓట్లు వేయాలని అది సాధ్యమైనప్పుడే రాష్ట్రం కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో పూలే ఆశయ సాధన సమితి (పాస్) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ మాట్లాడుతూ 2021 లో జరగవలసిన జనాభా లెక్కలు ఇప్పటివరకు కూడా ప్రారంభించలేదు. జనాభా లెక్కల ద్వారా వివిధ సామాజిక వర్గాల వివిధ ప్రాంతాల వారిగా అభివృద్ధి తీరుతెన్నులు తెలుస్తాయని, అందుకు తగిన విధంగా ప్రణాళిక వేయలేదు. అయితే పేద ప్రజల గురించి గానీ వెనుకబడిన ప్రాంతాల గురించి గానీ మోడీ ప్రభుత్వానికి ఎలాంటి శ్రద్ధ లేదని గత పది సంవత్సరాల పరిపాలన తెలియ జేస్తున్నాయని చెప్పారు.కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఐదు గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు బీసీలకు జనగణ చేస్తామని తగిన విధంగా బీసీల రిజర్వేషన్ కోటా పెంచుతామని హామీ ఇవ్వడం జరుగుతున్నది. బీసీల బిడ్డనని చెప్పుకుంటున్న మోడీ మాత్రం జనాభా లెక్కలు చేయడం లేదు ముఖ్యంగా జనగణన చేయడానికి సిద్ధపడటం లేదు. ఓట్లు వేయడానికి మాత్రమే హిందువులు కావాలి గాని అభివృద్ధికి మాత్రం గుజరాతీలు మోడీ అంబానీలు ధనవంతులు మాత్రమే శిరోధార్యం అని మోడీ గత పాలన తెలియజేస్తున్నదని డాక్టర్ మల్లేశ్వర్ అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో పాస్, నాయకులు డాక్టర్ చందా మల్లయ్య , డాక్టర్ నల్లాని శ్రీనివాస్, డాక్టర్ సుధాకర్, ఓబీసీ నాయకులు బొమ్మ చంద్రమౌళి, నారగాని కుమారస్వామి, వాంకే రాజయ్య, ఈర్ల చిన్ని, తాళ్ల నవీన్, లింగంపల్లి బిక్షపతి, నారగాని ఐలయ్య, రావుల సురేష్, అట్టెం బాబు, పుట్ట శ్యామ్ రాజ్ , తదితరులు పాల్గొన్నారు.