జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం కుందారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం రోజున ప్రజలతో కలిసి ప్రచార కార్యక్రమం చేపట్టారు.చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి ఆదేశాల మేరకు పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ గెలుపు కోసం కుందారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపాధి హామీ కూలీల చెంతకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామంలోని గడపగడపకు ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మనపల్లి నరసింగరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రజల ప్రభుత్వం వచ్చి ,ప్రజా పాలన జరుగుతున్నదని పేర్కొన్నారు.పెద్దపెల్లి పార్లమెంటు పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించి ఆశీర్వదించినట్టుగా పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని చెన్నూర్ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాం అన్నారు .రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో పి ఏ సి ఏ ఎస్ వైస్ చైర్మన్ సంతోషం చంద్రశేఖర్, మూదాం రమేష్, పిడుగు వెంకటి, వనపర్తి దుర్గయ్య, ఎనిగళ్ళ రాకేష్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోపాటు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.