Padmashali Association District Committee Elections
పద్మశాలి సంఘం నూతన జిల్లా కమిటీ ఎన్నిక
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పద్మశాలి కులస్తుల జిల్లా స్థాయిసమావేశాన్ని నిర్వహించడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పద్మశాలీ అధ్యక్షులు గోనే బాస్కర్ తెలిపారు.
ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు కామార్థపు మురళి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచెర్ల రామ్ చందర్ రావు ముఖ్య అతిథులుగా హాజరై సంఘ భవిష్యత్ కార్యాచరణపై మార్గదర్శనం చేయనున్నట్లు తెలిపారు. వీరితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పద్మశాలి సంఘ నాయకులు కూడా పాల్గొననున్నారు.
సమావేశం అనంతరం జిల్లాలో నూతనంగా ఎన్నికైన పద్మశాలి సర్పంచ్లు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు, పద్మశాలి సంఘం నూతన జిల్లా కమిటీ ఎన్నికలు కూడా జరగనున్నట్లు వెల్లడించారు.
కావున జిల్లాలోని అన్ని మండలాల నుంచి పద్మశాలి మండల అధ్యక్షులు, కార్యదర్శులు, కుల పెద్దలు, పద్మశాలి కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అలాగే మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నూతనంగా ఎన్నికైన పద్మశాలి ప్రజాప్రతినిధులు తమ పూర్తి వివరాలను జిల్లా అధ్యక్షులు గోనే బాస్కర్ (ఫోన్: 98485 26216) కు తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బిమనాదుని సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు భాగవతం బిక్షపతి, పాసిగంటి శ్రీనివాస్, జిల్లా నాయకులు శేర్ కుమారస్వామి, క్యాతం సతీష్ కుమార్, శేకర్ నాని తదితరులు పాల్గొన్నారు.
