Paddy Procurement Centers Open in Sircilla
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
– సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి
– బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూరదేవరాజు
సిరిసిల్ల (నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణం విలీన గ్రామాలైన చంద్రంపేట, ముష్టిపెళ్లి గ్రామాల్లో బుధవారము నూతనంగా
వడ్ల కొనుగోలు కేంద్రం సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఆర బెట్టుకోవడానికి 4 ఎకరాలు ముష్టి పెళ్లికి, 5 ఎకరాలు చంద్రంపేటకు ప్రభుత్వం భూమి కేటాయించడం జరిగిందని అన్నారు. రైతులు పండించిన వడ్లకు గిట్టుబాటు ధరతోపాటు సన్న వడ్లకు అదనంగా 500 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. దళారులకు వడ్లు అమ్మి మోసపోవద్దని తెలియజేశారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ కి,సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, ప్రభుత్వ అధికారులకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో
మున్సిపల్ కమిషనర్ ఖాదర్ పాషా, మెప్మా మేనేజర్ పసాద్, ఆలీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, మాజీ కౌన్సిలర్లు నాగరాజు, రాజిరెడ్డి కమలాకర్ రావు, వంతడుపుల రాము, కొలనూరి రమాదేవి, గుడిసెట్టి బాలరాజు, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
