మంచిర్యాల, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం రోజున మందమర్రి కోల్ బెల్ట్ అసోసియేషన్ మరియు మంచిర్యాల లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లారీ ఓనర్స్ మాట్లాడుతూ గత మూడు నెలల నుండి లారీ ఓనర్ల సమస్యలను ట్రాన్స్ పోర్ట్ వారికి మొర పెట్టుకోవడం జరుగుతుందని కానీ ట్రాన్స్ పోర్ట్ వారు కొంచెం కూడా దయ చూపడం లేదని అందుచేత మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దృష్టికి లారీ ఓనర్ల సమస్యను విన్నపించడం జరిగిందని దానికి ఎమ్మెల్యే స్పందించి ట్రాన్స్ పోర్టు వారితో మాట్లాడడానికి పిలవగా వారు రాకపోవడంతో లారీ ఓనర్స్ అందరూ కలిసి బుధవారం రోజున గాంధీయవాదంతో శాంతియుతంగా మంచిర్యాలలోని లక్ష్మి థియేటర్ చౌరస్తా నుండి ఐబి చౌరస్తా వరకు 500 మంది లారీ ఓనర్స్ తో భారీ ర్యాలీ తీయడం జరిగిందని, రేపటిలోగా ట్రాన్స్ పోర్ట్ వారు ఎలాంటి స్పందన తెలపకపోతే తీవ్రంగా సమ్మెలో కూర్చుంటామని, లారీ ఓనర్స్ అందరూ కలిసి ముక్తకంఠంతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మందమర్రి కోల్ బెల్టు ఏరియా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీరమల్ల కోటిలింగం, ఉపాధ్యక్షులు గుండా సురేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పుప్పాల సత్తయ్య, జాయింట్ సెక్రెటరీ అరికోల్ల రమేష్ మరియు కమిటీ సభ్యులు అలాగే మంచిర్యాల లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇంచార్జ్ కాలిక్, కమిటీ సభ్యులు మంచిర్యాల జిల్లా లారీ ఓనర్స్ యజమానులు అందరూ పాల్గొనడం జరిగింది.