
-7 వ వార్డ్ కౌన్సిలర్ జగన్నదుల శ్రీను.
-ఎన్నికల ప్రచార షెడ్యూల్ ప్రతుల పంపిణీ
చెన్నూర్, నేటిధాత్రి:
చెన్నూర్ పట్టణ కేంద్రం లోని 7వ వార్డ్ లో కౌన్సిలర్ జగన్నదుల శ్రీను ఎస్ సి కాలని,శ్రీనగర్ కాలనీ లో ఎన్నికల ప్రచార ప్రతులను పంపిణీ చేశారు. ముచ్చటగా మూడో సారి బాల్క సుమన్ అన్నను గెలిపించుకునే వరకు శ్రమిస్తాము అన్నారు. చెన్నూర్ ఎం ఎల్ ఏ బి అర్ ఎస్ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్ ఆదేశాల మేరకు ప్రచార ప్రతులను పంపిణీ చేసినట్టు చెప్పారు. ఈ రోజు ఉదయం గం 9 కి స్థానిక శివాలయం లో పూజలు చేసి అనంతరం రావి చెట్టు,గాంధీ చౌక్,పాత బస్టాండ్ ,కొత్త బస్టాండ్ మీదుగా జలాల్ పెట్రోల్ బంక్ వరకు ప్రచారం కొనసాగుతుంది అన్నారు.ఈ కార్యక్రమం లో వార్డ్ ఇంచార్జ్ గోగర్ల.రాజ్ కుమార్, సోషల్ మీడియా ఇంఛార్జి తుంగపిండి.రాజేష్,బి అర్ ఎస్ కార్య కర్తలు గద్దల అక్షయ్,నవీన్,శశి,సంతోష్,సాయి,చింటు,భానేష్,సంపత్,మహేందర్,శివ తదితరులు పాల్గొన్నారు.