
వరంగల్/గీసుగొండ,నేటిధాత్రి :
గీసుగొండ మండలంలోని మనుగొండ గ్రామానికి చెందిన చాపర్తి కుమారస్వామి అనే నిరుపేదవ్యక్తి ఐదు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, రెండు సార్లు ఆర్థోపెడిక్ సర్జరీ జరిగి, వైద్య చికిత్సకు, కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న గీసుగొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మినారాయణ మానవత్వంతో స్పందించి గతంలో పదివేల రూపాయలు ఆర్థికసాయం అందజేయడం జరిగింది. బాధితుల దయనీయస్థితిని బట్టి, వారికి మన ఆపద్భాందవులు ఫౌండేషన్ తరఫున కూడా సహకారం అందజేయాలనే వారి సూచనమేరకు బుదవారం బాధితులకు, ఫౌండేషన్ ప్రతినిధి కర్ణకంటి రాంమూర్తి వారికి 25 కేజీల సన్నబియ్యం, నెలకు సరీపడా నిత్యావసర సరుకులను అందజేశారు.