జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలoలోని కాన్కూర్ అంగన్వాడి కేంద్రంలో బుధవారం రోజున ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ పక్షం పథకం పై అవగాహన సదస్సు జరుపబడింది. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ మనెమ్మ మాట్లాడుతూ పోషణ పక్షం పథకం ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామీణ పట్టణ ప్రాంత మహిళలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వాళ్ళ ఆరోగ్యం పై శ్రద్ధ ఎలా వహించాలి, పోషకాలతో నిండిన ఆహార నియమావళిని ఎలా రూపొందించుకోవాలి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలన్నింటినీ కలిపి ఈ పోషణ పక్షం పథకాన్ని ప్రభుత్వం రూపొందించిందని,పోషణతో కూడిన ఆహారం తీసుకోవాలని, చిరుధాన్యాలు తీసుకోవడం చాలా ముఖ్యమని, కుటుంబంలో అందరీ ఆరోగ్యం పై శ్రద్ధ చూపే స్త్రీలు
తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తుంటారని, అలా చేయకుండా జాగ్రత్త వహించాలని, ప్రతిరోజు సమయానికి పౌష్టికాహారాన్ని తీసుకున్నపుడే గర్భంలో శిశువులైన,పాలు తాగే పిల్లలైన ఆరోగ్యకరంగాఎదుగుతారని, ఆహారంతో పాటు రోజు వైద్యులు సలహా మేరకు చిన్న చిన్న వ్యాయామాలు, దినచర్యలో మార్పులు తప్పకుండా చేసుకోవాలని, క్రమం తప్పకుండా ఆసుపత్రికి వెళుతూ సక్రమంగా మందులు వాడాలని, వైద్యులు తెలిపిన జాగ్రత్తలను పాటించి సుఖప్రసవాన్ని పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మనెమ్మా, ప్రాథమిక పాఠశాల టీచర్ దివ్య, ఆశ కార్యకర్త సునీత మరియు బాలికలు, పాఠశాల పిల్లలు, గర్భవతులు, బాలింతలు, మహిళలు పాల్గొన్నారు.