మంత్రి సీతక్క పై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి..

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి

మంగపేట నేటిధాత్రి

ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్కని అభినందించాల్సింది పోయి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు మానుకోవాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీతక్క రాజకీయ జీవితం ఒక తెరిచిన పుస్తకం అని మచ్చలేని రాజకీయ నేత అని అన్నారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ములుగు జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు సీతక్క పై చిల్లర రాజకీయాలు చేయడం హాస్యాస్పదం అన్నారు ప్రతిపక్షాల చిల్లర రాజకీయాల వల్ల సీతక్క గౌరవ ప్రతిష్ట లకు ఎలాంటి భంగం కలిగించవని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని ప్రతిపక్షాలు గుర్తించాలన్నారు ఎక్కడో జరిగిన ఇసుక లారీల వ్యవహారాన్ని మంత్రి సీతక్కకి ఆపాదించడం బిఆర్ఎస్ నాయకుల చిల్లర రాజకీయాలకు నిదర్శనం అన్నారు తామంతా సీతక్క వెంటే ఉన్నామని ఎవరైనా వ్యక్తులు గాని రాజకీయ పార్టీలు గానీ ఎలాంటి ఆధారం లేని నిరాధారమైన ఆరోపణలు సీతక్క పై చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు మేడారం మహా జాతర సందర్భంగా మంత్రి సీతక్క చేస్తున్న సేవలను ప్రశంసంచాల్సింది పోయి బిఆర్ఎస్ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు సోయీ తప్పి మాట్లాడుతున్నాయని సాంబశివరెడ్డి ఆరోపించారు మాఫియాలు దందాలు వైన్స్ మైన్స్ అన్ని కుంభకోనాలు గత ప్రభుత్వంలోనే జరిగిన విషయాన్ని బిఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న సీతక్కకి జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పటికీ అండగా ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంగళ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!