
seeds
నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలి.
ప్రతి విత్తన అమ్మకంపై రసీదు తప్పనిసరిగా ఇవ్వాలి.
అధిక ధరలకు విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ తప్పదు.
పలు విత్తన దుకాణాలను తనిఖీ చేసిన ఏడిఏ దామోదర్ రెడ్డి.
నల్లబెల్లి నేటి ధాత్రి:
నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి సంబంధిత డీలర్ లైసెన్సును శాశ్వతంగా రద్దు చేయబడుతుందని నర్సంపేట ఏడిఏ కే దామోదర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం మండల కేంద్రంలోని పలు విత్తన దుకాణాలను తనిఖీ చేపట్టి. పలు కంపెనీలకు చెందిన విత్తన ప్యాకెట్లను పరిశీలించి కంపెనీకి సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన ఆమోదిత పత్రాలు పరిశీలించారు అదేవిధంగా విత్తన షాపులలో స్టాక్ రిజిస్టర్ లను, స్టాక్ బోర్డులను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆమోదిత పొందిన విత్తన ప్యాకెట్లను రైతులకు అంది ఇవ్వాలని అందించే క్రమంలో తప్పనిసరిగా ప్రతి రైతుకు రసీదు ఇవ్వాలని.

ప్రతిరోజు విక్రయించిన విత్తనాలను ప్రత్యేకంగా రిజిస్టర్ లో రైతుల పేర్లతో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని. విడిగా విత్తనాలు అమ్మకూడదని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విత్తన ప్యాకెట్లను రైతులకు విక్రయించాలి అధిక ధరలకు విత్తన ప్యాకెట్లను విక్రయించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పలువురు విత్తన డీలర్లను ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ అధికారులు కృష్ణ, గోపాల్ రెడ్డి, ఎస్సై వి గోవర్ధన్, మండల వ్యవసాయ అధికారి రజిత, ఏఈఓ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు.