
Study Hard and Aim High — CI Venkat Raja Goud
— కష్టపడి చదివితేనే.. ఉన్నత శిఖరాలకు
• చదువుతోపాటు క్రీడలు అవసరమే..
సీఐ వెంకట రాజ గౌడ్
నిజాంపేట: నేటి ధాత్రి
విద్యార్థులు కష్టపడి చదివితే.. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజ గౌడ్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతూనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యార్థికి చదువు ఎంత ముఖ్యమో.. క్రీడలు కూడా అంతే ముఖ్యమని క్రీడల ద్వారా మానసికంగా శారీకంగా దృఢంగా ఉంటామని అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, ఎస్సై రాజేష్, కమిటీ సభ్యులు తిరుపతి, జిపి స్వామి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.