
కాశిబుగ్గ నేటిధాత్రి.
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ లో కోటిలింగాల గుడి రోడ్డుకు వెళ్లేదారిలో ఎన్నో సంవత్సరాల నుండి చెత్త చెదారంతో ఉంటున్న కుంటను మాది ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఆదేశాల ప్రకారం స్థానిక కార్పొరేటర్ ఓనీ భాస్కర్ మరియు స్థానిక నాయకులు కుంటలో పేరుకుపోయినటువంటి చెత్తను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాల నుండి స్థానిక మహిళలు బతుకమ్మ ఆడుకొనుటకు మరియు బతుకమ్మను నిమజ్జనం చేయడానికి ఈ కుంట స్థలాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ కుంట లో పనికిరాని వ్యర్ధాలతో మరియు గుర్రపు డేక్కలతో పూర్తిగా కలుషితమయి నీళ్లు కూడా విషపూరితంగా ఉండటంతో స్థానిక నాయకులు, బతుకమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఈనెల 5వ తారీఖున కొండా మురళి కుంటున్న సందర్శించి పూర్తిగా చెత్తను మరియు పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించడానికీ మూడు లక్షల ఇరువై వేల రూపాయల మంజూరు చేయడం జరిగింది. కొండ మురళి ఆదేశాల ప్రకారం శనివారం రోజున స్థానిక కార్పొరేటర్ ఓని భాస్కర్, బతుకమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షులు పాలకొండ హరికుమార్ చెత్త తొలగించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. హరికుమార్ మాట్లాడుతూ ఈ కుంటలో చేరుతున్న మురికి నీటిని బయటకు మళ్ళించే విధంగా చర్యలు తీసుకోవాలని కొండా దంపతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.