రిటైర్డ్ జడ్జి ఎన్ వి వేణుగోపాల చారి
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల కేంద్రంలోని వెంకటలక్ష్మి గార్డెన్స్ లో శుక్రవారం రోజు ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్పీడీసీఎల్ చైర్ పర్సన్ రిటైర్డ్ జడ్జ్ ఎన్ వి వేణుగోపాల చారి హాజరు కాగా ముత్తారం కమాన్పూర్ రామగిరి మండలాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని సమస్యలను పరిష్కరించాలని వేణుగోపాలచారికి తెలుపగా స్పందించిన ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారులను వినియోగదారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కార దిశగా పనిచేయాలని తెలిపారు. ముత్తారం మండల కేంద్రానికి సంబంధించి ఇందిరమ్మ మీటర్లు ఇచ్చి కరెంటు లైన్ వేయడం మరిచారని ముత్తారం మండల కేంద్రానికి చెందిన ప్రజలు తెలపగా దానిపై వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.అదేవిధంగా మండల కేంద్రంలోని కొన్ని వార్డులలో వోల్టేజీ సమస్య తీవ్రంగా ఉన్నదని అధికారుల దృష్టికి తీసుకుపోగా లైన్ ఇన్స్పెక్టర్ పోచమల్లును వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.అనంతరం వేణుగోపాలచారి మాట్లాడుతూ జూనియర్ లైన్మెన్ ల కొరత ఉన్నందున పనిలో కొంత జాప్యం జరుగుతుందన్న మాట నిజమేనని అన్నారు.ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ప్రైవేటు వారు పని చేస్తే వారికి ఏమైనా జరగరాని ఇబ్బందులు జరిగితే విద్యుత్ శాఖకు ఎలాంటి సంబంధం ఉండదని అందుకే జూనియర్ లైన్మెన్ కానీ విద్యుత్ శాఖ అధికారులకు తెలిపి పని చేసుకోగలరని అన్నారు.ప్రకృతి ప్రకోపాలు వచ్చినప్పుడు అధికారులు విద్యుత్ తీగలు ఊగులాడే లైన్లను గుర్తించి సమస్య లేకుండా పరిష్కారం చేస్తే ఉరుములు, గాలి దుమారాలు వచ్చినప్పుడు విద్యుత్ సమస్య ఉండదని అన్నారు.ఇప్పటివరకు వచ్చిన సమస్యలను నాలుగు రోజుల్లో పరిష్కార దిశగా పనిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఎస్సీ ఎస్టీలు ప్రతినెల 101 యూనిట్ లోపు విద్యుత్ వినియోగించినట్లయితే విద్యుత్ చార్జీలు ఉండవన్నారు.అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఎర్త్ సమస్యతో కరెంటు వస్తున్న ట్రాన్స్ఫార్మర్ను రైతు ద్వారా డిడి కట్టించుకుని ట్రాన్స్ఫార్మర్ను పక్కకు వేసి సమస్యను పరిష్కరించాలని అన్నారు.మండలంలోని ప్రజలకు ఎలాంటి విద్యుత్ సంబంధిత సమస్యలున్నా వాట్సప్ ద్వారా 9440811299,8333923840,9491307004 సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ టెక్నికల్ మెంబర్ జనరల్ మేనేజర్ కె తిరుమల్ రావు, ఫైనాన్స్ మెంబర్ ఆర్ చరన్ దాస్, ఇండిపెండెంట్ నెంబర్ ఎన్ నరేందర్, ఎస్ ఈ బొంకూరి సుదర్శన్, డి ఈ శివ రాములు, ఏడి విజయ్ గోపాల్ సింగ్, మంథని ఏఈ మల్లయ్య, ఎగ్లాస్పూర్ ఏఈ శ్రీనివాస్, కమాన్పూర్ ఏఈ రాజేంద్ర కుమార్, ముత్తారం ఏఈ హనుమాన్ దాస్ లతోపాటుగా సంబంధిత విద్యుత్ అధికారులు పాల్గొన్నారు