`గత ప్రభుత్వం చేసిన పాపం ‘‘మంత్రి పొన్నం’’కి పొంచి వున్న గండం!
`పైరవీ కారులకు తరగని రాబడి!!
`అవినీతి అధికారుల అడ్డగోలు దోపిడీ!
`బలిసినోళ్లకే విదేశీవిద్యా నిధులు!
`మంత్రి పొన్నం మెడుకు చుట్టాలని చూస్తున్నారు.
`విదేశీవిద్యా నిధిలో చాలా తప్పుడు దృవీకరణలు.
`ఎప్పుడో లంచాలు మేసిన అధికారులు?
`ఇప్పటికే తల్లిదండ్రుల నుంచి అధికారులు అడ్వాన్సుగా చెక్కులు తీసున్నట్లు ఆరోపణలు?
`విదేశీవిద్యా నిధి బిల్లులు విడుదల కోసం తల్లిదండ్రులు ఎదురు చూపులు..వారికి నిధులు విడుదల కోసం అధికారుల పల్టీలు!
`అవి మంత్రి పొన్నం మెడకు చుట్టుకుంటే సేఫ్ అవుతామని ఆలోచనలు!
`విదేశీవిద్యా నిధులు విడుదల చేస్తే ఒక తంటా!
`విడుదల చేయకపోతే మరో తంటా!!
`రద్దు చేయలేక, మంజూరుకు మార్గం లేక అధికారులు వెతుకుతున్న వక్రమార్గాలు?
`రాజకీయం చేద్దామని కాచుకు కూర్చున్న బిఆర్‌ఎస్ నేతలు.
`ఫైలు ముందుకు కదలగానే ఆరోపణలు గుప్పిద్దామని చూస్తున్నారు.
`అందుకే విదేశీవిద్యా నిధులు విడుదల కావడం లేదని గగ్గోలు పెడుతున్నారు.
`అందులో భాగంగానే మండలిలో ‘‘కవిత’’ ప్రశ్నలు.
`సమయం చూసి మంత్రిని మాయ చేయాలని అధికారులు చూస్తున్నారు?
హైదరాబాద్,నేటిధాత్రి:
ప్రభుత్వాలు అట్టుడుగు వర్గాలకు ఆర్ధిక చేయూత కోసం కొన్ని పధకాలు ప్రవేశపెడుతుంటాయి. ఉన్నత వర్గాలు, అందులోనూ ఆర్దికంగా స్థితి మంతులైన వారి పిల్లలు విదేశీ విద్యలు అభ్యసించడానికి అవసరమైన వనరులు వారికి వుంటాయి. కాని పేదింటి పిల్లల్లో కొంత మందికి సరస్వతీ క్షటాక్షం వున్నప్పటికీ వారికి లక్ష్మీ దేవి అనుగ్రహం వుండదు. దాంతో వారు ఎంతటి విజ్ఞానవంతులైనా, విద్యలో ముందు వరుసలో వున్నప్పటికీ వారికి ఆర్ధిక చేయూత లేక మద్యలోనే చదవులు ఆగిపోతాయి. ఉన్నత చదువులు చదవాలన్న ఆశ వున్నప్పటికీ ఆర్ధిక స్ధోమత చాలక మధ్యలోనే జీవితంలో రాజీ పడతారు. అందివచ్చిన అవకాశాలను ఆసరాగా భవిష్యత్తును ఎంచుకుంటారు. వారి ఆశలను తుంచుకుంటారు. తమ పేదరికాన్ని నిందించుకుంటూ బతుకుతుంటారు. తమకున్న పేదరికాన్ని దూరం చేసుకోవాలన్న ఆలోచన ఎంత వున్నా, ఉన్నత విద్యలు చదివి గొప్ప స్ధితికి చేరుకోవాలనుకున్న ఆశలను చంపుకొని బతుకుతుంటారు. విద్య అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. కాకపోతే సర్వస్వతి కూడా లక్ష్మిదేవి కటాక్షంతోనే కొన్నిసార్లు సాగుతుంది.. అందుకు పేదరికం అడ్డు కాకూడదు. మట్టిలో మాణిక్యాల్లాంటి విద్యార్ధులు ఎంతో మంది వుంటారు. మనం అప్పుడప్పుడూ పరీక్షల ఫలితాలు వెలువడినప్పుడు చదువుతుంటాం. కార్పోరేట్ కాలేజీల్లో లక్షలు పోసి చదువుకున్న వారికంటే కడు పేదరికంలో వున్న పిల్లలు కూడా అద్భుతంగా రాణిస్తుంటారు. అయితే ప్రాధమిక, మాధ్యమిక స్ధాయిలో కూడా చాలా మంది మెరికల్లాంటి విద్యార్ధులు చదువును మధ్యలోనే ఎంతో మంది ఆపేస్తుంటారు. కాకపోతే కొంత మంది పిల్లలు ఎంతో పట్టుదలతో అందివచ్చిన అవకాశాలతో ముందుకు సాగుతుంటారు. కాకపోతే ఒక దశ వచ్చే సరికి ఉన్నత విద్యలను కొనుక్కోలేక ఆగిపోతుంటారు. అలాంటి వారికి ఆర్ధిక చేయూతనందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2015లో విద్యానిధి పథకాన్ని తెచ్చింది. పధకం ఉద్ధేశ్యం ఎంతో గొప్పది. మంచి ర్యాంకులు పొంది, ఉన్నత విద్యలో మంచి మార్కులు సంపాదించి, మరింత ఉన్నత విద్యలను విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి విద్యానిధి పధకం ఒక వరమనే చెప్పాలి. ఇంతటి గొప్ప పధకం ప్రారంభమైనప్పటి నుంచి కూడా పక్కదారి పడుతుంటే, పేద వర్గాలకు అయినా తీరని అన్యాయం జరగుతుందంటే దాని అమలులో ప్రభుత్వాల నిర్లక్ష్యం అర్ధం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే పేద పిల్లలకు వరంగా మారాల్సిన విద్యా నిధి పథకం కొంత మంది రాజకీయ నాయకులు, పైవరీ కారులకు, ముఖ్యంగా కొంత మంది అధికారులకు ఆర్ధిక వనరుగా మారిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటి వరకు జరుగుతున్నది అదే. ఇందులో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ప్రజా ప్రభుత్వం గుర్తించింది. దానిలోని లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తోంది. కాకపోతే కొంత ఆలస్యమౌతోంది. దాని ప్రతిపక్షాలు ఒక అస్త్రంగా మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద రాజకీయ దాడి చేయాలని చూస్తోంది. తాజాగా మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్లకవిత విద్యా నిధి పధకం సక్రమంగా అమలు కావడం లేదని ప్రశ్నించింది. కాని ఆ పధకం అమలు అన్నది గత ప్రభుత్వ హాయాంలో ఎంత వరకు న్యాయంగా జరిగిందన్న విషయం ఆమె వరకు వెళ్లిందా? లేదా? తెలియదు. తెలిసినా అప్పటి పాలకపెద్దలు మౌనం వహించారా తెలియదు. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత వరకు విద్యానిధిలో జరిగిన అవినీతి తెలిసిందో లేదో తెలియదు. కాని ముందు ఆ పధకంలో ఏం జరిగిందని తెలుసుకంటే మంచిది. ఇప్పుడు ఆ ఫైల్ ఎందుకు ఆగిందన్నదానిపై లోతైన అధ్యయనం చేస్తే కవత అలాంటి వ్యాఖ్యలు చేసే అర్హతను కోల్పోతారు. కారణమేమిటంటే గత పదేళ్ల కాలంలో ఏటా 300 మంది విదేశీ విద్యను అభ్యసించడానికి వెళ్లేవారికి ఎంత ఉపయోగపడిరది? ఎంత మంది పేదలకు న్యాయం జరిగిందన్నది తెలియాలి. ఏటా 300 మందికి అమలు చేసిన విద్యానిధి పథకం నిజమైన అర్హులకు పది శాతం కూడా అమలుకు నోచుకోలేదు. అంటే 300 మందిలో కనీసం 30 మందికి కూడా ఆ పధకం న్యాయంగా అందలేదన్న కఠోరమైన వాస్తవాలున్నాయి. ఈ పది శాతంలో కూడా ఎంతో కొంత చేతులు మారకుండా వుండలేదనే సమాచారం. విద్యా నిధి పధకం సుమారు ఓ వంద మంది పైరవీ కారులకు ఆదాయ మార్గమైంది. ఎంతో మంది నాయకులకు కూడా ఆదాయ వనరుగా మారింది. ఆ పధకం అమలు అధికారుల అవినీతికి ఆలవాలమైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ విద్యానిధి పధకానికి సంబంధించిన నిధులు అందాలంటే కొన్ని ప్రొసీజర్లు వున్నాయి. అవి సక్రమంగా వున్నవారికి మాత్రమే అందజేయాలి. అంతే కాకుండా పేద వర్గాల పిల్లలకు మాత్రమే అందజేయాలి. అగ్రవర్ణాలలో వున్న పేదలకైనా, ఇతర కులాల పిల్లలకైనా అందాలి. కాని కొందరు బలిసిన వాళ్లుకే ఈ పధకం వరంగా మారిందని తెలుస్తోంది. నిజం చెప్పాలంటే ఇప్పటికీ ఈ పధకం ఒకటుందని చాలా మందికి తెలియదు. చదువుకునే పిల్లలకు కూడా ఈ విషయం తెలియదు. ఎందుకంటే దానిపై వారు చదువుకుంటున్న సమయంలో అద్యాపకులు చెప్పరు. కాలేజీ యాజమాన్యాలు చెప్పవు. తల్లిదండ్రులకు అంత అవగాహన లేకపోవడంతో వారికీ తెలియదు. కాకపోతే అంతో ఇంతో రాజకీయం చేసేవారికి, పైరవీ కారులకు మాత్రమే ఈ పధకం అమలు వర్తింపులు తెలుసు. దాంతో తమ ఆర్ధిక అవసరాలు తీర్చుకునేందుకు కొంత మంది నాయకులు బాగా చదువుకునే కొంత మంది పేద విద్యార్ధులకు మేలు చేస్తున్నామనే క్రమంలో వారికి తెలియజేస్తారు. నేను దగ్గరుండి విద్యానిధి ఇప్పిస్తానని నమ్మిస్తారు. ఆ సొమ్ములో తాము అడిగినంత ఇవ్వాలని షరతు విదిస్తారు. తాము పై వాళ్లుకు ఇవ్వాల్సి వుంటుందని నమ్మిస్తారు. దాంతో తమ పిల్లల చదువుకోసం ఉపయోగపడుతున్నప్పుడు ఎంత వచ్చినా మేలే అన్న ఆలోచనతో తల్లిదండ్రులు పైరవీ కారులను నమ్ముతారు. ముందు కొంత అప్పు చేసి వారికి సమర్పించుకుంటారు. ఇక అంతో ఇంతో సమాజంలో ఒక గుర్తింపు వున్న వాళ్లు నేరుగా అధికారులతోనే డీల్ మాట్లాడుకుంటారు. మీకింత ఇస్తానని చెప్పి ఆపధకం లబ్దిపొందుతున్నారు. అందులో ఎక్కువగా అగ్రవర్ణాలలో ఆర్ధికంగా బాగా వున్నవారే లాభపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ20 లక్షల్లో రూ.5 లక్షల వరకు అధికారులు తీసుకుంటున్నారని సమాచారం. ఇలా ఈ పధకం అమలులోకి వచ్చిన నాటినుంచి ఈ తంతు సాగుతూనే వుంది. అయితే ఇందులో ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్ధుల పేరిట సమర్పించే సరిఫికెట్లన్నీ తప్పుడు దృవపత్రాలే కావడం విశేషం. విదేశాలలో విద్య కోసం ధరఖాస్తు చేసుకొని, నిర్వహించే పరీక్షల ఉత్తీర్ణతలకు చెందనవి కూడా తప్పుడు దృవీకరణ పత్రాలు కావడం గమనార్హం. విదేశాలకు చెందని సర్టిఫికెట్లే సృష్టించిన వాళ్లకు, ఆదాయ, కుల తప్పుడు దృవపత్రాలు సృష్టించడం పెద్ద సమస్య కాదు. అలా అధికారులే దగ్గరుండి ఇలాంటి సర్టిఫికెట్లు అందజేస్తున్నారనే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విద్యానిధికి సంబంధించిన ఫైలు ఆగిపోయింది. బిఆర్‌ఎస్ హాయాంలో జరిగిన అవకతవకలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కొంత సమాచారం వుంది. ఎందుకుంటే ఆయన విద్యార్ధి నాయకుడిగా రాజకీయాలను చూశారు. రాజకీయాల్లోకి వచ్చారు. ప్రభుత్వ పాలన మీద అవగాహన వున్న నాయకుడు. మంత్రి టేబుల్ మీద వున్న ఫైలులో అన్ని అవతవకలున్న లిస్టే వుందని సమాచారం. వారిలో గతంలో ఎంపిక చేయబడిన విద్యార్దులంతా బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులు చెందిన పిల్లలు, వారి అనుచరుల పిల్లలు, పైరవీ కోసం వారు సూచించిన వాళ్లున్నారు. అందులోనూ అన్ని తప్పుడు ధృవపత్రాలను సమర్పించిన వాళ్లే ఎక్కువగా వున్నారు. అందుకే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ ఫైలును పక్కన పెట్టారు. ఇప్పటి నుంచైనా నిజమైన విద్యార్ధులకు న్యాయం చేయాలన్న సంకల్పంతోమంత్రి పొన్నం ప్రభాకర్ వున్నారు. అయితే ఈ ఫైల్ క్లియర్ అయితే ప్రభుత్వాన్ని బద్‌నాం చేద్దామని బిఆర్‌ఎస్ కాచుకు కూర్చున్నది. మొత్తంగా పేద వర్గాలకు తీరని అన్యాయ ం చేసిన బిఆర్‌ఎస్ పార్టీ నాయకులే, ఇప్పుడు ప్రజా ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని చూస్తోంది. మంత్రిని ఇరికిద్దామని ఎదురుచూస్తోంది.