ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలంలోని ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా రైతులకు సాగు నీటిని విడుదల చేశారు.పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణారావు ఆదేశాల మేరకు ఎస్సారెస్పీ D86,D83 కెనాల్ ద్వారా రైతులకు సాగునీటిని విడుదల చేశామని ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేంసాగర్ రెడ్డి తెలిపారు.ఈ కెనాల్ ద్వారా సుల్తానాబాద్, ఓదెల, శ్రీరాంపూర్ మండల రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందుతాయనీ తెలియజేశారు.ఈ కార్యక్రమం లో పోత్కపల్లి సహకార సంఘ చైర్మన్ అళ్ళ సుమన్ రెడ్డి, డైరెక్టర్ బొంగోని శ్రీనివాస్ గౌడ్ కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పిటిసి లంక సదయ్య వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.