గుండాల జడ్పిటిసి వాగబోయిన రామక్క,గుండాల ఎంపిపి ముక్తి సత్యం, విద్యుత్ శాఖఏడి కోటేశ్వరరావు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
శుక్రవారం గుండాల మండలంలోని పోతిరెడ్డి గూడెం గ్రామంలో ప్రమాదకశాత్తు నిప్పంటుకొని 25 ఎకరాల యాసంగి మొక్కజొన్న పంట దగ్ధం కావడం జరిగింది.
శనివారం గుండాల జడ్పిటిసి వాగబోయిన రామక్క, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, విద్యుత్ శాఖ ఏడి కోటేశ్వరరావు కాలిపోయిన మొక్కజొన్నపంటను పరిశీలించారు.
ఈ సందర్భంగా గుండాల ఎంపీపీ ముక్తి సత్యం మాట్లాడుతూ ఎంతో కష్టపడి మొక్కజొన్న పంట వేస్తే చేతికి వచ్చే సమయంలో ప్రమాదవశాత్తు కాలిపోవడం బాధాకరమని పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం స్పందించి ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పంట నష్టం జరిగిన వివరాలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారుల దృష్టికి గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల జడ్పిటిసి వాగబోయిన రామక్క తీసుకెళ్లడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు గుండాల మాజీ సర్పంచ్ కొరం సీతారాములు, వై వెంకన్న, పెండేకట్ల పెంటన్న, ఈసం కృష్ణన్న, భానోత్ లాలు, పంట నష్టపోయిన రైతులు తదితరులు పాల్గొన్నారు.