టిడిపి పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బి సంజయ్ కుమార్
మందమర్రి, నేటిధాత్రి:-
నిజమైన బహుజనుల రాజ్యాన్ని సాధించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్, బహుజనుల ఆరాధ్య దేవుడు ఎన్టీ రామారావు అని టిడిపి పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బి సంజయ్ కుమార్ అన్నారు. గురువారం ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకొని మందమర్రి పట్టణంలోని టిఎన్టియుసి, టిడిపి పార్టీ కార్యాలయంలో బి సంజయ్ కుమార్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల ఆరాధ్య దేవుడు మాజీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని అన్నారు. రూపాయికి కిలో బియ్యం పేద ప్రజలకు ఇచ్చి భారతదేశంలో పేదల పెన్నిధిగా నిలిచారని, పటేల్, పట్వారి వ్యవస్థను రూపుమాపి బహుజనులకు నిజమైన స్వేచ్ఛ నిచ్చిన మహా నాయకుడు ఎన్టీఆర్ కొనియాడారు ఎన్టీఆర్ ఆశయ సాధనకు నిరంతరం తపిస్తున్న సంజయ్ కు పలువురు నాయకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి ఎండి షరీఫ్, జిల్లా నాయకులు వాసాల సంపత్, పట్టణ మహిళా అధ్యక్షులు ఆర్ జయ, కరిడే తిరుపతి, జిల్లా నాయకులు పెంచేకల్ రాజేశ్వర్ రావు, ట్రీ కోవెల కృష్ణయ్య, మండల నాయకురాలు సుగుణ, పట్టణ ఉపాధ్యక్షులు జూపక సంధ్య, కమలా, మండల ఇంచార్జి విజయగిరి శంకర్, గిర్నల్ శ్రీనివాస్, వడ్నాల సత్యనారాయణ, చాట్ల పెళ్లి రాజేష్, నర్సయ్య భాగ్య, జయస్ తదితరులు పాల్గొన్నారు.