నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఎమ్మెల్యే నివాసంలో తన తల్లి పెద్ది అమృతమ్మ వద్ద ఆశీర్వాదాలు తీసుకొని శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నర్సంపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీవో కృష్ణవేణి తన నామినేషన్ అందజేశారు. ఎమ్మెల్యే వెంట తన సతీమణి పెద్ది స్వప్న, మార్కెట్ చైర్మన్ పొన్నం మొగిలి, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ పలువురు నాయకులు ఉన్నారు.