Police Help Former Maoist
పోరు వద్దు ఊరు ముద్దు
మాజీ మావోయిస్టు కంటికి శస్త్ర చికిత్స చేయించిన కోటపల్లి పోలీస్
ఆయుధాలను అజ్ఞాతాన్ని వీడండి – జనజీవన స్రవంతిలో కలవండి
జైపూర్,నేటి ధాత్రి:
రామగుండం పోలీస్ కమిషనరేట్ కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారేపల్లి గ్రామానికి చెందిన ఆత్రం లచ్చన్న,భార్యతో కలిసి గత కొన్ని నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం,పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహాకారాలు,లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకుని,తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని లొంగిపోయినాడు.మాజీ మావోయిస్టు కు పోలీస్ శాఖ తరుపున ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎలాంటి సహాయం,సమస్య ఉన్న అండగా ఉంటామని ఇచ్చిన మాట ప్రకారం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్,కోటపల్లి ఎస్సై రాజేందర్ ఆత్రం లచ్చన్న కు కంటి చికిత్స ను మంచిర్యాల లోని పవన్ ఆప్టికల్స్ ద్వారా ఉచితంగా కంటి చికిత్స చేపించారు.
