తనాపై అవిశ్వాసం ముమ్మాటికి కక్ష సాధింపు చర్య. అని గణపురం పిఎసిఎస్ చైర్మన్ పూర్ణచంద్రారెడ్డి ప్రెస్ మీట్ లో అన్నారు
వారి విజ్ఞతకే వదిలేస్తున్న.
నాకు ఛైర్మన్ గా అవకాశం కల్పించిన గండ్ర వెంకటరమణారెడ్డి వారికి జీవితాంతం రుణపడి ఉంటా.
4 ఏండ్లు నాకు సహకరించిన రైతులకు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
నా పదవి తొలగించి నన్ను చంపే కుట్ర చేస్తున్నారు.
నన్ను నమ్ముకున్న వారికి అండగా ఉంటా.
గణపురం నేటి ధాత్రి గణపురం పిఎసిఎస్ ఛైర్మన్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ .ఏ ఐ ఎఫ్ బి మరియు ఇతర రాజకీయ పార్టీల పరస్పర ఒప్పందంతో ఏకగ్రీవంగా ఎన్నికై ప్రజలకు పార్టీలకతీతంగా సేవచేస్తూ ఛైర్మన్ గా కొనసాగుతున్న నాపై అవిశ్వాసం పెట్టడం అధికార పార్టీ రాజకీయ కక్ష సాధింపు చర్య అని, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర చేస్తున్నారని అది వారి విజ్ఞతకే వదిలేస్తున్న అని, నాకు పిఎసిఎస్ ఛైర్మన్ గా అవకాశం కల్పించిన భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు, నాకు దైవ సమానులు గండ్ర వెంకటరమణారెడ్డి జ్యోతి గార్లకు జీవితాంతం రుణపడి ఉంటానని గణపురం పిఏసిఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి తెలిపారు.
ఛైర్మన్ ఎన్నికల్లో ఏకగ్రీవానికి సహకరించిన వివిధ పార్టీ నాయకులకు, గత నాలుగు సంవత్సరాలు నాకు సహకరించిన పిఎసిఎస్ పాలకవర్గ సభ్యులకు, కార్యాలయ సిబ్బందికి, అధికారులకు, పార్టీ పెద్దలకు, ముక్యంగా గణపురం మండల రైతులకు పేరుపేరునా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నాకు ఎప్పుడు ఏ అవకాశం ఉన్న ప్రజా సేవలో మీకు సేవ చేస్తానని, నన్ను నమ్ముకున్న వారికీ నిరంతరం అందుబాటులో ఉంటూ, సేవ చేస్తాను.
ఎమ్మెల్యే అనుచరులు నాపై దాడి చేసిన సమయంలో నాకు అండగా ఉన్న నా సహచర మిత్రులపై, బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబసభ్యులపై అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీస్ వారిని ఇబ్బంది పెట్టి మాపై కేసులు పెట్టడం సరైన విధానం కాదని, ఎమ్మెల్యే అనుచరుల నుండి నాకు ప్రాణహాని ఉందని, వారి నుండి నాకు రక్షణ కల్పించాలని గణపురం పిఎసిఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్ర రెడ్డి విజ్ఞప్తి చేశారు