`పదకొండేళ్లుగా ఒకేశాఖను నిర్వహిస్తూ రికార్డు
`ఎక్స్‌ప్రెస్‌వే మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు
`రోజుకు 30 కిలోమీటర్ల స్థాయికి జాతీయ రహదారుల నిర్మాణం
`ఆయన నేతత్వంలో ఎన్హెచఏఐలో గిన్నిస్‌బుక్‌లో స్థానం
`విపక్షాలతో కూడా ప్రశంసలందుకున్న అజాతశత్రువు
`ఏకంగా 2560% పెరిగిన నేషనల్ హైస్పీడ్ కారిడార్లు
`ప్రైవేటీకరణకు గొప్ప మద్దతుదారు
హైదరాబాద్, నేటిధాత్రి:
నితిన్ జయ్‌రాం గడ్కరీ ప్రస్తుతం 40వ కేంద్ర రోడ్డు రవాణా`హైవేల మంత్రిగా కొనసాగుతున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు పదకొండేళ్లుగా ఒకే మంత్రిత్వశాఖను నిర్వహిస్తూ రావడం విశేషం. ఈవిధంగా మూడు టర్మ్‌ల్లో ఒకే మంత్రిత్వశాఖను నిర్వహిస్తున్న ఆయన బీజేపీలో అత్యంత సీనియర్ నాయకులు. 2009`13 మధ్యకాలంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. వత్తి రీత్యా న్యాయవాది అయిన ఆయన ప్రస్తుతం నాగ్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఆయన నీటివనరులు, నదుల అభివద్ధి, షిప్పింగ్, గ్రామీణాభివద్ధి, ఎంఎసఎంఈ వంటి వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. నితిన్ గడ్కరీని తరచుగా “ఎక్స్‌ప్రెస్‌వే మ్యాన్ ఆఫ్ ఇండియా”గా మీడియా వ్యవహరిస్తుంటుంది. ము ఖ్యంగా ముంబయి`పూణె ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి ఆయనే ప్రధాన కారణం. ఆ తర్వాత దే శంలోని వివిధ ప్రాంతాల్లో ఇటువంటి ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణాలను చేపట్టారు. వరల్డ్ ఎకనా మిక్ ఫోరం ఆయన్ను రహదారుల రంగంలో “పయెనీర్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప”గా పేర్కొంది. రోడ్డు రవాణా`హైవేలశాఖ మంత్రిగా ఆయన హయాంలో దేశంలో జాతీయ రహదారు లు 60% పెరిగి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హైవే నెట్‌వర్క్‌గా రూపొందాయి.
2014లో 91,287 కిలోమీటర్లుగా వున్న హవేలు 2024 నాటికి 146194 కిలోమీటర్లకు విస్తరించాయి. నేషనల్ హైస్పీడ్ కారిడార్లు ఏకంగా 2560% పెరిగాయి. అంటే 2014లో 93 కిలోమీటర్లు మాత్రమే వున్న ఇవి, 2024 నాటికి 2474 కిలోమీటర్లకు చేరుకున్నాయి. నాలుగు లేన్లుఅంతకంటే ఎక్కువ నేషనల్ హైవేలు (హెఎస్సీలు మినహాయించి) 18278 కి.మి. (2014) నుంచి 45947కి.మి.కి (2024)కు విస్తరించాయి.
నితిన్ గడ్కరీ మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో 1957 మే 27న నాగ్‌పూర్‌లో జన్మించారు.నితిన్ గడ్కరీ భార్య కంచన్ గడ్కరీ. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు నిఖిల్‌కు రితూజా పాఠక్‌తో వివాహం జరిగింది. రెండో కుమారుడు సారంగ్ గడ్కరీ మధు రా రోడీని వివాహమాడారు. వీరి కుటుంబం పూర్తి శాఖాహారులు. యువకుడిగా వున్నప్పుడు భారతీయ యువ మోర్చాలో, అఖిలభారత విద్యార్థి పరిషత్ యూనియన్ నేతగా పనిచేశారు. నాగ్‌పూర్ యూనివర్సిటీనుంచి ఎం.కాం, ఎల్.ఎల్.బి. డిగ్రీని పూర్తిచేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలతో కూడా ఆయనకు మంచి సంబంధాలుంటాయి. పార్లమెంట్లో ఆయన తీరును విపక్ష నేతలు కూడా ప్రశంసిస్తుం టారు.
1995`99 మధ్యకాలంలో ఆయన మహారాష్ట్ర ప్రజాపనులశాఖ మంత్రిగా, మహారాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. గడ్కరీ ప్రైవేటీకరణను పూర్తిగా సమర్థిస్తారు. ఆయన చాలా ప్రైవేటు సంస్థలు, పెట్టుబడిదార్లతో చర్చలు జరిపి, పెద్దమొత్తంలో నిధులను ప్రైవేటీకరణ వైపు నకు మరలించారు. ఫలితంగా మహారాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అనుసంధానతకోసం 7బిలియన్ రూపాయలను మరల్చింది. ఈ నేపథ్యంలో రాబోయే నాలుగేళ్ల కాలంలో మహారాష్ట్ర ప్రజలకు 98% అన్నికాలాల్లో పనిచేసే రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు కింద మహారాష్ట్రలోని 13736 మారుమూల గ్రామాలు అనుసంధానమవుతాయి. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరినుంచి ఈ గ్రామాలకు రోడ్ల అనుసంధానత లేకపోవడం గమనార్హం. ఈ రోడ్ల అనుసంధానత వల్ల అప్పటివరకు సరైన వైద్యసహాం అందక పోషకాహారలోపంతో నానా ఇబ్బందులు పడిన అమరావతి జిల్లాకు చెందిన మేల్ఘాట్‘ధరణి ప్రాంతానికి వైద్యసేవలు అందుబాటులోకి వచ్చి ఇ ఇప్పుడు పోషకాహార రహిత ప్రాంతంగా రూపొందడం విశేషం. గడ్కరీ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన రూపశిల్పి. నాశిక్ పబ్లిక్ లైబ్రరీనుంచి సమర్థవంత మైన పార్లమెంటేరియన్‌గా ఆ యన దివంగత మాధవరావు లిమాయే అవార్డును అందుకున్నారు. మహారాష్ట్రలో వివిధ పదవు లు నిర్వహించిన ఆయన రాష్ట్ర అభివద్ధికి ఎంతగానో దోహదం చేశారు.
బీజేపీ రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన క్లిష్ట సమయంలో అంటే 2009, డి సెంబర్‌లో నితిన్ గడ్కర్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. తుహిన్ సి న్హాతో కలిసి ఆయన “ఇండియా యాస్పైర్స” అనే పుస్తకాన్ని రచించారు. ఇందులో తన అభివద్ధి నమూనాల గురించి చాలా విపులంగా వివరించారు. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ ఎనర్జీ వినియోగం, వ్యర్థ పదార్థాల నిర్వహణ వంటి అంశాలపై ఆయన స్పష్టంగా వివరించారు. నిరుపేదల అభ్యున్నతికి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సూత్రాలు అత్యంత అవసరమని ఆయన గట్టిగా చెబు తారు. 2013 జనవరి వరకు ఆయన పార్టీ అధ్యక్షులుగా కొనసాగారు. 2014 మే నెలలో కేం ద్ర రవాణా`హైవేల మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన అధికారంలోకి వచ్చిన ప్పుడు అప్పటివరకు రోజుకు 2కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం సాగేది. మొదటి సంవత్సరం దీన్ని రోజుకు 16.5 కిలోమీటర్లకు, రెండో సంవత్సరం 21 కిలోమీటర్లకు, 2018 నాటికి రోజుకు 30 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారుల నిర్మాణం జరిగేలా చర్యలు తీసు కున్నారు. ఆయన హయాంలో ఈ ప్రాజెక్టుల నిమిత్తం కేటాయించిన ఒక ట్రిలియన్ రూపాయి ల్లో ఒక శాతం మొక్కలు, సుందరీకరణకు కేటాయించారు. ఇక రెండో టర్మ్‌లో ఇదే పదవిలో కొనసాగుతూ 2019లో జాతీయ రహదారుల నిర్మాణం రోజుకు 36 కిలోమీటర్లకు పెంచారు. ఆవిధంగా రోజుకు 68 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంధన రం గంలో ఆత్మనిర్భర్ భారత్ సాధించాలన్నది ఆయన ýక్ష్యం. ఇందులో భాగంగానే ఆయన హైడ్రో జన్ ఇంధనంతో నడిచే ఎఫ్‌సీఈవీ టోయ్‌టా మిరాయ్ కారును నడుపుకుంటూ పార్లమెంట్‌కు రావడం విశేషం. పెట్రోల్‌లో గ్యాసోలిన్, ఇథనాల్ కలపడం, ఇక అస్ఫాల్ట్`బిటుమెన్ రోడ్లకు ప్లా స్టిక్‌ను కలిపే ప్రక్రియను ప్రోత్సహించడం వంటి గడ్కరీ ప్రక్రియలు అధికార, విపక్ష పార్టీలనుంచి ప్ర శంసలు అందుకున్నాయి. నమామి గంగే ప్రాజెక్టుకు ఆయన నాయకత్వం వహించారు. ఆయన హయాంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వేగంగా రోడ్లు నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఆయన్ను పార్టీల కతీతంగా “డెవలప్ మెంట్ మ్యాన” అని కీర్తిస్తారు. ఆయన ప్రారంభించిన భారత్ న్యూ కార్ అసెస్మెంట్ కా ర్యక్రమాన్ని పార్టీలతో సంబంధం లేకుండా అంతా ప్రశంసించారు. దీని ప్రకారం కారు ప్రయాణంలో మరింత భద్రత కోసం ఆరు బెలూన్లు తప్పనిసరి చేశారు. అయితే ఈ నిర్ణయం కొందరు కార్ల తయారీ కం పెనీలకు ఆగ్రహం కలిగించింది. గడ్కరీ ప్రతి ఏటా “ఖస్దార్ సాంస్కతిక్ మీVAత్సవ”ను నిర్వహించారు. ఇందులో భారతీయ వైవిధ్య సాంస్కతిక వారసత్వం, సంప్రదాయ కళలు, సంగీతం, నత్యం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. గడ్కరీ తనను ఒక “వ్యవసాయదారుడిగా” నమోదు చేసుకున్నారు. “కేటకీ ఒవర్సీస్ కంపెనీ” పేరుతో విదేశాలకు పండ్లు ఎగుమతి చేసే కం పెనీ నెలకొల్పారు. పూర్తి గ్రూపు కింద విదర్భ ప్రాంతంలో 17 చెరకు ప్లాంటేషన్లున్నాయి. పూరీ పవర్ అండ్ షుగర్ లిమిటెడ్‌ను (ప్రస్తుతం పూరీ గ్రూపు)ను 1995లో ఏర్పాటుచేశారు.
ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో దేశంలో ముఖ్యమైన రహదారుల ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. 1. ఢిల్లీ`ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే: ఇది పూర్తయితే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ కాలం 24 గంటలనుంచి 12 గంటలకు తగ్గిపోతుంది. 2. దేశవ్యాప్తంగా 35వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ముఖ్యంగా ఆర్థిక కారిడార్లు, సరిహద్దు రోడ్లపై ఇది దష్టి కేంద్రీకరిస్తుంది. 3. శ్రీనగర్`లేహ్ మధ్య అన్నివాతావరణ పరిస్థితుల్లో ప్రయాణించేలా ఆసియాలోనే అతిపొడవైన రెండు దిశల సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. 4. గ్రీన్ హైవేస్: రహదారుల వెంట చెట్లను నాటడం, పర్యావరణ హితమైన రోడ్ల నిర్మాణంపై దష్టి కేంద్రీకరిస్తున్నారు. 5. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌లు: సరకు రవాణా ఖర్చులు తగ్గించడానికి దేశంలోని ప్రధాన మార్గాల్లో ఆధునిక లాజిస్టిక్ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
