గొల్లపల్లి నేటి ధాత్రి:
గొల్లపల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి శ్రీ భక్త ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి 15వ వార్షికోత్సవం సందర్భంగా వారికి శాలువ కప్పి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని వేడుకున్నారు. అనంతరం ఆత్మకూర్ – దమ్మన్నపేట గ్రామాల మధ్య క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేవెల్ల సత్యనారాయణ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ బొలిశెట్టి నరేష్, వైస్ చైర్మన్ గుండ స్వామి, రేగుంట బాపు ఆత్మకూర్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు అత్తెన శివయ్య, దమ్మన్నపేట గ్రామ శాఖ అధ్యక్షులు మామిడిపల్లి రమేష్, మాజీ ఉపసర్పంచ్ అత్తిన శివరాజ్యం, రాజు రాజేందర్, నేరెళ్ల మహేష్, ఓర్సు విజయ్ ఆలయ కమిటీ సభ్యులు హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.