హైడ్రా కు మా పూర్తి మద్దతు ఎన్ ఎచ్ అర్ సి రాష్ట్ర అధ్యక్షులు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి

– *రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ ల ముందు సంగీబావ కార్యక్రమం.*

– *హైడ్రా ను అన్ని జిల్లాలకు విస్తరింపజేయాలి – ఎన్ ఎచ్ అర్ సి.*

– *హైడ్రా ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి, మరియు, హైడ్రా కమిషనర్ గా వ్యవహరిస్తున్న శ్రీ ఏ. వి రంగనాథ్ గారికి ప్రతేక ధన్యవాదాలు – శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు, ఎన్ ఎచ్ అర్ సి జిల్లా అధ్యక్షులు*.

 

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎన్ ఎచ్ ఆర్ సి కార్యాలయం ముందు హైడ్రా ప్రణాళికకు మద్దతుగా, అంతే కాకుండా ఈ పద్దతిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లకలకు కూడా విస్తరంప చేయాలని జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందివ్వడం జరిగింది…

*నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్‌సాగర్‌తోపాటు… దశాబ్దాలుగా హైదరాబాదీల దాహర్తిని తీర్చిన జంట సాగరాలను వేలాది చెరువులను తవ్వించారు. ఈ సరస్సులను సంరక్షించి వారసత్వ సంపదగా భవి ష్యత్‌ తరాలకు అందించా ల్సిన బాధ్యతను విస్మరిస్తూ చెరువులను చెరబడుతుం డటమే నేటి దౌర్భాగ్యమ్*

 

అందుకే ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది… నగరం లోని సరస్సులకు పూర్వవై భవం తెచ్చేందుకు ప్రయత్ని స్తోంది.

 

హైదరాబాద్ కోటిన్నర జనాభాను కడుపులో పెట్టుకున్న విశ్వ నగరం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సగం కుటుంబాలకు ఆసరా మన హైదరాబాద్‌. తెలుగు రాష్ట్రాలే కాదు దేశం నలుమూలల నుంచి ఇక్కడి వచ్చి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న వారు లక్షల్లోనే ఉన్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం విశ్వనగరం గా వర్ధిల్లాలని ఐదు శతాబ్దా ల క్రితమే మన పూర్వీకులు దీవించారు. అందమైన నగ రం నిర్మించాలని… నగరం నలుమూలలా సరస్సులను తవ్వించారు. కబ్జాలు చేస్తూ కోట్ల రూపాయల సంపాదన హైదరాబాద్‌ ఎంత బాగుం టే మనం అంత బాగుంటాం అనేది మన పూర్వీకుల ఆలోచన..

 

కానీ, ప్రస్తుతం ఇక్కడున్న వారికి హైదరాబాద్ చరిత్ర తో పనిలేదన్నట్లే వ్యవహరి స్తున్నారు. అందమైన హైద రాబాద్.. ఆరోగ్య హైదరా బాద్.. ప్రశాంత హైదరాబాద్ కోరుకుంటూనే ఎవరికి తోచి న విధంగా వారు విధ్వంసం సృష్టిస్తున్నారు.

 

సువిశాల రోడ్ల కోసం, అత్యాధునిక వసతుల కోసం నగరం నడిబొడ్డున ఉన్న చెరువులు, నాలాలను కప్పేస్తున్నారు. కబ్జాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. పైసలు వస్తున్నాయని సంబరమే కానీ, భవిష్యత్‌ తరాలను నాశనం చేస్తున్నామని ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. ఇలాంటి వారి అత్యాశ ఫలితమే.. 

 

చిన్న వర్షం కురిసినా నగరంలో వరద పోటెత్తు తోంది… ఈ సమస్య పరిష్కా రంతోపాటు భవిష్యత్‌ తరా లకు భద్రత కల్పించేందుకు ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది.

 

హైదరాబాద్ సిటీ పెరుగు తున్న కొద్దీ సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. ఓ వైపు అభివృద్ధి సూచికలు బలంగా కనిపిస్తున్నాయని ఆనందపడాలో…చేసిన తప్పులూ వెంటాడుతు న్నాయని చింతించాలో తెలియని దుస్థితి. 

 

ఐదేళ్లు.. పదేళ్లుగా చేసిన తప్పులు కాదు.. మూడు, నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న తప్పులు ఇప్పుడు హైదరాబాద్‌ నగరాన్ని వెంటాడుతున్నారు. 

 

ఆ తప్పులు సరిదిద్దడం అంత తేలిక కాదు. కానీ, ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయమే తీసుకుంది. చెరువులను చెరబట్టిన వారి భరతం పడుతూ హైడ్రాకు ఫుల్‌ పవర్స్‌ ఇచ్చింది అది ఆదర్శనియం..

అలాగే తెలంగాణ మొత్తం ప్రతి జిల్లాలో సైతం ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో సైతం హైడ్రా మాదిరిగా ఉండాలి అని అలాగే హైడ్రాకు ఏ విధంగా సహకారం అధిస్తున్నామో ఆ విదంగా ప్రతి జిల్లాకు మా జాతీయ మానవ హక్కుల సంఘము సహకరిస్తుంది అని తెలియజేస్తున్నాము…..ఈ సందర్భంగా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది…ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలో తొందరగా తీసుకోస్తారు అని తెలంగాణ ప్రభుత్వన్నీ మా సంస్థ ద్వారా కోరుకుంటున్నాం….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *