
పెండింగులో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి
ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ డిమాండ్
భూపాలపల్లి నేటిధాత్రి
నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులందరిని ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని అలాగే పెండింగులో ఉన్న 3నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ అన్నారు,సుప్రీంకోర్టు కోర్ట్ తీర్పు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎన్ హెచ్ ఎం స్కీమ్ ఉద్యోగుల ధర్నా అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ పేద బడుగు ప్రజలకు సేవ అందించడంలో ఎన్హెచ్ఎం స్కీం లో పనిచేస్తున్న ఉద్యోగులు అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నారు,ప్రభుత్వం వీరిని శ్రమదోపిడికి గురిచేస్తుందని అన్నారు,ముఖ్యంగా కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేశారని గుర్తు చేశారు,కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని లేనిపక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు,అలాగే 7 నెల ఏరియాస్ బకాయిలు వెంటనే ఇవ్వాలని అన్నారు ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఒకటవ తేదీన వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు,ముఖ్యంగా 2వ ఏఎన్ఎంలు గతంలో సమ్మె చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చింది. కాని నేటివరకు హామీని అమలు చేయడం లేదని అన్నారు,
ఈ కార్యక్రమంలో సరళ, కృష్ణవేణి,ప్రవీణ్, రాజు, ప్రభాకర్, హాసన్, విజయ, శ్యామల, శ్యామలత, సుజాత, శంకర్ తో పాటు ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది