
-నాంపెళ్లి గుట్ట మీద ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్ రిపిటర్ ప్రారంభించిన
-జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీస్ అధికారులు, సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు, పరిపాలనా సౌలభ్యాన్ని పెంచుకునేందుకు వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ కి అనుబంధంగా నిర్మించిన గదులను మరియు మారుమూల ప్రాంతాలకు కమ్యూనికేషన్ సేవలు అందించడానికి నాంపెళ్ళి గుట్ట మీద ఏర్పాటు చేసిన రిపిటర్ ను ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,
*అనంతరం నాంపెళ్లి గుట్ట మీద ఉన్న శ్రీ లక్ష్మి నరసింహా స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించన ఎస్పీ
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ లో పోలీస్ సేవలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మరియు పరిపాలనా సౌలభ్యాన్ని పెంచుకునేందుకు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ కి అనుబంధంగా నిర్మించిన స్టేషన్ గదులను ప్రారంభించడం జరిగిందని అన్నారు.అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ విధినిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ ప్రజలతో స్నేహపూర్వకంగా క్రమశిక్షణతో ఉండాలని సూచించారు.
పోలీస్ శాఖలో విప్లవాత్మకంగా మార్పులు రావడం జరిగిందని జిల్లాలో మారుమూల ప్రాంతాలకు పోలీస్ కమ్యూనికేషన్ సేవలు నిరంతరం అందించడానికి నాంపెళ్లి గుట్ట మీద కమ్యూనికేషన్ రిపిటర్ ఏర్పాటు చేయడం జరిగింది, దినివలన పోలీస్ సిబ్బంది జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్న ఎలాంటి అవాంతరాలు లేకుండా కమ్యూనికేషన్ సెట్ ద్వారా ఎక్కడి నుండి ఆయన మాట్లాడవచ్చు అని జిల్లా ఎస్పీ అన్నారు.
ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ లు కరుణాకర్, శ్రీనివాస్, కమ్యూనికేషన్ సి.ఐ శ్రీలత పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.