బి ఆర్ ఎస్ యువ నాయకులు నాగేందర్ పటేల్ ఆధ్వర్యంలో నూతన ఎస్సై కి సన్మానం
జహీరాబాద్ నేటి ధాత్రి;
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన క్రాంతికుమార్ పటేల్ కు శుక్రవారం నాడు బోరేగావ్ బి ఆర్ ఎస్ యువ నాయకులు నాగేందర్ పటేల్ ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ కి పుష్ప గుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ మాట్లాడుతూ శాంతి భద్రతలు పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు వీరన్న బస్వరాజ్ జైకర్ రామచంద్ర నాగరాజ్ సి,మల్లన్న నాగేంద్ర పటేల్ తదితరులు పాల్గొన్నారు.