మంత్రుల మంతనాలా!అధికారులపై కేసులా!!
-రో హౌస్‌ల విషయంలో రోజుకో ట్విస్టా!
-రో హౌస్ ల విషయంలో తాజాగా 3 కోట్లు ఎవరికి చేరాయి!
-ఏ ఇద్దరికి ఆ మూడు కోట్లు అందాయి!
-చదలవాడ దగ్గర మళ్ళీ మూడు కోట్లు ఎందుకు తెచ్చారు!
-రో హౌస్ లను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వారెవరు!
-రో హౌస్‌లు కూల్చుతారా…లేదా!
-కార్మికులకు న్యాయం చేస్తారా..లేదా!
-మంతనాలు చేసి మాయ చేస్తారా!
-రో హౌస్ నిర్మాణమే అక్రమం!
-స్వయంగా ఒప్పుకుంటున్న పాలక వర్గం!
-రో హౌస్ లు కాపాడడంలో ఆంతర్యం?
-కార్మికులకు బఫర్ జోన్ ట్విన్ టవర్ల నిర్మాణాలా?
-బఫర్ జోన్ లో ట్విన్ టవర్స్ సాధ్యమా!
-సినీ పెద్దలకు 14 ఎకరాలు ఎందుకిచ్చినట్లు?
-ప్రభుత్వ పర్మిషన్లకు బదులు అదనంగా ఎలా కట్టుకున్నారు!
-రో హౌస్ లకు నోటీసులతో సరిపెడతారా?
-కూల్చేసి కార్మికులకు న్యాయం చేస్తారా!
-రో హౌస్ లు కూల్చి అక్కడ ట్విన్ టవర్స్ కట్టలేరా!
-సినీ గద్దలను అక్కడి నుంచి తరిమేయలేరా!
-చిత్రపురిలో ఇతరులకు ఇండ్లు ఎలా వచ్చాయి?
-తమ్మారెడ్డి చెప్పేదాంట్లో నిజమెంత?
-తన ప్రమేయమేమీ లేదనే మాటల్లో వాస్తవమెంత!
-తమ్మారెడ్డి కార్మిక పక్షపాతే అయితే రో హౌస్‌లు ఎందుకు అడ్డుకోలేదు!
-కార్మికులకు అన్యాయం జరుగుతుంటే నోరెందుకు విప్పలేదు?
-తమ్మారెడ్డి హయాంలోనే అవినీతి జరిగిందన్న ఆరోపణలు అనేకం వున్నాయి!
-అసలైన కార్మికులకు అన్యాయం మొదలైందే తమ్మారెడ్డి హయాంలోనేనా?
-లెక్కకు మించి సభ్యత్వాలు ఎందుకు తీసుకున్నారు?
-కార్మికుల నుంచి లక్షలు ఎందుకు వసూలు చేశారు!
-వారికి ఫ్లాట్లు కేటాయించక ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారు?
-ఎంత కాలం ఎడతెగని పంచాయతీ చేస్తారు?
-ఇంకెంత మంది కార్మికుల ఉసురుపోసుకుంటారు!
హైదరాబాద్,నేటిధాత్రి:
అసలు చిత్రపురిలో ఏం జరుగుతోంది? రో హౌజ్‌ల నిర్మాణం అక్రమమని ఓ వైపు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. మరో వైపు సంబంధిత వ్యక్తులు మంత్రులతో మంతనాలు జరుపుతున్నారు? ఇదెక్కడి రాజకీయం? ప్రభుత్వ ఆదేశాలను ఓ వైపు పకడ్బందీగా అమలు చేయాలని అదికారులు చూస్తుంటే మరో వైపు ఓ ఇద్దరు మంత్రులు రోహౌజ్‌ల కూల్చివేతల నిర్ణయంపై చర్చలు సాగిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి? అవి నిజమా? కాదా? అన్నది తేలాల్సివుంది. ఈ విషయంలో ఇప్పటికే ఓ ఇద్దరు మంత్రులకు మూడు కోట్లు ముట్టినట్లు కూడా చిత్రపురిలో చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్మికులకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తుంటే కొందరు మంత్రులు తమ తమ లాభాపేక్ష కోసం పాకులాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రుల అనవసర జోక్యంతో ప్రభుత్వానికి మచ్చ వచ్చేలా వుందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే రో హౌజ్‌లకు అసలు ఎవరూ పర్మిషన్లు ఇవ్వలేదు. చిత్రపురి సొసైటీ నిర్ణయం మేరకు అప్పటి ప్రభుత్వాల ఆదేశాల మేరకు కేవలం 1550 ఎస్‌ఎఫ్‌టీ నిర్మాణం కోసం పర్మిషన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అది చాలదన్నట్లు చిత్రపురి సొసైటీ కీలక సభ్యులతోపాటు, రోహౌజ్‌ల యజమానులు 255ం ఎస్‌ఎఫ్‌టీల పర్మిషన్ల కోసం ధరఖాస్తులు చేసుకున్నారు. కాని వాటిని ఏ అదికారి అంగీకరించలేదు. దానిపై కొన్ళేళ్లుగా ఎలాంటి నిర్ణయం కూడా ప్రకటించలేదు. కాని నిర్మాణాలు మాత్రం పూర్తి చేసుకున్నారు. తమకు పర్మిషన్లు వస్తాయన్న ఆలోచనతో యజమానులున్నారు. అలా నిర్మాణాలు చేసుకున్నవారు, ఒకప్పటి సొసైటీ ముఖ్యులు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మంత్రులు సొసైటీ సభ్యులతో మంతనాలు జరపడం వల్ల మొదటికే మోసం వచ్చే అవకాశం వుంది. కార్మికులకు మరింత తీరని అన్యాయం జరగనున్నది. చిత్రపురి సాగతీత ఎంత కాలం జరుగుతుందన్నది చెప్పలేనంత సాగుతోంది. దానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? కార్మికులకు ఎప్పుడు న్యాయం జరుగుతుందన్న దానిపై నమ్మకం లేకుండా పోతోంది. కొన్ని సంవత్సరాలుగా కార్మికులు పోరాటం చేస్తున్నారు. కార్మికుల పక్షాన నిలవాల్సిన వాళ్లు పెద్దలుగా చెలామణి అవుతూ ఆది నుంచి అన్యాయం తలపెడుతూనే వస్తున్నారు. చిత్రపురి అన్నది కేవలం కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సొసైటీ. అందులో పెద్దలు ఎందుకు దూరారు? కార్మికులల్లో నాయకులు లేరా? కార్మికుల పక్షాన నిలబడతామని పెద్దలు దూరితే న్యాయం జరగుతుందా? ఎక్కడైనా ఏ సొసైటీ అయినా సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తారు? కాని చిత్రపురి విషయంలో కార్మికులు సమిధలౌతున్నారు. సినీ పెద్దలు రాజ్యమేలుతున్నారు. ఇష్టానుసారం కేటాయింపులు చేస్తున్నారు. అసలు వుండాల్సిన కార్మికులు ఎంత మంది? వున్న కార్మికులు ఎంత మంది? లెక్కకు మించి సభ్యత్వాలు ఎందుకిచ్చారు? ఇచ్చిన కార్మికులను న్యాయం చేయకుండా ఎందుకు తప్పించుకుంటున్నారు? ఇంకా కొత్తగా ఎందుకు సభ్యత్వాలు ఇస్తున్నారు? వారికి ఎక్కడ న్యాయం చేస్తారు? ఎలా ఫ్లాట్లు కేటాయిస్తారు? చిత్రపురి సొసైటీ నిర్మాణానికి ముందు వున్న కార్మికుల లెక్కెంత? ఇప్పుడు జాబితాలో సభ్యులెంత? ఇదంతా లెక్కలోకి తీసుకోకుండానే, నిర్మాణాలు ఎలా చేశారు? ఎలా కేటాయింపులు చేశారు? ఇప్పుడు ఎందుకు చేతులెత్తేస్తున్నారు? అడుగడుగునా కార్మికులకు ఎందుకు తీరని అన్యాయం చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాదానం ఎవరు చెబుతారు?
రోహౌజ్‌లను కూల్చాలన్నదానిపై సొసైటీ ఎందుకు ఏక వాఖ్య తీర్మానం చేయలేకపోతోంది? ఏకాభిప్రాయానికి ఎందుకు రావడంలేదు?
గత సొసైటీ పెద్దలు చేసిన తప్పు, వెంటాడుతున్నా, కొత్త సొసైటీ ఎందుకు జాప్యం చేస్తోంది మేమంతా బాగానే చేశాం..మా హాయాంలో అన్నీ పూర్తి చేశాం…కార్మికులకు న్యాయం చేశామంటూ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఎలా చెబుతున్నారు? తమ్మారెడ్డి భరద్వాజ హయాంలోనే తప్పులకు భీజం పడిరదని అందరూ వేలెత్తి చూపుతున్నారు. కాని మా మీద కేసులెందుకు పెడుతున్నారని తమ్మారెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఆనాడే చిత్రపురిలో కార్మికులకు తప్ప ఇతరులకు స్ధానం లేదని తమ్మారెడ్డి ఎందుకు తేల్చిచెప్పలేదు. ఆయన హయాంలో జరిగిన అవతవకలను నుంచి తప్పించుకుంటానంటే సరిపోదు? రోహౌజ్‌ల నిర్మాణంలో తమ్మారెడ్డి బరద్వాజ చెబతున్న విషయాలు విచిత్రంగా వున్నాయి. 14 ఎకరాల్లో నిర్మాణం జరిగిన రో హౌజ్‌లన్నీ అన్ డివైడెడ్ ప్రాపర్టీలంటూ ఇప్పుడు కొత్త భాష్యం చెబుతున్నాడు. నిజానికి మొత్తం చిత్ర పురి అంతా ఫ్లాట్ల నిర్మాణం జరపాలన్న జీవో మాత్రమే వుందని కూడా ఆయనే చెబుతున్నారు. ఆ జీవోను అతిక్రమించామని ఆయనే స్వయంగా ఒప్పుకుంటున్నారు. 2005 నుంచి 2015 వరకు తమ్మారెడ్డి భరద్వాజ నేతృత్వంలోనే సొసైటీ కొనసాగింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏమిటి? అందులో సూచించిన విషయాలేమిటి? ఇచ్చిన నిబందనలు ఏమిటన్నది తమ్మారెడ్డికి పూర్తిగా తెలుసు. కేవలం ఫ్లాట్లు మాత్రమే నిర్మాణం చేయాల్సిన అవసరం, ఆగత్యం మాత్రమే వుండాలి. కాని రో హౌజ్‌ల నిర్మాణానికి పర్మిషన్ ఎలా తెచ్చుకున్నారు? ఎందుకు తెచ్చుకున్నారు? ఎవరి ప్రయోజనాలు ఆశించి రో హౌజ్‌లు నిర్మాణం చేశారు? వాటిని కార్మికులకు కాకుండా ఇతరులకు ఎందుకు ఇచ్చారు? వీటికి సమాధానం అప్పటి పాలక వర్గం సమాదానంచెప్పాలి. రో హౌజ్‌లు ఇండివిడివల్ ప్రాపర్టీ కాదని స్వయంగా తమ్మారెడ్డి ఓ ఇంటర్వూలో చెప్పారు. వ్యక్తిగత ప్రాపర్టీలు కానప్పుడు అమ్మిన వాళ్లు ఎలా అమ్మారు? కొన్న వాళ్లు ఎలా కొనుక్కున్నారు? ఇప్పుడు కూల్చడానికి అడ్డుపడుతున్నవాళ్లెవరు? ఆ నిర్మాణాలే అక్రమం? రో హౌజ్‌ల్లో పై అంతస్ధు వేయడమే నిశిద్దం? పైగా ప్రభుత్వ పర్మిషన్లు ఇచ్చినట్లుగా చెబుతున్న 1550 ఎస్‌ఎఫ్‌టీ కాకుండా, 2550 ఎస్‌ఎఫ్‌టీ నిర్మాణాలు సాగుతుంటే ఎలా ఊరుకున్నారు? మొత్తం పద్నాలుగు ఎకరాల్లో, 225 రో హౌజులలో ఒకటో, రెండో అలా రూల్స్ వైయిలేషన్ చేసి కట్టారంటే ఎక్కొడో పొరపాటు జరిగిందని అనుకోవచ్చు. కాని మొత్తం నిర్మాణాలన్నీ నిబంధనలకు వ్యతిరేకంగానే జరుగుతుంటే ఏం చేశారు? జరిగిందే తప్పు..చేసిందే తప్పు..ఇంకా కప్పిపుచ్చుకోవడం, తమకు సంబంధం లేదని తప్పుకుంటే సరిపోతుందా? అన్యాయం జరిగిన కార్మికులకు న్యాయం జరుగుతుందా?
ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో కేవలం 225 మందికి 14 ఎకరాలు తీసుకొని, మిగిలిన 4 ఎకరాల్లో కార్మికులకు ట్విన్ టవర్స్ నిర్మాణం చేస్తామంటున్నారు.
కార్మికులకు ట్విన్ టవర్స్ నిర్మాణం చేస్తామంటున్న స్ధలం ఎల్లమ్మచెరువు బఫర్ జోన్‌లో వుందన్నది తేలింది. ఆ విషయం సొసైటీ పాత పెద్దలకైనా, కొత్త పెద్దలకూ తెలుసు. అప్పటి పెద్దలు, ఇప్పటి పెద్దలు మళ్లీ కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తుంటే అడిగేవారు లేరా? రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్ధలాలు ఆక్రమించుకున్నవారిపై, హైడ్రా కొరడా రaులిపిస్తోంది. ఇలాంటి సమయంలో బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపడితే నష్టం మళ్లీ కార్మికుల ఖాతలో వేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారా? ఆ బఫర్ జోన్ 4 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం వుంది. నిర్ణయం జరిగిపోయిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అలాంటప్పుడు ఇంకా కార్మికులను మోసం చేసే ప్రకటనలు చెందుకు చేస్తున్నారు. ట్విన్ టవర్స్ నిర్మాణం చేసి ప్లాట్లు ఇస్తామని ఎంత మంది కార్మికులకైతే మాట ఇచ్చారో..వాళ్లందరికీ రో హౌజ్‌లు కూల్చివేసి, ఆ స్ధలంలో కొత్తగా నిర్మాణాలు చేసి ఇవ్వాలి. హైడ్రా తన పంజా విసురుతున్న సమయంలో కూడా కార్మికులను మసిబూసి మారేడు కాయ చేయాలని చూడడం నేరం. ఇప్పటికే గత సొసైటీ పెద్దలపై కేసులు నమోదుచేశారు. ఆ కేసు కొట్టి వేశారంటూ కొందరు పెద్దలు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అంటే మా తప్పు లేదని చెప్పుకోవడానికి అవకాశంగా తీసుకుంటున్నారు. కాని అన్యాయం జరిగిందే అప్పటి నుంచి… రో హౌజ్‌ల హైడ్రామా మొదలైందే అప్పటి నుంచి…అందుకే రోహౌజ్‌ల కూల్చివేత జరగాలి. కార్మికులకు అదే స్ధలంలో ట్విన్ టవర్స్ నిర్మాణం చేయాలి. కార్మికులకు సొంత ఇంటి కల నెరవేర్చాలి. సినీ గద్దలు అక్కడి నుంచి వెళ్లిపోవాలి. పాలక వర్గంలో సినీ గద్దల జోక్యం ఆగిపోవాలి.