ఎంపీ వద్దిరాజు వరద బాధితులకు చేయూత

*Date 02/09/2024*


*బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తన పెద్ద మనస్సును మరోసారి చాటుకున్నారు*

*గొప్ప దైవ భక్తుడిగా గుళ్లు,గోపురాల నిర్మాణాలు,పేద విద్యార్థుల చదువులు,నిరుపేదల పెళ్లిళ్లకు కొన్నేళ్లుగా చేయూతనందిస్తున్న సేవాభావం,అన్నదాతగా రవిచంద్రకు సమాజంలో మంచి పేరున్న విషయం తెలిసిందే*

*ఖమ్మం నగరంలో మున్నేరు వరద బాధితులను సోమవారం పరామర్శించిన ఎంపీ వద్దిరాజు సాయంత్రం వారికి నిత్యావసరాలు అందించారు*

*వరద వల్ల బాగా నష్టం వాటిల్లిన 48వ డివిజన్ వెంకటేశ్వర నగర్ ,47వ డివిజన్ బొక్కలగడ్డ,46వ డివిజన్ జూబ్లీపుర వాసులకు ఎంపీ రవిచంద్ర బియ్యం,కందిపప్పు, ఉల్లిపాయలు,ఆలుగడ్డలు,మంచి నూనె,ఉప్పు ప్యాకెట్స్, కూరగాయలు అందజేశారు*

*ఈ సందర్భంగా ఖమ్మం బురహాన్ పురం ఎంపీ వద్దిరాజు నివాసంలో ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు వేములపల్లి వెంకటేశ్వరరావు,గుండ్లపల్లి శేషగిరిరావు,మాటేటి నాగేశ్వరరావు,తోట రమేష్,సెల్వం జ్ఞానేశ్వర్ తదితరులు ఉన్నారు*

*బాధితులకు అందించే నిత్యావసరాలను ప్యాకింగ్ చేయడంలో ఎంపీ రవిచంద్రకు ఆయన చిరకాల అభిమానులు వెంపటి ఉపేందర్,సుంకర చిరంజీవి,నానబాల హరీష్,ఆకుల సాయి,గుమ్మడవెల్లి హరీష్,మద్దెల భానుప్రతాప్,వారాల గణేష్,అరుణ్ నాయక్,చరణ్, సాయికుమార్,కార్యాలయ సిబ్బంది సహకరించారు*

*ఈ నిత్యావసరాలను ఆ యా డివిజన్ల కార్పోరేటర్లు తోట గోవిందమ్మ రామారావు,మాటేటి అరుణ నాగేశ్వరరావు,కన్నం వైష్ణవి ప్రసన్నలు బాధితుల ఇళ్లకు వెళ్లి అందజేశారు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *