
సుందరయ్యనగర్ గౌస్ కబ్రస్థాన్ నూతన కమిటీ ఏర్పాటు
నేటిధాత్రి, వరంగల్
వరంగల్ ఏనుమాముల మార్కెట్, మిర్చి యార్డు వద్ద ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ వసీం, మహమ్మద్ సలీంలా ఆధ్వర్యంలో మైనార్టీల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో సుందరయ్యనగర్ లోని కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కొరకు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిఎకైన వారిలో కమిటీ గౌరవ అధ్యక్షుడుగా అబ్దుల్ ఖయ్యూం, అధ్యక్షుడిగా మహమ్మద్ ఆజం ఖాద్రి( బబ్బు ), ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ఉస్మాన్, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ సలీం సయ్యద్ అఫ్జల్, కోశాధికారిగా షేక్ ఉమర్, ఉప కోశాధికారిగా మహమ్మద్ జావిద్, సహాయ కార్యదర్శులుగా ఎండి మహబూబ్, షేక్ జావిద్, ముఖ్య సలహాదారుగా సయ్యద్ వసీం, గౌరవ సలహాదారులుగా ఎండి సాబీర్, జహీర్ భాష, అక్బర్, షేక్ యాకూబ్, కార్యవర్గ సభ్యులుగా షేక్ అబ్జల్, ఎండి గౌస్, ఫెరోస్, సోహెల్, ఫరీద్ బాబా, ఆరిఫ్, ముజాహిద్, ముస్తఫా లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.