https://epaper.netidhatri.com/view/251/netidhathri-e-paper-2nd-may-2024%09/3
అటు కేసిఆర్, ఇటు హరీష్ ఇద్దరి ఆశీస్సులు.
ఆది నుంచి మెదక్ బిఆర్ఎస్కు కంచుకోట.
కాంగ్రెస్ హయాంలో మెతుకుకు దిక్కులేని సీమ.
పదేళ్ల బిఆర్ఎస్ కాలంలో మెదక్ అన్నపూర్ణ.
కాంగ్రెస్ వచ్చింది…కరువొచ్చింది.
మెదక్ మెతుకుకోసం మళ్ళీ తల్లడిల్లుతోంది.
నిన్నటి దాక మంజీర పరవళ్లు తొక్కింది.
కాంగ్రెస్ రాగానే ఎండిపోతోంది.
బిఆర్ఎస్ హయాంలో మెదక్ అంతా సస్యశ్యామలం.
కాంగ్రెస్ రాగానే ఎడారి మయం.
ఆనాడు ఇందిరా గాంధీ గెలిచినా చేసిందేమీ లేదు.
ఇప్పుడు కాంగ్రెస్ ఒరగబెట్టేదేమీ లేదు.
వనరులను వినియోగించడం కాంగ్రెస్‌కు చేతకాదు.
బిఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధికి తిరుగుండదు.
మెదక్ మేలు కోరేది బిఆర్ఎస్సే.
మెదక్ గడ్డ ఎప్పుడైనా బిఆర్ఎస్దే
కాంగ్రెస్ కాలంలో మెతుకు కోసం ఎడ్చిన సీమ!
కేసిఆర్ చలువతో మెదక్ పచ్చని పొలాల కోనసీమ!!
హైదరాబాద్,నేటిధాత్రి:
ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది బిఆర్ఎస్ జోరు మరింత పెరుగుతోంది. ముఖ్యంగా మెదక్ జిల్లాలో ఆది నుంచి కారు జోరే వుంది. పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి కూడా కారుదే హవా కనిపిస్తోంది. ఓ వైపు ముఖ్యమంత్రి కేసిఆర్ ఉమ్మడి సొంత జిల్లా. 2014లో ఆయన కూడా మెదక్ నుంచి పోటీ చేసి నాలుగు లక్షల పై చిలుకు రికార్డు మెజార్టీని సాధించారు. ఆ తర్వాత ప్రభాకర్‌రెడ్డి రెండు సార్లు గెలిచారు. ఈసారి బరిలో మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి బిఆర్ఎస్ తరుపున బరిలో వున్నారు. వెంకట్రామ్‌రెడ్డికి మెదక్ జిల్లాతో ఎంతో అనుబంధం వుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన గ్రూప్ ఆఫీసర్ గా మెదక్ జిల్లాకు వివిధ హోదాలలో సేవలందించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన సిద్దిపేట,సిరిసిల్ల జిల్లాలకు కలెక్టర్‌గా సేవలందించారు. ఆయన కలెక్టర్‌గా వున్న సమయంలో సిద్దిపేట జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ల నిర్మాణంలో జరిగింది. వాటి పూర్తికి వెంకట్రామిరెడ్డి కృషి ఎంతో వుందని చెప్పాలి. అధికారిగా ఎంతో మంచి పేరు ఆయనకు వుంది. ప్రభుత్వాలు చేపట్టే పనులు ఎంత సమర్ధవంతంగా పూర్తి చేసే చురుకైన అధికారులల్లో ఒకరుగా గుర్తింపు వుంది. ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ అనేక అవార్డులు, రివార్డులు అందుకుంటుండేవారు. సామాజిక సేవ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకే ఆయన ఉన్నతోద్యోగిగా ఎప్పుడూ పేదల గురించి ఎక్కువగా ఆలోచించేవారు. వారికి మేలు చేసేందుకు కృషి చేసేవారు. అంతటి మంచి పేరున్న వెంకట్రామిరెడ్డి ఇప్పుడు బిఆర్ఎస్ అభ్యర్ధిగా మెదక్ నుంచిపోటీ చేస్తున్నారు. ఒక సమర్ధవంతమైన అధికారిగా వున్న వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా సిద్దిపేట జిల్లాకు ఎనలేని సేవలు చేశాడు. ఆ గుర్తింపుతోనే కేసిఆర్ వెంకట్రామి రెడ్డి చేత రాజీనామ చేయించి, ఎమ్మెల్సీని చేశాడు. గత శాసన సభ ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ గెలిచి వుంటే, వెంకట్రామ్ రెడ్డి మంత్రి అయ్యేవారు. ఎందుకంటే అధికారిగా ఆయనకు వున్న అనుభవం, విసృతమైన సేవల మూలంగా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు కేసిఆర్ తప్పకుండా వెంకట్రామ్‌రెడ్డిని మంత్రిని చేసేవారు. ఇది గత శాసన సభ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున జరిగినచర్చ. అంతటి విశిష్ట వ్యక్తిత్వం వున్న వెంకట్రామ్ రెడ్డిని ఇప్పుడు కేసిఆర్ పార్లమెంటు ఎన్నికల బరిలో మెదక్ నుంచి నిలిపారు.
మెదక్ జిల్లాలో ఆది నుంచి బిఆర్ఎస్కు వున్నంత పట్టు ఏ పార్టీకి లేదు.
బిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మెదక్ ఎంపిసీటును ఎక్కువ సార్లు గెల్చుకున్న పార్టీ బిఆర్ఎస్. తెలంగాణవచ్చిన తర్వాత మూడుసార్లు కూడా బిఆర్ఎస్సే గెల్చుకున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్ బంపర్ మెజార్టీతో గెలిచారు. తర్వాత కూడా బిఆర్ఎస్ గెలుస్తూనే వచ్చింది. మెదక్ పార్లమెంటులో బిఆర్ఎస్కు తప్ప మరో పార్టీకి చోటు లేదు. ఎదుకంటే తెలంగాణ ఉద్యమ కారుడు, తెలంగాణ సాధకుడు, తెలంగాణ ప్రగతి ప్రధాత కేసిఆర్. ఆయన తెలంగాణ ఉద్యమం ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే మొదలు పెట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాను బిఆర్ఎస్కు కంచుకోటను చేశారు. గత శాసన సభ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు బిఆర్ఎస్సే గెల్చుకున్నది. అందువల్ల మెదక్‌లో బిఆర్ఎస్ అభ్యర్ధి వెంకట్రామ్రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు. అయితే మెదక్‌లో బిఆర్ఎస్ను ఎదుర్కొవడం ఏ పార్టీ వల్ల కాదు. అందువల్ల బిఆర్ఎస్ను మానసికంగా దెబ్బతీసే ఎత్తుగడంలో, వెంకట్రామ్రెడ్డి కొంత మంది ఉద్యోగులను కలవడం రాజకీయం చేశారు. ఆ కలయికపై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయడం వంటి, కుట్రలు చేశారు. ఎలాంటి విచారణ లేకుండానే, నిబంధనలు సరి చూసుకోకుండానే ఎన్నికల సంఘం కొంత మంది ఉద్యోగులను అప్పటికప్పుడు సస్పెండ్ చేయడం వంటి చర్యలు చకచకా జరిగిపోయాయి. ఆ సమయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం తప్పని, చెప్పిన ఏకైక పత్రిక నేటిధాత్రి. ఉద్యోగులు ఓటర్లు కాదా…వారు సమావేశమయ్యే హక్కు లేదా? అంటూ నేటిధాత్రి కధనాలు రాసింది. నేటిధాత్రి వార్తను చూసిన ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. న్యాయం వారి పక్షాన వుంది. ఉద్యోగులకు శభవార్త అందింది. వారికి న్యాయం జరిగింది. దాంతో ఉద్యోగ వర్గాలు బిజేపికి, కాంగ్రెస్‌కు వ్యతిరేకమయ్యారు. ఆ వార్గలు బిఆర్ఎస్కు మరింత దగ్గరయ్యారు.
ఇక అటు మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్, ఇటు మాజీ మంత్రి హరీష్‌రావులకు మెదక్ జిల్లా మీద పూర్తి పట్టువుంది.
తెలంగాణ ఉద్యమానికి ముందు కేసిఆర్ మంత్రిగా వున్నప్పుడు మెదక్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ది చేసేందుకు విశేష కృషి చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత అటు ముఖ్యమంత్రి కేసిఆర్, ఇటు జిల్లా మంత్రిగా హరీష్‌రావులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో మెదక్ జిల్లా రూపు రేఖలే మారిపోయాయి. ఒకప్పుడు మెతకు కోసం అల్లాడిన మెదక్ జిల్లా అన్నపూర్ణగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. కనీసం కల కూడా కనలేదు. కాని మెదక్ జిల్లాను అన్ని రంగాలలో ముందు వరసలో నిలబెట్టిన ఘనత కేసిఆర్‌కు, హరీష్‌రావులకే దక్కుతుంది. అయితే కలెక్టర్‌గా ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్దిలో వెంకట్రామ్ రెడ్డి పాత్ర కూడా వుండడం విశేషం. దాంతో వెంకట్రామ్ రెడ్డి ఎక్కడికెళ్లినా ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మెదక్ జిల్లా నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలే వుండడం గమనార్హం. అందులో సిద్దిపేట, గజ్వెల్, సంగారెడ్డి నియోజవర్గాలు మెదక్ పార్లమెంటు పరిధిలోనే వున్నాయి. ఈ మూడు నియోజకవర్గాలు బిఆర్ఎస్కు కంచుకోటలు. అందువల్ల వెంకట్రామ్రెడ్డి ఈ పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే కాదు..బంపర్ మెజార్టీ సొంతం చేసుకోబోతున్నారన్నవార్తలు వినిపిస్తున్నాయి. గత శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నమ్మినందుకు ప్రజలకు మూడు నెలల్లోనే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రజలే స్వయంగా ఆ విషయాలు మీడియాకు వివరిస్తున్నారు. బిఆర్ఎస్ అధికారుంలో వున్న కాలంలో, ముఖ్యమంత్రి కేసిఆర్ రెప్పపాటు కూడా కరంటు పోకుండా నిరంతరం విద్యుత్ ప్రసారం చేయడంలో విజయం సాదించారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా తెలంగాణలో ప్రసరించేంత నాణ్యమైన,నిరంతర కరంటు ఎక్కడా సరఫరా వుండదని అంతర్జాతీయ పత్రికలు కూడా శ్లాఘించాయి. కాని కాంగ్రెస్ ఫ్రభుత్వం తెలంగాణలో అదికారంలోకి వచ్చిన మరునాటి నుంచే కరంటు కోతలు మొదలయ్యాయి. సక్రమంగా కరంటు సరఫరా లేకపోవడం మూలంగా పంటలు కూడా ఎండిపోయినట్లు రైతులు ఆరోపించిన సందర్బాలున్నాయి.
ఒకనాడు మెతకు కూడా లేక అల్లాడిన మెదక్ జిల్లా నుంచి ఎంతో మంది పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
దేశ ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీ అమెధీలో ఓడిపోవడం వల్ల పోయిన పరువును కాపాడిని జిల్లా మెదక్. అప్పటి ఎంపి. బాగారెడ్డి తన సీటును త్యాగం చేసి, ఇందిరాగాంధీతో మెదక్ నుంచి పోటీ చేయించి గెలిపించారు. అయినా ఆమె మెదక్‌ను బాగు చేయలేదు. అలా కాంగ్రెస్ పార్టీ ఏనాడు మెదక్ జిల్లా ప్రగతిని కాంక్షించలేదు. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిన కాంగ్రెస్‌కు తెలంగాణలో చోటు లేకుండా చేసి, తెలంగాణ రాష్ట్రం సాధించి, అభివృద్ది చేసిన నాయకుడు కేసిఆర్. దాంతో మెదక్ బిఆర్ఎస్కు పెట్టని గోడలా తయారైంది. హరీష్‌రావుకు పూర్తి బాధ్యతలు చేపట్టి, మెదక్‌నుంచి మరోసారి కారును గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. వెంకట్రామ్‌రెడ్డికి తోడుగా విసృత ప్రచారం చేస్తున్నాడు. ప్రజలు కూడా వెంకట్రామ్‌రెడ్డిని అంతే విధంగా సాదర స్వాగతం పలుకుతున్నారు. ఆయనకు అభయమిస్తున్నారు. ఖచ్చితంగా గెలిపిస్తామని మాటిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సాగు నీరివ్వక పదేళ్లు ఇబ్బంది లేని సాగును చిద్రం చేసింది కాంగ్రెస్. రైతును గోస పుచ్చుకున్నది కాంగ్రెస్. అందుకే మెదక్ ప్రజలు మరోసారి కారును పార్లమెంటుకు పంపించేందుకు సిద్దపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మిగతా రెండు పార్టీలు చేతులెత్తేశాయనే అంటున్నారు.