రేవంత్ రెడ్డి పేరే ఒక ధైర్యం.
కాంగ్రెస్ పార్టీకి రేవంత్ తెచ్చిన పూర్వవైభవం.
పది నెలల పాలన సంక్షేమానికి సంకేతం.
పార్టీ అధ్యక్షుడుగా పట్టువదలని విక్రమార్కుడు.
ఒంటి చేత్తో కాంగ్రెస్ ను గెలిపించిన విజేయుడు.
అధిష్టానం మెచ్చిన నాయకుడు.
ప్రజల మన్ననలు పొందిన జన నాయకుడు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించిన విజేత.
ప్రజల మనసు గెలుచుకున్న జననేత.
కాంగ్రెస్ ను ముందుండి నడిపిన అధినేత.
ప్రజామోదంతో పాలన సాగిస్తున్న ప్రజానేత.
రేవంత్ పాలన ప్రజాహితం.
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యం.
పేదల కళ్లలో నిండుతున్న ఆనందం
అరు గ్యారెంటీల అమలు ఒక సంచలనం.
రైతు రుణమాఫీ ఒక చారిత్రకం.
పదినెలల పాలన ప్రజామోదం.
అన్ని వర్గాల ఆశయాల అమలులో సరికొత్త నిర్వచనం.
నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అతడే ఒక సైన్యం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన రాజకీయ జీవితం ముందుగాని, వెనకగాని ఎవరూ లేరు. ఆయనను ఎవరూ నడిపించలేదు. ఆయనకు ఆయనగా రాజకీయ అడుగులు నేర్చుకున్నారు. రాజకీయంగా ఒక్కొమెట్టు ఎదుగుతూ వచ్చారు. అటు అదృష్టాన్ని ఇటు కష్టాన్ని రెండూ నమ్ముకొని ముందడుగు వేశారు. అందరికీ సాద్యం కాని దానిని తను సుసాధ్యం చేసుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి అందరికీ దక్కేది కాదు. చాలా కొద్ది మందికి మాత్రమే వచ్చే అవకాశం. ఆ అవకాశాన్ని చిన్న వయసులో అందుకోవడం అంటే మాటలు కాదు. ఆ స్దాయికి రావడం అంటే మామాలు వ్యక్తులకు సాధ్యపడదు. అందుకు ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదు. మిడ్జిల్ మండలం నుంచి మొదటి సారి ఆయన జడ్పీటీసి కావడమే ఆయన లక్ష్య నిర్ధేశనకు మార్గం పడిరది. సహజంగా ఊరి సర్పంచ్ కావడమే చాలా మందికి గగనం. పార్టీ పేరు మీదనో, కుటుంబ నేపధ్యం వల్లనో గ్రామాల్లో అవకాశాలు వస్తాయి. అది దాటి మండల స్దాయికి రావాలంటే ఎంతో కష్టపడాలి. అలాంటిది జడ్పీటిసి పదవి కావాలంటే రావాలంటే అటు పార్టీలోనూ బలమైన నాయకుడైవుండాలి. కనీసం ఓ నలభై గ్రామాలక పరిచమైవున్న నాయకుడు కావాలి. ఆయా ప్రజలకు బాగా సుపరితమైన నాయకుడిగా సేవలందించిన చరిత్ర కావాలి. రాజకీయ పార్టీల అభ్యర్ధులుగా ఎన్నికల బరిలో నిలిచి గెవడమే ఎంతో కష్టం. అలాంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండిపెండెంటుగా పోటీ చేసి గెలిచారు. ఇక అప్పటి నుంచి రాజకీయాల్లో ఆయన వెనుదిగిరి చూసుకునే అవకాశం రాలేదు. అలా జడ్సీటీసి సభ్యుడు అయ్యారో లేదో..ఆ వెంటనే వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంటుగా నిలబడి గెవడం అన్నది అంత సులువైన పని కాదు. కాని అలాంటి విజయాలు ఒక్క రేవంత్‌రెడ్డికి మాత్రమే సాద్యమైంది. అందుకే అయన అందరినీ దాటుకుంటూ ముందుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యింది. ఎమ్మెల్సీగా రెండు సంవత్సరాలు పూర్తి ఎమ్మెల్యే అయ్యారు. ఇలా తన రాజకీయ జీవితంతో ఏ ఒక్క రోజు వృధా కాలేదు. ఏ ఒక్కసారి పదవి లేకుండా వుండలేదు. అలా రెండు సార్లు ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారంటే ఆయనపై ప్రజలకు వున్న నమ్మకం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాదు, తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్‌రెడ్డి మీద బిఆర్‌ఎస్ చేసిన ఆరోపణలు, విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అయినా ప్రజలు ఆయననే గెలిపించారు. అయితే 2018 ముందస్తు ఎన్నికల్లో రేవంత్‌రెడ్డిని రాజకీయంగా ఎదకుండా చేయాలన్న ఆలోచనతో ఓడిరచారు. సర్వశక్తులు ఒడ్డి బిఆర్‌ఎస్ పార్టీ నేతలు రేవంత్‌రెడ్డిని ఓడిరచారు. కాని 2019 పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. పార్లమెంటు సభ్యుడయ్యారు. ఇలా జడ్పీటీసి నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, పార్లమెంటు సభ్యుడు, తర్వా ముఖ్యమంత్రి అయిన వారు బహుషా దేశ చరిత్రలోనే ఒక్క రేవంత్‌రెడ్డి తప్ప మరొకరు లేరు. మన దేశ రాజకీయాలలో ఆరు సార్లు, ఎనమిది సార్లు ఎమ్మెల్యేలు అయిన వారు ఎంతో మంది వున్నారు. కాని అలాంటి వారికి ఎవరికీ రాని అవకాశం రేవంత్ రెడ్డికి ఆశామాషీగా ముఖ్యమంత్రి పదవి రాలేదు. అందుకు ఆయన పడిన కోఠోర శ్రమ మాటల్లో చెప్పలేనిది. 2007లో ఎమ్మెల్సీ అయినప్పుడు తొలిసారి మండలిలో అడుగుపెట్టిన వేళ పక్క సీట్లో కూర్చున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏ లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు? అని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా..అని ఒక్క క్షణం ఆలోచించకుండా రేవంత్‌రెడ్డి సమాదానం చెప్పారట. అప్పుడు రేవంత్ రెడ్డిలో కనిపించిన పట్టుదల తర్వాత అడుగడుగునా కనిపించాయని నాగేశ్వర్ ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. అందరి వాడిగా ఎంతగా కలిసివుండాలని చూసినా రేవంత్‌రెడ్డితో నాయకులు వివాదాలు సృష్టించే ప్రయత్నాలు అనేకం జరిగాయి. అయినా ఏనాడు రేవంత్‌రెడ్డి వాటిని పట్టించుకోలేదు. తన లక్ష్యం మీదనే గురి పెట్టుకొని ముందుకు సాగారు. తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో రేవంత్ రెడ్డి సన్నిహితంగా వుండడాన్ని అప్పట్లో చాలా మంది నాయకులు జీర్ణించుకోలేకపోయారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ తెలుగుదేశంపార్టీకి రేవంత్ రెడ్డిని అద్యక్షుడిని చేయాలని చంద్రబాబు అనుకున్నారు. కాని ఆయనను కాకుండా అప్పటి తెలుగుదేశం నాయకులు చాలా మంది అడ్డుకున్నారు. చివరికి తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంటు అయ్యారు. కాని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షపదవిని రేవంత్‌కు ఇస్తే ఆ పార్టీ పరిస్ధితి ఇప్పుడు మరో రకంగా వుండేది. కాని పరిస్దితులను అంచనా వేయడంలో రేవంత్ రెడ్డి ఎంతో చురుకైన నాయకుడు. అందుకే తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవంగా బైటకు వచ్చారు. ఆ విషయం సాక్ష్యాత్తు చంద్రబాబు చెప్పి మరీ పార్టీనుంచి బైటకు వచ్చారు. ఇలా పార్టీ అధ్యక్షుడికి రాజీనామా పత్రం నేరుగా అందజేసి, ఆ పార్టీని ఒక్క మాట కూడా అనకుండా బైటకు వచ్చిన నాయకులు ఎవరూ వుండరు. కాని ఆ సంప్రదాయాన్ని కూడా రేవంత్ రెడ్డి తిరగరాశారు. తనకు నచ్చిన రూట్‌లోనే ఎంతో ధైర్యంగా వెళ్లారు. అయితే ఇండిపెండెంటుగా రాజకీయాలు చేసినప్పుడుగాని, తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడైనా ఏనాడు ఇబ్బందులు ఎదుర్కొని రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఎదురైన అనుభవాలు కూడా ఆయన లక్ష్య సాధనకు మరింత పదును పెట్టేలా చేశాయి. అసలు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతానంటూ ఉమ్మడిరాష్ట్ర మండలి సభలో అన్నప్పుడు ఎవరైనా నవ్వుకునే సందర్భమే..ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకుటుంబం మినహా మరకొరు సిఎం కావడం అసాధ్యం. అలాగే అప్పటి పరిస్ధితుల దృష్ట్యా ఉమ్మడి రాష్ట్రం ఇంకా కొనసాగి వుంటే కాంగ్రెస్‌లో చేరినా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వారు కాదు. కాని ఏ ముహూర్తాన రేవంత్ రెడ్డి ఆ మాట అన్నారో అప్పుడే తదాస్ధు దేవతలు దీవించినట్లున్నారు. కాకపోతే ఆయన రాజకీయంగా ఎన్నొ కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. ఒక వేళ రేవంత్‌రెడ్డి కాకతాళీయంగా చెప్పినా, తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఎవరికీ నమ్మకం లేదు. తెలంగాణ ఉద్యమాలు అప్పటికే అనేకం జరిగాయి. అప్పటికి తెలంగాణ ఉద్యమం పెద్దగా ఊపందుకున్నది లేదు. అయినా తన జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని రాజకీయంగా తనకు తాను పరీక్ష పెట్టుకున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా వుండే పార్టీలో చేరడమే వర్కింగ్ ప్రెసిడెంటు పదవితో అడుగుపెట్టారు. ఆ తర్వాత అందరినీ పక్కకు నెట్టి పిపిసి. అధ్యక్షుడయ్యారు. ఎంతోమంది సీనియర్లు వున్నప్పటికీ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఆయన కాలాన్ని నమ్ముకున్నారు. తన కష్టాన్ని నమ్ముకున్నారు. తన నాయకత్వం మీద తనపై తనుకు అచెంచల విశ్వాసాన్ని పెంచుకున్నారు. ఎంతటి వారితోనైనాపోరాటం చేసే శక్తిని కూడగట్టుకున్నారు. ఎవరికీ బెదరలేదు. ఎవరు అదిరించాలని చూసినా అదరలేదు. ఆఖరుకు కేసులు నమోదు చేసి జైలు పాలు చేసినా వెనకడుగు వేయలేదు. మొక్కవోని ధైర్యంతో ఆయన సాగిన విధానం రేపటి భవిష్యత్తు రాజకీయ తరానికి ఆదర్శం. పిపిసి అధ్యక్షుడిగా ఎన్ని ఒడుదొడులు ఎదురైనా వాటిని చిరునవ్వుతో ఎదుర్కొన్నాడు. తనను వ్యతిరేకించే నాయకులందరినీ కలిశాడు. వారి ఆశీస్సులు తీసుకున్నాడు. అందరికీ కలుపుకుపోతూ పార్టీకి నాయకత్వం వహించాడు. పార్టీపై పూర్తి ఆదిపత్యం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్దానాలు అధిష్టానానికి స్పష్టతనిచ్చి, భరోసా కల్పించి టికెట్లు ఇచ్చారు. అందర్నీ గెలిపించుకున్నారు. పార్టీని పదేళ్ల తర్వాత అధికారంలోకి తెచ్చిన నాయకుడిగా అధిష్టానం ఆశీస్సులతో ముఖ్యమంత్రి కాగలిగారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడ ఆయనను ముఖ్యమంత్రి కాకుండా మూడు రోజుల పాటు పార్టీలో హైడ్రామా బాగానే సాగింది. కాని అదిష్టానం ఎవరి మాట వినలేదు. రేవంత్‌ను పక్కకు పెట్టలేదు. రేవంత్‌రెడ్డే ముఖ్యమంత్రి…ఎవరు ఔనన్నా..ఎవరు కాదన్నా ఇదే ఫైనల్ అని అదిష్టానం తేల్చి చెప్పింది. రేవంత్ రెడ్డి అంకితభావాన్ని గుర్తించి ముఖ్యమంత్రిని చేసింది. ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలు చేపట్టి పది నెలలు అవుతోంది. ప్రజా పాలను పది నెలలుగా అనేక సంక్షేమ పధకాలతో సాగుతోంది.