డిసీఏ నిర్లక్ష్యం, మెడికల్ మాఫియా ప్రజలకు సవాల్ .

అధికారుల తనిఖీల్లో నిషేధిత మందులు అనేక అవకతోకలు దొరికిన, డి సి ఏ నిర్లక్ష్యఎం మాఫియాకు బలం.

మాఫియా అక్రమాలు, దోపిడి లు కాదట, అది సేవ అంటూ, దాడులు చేస్తే మెడికల్ మూసివేస్తాం అని సవాల్ విసిరిన మాఫియా.

రెండు రోజులుగా మండలం లో ని మెడికల్ షాపులు మూసివేత.మెడికల్ మాఫియా విముక్తి తోనే అమాయక ప్రజల ప్రాణాలకు రక్షణ,

అధికారులు అమ్ముడుపోయారు,ప్రజలు మేలుకోవాలి, ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వ ఆసుపత్రులే శ్రీరామరక్ష.

మహాదేవపూర్-నేటిధాత్రి:

ప్రజల ప్రాణాలను గాలిలో కలవకుండా ఔషధాల మాఫియా ఊబిలో పడకుండా ప్రజలను నాణ్యమైన అర్హత కలిగిన ఔషధ విక్రయాలు ఔషధాలు అందించడమే ప్రజా ఆరోగ్య వ్యవస్థలు కీలక పాత్ర పోషించాల్సిన డ్రగ్ కంట్రోల్ అథారిటీ తమ అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడుతూ అమాయక ప్రజలను మెడికల్ మాఫియాకు బానిస చేసేలా చేస్తుంది. డి సి ఏ వ్యవహారానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మహా మెడికల్ మాఫియా ఒక సాక్ష్యం. అనేక ఔషధాలు నిషేధితం నిబంధనలకు ఉల్లంఘన మెడికల్ నిర్వహణలో కనీస పరిజ్ఞానం అర్హత లేకున్నప్పటికీ అధికారుల తనిఖీల్లో ఇక అవకతవకలు సిజెక్కిన లైసెన్సులు మూసివేత మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవడం నేరంగా భావించిన డి సి ఏ మహా మెడికల్ మాఫియా మరింత రెచ్చిపోవుటకు ప్రోత్సహిస్తుంది. సుమారు 40 రోజులుగా మెడికల్ మాఫియాను గుట్టురట్టు చేసినప్పటికీ 24 మెడికల్ షాపులపై చర్యలు తీసుకొని లైసెన్స్ రద్దు వారిపై కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు. గరిచిపోయిన మెడికల్ మాఫియా ఇటు ప్రజలకు అలాగే డ్రగ్ కంట్రోల్ శాఖకు సవాల్ విసురుతుంది. మేము మాఫియా అయినా పరవాలేదు మా పై దాడులు చేస్తారా అంటూ పాము చేస్తుంది సేవ అని చెప్పుకుంటూ మెడికల్ షాపులను మూసివేసి నిరసన తెలపడం చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రూపు దిద్దింది మహా మెడికల్ మాఫియా.

డిసీఏ నిర్లక్ష్యం, మెడికల్ మాఫియా ప్రజలకు సవాల్ .

ప్రజా ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఔషధ విక్రయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు చర్యలు తీసుకుంటూ ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన డిసిఏ అధికార యంత్రాంగం మెడికల్ మాఫియాలకు కొమ్ముకాస్తూ డ్రగ్ కాస్మోటిక్ చట్టం 1947 అలాగే 1940 ప్రధానంగా షెడ్యూల్ హెచ్ బై హెచ్ వన్ లాంటి చట్టాలను అమలు చేస్తూ చర్యలు తీసుకోకుండా కాసులకు కక్కుర్తి పడి నిర్లక్ష్య ధోరణి వహించడం అమాయక ప్రాణాలకు నష్టం బాటిల్ ఏం చేయాలా చేయడం జరుగుతుందని చెప్పడానికి సందేహం లేదు. డి సి ఏ నిర్లక్ష్యానికి అమాయకులు ఇప్పటికే తమ కష్టార్ జీతాలను మెడికల్ మాఫియాకు కట్టబెట్టడం జరుగుతుంది. ప్రజా ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి మెడికల్ మాఫియా అమాయక ప్రజల నుండి దోచుకుంటున్న వందల రూపాయలు స్వయ వైద్యం పేదల ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదం. ఇక డి సి ఏ నిర్లక్ష్య ధోరణికి మెడికల్ మాఫియా నేడు డ్రగ్ కంట్రోల్ శాఖతోపాటు ఉమ్మడి మండల ప్రజలకు కూడా సవాల్ విసిరింది. అధికారులు తమకేమీ చీరన్నట్టుగా తమపై దాడులు చర్యలు తీసుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా మా దగ్గర కూడా బదులు ఇచ్చే సమాధానం ఉందని రెచ్చిపోవడం తమ మాఫియా కళాపాలను నిర్భయంగా విక్రయాలు జరపడం ప్రజా వ్యవస్థ మరియు అధికార యంత్రాంగంలో ఒక ప్రశ్నార్థకంగా మారింది. సుమారు 40 రోజుల్లో అధికారుల తనిఖీ ఆధారాలతో సహా వరుస కథనాలు మహా మండలంలోని 24 ఔషధ విక్రయ కేంద్రాలకు ఎందుకు తాళం వెయ్యలేదు వారిపై సెక్షన్ 42 ఏ డ్రగ్ కంట్రోల్ ఆక్ట్ రూల్ 65 ఫార్మసీ చట్టం 1948 ఇందుకు అమలు పరచడం లేదు మహాదేవపూర్ ఉమ్మడి మండలంలోని మెడికల్ మాఫియా డ్రగ్ అథారిటీకి సవాల్ విసురుతున్న అధికారుల నిశ్శబ్దం పెద్ద మొత్తంలో ముడుపులు అందడం జరిగింది అందుకే చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పడానికి దీనికంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. షోకాస్ నోటీస్ విషయానికొస్తే జారీ చేయడం జరిగింది అని సమాచారమే తప్ప అధికారికంగా ఇక్కడ కూడా చర్యలు అనేది తీసుకున్న దాఖలాలు లేవు రేపటి రోజు ప్రజా ఆరోగ్య వ్యవస్థలో మహా మెడికల్ మాఫియా ద్వారా పురాణహానికి కేవలం డ్రగ్ కంట్రోల్ అథారిటీ బాధ్యత వహించాల్సిందే అని చెప్పక తప్పదు.

అధికారుల తనిఖీల్లో నిషేధిత మందులు అనేక అవకతోకలు దొరికిన, డి సి ఏ నిర్లక్ష్యఎం మాఫియాకు బలం.

డ్రగ్ కంట్రోల్ అధికారుల నిర్లక్ష్యం మహా మెడికల్ మాఫియాకు మరింత బలాన్ని చేకూర్చిందని నేటి వరకు చర్యలు తీసుకోకపోవడమే ప్రజల ముందు ఉన్నటువంటి సాక్ష్యం. గత నెల 18వ తేదీన విజిలెన్స్ అధికారులు మండల కేంద్రంలోని నాలుగు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేయగా పెద్ద మొత్తంలో నిషేధిత మందులను గుర్తించినట్లు విశ్వనీయ సమాచారం. గుర్తించిన నిషేధిత మందుల్లో సిరప్ తో పాటు పెద్ద మొత్తంలో క్యాప్సిల్స్ అలాగే ఇంజక్షన్స్ ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. నిషేధిత మందులు దొరికిన శ్రీమాతా మెడికల్ స్టోర్, శ్రీ శ్రీ మెడికల్, శివ సాయి మెడికల్, హరిహర మెడికల్ షాపు ల్లో సోదాలు చేయడం ఈ మెడికల్ స్టోర్ లలో నిషేధిత ఔషధాలు పెద్ద మొత్తంలో గుర్తించడం కూడా జరిగిందని తెలుస్తుంది. కానీ మండల కేంద్రంలోని మిగతా మెడికల్ లో అధికారులు తనిఖీలు చేయకుండా అలాగే సూరారం అంబాడ్పల్లి గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద మొత్తంలోని మెడికల్ షాపులకు కూడా నేటి వరకు అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే మండల కేంద్రంలోని తనిఖీ చేపట్టిన నాలుగు ఔషధ కేంద్రాలకు తక్షణమే షెడ్యూల్ హెచ్ వన్ ప్రకారం వారిపై క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయలేక పోయారు ఇది కేవలం అధికారులకే తెలుసు. పెద్ద మొత్తంలో నిషేధిత మందులు లభ్యమైనప్పటికీ కూడా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటే మాఫియా కు డి సి ఏ సహకారం ఉందన్నట్టా లేదన్నట్టా అనేది రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ ఉన్నత అధికారులే చెప్పాల్సిన అవసరం ఉంది.

మాఫియా అక్రమాలు, దోపిడి లు కాదట, అది సేవ అంటూ, దాడులు చేస్తే మెడికల్ మూసివేస్తాం అని సవాల్ విసిరిన మాఫియా.

మహాదేవపూర్ మెడికల్ మాఫియా ప్రస్తుతం నిషేధిత మందులు అర్హత లేకుండా ఔషధ విక్రయాలు కాస్మోటిక్ చట్టానికి విరుద్ధంగా వ్యవహరించడం లేదట, ఈ మాటలు స్వయంగా మెడికల్ మాఫియా నిర్భయంగా ప్రజలకు అందిస్తున్న సమాచారం. తాము ప్రజలకు సేవ చేస్తున్నాం ఇది అధికారులకు తెలుసు మేము తలుచుకుంటే ఏమైనా చేస్తాం అని పరోక్షంగా ప్రజల్లో చెప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరోవైపు అధికారుల చర్యలను ప్రశ్నిస్తూ మాఫియా ఒకవైపు ప్రజలకు మెడికల్ లేకుంటే ఔషధాలు మరెక్కడ దుర్గవని రీతిలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా అధికారులు తమ మెడికల్ షాపులను ఎలా తనిఖీ చేస్తారు తనిఖీలు జరిగిన మెడికల్ షాపుల నిర్వాహకులు యూనియన్ మండలమంతా గత వారం రెండు రోజులపాటు అధికారుల తనిఖీలకు తప్పుబడుతూ మెడికల్ షాపులను మూసివేయడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రజలు మెడికల్ షాపుల నీతివేతపై అడిగిన వారికి సమాధానం తమపై అధికారులు దాడి చేస్తే మెడికల్లను మూసివేయడం జరిగిందని తాము ప్రజలకు సేవ చేస్తున్నాం మేము లేకుంటే ఎవరు దిక్కు అని ప్రజలను ఎదురు సమాధానాలతో రెండు రోజులు మెడికల్ షాపులను మూసివేసి తిరిగి సోమవారం నుండి యధావిధిగా మండలంలోని మెడికల్ షాపులు కొనసాగడం విశేషం. డ్రగ్ కంట్రోల్ అథారిటీ తనిఖీలు చేస్తే ఔషధ కేంద్రాలు వారు చేసిన తప్పును సర్దుకునే ప్రయత్నంలో ఉంటారు కానీ మహా మెడికల్ మాఫియా డ్రగ్ కంట్రోల్ అధికారుల నే ప్రశ్నించింది దాడులు చేస్తే మూసివేస్తామని ఇటు ప్రజలకు అటు డ్రగ్ కంట్రోల్ అథారిటీకి సవాల్ విసిరింది ఇది మెడికల్ మాఫియా బలం, ఈ బలానికి పరోక్షంగా సహకారం ఇవ్వరు కంట్రోల్ అధికారులే, ఈ వ్యవహారానికన్నా ఎక్కువ రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఏలాంటి సాక్ష్యం కావాలో మహా మెడికల్ మాఫియా పై చర్యలు తీసుకోవడానికి అధికారులే తేల్చి చెప్పాలి.

రెండు రోజులుగా మండలం లో ని మెడికల్ షాపులు మూసివేత.మెడికల్ మాఫియా విముక్తి తోనే అమాయక ప్రజల ప్రాణాలకు రక్షణ,

మహా మెడికల్ మాఫియా తమ ఆగడాలపై అధికారులు తనిఖీలు చేస్తే అది కేవలం నామమాత్ర తనిఖీలు అని చెప్పుకుంటూ తమకేమి ఏమీ కాదని వాస్తవాలను స్థిరపైకి తీసుకువచ్చిన నేటి ధాత్రిపై తప్పుడు ఆరోపణలు చేయడమే తమ లక్ష్యంగా పెట్టుకొని గత వారం రెండు రోజులు మెడికల్ షాపులను మూసి వేయడం జరిగింది. అధికారులను తమపై దాడులు చేస్తే మేము ప్రజలకు ఇబ్బంది పెడతామని నిషేధిత మందులు విక్రయాలు చేసిన తమకు ఎవరు ప్రశ్నించకూడదని కాస్మోటిక్ చట్టం డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆదేశాలను తుంగలో తక్కి మేము మెడికల్ షాపులను నిర్వహించి వేల రూపాయలు దండుకుంటాం మాకు ఎవరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం లేదు తనిఖీలు చర్యలు చేస్తే బదులుగా మండలంలోని మెడికల్ షాపులు మూసి వేస్తాం అంటూ మహా మెడికల్ మాఫియా మరింత రెచ్చిపోయి ప్రజా వ్యవస్థని ఇబ్బందిలోకినట్టే విధంగా వ్యవహరిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారులకు సవాల్ విసురుతుంది. ఈ వ్యవహారానికి కారణం డ్రగ్ కంట్రోల్ అధికారులు డ్రగ్ కాస్మోటిక్ యాక్ట్ తో పాటు డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియా కఠిన నిబంధనలు ముల్లంగించినటువంటి మహా మెడికల్ మాఫియా పై చర్యలు తీసుకోకపోవడం నేడు మెడికల్ మాఫియా రెచ్చిపోయి నిర్భయంగా విక్రయాలను కొనసాగించడం జరుగుతుంది. మహదేవ్పూర్ మండలంలోని 26 గ్రామ పంచాయతీలకు సంబంధించి సుమారు 30 వేల జనాభాకు మహా మెడికల్ మాఫియా తో ముప్పు ఉన్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం అమాయక పేద ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. డ్రగ్ కంట్రోల్ ఉన్నత అధికారులు మహా మెడికల్ మాఫియా పై తక్షణమే రాష్ట్ర విజిలెన్స్ ఉన్నత అధికారులతో తనిఖీలు జరిపించి తక్షణమే 24 మెడికల్ దుకాణాలను మూసివేసి వారిపై క్రిమినల్ ప్రొసీజర్ లోని షెడ్యూల్ హెచ్ బై హెచ్ వన్ అమలుపరిస్తేనే ఉమ్మడి మండల పేద ప్రజల ప్రాణాలకు డ్రగ్ కంట్రోల్ శాఖ కాపాడినట్టు ఉంటుంది. లేదంటే మహా మెడికల్ మాఫియా అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకునే పరిస్థితులు ఎంతో దూరం లేవని స్పష్టమవుతుంది.

అధికారులు అమ్ముడుపోయారు,ప్రజలు మేలుకోవాలి, ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వ ఆసుపత్రులే శ్రీరామరక్ష.

మహా మెడికల్ మాఫియా నుండి అధికార యంత్రాంగం పేద ప్రజలను కాపాడే పరిస్థితి ప్రస్తుతం ఎక్కడ కనబడడం లేదు. సుమారు 45 రోజుల నుండి కనీస చర్యలకు కూడా జిల్లా స్థాయి అధికారులు స్పందించకపోవడం ఒక సాక్ష్యం. నేడు మెడికల్ మాఫియా రెచ్చిపోయి అధికారం యంత్రాంగాన్ని ప్రశ్నించే పరిస్థితికి దారి తీయడం కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ మాఫియాకు పరోక్షంగా సహకరిస్తున్నారని స్పష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం రాష్ట్ర ఉన్నత అధికారులు మాత్రమే దీనికి పరిష్కారం కానీ కిందిస్థాయి అధికారుల వివరణ కూడా రాష్ట్రస్థాయి అధికారులు పరిగణంలోకి తీసుకోవడం కూడా జరుగుతుంది. మాఫియా మాత్రం వెనుకడుగు వేయకుండా అధికారుల చర్యలు దాడులకు బలంగా తట్టుకునే శక్తి మహా మెడికల్ మాఫియా ఉంది. ఇప్పటికే అనేక అధికారులు మెడికల్ మాఫియా కు పరోక్షంగా సహకరిస్తూ చర్యలకు ముందే సమాచారాన్ని అందిస్తూ తనిఖీలకు ముందు కూడా అధికారులు సమాచారంతో మాఫియా అంతా ఒక్క జాగాల చేరి అధికారులను తప్పుదారి పట్టించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మండల ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ముందుకు సాగాలి. మండల ప్రజల ఆరోగ్య వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలతో మెడికల్ షాపులపై ఆధారపడకుండా ఆయా గ్రామాల్లోని ఆశా వర్కర్ ఏ ఎన్ ఎం తోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంప్రదించాలి అలాగే మరింత ఆరోగ్య సమస్య కలిగినప్పుడు గ్రామాల్లో అలాగే మండల కేంద్రంతో పాటు మేజర్ గ్రామపంచాయతీలో మెడికల్ షాపుల యజమానుల స్వీయ వైద్యానికి పోకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అర్హత కలిగిన డాక్టర్లను సంప్రదించి తమ ఆరోగ్య సమస్యలను ఉచిత ఔషధాలు తోపాటు ఉచిత చికిత్సతో తమ ఆరోగ్యానికి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కష్టపడి సంపాదించిన సొమ్మును మెడికల్ మాఫియా పాలు చేయకుండా ప్రతి ఆరోగ్య సమస్యకు ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ వైద్యులు అలాగే ఆశా వర్కర్లు గ్రామ గ్రామాన ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. వారి సలహా సూచన మేరకు ప్రభుత్వ వైద్యులకు ప్రభుత్వ ఆసుపత్రులకు సంప్రదించి సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. రాష్ట్ర ట్రక్ కంట్రోల్ అధికారులు మహా మెడికల్ మాఫియా పై ఇలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!