Quran Telugu Translation Presented to Harish Rao
మాజీ మంత్రి హరీష్ రావు ను ఖురాన్ తెలుగు అనువాద ప్రతిని అందజేసిన నాజిముద్దీన్ ఘోరీ,
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ ప్రాంతానికి చెందిన జమాతే ఇస్లామీ జిల్లా నాజిమ్, ముహమ్మద్ నాజిముద్దీన్ ఘోరీ,జహీరాబాద్‌లోని ‘ఘోరీ ప్యాలెస్’లో బి. ఆర్. ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి హరీష్ రావుకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు ఖురాన్ తెలుగు అనువాద ప్రతిని అందజేశారు. ఖురాన్ ప్రతిని స్వీకరిస్తూ హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు; దేశంలో ఇటువంటి ఇఫ్తార్ విందులు ఎంతో అవసరమని పేర్కొంటూ, ప్రపంచంలో శాంతి భద్రతలు నెలకొనేలా ముస్లిం ఉమ్మత్ (ముస్లిం సమాజం) ప్రార్థించాలని ఆకాంక్షించారు.
