పరకాల నేటిధాత్రి
హైదరాబాద్ నందు బొగ్గులకుంట సారస్వత పరిషత్ ఆడిటోరియం లో జరిగిన నేషనల్ ప్రీమియర్ అవార్డు 2025 బెస్ట్ సాంగ్స్ రైటర్ గా “రామంచ సుమన్” ఎంపికయ్యారు.ఈ అవార్డు హైకోర్టు జడ్జి చంద్రకుమార్ మరియు జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ శేషుల చేతులమీదుగా అందుకున్నారు.ఈ కార్యక్రమంలో నేషనల్ ప్రీమియర్ అవార్డు ఫౌండర్ రవి పరిపల్లి గౌరీ శ్రీ పాల్గొన్నారు.అనంతరం రామంచ సుమన్ మాట్లాడుతూ ఈ యొక్క అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంకా మరెన్నో సామాజిక చైతన్య గీతాలు రాస్తూ మరెంతో గుర్తింపు కోసం కృషి చేస్తానని తెలిపారు.బెస్ట్ సాంగ్స్ రైటర్ రామంచ సుమన్ ను పలువురు అభినందించారు.
వరికోల్ ముద్దుబిడ్డ రామంచ సుమన్ కు నేషనల్ ప్రీమియర్ అవార్డు
