కొల్చారం,( మెదక్) నేటి ధాత్రి :-
శనివారం నర్సాపూర్ శాసన సభ్యురాలు. సునీత లక్ష్మారెడ్డి ఏడుపాయల అమ్మవారి దర్శనానికి విచ్చేశారు పాలకమండలి సభ్యులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు
అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు శాసనసభ్యులను ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
వనదుర్గ భవాని అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని
కోరుకున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి, చైర్మన్ బాల గౌడ్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య , డిపిఓ యాదయ్య తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, కొల్చారం మండలం బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్తా, కొల్చారం ఎంపీపీ మంజుల కాశీనాథ్ , జడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్, ఏడుపాయ డైరెక్టర్ యాదగౌడ్, గజినీ వెంకట్ గౌడ్, చిట్యాల యాదయ్య, కోనాపూర్ సంతోష్ రావు, రాజా గౌడ్, గడ్డ మీది నరసింహులు, సోమ నర్సింలు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.