
కూకట్పల్లి, మార్చి 05 న్యూస్ నేటి ధాత్రి ఇన్చార్జి
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని టిఎంఆర్ స్కూల్, జూనియర్ కాలేజ్ బాలానగర్ బాయ్స్-1లో దోమల బెడద ఎక్కువగా ఉందని సమస్యను స్థానిక కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు దృష్టికి తీసుకొని రా గా కార్పొరేటర్ తక్షణమే స్పందించి జిహెచ్ఎంసి ఎంటమాలజి సిబ్బంది తో యాంటీ లార్వా దోమల మందు ను పిచికారీ చేయించడం జరిగిం ది.ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ……. టిఎంఆర్ స్కూల్ & జూనియర్ కా
లేజ్ బాలానగర్ బాయ్స్ -1లో దోమ ల బెడద ఎక్కువగా ఉందని నా దృ ష్టికి తీసుకొని రాగా జిహెచ్ఎంసి ఎంటమాలజి సిబ్బందితో యాంటీ లార్వా దోమల మందును పిచికారీ చేయించడం జరిగిందన్నారు.దోమ ల నివారణలో ప్రజలు భాగస్వా మ్యం కావాలి పిలుపునిచ్చారు.దో మ లార్వాను తోక పురుగులు
అనుకోని వదిలివేయడం వల్ల దోమలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఖాళీ ప్రదేశాల్లో నీటి నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది మలేరియా,డెంగీ,ఫైలేరి యా పలు రకాల వ్యాధులు వస్తా యన్నారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని స్కూల్ కళాశా ల యాజమాన్యానికి సూచించారు.
పలు చోట్ల నిలువ ఉన్న నీటిని తొల గించారు. అదేవిధంగా అధికారులు కూడా దోమల నివారణలో సమన్వ యంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలన్నారు. దోమల నివార ణకు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని,ఫా గింగ్ చేయించాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు అధికారులకు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో అధికారులు ఎంటమాలజి సూపర్వై జర్ నర్సింహులు,శానిటేషన్ సూప ర్వైజర్లు భరత్ రాకేష్,శ్రీకాంత్,కళా శాల ప్రిన్సిపాల్ శైలజ ఎంటమా లజి, శానిటేషన్ సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 1 లో….