దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న నరేంద్రమోదీ

ఆర్థిక వ్యవస్థ సుస్థిరం

పటిష్ట విదేశాంగ విధానం

 

నోట్ల రద్దుతో నల్లధానికి అడ్డుకట్ట

ఇబ్బందులు పడ్డా మోదీ వెంటే దేశ ప్రజలు

పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్న మోదీ

దేశాన్ని ‘ప్రపంచ గురు’గా మార్చిన ప్రధాని

370 అధికరణం రద్దు

జీఎస్టీని అమల్లోకి తెచ్చిన ఘనత మోదీ సర్కారుదే

హైదరాబాద్‌,నేటిధాత్రి:

దేశాన్ని ఆర్థిక దుస్థితినుంచి గట్టెక్కిస్తానంటూ 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించడమే కాదు, ఇటువంటి విపత్కర పరి స్థితుల్లో దేశానికి సుస్థిరపాలనతో పాటు, దేశ గౌరవాన్ని మరింత ఇనుమడిరపజేస్తానంటూ తన స్ఫూర్తిదాయక ప్రసంగాలతో వివిధ రాష్ట్రాల ప్రజలను సమ్మోహితులను చేసిన నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ పార్టీని పూర్తి మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చారు. అంతకుముందు పార్టీ అధికారంలోకి వచ్చినా కూటమికి నేతృత్వం వహిస్తూ సంకీర్ణపాలనను మాత్రమే అటల్‌బిహారీ వాజ్‌ పేయి హయాంలో అందించింది. కానీ తొలిసారి స్పష్టమైన మెజరిటతో 2014 మే 26న దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టడమే కాదు దేశానికి కొత్త దశ, దిశను చూపేందుకు ఉపక్రమిం చారు. ముందుగా ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది దేశంలో మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల నిబంధనలను మరింత సరళతరం చేయడంపై. ఆవిధంగా దేశంలోకి విదేశీ పెట్టుబడులను రావడానికి ఆయన మార్గం సుగమం చేశారు. అదే ఏడాది ఆ యన రెండు దౌత్యపరమైన విజయాలు సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. మొట్టమొదటిది సెప్టెంబర్‌ మధ్యకాలంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను దేశానికి ఆహ్వానించడం, ఈ పర్యటనను విజయవంతం చేయడం. రెండవది అప్పటివరకు మోదీకి వీసా అనుమతిని నిరాకరించిన అమెరికా, వీసా అనుమతినివ్వడం. వెంటనే ప్రధాన హోదాలో నరేంద్రమోదీ న్యూయార్క్‌లో పర్యటించి అప్పటి యు.ఎస్‌. అధ్యక్షులు బరాక్‌ ఒబామాతో చర్చలు జరిపారు. ఈ పర్యటన గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. ఇక్కడ గుర్తించాల్సింది మరే ఇతర నాయకుడు సాధించని ఒక గొప్ప విజయాన్ని మోదీ సాధించి చూపిన విషయాన్ని గుర్తించాలి. ఏ దేశమైతే వీసా నిరాకరించిందో ఆ దేశమే చివరకు వీసాను ఇవ్వడమేకాదు, దేశ పర్యటనకు ఆహ్వానించడం నిజంగా మోదీ ఖాతాలో న మోదైన గొప్ప విజయం.

నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో జరిగిన సానుకూల పరిణామం హిందువులు జాగృతం కావడం. హిందూత్వను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అప్పటివరకు ఏకతాటిపైలేని హిందువులను సుసంఘితం చేసేందుకు యత్నాలు జరిగాయి. ఇవి చాలావరకు సత్ఫలితాలని చ్చాయనడానికి ఉదాహరణ కమ్యూనిస్టులు క్రమంగా తెరమరుగైపోవడం! కమ్యూనిస్టు భావజా లం క్రమంగా పతన పథంలో ప్రయాణించి ఒకప్పుడు విశేష ప్రాచుర్యం పొంది, ప్రజల అభిమానాన్ని చూరగొన్నప్పటికీ క్రమంగా బలహీనపడి ప్రస్తుతం అంతరించిపోయే స్థితికి చేరుకుంది. దీనికి ప్రధాన కారణం హిందువుల్లో పెరుగుతున్న చైతన్యం. మైనారిటీల ముసుగులో జరుపుతున్న రాజకీయాలు తమను ఏవిధంగా అథ్ణపాతాళానికి తొక్కేస్తున్నాయో హిందువులకు బాగా అవగతం కావడం. అంతకుముందు ఇంతలా అవగాహన కల్పించిన పార్టీలు లేవు. చైతన్యం తీసుకు రాగలిగే భాజపా అంతగా బలపడలేదు! ఇదే సమయంలో గోహత్య నిషేధ ఉద్యమం మరింత ఊపందుకోవడం విశేషం.

ప్రధాని పదవి చేపట్టాక నరేంద్రమోదీ రెండు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. నిజం చె ప్పాలంటే ఇవి దేశ వ్యవస్థలో సమూల మార్పులకు దోహదం చేశాయనే చెప్పాలి. మొదటిది నోట్ల రద్దు. అంటే రూ.500, రూ.1000నోట్లను రద్దుచేయడం. నోట్లమార్పిడికి చాలా తక్కువ స మయం ఇవ్వడం ద్వారా దేశంలో నల్లధనాన్ని చాలావరకు దెబ్బతీయాలన్న వ్యూహం అనుసరిం చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తినా ఆయన వెనుకాడలేదు. ప్రజలు కూడా మోదీ ప్రభుత్వ అసలు ఉద్దేశాన్ని గ్రహించి కష్టాలు సహించి, ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఈ నిర్ణయం వెనుక సుదీర్ఘమైన, లోతైన ఆలోచన, చర్చలు, మేధోమధనం వున్నాయ న్న సత్యం మరువరాదు. నిజం చెప్పాలంటే నల్లధనం పోగేసుకున్న వర్గాలకు అనుకూలురు మా త్రమే నిర్ణయాన్ని వ్యతిరేకించారు తప్ప ఇతరులెవ్వరూ అడ్డు చెప్పలేదు. ముఖ్యంగా ఈ నిర్ణయం వల్ల పెద్దమొత్తంలో పోగేసుకున్న నల్లధన మార్పిడి కష్టతరం కావడంతో, ‘నల్ల కుబేరులు’ నిం డా మునిగారు. ఇక నరేంద్రమోదీ తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం ‘వస్తుసేవల పన్ను’ (గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌) విధింపు. నిజానికి ఇది నాటి యు.పి.ఎ. ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయమే కానీ, సంకీర్ణ భాగస్వాములనుంచి విపరీతమైన ఒత్తిడి రావడంతో నాటి మ న్మోహన్‌ ప్రభుత్వం దీన్ని అమలు చేయలేకపోయింది. కానీ నరేంద్రమోదీ దీన్ని తక్షణమే అమల్లో కి తెచ్చారు. దీనివల్ల దేశమంతా ఒకే జీఎస్టీ అమలు కావడమే కాదు, వివిధ రాష్ట్రాలు విధించే రకరాల పన్నుల భారం తగ్గింది. సగటు పౌరుడు ఏ వస్తువును కొనుగోలు చేయాలన్నా, వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కట్టాల్సి వచ్చేది. జీఎస్టీ అమల్లోకి తేవడంతో ఆ సమస్య కు పరిష్కారం లభించినట్లయింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలవల్ల 2015లో 8.2% వున్న జీడీపీ కొద్దిగా నిదానించినా, దీర్ఘకాలంలో సత్ఫలితాలిచ్చాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

2018లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో భాజపా అధికారా న్ని కోల్పోయింది. వీటిల్లో పార్టీకి గట్టిపట్టున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లు వుండటం గమనార్హం. వీటిల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో లోక్‌సభకు ఎన్నికలు జ రు గనున్న తరుణంలో పలువురు విశ్లేషకులు భాజపా పని అయిపోయిందనే అనుకున్నారు. మరి కొందరు మాత్రం మోదీ ఛరిష్మాకు ఎటువంటి ఢోకాలేదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా 2019 ఫివ్రబరి 14న తీవ్రవాదులు పుల్వామాలో జరిపి ఉగ్రదాడిలో 40మంది పారా మిలిటరీ సిబ్బంది మరణించడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు ప్ర తీకారంగా అదేనెల 26వ తేదీన బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మన వాయుసేన జరిపి న దాడిలో ఉగ్ర ముష్కరులు వందల సంఖ్యలో మరణించారు. మోదీ ప్రభుత్వ సామర్థ్యాన్ని మరోసారి దేశ ప్రజలకు, ప్రపంచ దేశాలకు వెల్లడిరచిన సంఘటన ఇది. పర్యవసానంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పార్టీలు ఇనుమడిరచిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారంలో పాల్గనగా, విపక్ష కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ప్రచారం వెలవెలబోయింది. చివరకు ఈ ఎన్నికల్లో నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి రెండోసారి అధికారాన్ని చేప ట్టింది. అంతేకాదు బీజేపీ పూర్తి మెజారిటీ సాధించడం విశేషం. రెండోసారి పూర్తికా లం ప్రధానిగా కాంగ్రెస్సేతర రెండో నాయకుడిగా నరేంద్రమోదీ రికార్డు సృష్టించారు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న మరో ప్రధాన నిర్ణ యం జమ్ము`కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించే 370వ అధికరణాన్ని రద్దుచేయడం. నిజానికి మైనారిటీ బుజ్జగింపులకు అలవాటుపడిన వర్గాలు, పార్టీలు దీన్ని సహజంగానే విమర్శించాయి. కొందరు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘ఇది కార్యనిర్వాహక శాఖ’ అధికారపరిధిలోనిదంటూ కోర్టు జోక్యం చేసుకోలేదు. ఫలితంగా పార్లమెంట్‌ ఉభయసభల ఆమోదం పొందిన తర్వాత, దశాబ్దాలుగా జమ్ము`కశ్మీర్‌ అభివృద్ధిని అంధకారంలోకి నెట్టడమే కాదు, కొన్ని లక్షలమంది మైనారిటీలైన హిందువులైన కశ్మీరీ పండిట్లను రాష్ట్రంనుంచి వెళ్లగొట్టిన అంథకార చరిత్రకు అంతం పలకడంలో ఒక అడుగు ముందుకు పడినట్లయింది. ఈ అధికరణం రద్దయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి వీచికలు ప్రారంభమయ్యాయి.

2020లో దేశంలో కోవిడ్‌ మహమ్మారి దేశంలోకి ప్రవేశించింది. దీని విస్తరణను అరికట్టేందుకు మోదీ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడమే కాదు, దేశీయంగా వ్యాక్సిన్‌ తయారీని ప్రోత్సహించేందుకు వీలుగా వివిధ బయోటెక్‌ కంపెనీలను ప్రోత్సహించారు. ఫలితంగా కోవిడ్‌ షీల్డ్‌ వంటి వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో అనేక ఇతర పేదదేశాలకుకోవిడ్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించడంతో మనదేశ ప్రతిష్ట అనుమడిరచింది. అనేక దేశాలు ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు నరేంద్రమోదీని ఎంతగానో ఇప్పటికీ అభిమానిస్తున్నాయంటే మన ప్రభుత్వం అనుసరిస్తున్న ‘బహుజన హితాయచ…బహుజన సుఖాయచ’ అనే సూత్రాన్ని తు.చ. తప్పకుండా అనుసరించడమే. ఇదే ఏడాది నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణలను అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. నిజంగా ఇది రైతులకు ఎంతో ప్రయోజనకరం. ఎటు వంటి ఇబ్బందులు లేకుండా రైతులు తమ పంట ఉత్పత్తులను దేశంలోని ఏ ప్రాంతంలోనైనా తగిన లాభంతో విక్రయించుకునేందుకు వీలుకల్పించే ఈ చట్టాలను, వ్యవసాయ రంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఏలుతున్న పంజాబ్‌, హర్యానాలకు చెందిన బలీయమైన రాజకీయ పలుకుబడి కలిగిన దళారులు వ్యతిరేకించడమే కాదు, వీటిని రైతు వ్యతిరేక చట్టాలుగా విపరీతంగా ప్ర చారం చేశారు. కేవలం ఈ రెండు రాష్ట్రాలకు చెందిన దళారులు చేసిన ఆందోళన వల్ల, దేశవ్యాప్తంగా రైతులు నష్టపోవాల్సి వచ్చింది. వీరికి అనుకూల మీడియా కూడా అసలు నిజాలను దాచి పెట్టి, ఈ దళారులకే వత్తాసు పలకడం, అప్పటి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కూడా వీరికి అనుకూలంగా మాట్లాడటం సంచలనం సృష్టించింది. ట్రూడో వైఖరి వల్ల ఇరుదేశాల సంబంధాలు గతంలో ఎన్నడూలేని స్థాయికి దిగజారిపోవడం వర్తమాన చరిత్ర. చివరకు ఆందోళనకారులు ఢల్లీిలో ప్రవేశించి ఎర్రకోటపై ఖలిస్తానీ జెండాను ఎగరేయడం సంచలనం సృష్టించింది. ఆవిధంగా రైతు ఉద్యమాల ముసుగులో ఖలిస్తానీ వేర్పాటువాదులు ఈ అకృత్యానికి పాల్పడ్డారన్న సంగతి కూడా వెల్లడైంది. అప్పటినుంచి కేంద్రం అప్రమత్తమై, ఖలిస్తానీలపై ఉక్కుపాదం మోపే రీతి లో చర్యలు చేపట్టింది. ఫలితంగా రెండోసారి మళ్లీ రైతు ఆందోళన చేపట్టాలన్న ఈ దళారులు,ఖలిస్తానీల ఆటలు సాగలేదు. మొగ్గదశలోనే ప్రభుత్వం అణచివేసింది. దీంతో మళ్లీ ఢల్లీి ముట్టడి ప్రమాదం తప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!