`నాకు ఎవరూ పోటీ కాదు.
`కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తో నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు ప్రత్యేక ఇంటర్వూ..
`సమాజాన్ని ,సామాజిక స్థితిగతులు అధ్యయనం చేశాను.
`ఉన్నత విద్యావంతుడిగా తెలంగాణలో విద్యాభివృద్ధికి కృషి చేస్తాను.
`నిరుద్యోగులకు అండగా వుంటూ ఉద్యోగ కల్పన కోసం శ్రమిస్తాను.
`సామాజిక సమస్యలపై అవగాహన వుంది.
`విద్యా వ్యవస్థ మీద పూర్తి అవగాహన వుంది.
`రేపటి తరం గురించి ఆలోచించే శక్తి వుంది.
`రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం
`ఉద్యోగులకు మెరుగైన జీతాలను సకాలంలో అందించేది కాంగ్రెస్ ప్రభుత్వం.
`బిజేపి తో గతంలో ఒరిగింది లేదు.
`ఇప్పుడు కొత్తగా జరిగే మేలు లేదు.
`పదేళ్ల క్రితం 2 కోట్ల ఉద్యోగాలిస్తామని దేశ ప్రజలను మోసం చేసింది బిజేపి.
`తెలంగాణ రాష్ట్రమంటేనే బిజేపికి చిన్న చూపు.
`బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావన కూడా వుండదు
`తెలంగాణకు అదనంగా రూపాయి ఇచ్చేది వుండదు.
`తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపిలను గెలిపిస్తే రూపాయి తెచ్చింది లేదు.
`తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు ఇచ్చింది లేదు.
`తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్.
`తెలంగాణ అభివృద్ధి చేసేది కాంగ్రెస్.
`ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.
`తొలి ఏడాదిలో 60 వేల ఉద్యోగాలిచ్చాం.
`జాబ్ క్యాలెండర్ ద్వారా ఏటా ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తాం
హైదరాబాద్,నేటిధాత్రి:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది నేనే..ఇది అతి విశ్వాసంతో చెబుతున్న మాట కాదు…పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాట. ఎందుకంటే ఇప్పటికే నేను నాలుగు ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రచార పర్యటనల్లో తెలిసిన అంశం. తెలుసుకున్న విషయం. పైగా నేను దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎక్కువగా సుపరిచితమైన విద్యావేత్తను. నా విద్యా సంస్దలు నా గెలుపుకు ఒక కారణమైతే, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో వున్న నమ్మకం మరో కారణం. దానితోపాటు అంకితభావం కల్గిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు కలిగిస్తున్న విశ్వాసం కూడా నాలో మరింత నమ్మకాన్ని పెంచింది. ఎక్కడికెళ్లినా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆదరణ మర్చిపోలేనది. నాలుగు జిల్లాల్లో వున్న పట్టభద్రులు స్పందన కూడా నాకు ఎంతో బలాన్ని ఇస్తోంది. అందుకే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు నాదే..గెలిచేదినేనే అనే నమ్మకం మరింత నాలో బలపడిరది. అయితే ఇంకా నేను మరింత ప్రచారం కొనసాగించాల్సిన అవసరం వుంది. ప్రత్యర్ధులకు అవకాశమివ్వకుండా ముందుకు సాగాల్సి వుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీల మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగాల కల్పన నా విజయానికి బాటలు వేస్తుందని బలంగా నమ్ముతున్నానంటున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ది డాక్టర్. వి. నరేందర్ రెడ్డి నేటి ధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుకిచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో అనేక అంశాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
తెలంగానలో కాంగ్రెస్ పార్టీ బలంగా వుంది. కాంగ్రెస్ పార్టీకి సమీపంలో కూడా ఏ పార్టీలేదు. పైగా తెలంగాణ యువతకు కాంగ్రెస్ పార్టీ మీద అచెంచలమైన విశ్వాసం వుంది. గత పదేళ్ల కాలంలో పది ఉద్యోగాలు కూడా కల్పించలేని బిఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడిరచి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఆ నమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచే నిలబెట్టుకుంటూ వస్తోంది. ఒక్క ఏడాది కాలంలోనే సుమారు 60వేలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వాలు దేశంలోనే ఎక్కడా లేవు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూడలేదు. గత పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో అసలే చూడలేదు. గత ఏడాదే ఇంకా అనేక ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. కాకపోతే తర్వాత వెంటనే వచ్చిన పార్లీమెంటు ఎన్నికల సమయానికే మూడు నెలల సమయం పట్టింది. అయినా ఇంత తక్కువ సమయంలోనే 60వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడం అంటే మాటలు కాదు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వల్లనే ఇన్ని ఉద్యోగాలు ఇంత తక్కువ సమయంలో ఇచ్చేందుకు దోహడపడిరది. అందువల్ల తెలంగాణలో యువత, నిరుద్యోగులు అంతా కాంగ్రెస్ మీద అనేక ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగాలు ఇస్తారని ఎదురుచూస్తున్నారు. ఇంకా కొన్ని వేలకుపైగా ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా వేయడం జరిగింది. ఇలా ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం యువతకు పెద్దఎత్తున ఉద్యోగాల కల్పన చేస్తూ నిరుద్యోగ సమస్యను లేకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అందువల్ల ఈ ఎన్నికల్లో తన గెలుపు పెద్ద కష్టం కాదు. పైగా నా ప్రత్యర్ధులెవరూ నాకు సమీపంలో కూడా వుండే అవకాశం లేదు. బిజేపి పార్టీకి తెలంగాణలో చోటు లేదు. బిజేపి కేంద్ర నాయకత్వానికి తెలంగాణ మీద ప్రేమే లేదు. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణకు బిజేపి చేసిందేమీ లేదు. ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదు. కనీసం బడ్జెట్‌లలో తెలంగాణ పదానికి కూడా చోటు వుండడం లేదంటే తెలంగాణ ప్రజలు బిజేపిని ఎందుకు నమ్మాలి? తెలంగాణ నుంచి గత పార్లమెంటు ఎన్నికల్లో 8 మంది ఎంపిలను గెలిపిస్తే, అందరూ కలిసి 8 రూపాయలు కూడా తీసుకురాలేదు. అలాంటి పార్టీని తెలంగాణ పట్టభద్రులు నమ్మడం అనేది కల. 2014 ఎన్నికల్లో బిజేపి గెలిస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. అంటే ఈ పదేళ్ల కాలంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కాని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఏనాడో మర్చిపోయింది. రైటైర్ అయిన ఉద్యోగాలను కూడా నింపలేకపోతోంది. దేశంలో నిరుద్యోగ సమస్యను పెంచింది. పదేళ్ల క్రితం వున్న నిరుద్యోగ సమస్యకు ఇప్పటికీ పొంతన లేదు. బిజేపి పాలిత రాష్ట్రాలలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఆ మధ్య ఉత్తర ప్రదేశ్‌లో రెండు ఉద్యోగాలకు 2లక్షల మంది ధరఖాస్తులు చేసుకున్నారన్న వార్త విన్నాం. అది కూడా ప్యూన్ పోస్టు అని అందరం ముక్కున వేలేసుకున్నాం. అంటే దేశంలో బిజేపి పాలిత రాష్ట్రాలలో నిరుద్యోగ సమస్య ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కనీసం ప్రైవేటు రంగంలోనైనా ఉద్యోగ కల్పన చేపట్టారా? అదీ లేదు. దేశంలో బిజేపి పార్టీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవరూ ముందుకు రావడంలేదు. జిఎస్టీని తెచ్చిన పారిశ్రామిక రంగాన్ని మొత్తం దివాళా తీయించారు. చిన్న చిన్న వ్యాపారులను నిలువునా ముంచారు. ప్రజల మీద పన్నుల భారం వేసి ప్రజలను హడలగొడుతున్నారు. కష్టపడి రోజూ కూలీ సంపాదించుకునే సామాన్యుడు బతకలేని పరిస్దితులు తెచ్చిపెడుతున్నారు. అయినా బారత్ వెలిపోతోందని, వికసిత్ భారత్ అంటూ ప్రజలను మతం మత్తులో మభ్యపెడుతూ రాజకీయం చేయడం తప్ప బిజేపి ప్రజలకు చేస్తున్నదేమీ లేదు. యువత భవష్యత్తుకుబాటలు వేస్తున్నదేమీ లేదు. అందుకే తెలంగాణలో బిజేపికి చోటు లేదు. ఇతర పార్టీలకు అసలే చోటు లేదు. ఇక వ్యక్తిగతంగా నా విషయానికి వస్తే నాకు సమాజం తెలుసు. సామాజిక సమస్యలు తెలుసు. ప్రజల జీవన విధానం తెలుసు. పల్లె జీవితాలు ఎలా వుంటాయో తెలుసు. పల్లెలో జీవనోపాధి ఎంతవరకు వుంటుందోతెలుసు. నిజానికి ఉపాధి, ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎదరుచూసేది గ్రామీణ విద్యావంతులే. వారికి గ్రామంలో సరైన ఉపాది వుండదు. ఎలాగైనా మంచి ప్రభుత్వ ఉద్యోగమో..లేక అంతకు సమానమైన ప్రైవేటు ఉద్యోగమైనా పొందాలని ఎంతో కష్టపడుతుంటారు. వారికి భరోసా ఇచ్చేవారు వుండరు. వారి ఆశలను గత ప్రభుత్వం నెరవేర్చింది లేదు. దాంతో పల్లె యువతలో నిరుద్యోగం పెరిగిపోయింది. వారికి ఒక దారి చూపాల్సిన అవసరం వుంది. పల్లె యువతకు ఉపాధి అవకాశాలను ఏర్పాటు చేయడంలో స్వయం ఉపాధి రంగాలలో వారిని ప్రోత్సహించాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూసే వారికి ఉద్యోగాలు వేసేలా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు సంప్రదించే ప్రయత్నం నిరంతరం చేయాలి. ఇక ప్రైవేటు రంగంలో కూడా అనేక అవకాశాలు వస్తుంటాయి. అందులో ప్రతి పరిశ్రమలోనూ తెలంగాణ వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించేలా చూడాల్సి వుంటుంది. ఇవన్నీ వాటిపై అవగాహన వున్న నాలాంటి వారికి మాత్రమే సాద్యమౌతుంది. నా విద్యా సంస్దల్లో కూడా ఎంతో మందికి ఉపాది అవకాశాలు కల్పిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఎంతో మందికి ఉపాధి కల్పించేందుకు వీలు కూడా వుంది. విద్యారంగం, వ్యవస్ద మీద కూడా పూర్తి అవగాహన వుంది. పరిజ్ఞానం వుంది. ప్రపంచ విద్యా విధానంలో వుస్తున్న మార్పులను ఎప్పటికిప్పుడు అద్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం, మన విద్యా విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టడం వంటివి చేయాలంటే నా లాంటి విద్యావేత్తకు కొంత వెసులుబాటు వుంటుంది. మిగతా వారికి ఈ అవకాశం వుండదు. ఎందుకంటే విద్యా సంస్ధల అదినేతగా వున్నందున దేశంలోని విద్యా విదానం, విదేశాలలో విద్యా విధానాలపై ఎప్పటికప్పుడు సమాచారం వుంటుంది. మన విద్యార్ధులకు ప్రపంచ పరిజ్ఞానం అందించే విద్య అందించేందుకు ఎలా ముందుకు సాగాలన్నదానిపై ప్రభుత్వానికి నివేదికలు, సూచలునలు ఇచ్చేందుకు వీలుంటుంది. ఇలా ఏ రకంగా చూసినా ఈ ఎమ్మెల్సీ ఎంపికకు తాను మాత్రమే అర్హుడనని చెప్పగలను. విద్యావంతులైన నిరుద్యోగులు రేపటి వారి భవిష్యత్తు కోసమే కాకుండా, వచ్చే తరాలకు సంబంధించిన మేలు కూడా కోరుకోవాల్సిన అవసరం వుంది. అందువల్ల పట్టభద్రులంతా తనను గెలిపించి, రేపటి తెలంగాణ భవితకు నా తోడ్పాటును అందించేందుకు వీలు కలగాలంటే, నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను.