
మందమర్రి, నేటిధాత్రి:-
ధర్మసమాజ్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నందిపాటి రాజు ను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నందిపాటి రాజు మాట్లాడుతూ, చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే కేవలం ధర్మసమాజ్ పార్టీతోనే జరుగుతుందని అన్నారు. చెన్నూరు నియోజకవర్గ ప్రజలు ధర్మ సమాజ్ పార్టీ గుర్తు టార్చ్ లైట్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నియోజవర్గ ప్రజలందరూ భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మసమ్మ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.