
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో
ఇండియన్ పోలీస్ ఇన్ స్టిట్యూట్ సభ్యుడిగా మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల వాసి యువ న్యాయవాది నాగరాజ్ శాశ్వత సభ్యుడిగా ఎంపికయ్యారు. ఇండియాలో క్రిమినల్ చట్టాల పై పరిశోధన కొనసాగించడం తో పాటు పోలీస్ సంస్కరణల కోసం ఉద్యమించడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దేశంలో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఐపీఎస్ అధికారులు ప్రకాష్ సింగ్, సిబిఐ మాజీ డైరెక్టర్లు ఆర్కె రాఘవన్, ఆర్కె శుక్లా తో పాటు పలువురు తల పండిన ప్రొఫెసర్ లు, పలు రాష్ట్రాల ప్రస్తుత మరియు మాజీ గవర్నర్లు పేరు ప్రఖ్యాతలు గాంచిన జాతీయ స్తాయి జర్నలిస్టులు, ఆర్.బి.ఐ మాజీ గవర్నర్లు ఈ సంస్థలో సభ్యులుగా ఉండడం ఉంటారు. మేఘాలయ రాష్ట్ర గవర్నర్ గా పని చేసిన ఆర్ఎస్ ముషాహేరి ప్రస్తుతం ఈ సంస్థకు చైర్మన్ గా నాయకత్వం వహిస్తున్నారు. అయితే నాగరాజు ఇప్పటికే ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిమినాలజీ ఐఎస్సి సభ్యుడిగా ఉండడం దాంతోపాటు లిటిల్ డిస్కర్స్ ఆన్ ఇండియన్ ఫెడరలిజం పుస్తక రచయితగా నాగరాజ్ చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. తనను ఈ సంస్థకు పరిశోధన సభ్యుడిగా ప్రతిపాదన చేసిన మాజీ డిజిపి పీఎం నాయర్ తో పాటు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఎస్పీ గా పనిచేస్తున్న సరిత ఐపీఎస్ కి నాగరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. నాగరాజు ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు.