నడిచే దారేది…
నడిచే దారే లేదని, బురదమయంగా పాత్రపురం గ్రామ పంచాయితీ మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజి కాలువ వెంట నీరు పోతున్న పట్టించుకొనే నాథుడే లేక తీవ్రఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్‌ను నిర్మించేందుకు ఇరువైపులా శుభ్రం చేసి రోడ్డు పనులు మాత్రం పూర్తి చేయలేదని గ్రామస్తులు అంటున్నారు. ఏడాది గడిచిన పట్టింపు లేకుండా కాంట్రాక్టర్, అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. గుంతలు పడినా…నీళ్లు నిలుస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని, రాత్రి వేళల్లో రోడ్డు వెంట వెళ్లాలంటేనే భయంగా ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బైకులు వెళ్తున్న సందర్భంలో గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగక ముందే అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. పాత్రపురం నుండి 2కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగవాయి గ్రామంలోకి వెళ్లటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.